Homeఅంతర్జాతీయందేశంలో వందే భారత్..హై స్పీడ్ రైళ్లు లో సందడి చేయనున్నాయి..

దేశంలో వందే భారత్..హై స్పీడ్ రైళ్లు లో సందడి చేయనున్నాయి..

  • ఏకంగా 400 వందే భారత్ ట్రైన్లు .. తేవాలని కేంద్రం యోచిస్తోంది.

విమానాల తరహా ప్రయాణం.. సగానికి తగ్గనున్న ప్రయాణ టైం.. అత్యాధునిక ఫీచర్లతో .. వందే భారత్ ట్రైన్లు .. దేశంలో కూత పెడుతున్నాయి. ఇక త్వరలో తెలుగు రాష్ట్రాల్లోనూ ఇవి సందడి చేయనున్నాయి.

తెలుగు రాష్ట్రాల ప్రయాణికులను పలుకరించేందుకు వందే భారత్ రైలు వస్తోంది. ఈ నెల 19 నుంచి తెలంగాణ, ఏపీ మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు పరుగులు పెట్టనుంది. 8వ వందే భారత్ రైలును ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. దేశంలో ఇప్పటి వరకు ఏడు వందే భారత్ రైళ్లు అందుబాటులో ఉన్నాయి. న్యూ ఢిల్లీ -వారణాసి, న్యూ ఢిల్లీ- శ్రీ మాతా వైష్ణో దేవి కాట్రా, న్యూ ఢిల్లీ-అంబ్ అందౌరా, ముంబై సెంట్రల్ గాంధీ నగర్‌, మైసూర్ -చెన్నై, నాగ్‌పూర్ -బిలాస్‌పూర్, హౌరా- న్యూజల్‌పాయ్‌గురి రూట్లల్లో వందే భారత్ రైళ్లు ప్రస్తుతం నడుస్తున్నాయి.

వందే భారత్ రైలులో మొత్తం 16 కోచ్‌లు ఉంటాయి. 1128 సీట్లు అందుబాటులో ఉంటాయి. ఈ రైలు గంటకు 180 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెడుతుంది. 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 52 సెకండ్లలో అందుకుంటుంది. ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి వైజాగ్ ప్రయాణ సమయం 14 గంటలు కాగా, వందే భారత్లో ప్రయాణిస్తే..8 గంటల్లో చేరుకోవచ్చు. వందే భారత్ ఎక్స్ ప్రెస్లో ఆటోమెటిక్ డోర్ సిస్టమ్ ఉంటుంది.

ఎక్స్ ప్రెస్ రైళ్లతో పోల్చుకుంటే వందే భారత్లో ప్రయాణ సమయం ఆదా అవుతుంది. ఈ రైళ్లలో వైఫై, హాట్ స్పాట్ కూడా ఉంటుంది. వందే భారత్ ఎక్స్ ప్రెస్ లో GPSబేస్డ్ ఆడియో విజువల్ ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఏర్పాటు చేశారు. దీనికి తోడు బయో వ్యాక్యూమ్ టాయిలెట్స్, దివ్యాంగులకు అనుకూలంగా వాష్ రూమ్స్ ఏర్పాటు చేశారు. సీట్ హ్యాండిల్‌కు, సీట్ నెంబర్స్‌కు బ్రెయిలీ లెటర్స్ ఉంటాయి. వేడివేడి కాఫీ, భోజనం, కూల్ డ్రింక్స్ అందుబాటులో ఉంటాయి.

ప్రతి కోచ్కు ప్యాంట్రీ సదుపాయాన్ని కూడా కల్పించారు. వందే భారత్ ఎక్స్ ప్రెస్ లో సీట్లు సౌకర్యవంతంగా ఉంటాయి. ఎగ్జిక్యూటీవ్ క్లాస్ బోగీల్లో రొటేటింగ్ చైర్లు ఆకట్టుకుంటాయి.

సికింద్రాబాద్లో మొదలయ్యే వందే భారత్ ఎక్స్ ప్రెస్..వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి స్టేషన్ లలో ఆగుతుంది. చివరకు వైజాగ్ చేరుకుంటుంది. ప్రస్తుతం వందే భారత్ రైళ్లల్లో చైర్ కార్ సీటింగ్ వ్యవస్థ మాత్రమే ఉంది. త్వరలో వందే భారత్ రైళ్లల్లో స్లీపర్ బెర్తులు అందుబాటులోకి రానున్నాయి. అయితే 500 కి.మీ నుంచి 600 కి.మీ దూరం మధ్య ప్రయాణించే వందే భారత్ రైళ్లల్లో స్లీపర్ బెర్తులు అందుబాటులోకి వస్తాయి.

గత కొన్ని సంవత్సరాలలో ఇండియన్‌ రైల్వేస్ అనేక సంస్కరణలు తీసుకొచ్చింది. ప్రయాణికులకు బెస్ట్‌ ట్రావెలింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ అందించేందుకు చర్యలు తీసుకుంటోంది. స్టేషన్‌లలో ఫ్రీ వైఫై, కోచ్‌లలో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు, ట్విట్టర్‌ హ్యాండిల్‌ ద్వారా ఫిర్యాదుల స్వీకరణ వంటి కొన్ని నిర్ణయాలు ప్రయాణికులకు మేలు చేస్తున్నాయి. అదే విధంగా కొన్ని ప్రధాన మార్గాల్లో ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకు అత్యాధుని సదుపాయాలతో వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులను ప్రారంభించింది. ఈ సెమీ హైస్పీడ్ రైలు.. విమానం లాంటి ప్రయాణ అనుభూతిని ఇ దీనికి తోడు గంటకు 180 కి.మీ.

గరిష్ట వేగంతో ప్రయాణించే ఈ రైలుకు అత్యాధునిక సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. ముఖ్యంగా కవచ్ టెక్నాలజీ. రైళ్లు పరస్పరం ఢీకొట్టుకోకుండా నివారించేందుకు దేశీయంగా అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానం ఇది. సాంకేతిక తప్పిదం వల్ల రైళ్లు ఒకే ట్రాక్‌పై వస్తే, వాటి మధ్య కిలోమీటర్ దూరం ఉండగానే.. ఈ వ్యవస్థ హెచ్చరికలు చేసి, రైలు వేగాన్ని ఆటోమేటిగ్గా నియంత్రిస్తుంది.

సాధారణ రైళ్లతో పోలిస్తే.. వందే భారత్ రైళ్లలో టికెట్ ఛార్జీలు కాస్త అధికంగా ఉన్నాయని ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. తాజాగా ముంబై – అహ్మదాబాద్ మధ్య ప్రవేశపెట్టిన వందే భారత్ రైలులో ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ టికెట్ ధర రూ.2505 కాగా.. సాధారణ చైర్ కార్ టికెట్ ధర రూ. 1385గా ఉంది.

శతాబ్ది సహా ఇతర రైళ్ల టికెట్లతో పోలిస్తే ఇది ఎక్కువ. అయితే, వందే భారత్ రైళ్లలోని అత్యాధునిక ఫీచర్లతో పోలిస్తే ఈ ధరలు అంత ఎక్కువేం కాదని విశ్లేషకులు, కొంత మంది ప్రయాణికులు చెబుతున్నారు. చాలా తక్కువ ఖర్చుతో విమానం లాంటి ప్రయాణ అనుభూతి పొందగలుగుతున్నామని.. గమ్యం కూడా చాలా వేగంగా చేరుకునే వెసులుబాటు ఉందని చెప్పారు. ఈ రైలు కేవలం 140 సెకన్ల సమయంలో 160 కి.మీ. వేగం అందుకుంటుంది.

అంత వేగంలోనూ కుదుపులు లేకుండా ప్రయాణం సాగడం ఈ రైలు మరో ప్రత్యేకత. ఎయిర్ కండిషన్‌ కోసం ప్రతి కోచ్‌కు ‘కోచ్ కంట్రోల్ మేనేజ్‌మెంట్ సిస్టం’ఉంటుంది. పెద్ద గాజు అద్దాల నుంచి ప్రకృతి అందాలను చూస్తూ జర్నీ ఎంజాయ్ చేయొచ్చు. వరదల నుంచి రక్షణకు ప్రత్యేక ఏర్పాటు ఈ రైళ్ల అదనపు ప్రత్యేకతగా నిపుణులు చెబుతున్నారు. వందే భారత్ రైళ్లు ఎలాంటి అవాంతరం లేకుండా వెళ్లేందుకు శతాబ్ది రైళ్లను కూడా రీషెడ్యూల్ చేస్తున్నారు.

ఆదివారం మినహా వారంలో 6 రోజులు ఈ రైలు నడవనుంది. ముంబై – అహ్మదాబాద్ మార్గంలో ఒక రైలు.. అదే సమయంలో అహ్మదాబాద్ – ముంబై మధ్య మరో రైలు నడుస్తుంది. దేశంలో 2019లో తొలి వందే భారత్‌ రైలు అందుబాటులోకి వచ్చింది. న్యూఢిల్లీ – వారణాసి మార్గంలో ఈ రైలును ప్రారంభించారు. అనంతరం ఢిల్లీ – శ్రీ మాతా వైష్ణోదేవి ‘కత్రా’మార్గంలో రెండో రైలును ప్రవేశపెట్టారు.

140 కోట్ల జనాభా గల భారతదేశానికి ఈ తరహా రైళ్ల అవసరం ఉందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. వందే భారత్ రైళ్లు అందుబాటులోకి వస్తే నగరాల మధ్య ప్రయాణ సమయం భారీగా తగ్గుతుంది. వచ్చే మూడేళ్లలో దేశంలోని వివిధ మార్గాల్లో మొత్తం 400 వందే భారత్‌ రైళ్లను ప్రవేశపెట్టాలనేది మోదీ సర్కార్ యోచన. భవిష్యత్తులో వందే భారత్ రైళ్ల కోసం మెట్రో తరహాలో ఎలివేటెడ్‌ కారిడార్లను నిర్మించాలనే ప్రతిపాదన కూడా ఉంది.

  • వందే భారత్ రైళ్ల రాకతో .. ఇక రైల్వేలు .. వాయు వేగాన్ని అందుకోనున్నాయా..?

2026 కల్లా బుల్లెట్‌ రైళ్లను దేశంలో నడుపుతామని కేంద్రం ప్రకటించింది. 138 రైల్వే స్టేషన్లకు ఇప్పటికే బృహత్‌ ప్రణాళికను సిద్ధం చేశామని, మరో 57 స్టేషన్లకు సిద్ధం చేసే పనిలో ఉన్నామని పేర్కొంది. ఇక బుల్లెట్‌ రైలుకు సంబంధించి ఇప్పటికే 110 కిలోమీటర్ల మార్గాన్ని సిద్ధం చేసినట్లు, జపాన్‌లో తయారైన రైలు భారత పరిస్థితులకు తగ్గట్టుగా మార్చేందుకు కొంత సమయం పడుతున్నట్లు తెలిపింది.

ఇదిలాఉండగా 2025-26 కల్లా దేశంలో టిల్టింగ్‌ రైళ్లను నడుపుతామని అధికారులు వెల్లడించారు. పట్టాలు వంపుగా ఉన్నా వేగం తగ్గకుండానే వెళ్లే రైళ్లను టిల్టింగ్‌ రైళ్లుగా వ్యవహరిస్తున్నారు. మూడో ట్రైన్‌ను మోదీ, 2022 సెప్టెంబర్ 30న గాంధీనగర్‌- ముంబై మార్గంలో ప్రారంభించారు. ఈ ట్రైన్ 6 గంటల 15 నిమిషాలలో 520 కి.మీ దూరాన్ని చేరుకుంటుంది. 2022 అక్టోబరు 13న నాలుగో ట్రైన్‌ను ఉనా స్టేషన్ నుంచి మోదీ ప్రారంభించారు.

ఈ ట్రైన్ 415 కి.మీ దూరాన్ని 5 గంటల 15 నిమిషాలలో కవర్ చేస్తుంది. దక్షిణ భారతదేశంలో మొదటి, సిరీస్‌లో 5వ వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను చెన్నై- మైసూరు మార్గంలో 2022 నవంబర్ 11న ప్రారంభించారు. ఈ ట్రైన్ 6 గంటల 30 నిమిషాలలో గమ్యస్థానం చేరుకుంటుంది. దేశంలోని ఆరో వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ బిలాస్‌పూర్- నాగ్‌పూర్ మార్గంలో నడుస్తుంది. దీన్ని గతనెల అందుబాటులోకి తీసుకొచ్చారు.

ఈ ట్రైన్ 5 గంటల 30 నిమిషాలలో 400 కి.మీ ప్రయాణం చేస్తుంది. హౌరా- న్యూ జల్పైగురి జంక్షన్ మధ్య నడిచే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ భారతదేశంలో ఏడోది. డిసెంబర్ 30న మోదీ ప్రారంభించారు. వందే భారత్ సిరీస్‌లో రెండో ప్రీమియం రైలు. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ వందే భారత్ రైళ్లు త్వరలోనే సందడి చేయనున్నాయి.

వందే భారత్ రైళ్ల రాకతో .. ఇక రైల్వేలు .. వాయు వేగాన్ని అందుకోనున్నాయని నిపుణులు సైతం చెబుతున్నారు.

Must Read

spot_img