Homeఅంతర్జాతీయంఅమెరికా చైనా మధ్య ఘర్షణ ...పదునెక్కుతున్న స్థితిలో రష్యా.!

అమెరికా చైనా మధ్య ఘర్షణ …పదునెక్కుతున్న స్థితిలో రష్యా.!

చూస్తుండగానే మరో అల్లకల్లోలం స్రుష్టించిన సంవత్సరం ముగిసింది. కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టడం జరిగిపోయింది. 2022 ప్రారంభంలోనే మొదలైన యుధ్దం యూరోపియన్ తీరాలను నేరుగా చేరుకుంది. కోవిడ్ 19 అనంతర సాధారణ స్థితికి ప్రపంచం చేరుకుంటు్న సమయంలోనే ఉక్రెయిన్ ను రష్యా ఆక్రమించడంతో ప్రపంచ క్రమవ్యవస్థకు కొత్త సవాళ్లు విసరినట్టైంది. అమెరికా చైనా మధ్య ఘర్షణ పదునెక్కుతున్న స్థితిలో రష్యా చైనా మధ్య బంధం మరింతగా బలపడింది. ప్రతీ విషయంలోనూ ఆయుధీకరణ కొత్త వ్యవస్థగా ఆవిర్భవిస్తున్నందున ప్రపంచీకరణ వ్యతిరేక క్రమం చుట్టూ చర్చ బలం పుంజుకుంటోంది. తన పరిధిని పెంచుకుంటోంది. ఈ ఉపద్రవం మధ్య అంతర్జాతీయ సంస్థలు నూతన సవాళ్లను ఎదుర్కోవడానికి ఏమాత్రం సిధ్దంగా లేవు. కాబట్టి నూతన సంస్థాగత నిర్మాణాల కోసం శోధన ముందుకు వచ్చింది.

జాతీయ వ్యూహాత్మక చింతనకు చెందిన కొన్ని మౌలిక భావనలకు బహరింగంగా వ్యతిరేకత ఎదురవుతున్నప్పుడు భారతీయ విదేశీ విధానం ఒక సంవత్సర కాలంలో ఈ అన్ని మలుపులకూ స్పంధించాల్సివచ్చింది. 2020లో గాల్వన్ సంక్షోభం భారత ప్రభుత్వాన్ని తన చైనా విధానాన్న తిరిగి మదింపు చేసుకునేలా ఒత్తిడికి గురి చేసింది. ఆ విధంగానే ఉక్రెయిన్ యుధ్దం భారత్ ను తన రష్యా విధాన చోదక శక్తుల పట్ల వైఖరిని తిరిగి పనిశీలించుకునేలా చేసింది. అలాగే పాశ్చాత్యప్రపంచంతో తన వ్యవహార శైలిని కొత్తగా రూపొందించుకునేందుకు కూడా వెసులుబాటు కల్పించింది. 2022 ఫిబ్రవరిలో రష్యన్ దురాక్రమణ ప్రారంభమైనప్పుడు డిమాండ్ చేస్తున్న పాశ్చాత్య దేశాలు ఒకవైపు, విఘాతం కలిగించే రష్యా మరొకవైపు ఉంటున్న స్థితిలో రెండు శక్తులతోనూ సంబంధాలను భారత ఎంత కష్టంగా నిర్వహిస్తుందనే అంశంపై చాలా చర్చ జరిగింది. అయితే అత్యంత సంక్లిష్టమైన ప్రపంచ సమస్యపై భారత్ సమతుల్యత ప్రదర్శించడం నుంచి నూతన సంవత్సరం నాడు ప్రారంభమైంది.

ఇంధన భద్రత కోసం రష్యాలో తన సంబంధ బాంధవ్యాలను భారత్ కొనసాగించడమే కాదు..మాస్కోతో ఇంధన పొత్తులను మరింతగా పెంచుకోగలిగింది. రష్యాను బహిరంగంగా ఖండించకపోవడం ద్వారా పాశ్చాత్య ప్రపంచం పక్షాన భారత్ నిలవలేదని పాశ్చాత్య దేశాలలో కొంత మంది విమర్షిస్తున్న సమయంలోనే సంవత్సరం పొడుగునా సదరు దేశాలతో సంబంధాలు మరింత బలపడ్డాయి. భారత్ తన వంతుగా ఐక్యరాజ్యసమితి చార్టర్, అంతర్జాతీయ చట్టం, ప్రాదేశిక సార్వభౌమాధికారం నేపథ్యంలో రష్యన్ దురాక్రమణై ఆరోపించడం నుంచి తన వైఖరిని మార్చుకుంది.ఈ క్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ‘ఇది యుధ్ధసమయం కాదని రష్యన్ అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్ కు బహరింగంగానే బోధ చేసేంతవరకు పోయారు.

బాలి సదస్సులో జీ20 దేశాల చర్చల సమయంలో సెంటిమెంటును రంగరించి మరీ మోదీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు. సంవత్సరం ముగిసే సమయానికి ఉక్రెయిన్ సంక్షోభాన్ని ముగించే విషయంలో భారత్ మరింత క్రియాశీలక పాత్ర చేపట్టనుందనే అంచానాలు బాగా పెరిగిపోయాయి. చివరకు ప్రధాన మోదీతో ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్ స్కీ కి ఫోన్ చేసి మరీ మాట్లాడారు. రష్యా పట్ల భారత్ వైఖరిని పాశ్చాత్యప్రపంచం ప్రారంభంలో విమర్శనాత్మకంగా అంచనా వేసింది.

ఉక్రెయిన్ సమస్యపై దౌత్యపరమైన ప్రయత్నాల విషయంలో భారత్ చొరవను పాశ్యాత్య దేశాలు హేతుపూర్వకంగా గుర్తించాల్సి వచ్చింది. యూరప్ సమస్యలు ప్రపంచ సమస్యలు అవుతాయి. కానీ ప్రపంచ సమస్యలు యూరప్ సమస్యలుగా ఎన్నడూ కావు అనే ఆలోచనలోని కపటత్వాన్ని భారత్ ప్రపంచదేశాలకు నొక్కి చెప్పింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇండో పసిఫిక్ వ్యవహారాలకు సంబంధించి భారత్ కేంద్ర స్థానం విషయంలో యూరప్ దేశాలు నిశ్చితాభిప్రాయానికి వచ్చేసాయి.

దీంతో ఈ సంవత్సరం భారత్ యూరప్ దేశాల మధ్య సంబంధాలు కొత్త పుంతలు తొక్కాయి. యూరోపియన్ స్థల పరిదుల్లో రష్యాకు ప్రధాన స్థానం ఉన్నప్పటికీ, చైనా నుంచి, దాని దూకుడు ఎత్తుగడల నుచి తమకు దీర్ఘకాలిక వ్యూహాత్మక తర్కం కారణంగా అమెరికాలో భారత్ సంబంధాలు కూడా ముందంజ వేసాయి. ఇండో పసిఫిక్ నేడు అత్యంత కీలకంగా మారింది. పసిఫిక్ ప్రాంతంలో ‘క్వాడ్’, మధ్య ప్రాచ్యంలో ‘ఐటూయూటూ’ రెండు కీలక భాగాలలో సంస్థాగత వ్యాఖ్యాతలుగా ఆవిర్భవిస్తున్నాయి. న్యూఢిల్లీ వాషింగ్టన్ ద్వైపాక్షిక సంబంధాలకు మించి తమ వ్యవహారాలకు చెందిన ఎజెండానే పునర్ నిర్వచించుకుంటున్నాయి. తమ ఆకాంక్షల ఆక్రుతులను మరింత పరిగణనలోకి తీసుకుంటున్నాయి. భారతదేశం నిర్వహించే అంతర్జాతీయ పాత్రను ప్రపంచం ఇప్పుడు మనంత సీరియస్ గా తీసుకుంటోంది. ఎందుకంటే ప్రపంచ సమస్యలను భారత్ ఇప్పుడు మరింతగా పట్టించుకుంటోంది. అంతే కాదు నాయకత్వం కూడా నిర్వహిస్తోంది.

ప్రపంచ సమస్యలకు పరిష్కారాలను అందించేందుకు సిధ్దపడుతోంది. ఇది భారత్ లో ప్రపంచం పట్ల గతంలో లేని మార్పుగా చెప్పుకోవచ్చు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్ తన అధ్యక్ష స్థానాన్ని సంస్కరించిన బహు పాక్షికతను శాంతి పరిరక్షణను ఉగ్రవాద నిరోధకతను, సముద్ర భద్రతను నొక్కి చెప్పడానికి ఉపయోగపడుతుంది. ఈ సమస్యలు భారత్ ప్రయోజనాలకే కాదు ప్రపంచంలోని విశాల భాగం ప్రయోజనాలకు కూడా చాలా ముఖ్యమైనవిగా నిపుణులు చెబుతున్నారు. భద్రతా మండలిలో భారత్ వ్యవహరిస్తున్న తీరులో ఆదరణాత్మకతకు చెందిన కొత్త అర్థం ప్రస్పుటమవుతోంది. ఇంతవరకువినబడకుండా కనిపించకుండా పోయిన విశాల మెజారిటీ దేశాల గురించి మాట్లాడేలా భారత్ వాణి ఉంటోంది. ఈ ప్రాధాన్యత ప్రాతిపదికపైనే అది జీ20 కూటమి అధ్యక్ష బాధ్యతను భుజాలకెత్తుకుందని చెప్పుకోవచ్చు.

బహుపాక్షికత అనేదీ తన విశ్వసనీయతా సంక్షోభాన్ని ఎదుర్కోంటున్న సమయంలో ప్రపంచం ఎదుర్కొంటున్న కీలకమైన సవాళ్లు కొన్నింటికి పరిష్కారాలను అందించే విషయంలో అందరి కళ్లూ ఢిల్లీ చేపట్టిన జీ20 నాయకత్వంపైనే ఉన్నాయి. ఇది అంతర్జాతీయ పర్యవసానాలను రూపుదిద్దగలిగే నాయకత్వ శక్తిగా భారత్ తన విశ్వసనీయతను పెంపొందించుకోవాల్సిన సమయంగా భావిస్తున్నారు. ప్రత్యేకించి భారత్ గాథ ప్రపంచం ద్రుష్టిని ఆకర్షిస్తున్న సమయంలో ఇది ఎంతో అవసరం. భారత్ అంతర్జాతీయ పాత్రను మెచ్చుకునే పరిణామాలు ఏర్పడుతున్న సమయంలో ప్రముఖ ఆర్థిక శక్తిగా ఆవిర్భంచడం కీలక పాత్ర పోశించనుంది. ప్రపంచం మొత్తంగా బీజింగ్ వ్యవహారాలపై తీవ్ర అసమ్మతి వ్యక్త పరుస్తోన్న సమయంలో చైనా దూకుడును నిలువరించడంలో ద్రుడ వైఖరిని ప్రదర్శిస్తున్న భారత్ కొత్త అవకావాలను స్రుష్టించుకుంది.

2022లో ఇలాంటి కొన్ని అవకాశాలను అంది పుచ్చుకోవడంలో భారతీయ విదేశీ విధానం విజయవంతమైంది. అందులో మన విదేశాంగ్ మంత్రి జైశంకర్ సమర్థవంతమైన పాత్రను పోశించగలిగారు. మరో వైపున చైనా సవాలు సమీప భవిశ్యత్తులో భారత్ ప్రభుత్వ సమర్థతను పరీక్షించడం కొనసాగించనుంది. శీతాకాలం తర్వాత కూడా ఉక్రెయిన్ సంక్షోభం కొనసాగినట్లైతే భారత్ రష్యా పొత్తు కూడా నిశిత పరిశీలను గురవతుంది. న్యూఢిల్లీ పదేపదే చెబుతున్న ‘భహుళ అమరిక వాదం’ కూడా 2023లో తీవ్రమైన ఒత్తిడి పరీక్షకు గురి కాకతప్పదు.అయితే 2022 గురించి ఏమైనా చెప్పుకోవాలి అంటే భారత వాణి విశిష్టతను ప్రపంచం గుర్తించింది. మున్ముందు ఇది కూడా అంతర్జాతీయ వేదికలపై మరింతగా విస్తరిస్తుంది. ఇప్పుడిప్పుడే దాని ప్రతిధ్వనులు తగ్గిపోవని అంటున్నారు విశ్లేషకులు.

Must Read

spot_img