Homeఅంతర్జాతీయంఅమెరికా బాంబ్ సైక్లోన్ కారణంగా అల్లకల్లోలం !!!

అమెరికా బాంబ్ సైక్లోన్ కారణంగా అల్లకల్లోలం !!!

మొన్నటి మొన్న అమెరికా బాంబ్ సైక్లోన్ కారణంగా అల్లకల్లలోమైంది. ఆ బీభత్సం మరువక ముందే ఇప్పుడు మళ్లీ మంచు తుఫాన్ చెలరేగిపోతోంది. ఈసారి ఒక్క మంచు తుఫాన్ మాత్రమే కాదు..దాని వెంటే మండిస్తున్న ఎండలు కూడా ఉబ్బరింపుకు గురిచేస్తున్నాయి. ఈ విచిత్ర విభిన్న అసాధారణ వాతావరణంతో ఎలా వేగాలో తెలియక అగ్రరాజ్యం అమెరికా అల్లాడిపోతోంది.. ఓ వైపు మంచు తుఫాన్.. మరోవైపు మండిస్తున్న ఎండలు..

అసాధారణ వాతావరణంతో అమెరికెన్లు విలవిల్లాడుతున్నారు. ఒకవైపు చలి గడ్డకట్టిస్తోంది.. మరోవైపు ఎండలు దంచి కొడుతున్నాయి. ఈ రెండింటి మధ్య అమెరికన్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. నార్త్‌ అండ్‌ వెస్ట్‌లోస్నో బీభత్సం సృష్టిస్తుంటే, ఈస్ట్‌లో హై టెంపరేచర్స్ టాప్‌ లేపుతున్నాయి. మొత్తానికి భిన్న వాతావరణంతో అమెరికా ప్రజలు అల్లాడుతున్నారు. ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అగ్రరాజ్యం మరోసారి మంచు గుప్పిట్లోకి వెళ్లిపోయింది. మంచు తుఫాను దెబ్బకు మరోసారి విలవిల్లాడుతోంది అమెరికా. పశ్చిమ తీరం నుంచి గ్రేట్‌ లేక్స్‌ వరకు మంచు వర్షం బీభత్సం సృష్టిస్తోంది. మంచు తుఫాను దెబ్బకు అల్లాడిపోతున్నారు అమెరికన్లు. సుమారు మూడు లక్షల ఇళ్లకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో కోట్లాది మంది అమెరికన్లు చీకట్లో మగ్గిపోతున్నారు.

మంచు తుఫాను తీవ్రత అధికంగా ఉండడంతో.. 15వందలకు పైగా విమానాలను రద్దు చేశారు. లాస్‌ఏంజెల్స్‌, మిచిగాన్‌, మిన్నెసోటా, డెన్వర్‌, సాల్ట్‌ లేక్‌ సిటీ, మినియాపొలిస్‌, సెయింట్‌పాల్‌, వ్యోమింగ్‌ నగరాల్లో పరిస్థితులు అత్యంత దారుణంగా మారాయి. ఈ ప్రాంతాలకు రెడ్‌ అలర్ట్‌ ఇష్యూ చేసింది అమెరికా జాతీయ వాతావరణశాఖ. రాబోయే రోజుల్లో మంచు వర్షం తీవ్రంగా ఉండొచ్చని హెచ్చరించింది. మంచు తుఫానుతోపాటు గంటకు 70కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ముందుగా హెచ్చరికాలు జారీ చేసింది. అత్యంత ప్రమాదకర వింటర్‌ స్నో సైక్లోన్‌ను ఎదుర్కొనేందుకు ప్రజలంతా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది అమెరికా వెదర్‌ డిపార్ట్‌మెంట్‌. ఇళ్ల నుంచి బయటికి వస్తే కచ్చితంగా సేఫ్టీ కిట్‌ను వెంట ఉంచుకోవాలని సూచించింది.

ఒకవైపు మంచు తుఫాను అమెరికన్లు వణికిస్తుంటే, తూర్పు ప్రాంతంలో అసాధారణ ఉష్ణోగ్రతలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మొత్తానికి అమెరికా అసాధారణ వాతావరణంతో విలవిల్లాడుతోంది. దీంతో ఇంట్లో నుంచి బయటికి అడుగుపెట్టాలంటేనే వణికిపోతున్నారు అమెరికన్లు. రోడ్లపై గుట్టలుగుట్టలుగా మంచు పేరుకుపోవడంతో రహదారులన్నీ మంచు దుప్పటి కప్పుకున్నాయి. అక్కడి వాతావరణ విభాగం 1989 తర్వాత మొదటిసారిగా మంచు తుపాను హెచ్చరికలను జారీ చేసింది. కొన్ని తీర ప్రాంతాల్లో అలలు 3 నుంచి 4.3 మీటర్ల ఎత్తున ఎగిసిపడుతున్నాయి. వ్యోమింగ్, ఆరిజోనా, న్యూ మెక్సికో, పోర్ట్‌ల్యాండ్, ఓరెగాన్‌ పలు చోట్ల ట్రాఫిక్‌ అంతరాయం ఏర్ప డింది. మిషిగన్, ఇలినాయీ, కాలిఫోర్నియా ల్లో విద్యుత్‌ లైన్లు తెగిపోవడంతో జనం రాత్రిళ్లు చీకట్లోనే గడిపారు.

మంచు, చలిగాలులతో కాలిఫోర్నియా, సియెర్రా నెవడాల్లో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. సుమారు 1,800 విమాన సర్వీసులు రద్దు కాగా, మరో 6 వేలకు పైగా సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇలా ఉండగా, మరికొన్ని రాష్ట్రాల్లో ఇందుకు భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. నాష్‌విల్లేలో బుధవారం అత్యధికంగా 26.67 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదై 127 ఏళ్ల రికార్డు బద్దలైందని అధికారులు చెప్పారు. ఇండియానా పొలిస్, సిన్సినాటి, అట్లాంటా, లెక్జింగ్టన్, కెంటకీ, అలబామాల్లోనూ ఇదే స్థాయిలో ఎండలున్నాయి. అయితే ఇప్పుడు అమెరికా వ్యాప్తంగా 28 రాష్ట్రాలలో నెలకొని ఉన్న పరిస్థితిని వింటర్ స్టార్మ్ అని అంటున్నారు వాతావరణ నిపుణులు. దీని వల్ల 60 మిలియన్ల సంఖ్యలో జనంపై ప్రభావం పడుతోంది. ఈసారి వేసవి ప్రభావం చాలా తొందరగా వచ్చినట్టు చెబుతున్నారు.

నార్తర్న్ కాలిఫోర్నియా ప్రాంతంలో 6 అంగుళాల మంచు కురిసింది. పలు ప్రాంతాలలో మంచుతో కూడిన వర్షం కురుస్తోంది. గడ్డకట్టించే చలితో పాటు వేగంగా గాలులు వీస్తున్నాయి. గంటకు 50 నుంచి 60 మైళ్ల వేగంతో వీచే ఈ గాలులు కొన్ని ప్రాంతాలలో 80 మైళ్లను కూడా మించుతున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం చాలా ప్రాంతాలను బ్లిజార్డ్ అనబడే మంచు తుఫాన్ హెచ్చరికలు జారీ చేసింది. పట్టపగలే లైట్లు వేసుకుని చాలా జాగ్రత్తగా నడుస్తున్న కార్లు అనేక చోట్లా ప్రమాదాలకు గురవుతున్నాయి. అయితే గత అనుభవాలను ద్రుష్టిలో ఉంచుకుని కార్లలో అన్ని జాగ్రత్తలు తీసుకుని బయటకు రావాలని ప్రభుత్వం ముందే హెచ్చరించింది. నెల క్రితం ఇలాగే బయటకు వచ్చి ట్రాఫిక్ లో చిక్కుకుపోయి చలికి గడ్డకట్టుకుపోయి చాలా మంది చనిపోయారు.

Must Read

spot_img