స్టార్ హీరోలకే కాదు..సంగీత దిగ్గజాలకు వారసులున్నారు. ఓవైపు తండ్రులు రాణిస్తుంటే? మరోవైపు తనయులు దూసుకొస్తు న్నారు. గాయకులుగా…సంగీత దర్శకులుగా తమకిష్టమైన రంగాల్ని ఎంపిక చేసుకుని సక్సెస్ దిశగా అడుగులు వేస్తున్నారు. ఓసారి ఆ సంగీత స్వర మాంత్రికుల్ని తలుచుకుంటూ తనయుల ముందుకు సాగుతున్నారు. ఈ పరుగు పందెంలో ఏ తనయుడు ఎక్కడ ఉన్నాడు. వాచ్ దిస్ స్టోరీ..
అస్కార్ అవార్డు గ్రహీత…స్వర మాంత్రికుడు..మ్యూజిక్ లెజెండ్ రెహమాన్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడాయన వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని తనయుడు అమీన్ కూడా ఇదే రంగంలోకి దూసుకొస్తున్నాడు. చిన్న నాటి నుంచి తండ్రితో కలిసి స్టేజ్ షోలో పాల్గొంటున్నాడు. వాస్తవానికి అమీర్ సంగీతాన్ని కెరీర్ ఎంచుకోవాలనుకోలేదు. ఇటు వైపు రావడం అనుకోకుండా జరిగింది. ఓ కార్యక్రమంలో సరదగా పాడిన పాటకు మంచి అప్లాజ్ వచ్చింది. దీంతో అప్పటి నుంచి చదువుకుంటూనే సంగీతం నేర్చుకుంటున్నాడు. ఒకే బంగారం, 2.0, ఒకే జాను, నిర్మలా కాన్వెంట్ వంటి చిత్రాల్లో కొన్ని పాటలు పాడాడు. కష్టపడే తత్వాన్నితండ్రి నుంచే నేర్చుకున్నాడు అమీన్. ఈ నేపథ్యంలో యువ సంచలనం ఎప్పుడైనా బ్లాస్ట్ అవ్వొచ్చని మ్యూజిక్ ప్రియులు చెప్తున్నారు.
గానం..మ్యూజిక్ స్కూల్..స్వరకూర్చు ఇలా సంగీతం లో తనదైన ముద్ర వేసారు శంకర్ మహదేవన్. ఇప్పుడాయన కుమారులు సిద్దార్ధ్..శివమ్ కూడా తోడయ్యారు. భాగ్ మిల్కా భాగ్ లో, జిందా బార్ బార్ దేఖో పాటతో దేశమంతా ఫేమస్ అయ్యాడు. శివమ్ కూడా పాటలు పాడుతూ..వెబ్ సిరీస్ ల్లోనూ నటిస్తున్నాడు. ఇంట్లో ముగ్గురు ఓ చోట చేరితే సంగీత కచేరి సాగుతుందట.ఇక మణిశర్మ వారసుడిగా ఛలో తో ఎంట్రీ ఇచ్చిన మహతి సాగర్ ఇప్పటికే సక్సెస్ ఫుల్ సంగీత దర్శకుడిగా టాలీవుడ్ లో రాణిస్తున్నాడు. తండ్రి సూచనలు..సలహాలు తీసుకుంటూ మంచి భవిష్యత్ ని నిర్మించుకునే అవకాశం ఉంది. ఇతర భాషల్లోనూ యవ సంచలనానికి బాగానే అవకాశాలు వస్తున్నాయి.
మరో సంగీత దిగ్గజం కోటి తనయుడు రోషన్ కూడా సంగీత సాధన చేస్తున్నాడు. ఇప్పటికే ‘నిర్మలా కాన్వెంట్’.,.’గాయకుడు’ లాంటి చిత్రాలకు పనిచేసాడు. ఇలా మారడానికి తండ్రే ప్రధాన కారణం అంటున్నాడు. తన పట్టుదలకు తండ్రి సహకారం తోడవ్వడంతోనే ఇది సాధ్యమైందంటున్నాడు. ఇక డ్రమ్మర్ గా ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచిన శివమణి తనయుడు కుమరన్ కూడా తండ్రిని ఆదర్శంగా తీసుకుని రిథమ్ ప్లేయర్గామారాడు. ఏ. ఆర్ . రెహమాన్ బ్యాండ్ ట్రూప్
లోనూ పనిచేసాడు. భవిష్యత్ లో మంచి పేరు తెచ్చుకుంటాడని శివమణి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.