Homeసినిమాపెళ్ళికాని హీరోయిన్ శృతిహాసన్..

పెళ్ళికాని హీరోయిన్ శృతిహాసన్..

ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న పెళ్ళికాని హీరోయిన్లలో శృతిహాసన్ కూడా ఒకరు. అయితే శృతిహాసన్ వ్యక్తిగత జీవితం గురించి ఎప్పటికప్పుడు వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. శృతిహాసన్ ఏ ఇంటర్వ్యూ కి వెళ్లిన ఆమెను తరచుగా అడిగే ప్రశ్న పెళ్లి ఎప్పుడు అని. అయితే ఆమె మాత్రం ఎప్పుడూ ఆ ప్రశ్నకు ఇప్పట్లో కాదు ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం తన కరియర్ మీదనే అని చెప్పి కొట్టి పారేస్తూ ఉంటుంది. తాజాగా తన పెళ్లి ఫిక్స్ అయినట్లు మరోసారి వార్తలు పుట్టుకోస్తున్నాయి.

ఆ వివరాలు మీకోసం..మొన్న సంక్రాంతికి వాల్తేరు వీరయ్య ,వీర సింహారెడ్డి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ముద్దుగుమ్మ శృతి హాసన్. సీనియర్ స్టార్ హీరోయిన్స్ కు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా ఈ అమ్మడు పేరు దక్కించుకుంది. కేవలం తెలుగు లో మాత్రమే కాకుండా ఇతర భాషల్లో కూడా ఈ అమ్మడు నటిస్తూ బిజీ బిజీగా ఉంది.ఒక సూపర్ స్టార్ కూతురు అయినా కూడా ఈమె కెరీర్ మొదటి నుండి కూడా ఒక సాధారణ హీరోయిన్ మాదిరిగానే సాగింది.

తన తండ్రి స్టార్డమ్ ఉపయోగించుకోకుండా ఇండస్ట్రీలో మంచి పేరు దక్కించుకున్న అతి కొద్ది ముద్దుగుమ్మల్లో శృతి హాసన్ ఒకరు అనడంలో సందేహం లేదు. అయితే శృతిహాసన్ ప్రమ విషయాన్ని.. ఇతర విషయాలను ఎప్పటికప్పుడు చెబుతూనే వస్తోంది. హీరోయిన్ గా వరుసగా సినిమాలు చేస్తున్న శృతి హాసన్ గత కొన్నాళ్లుగా డూడుల్ ఆర్టిస్టు అయిన శాంతను హజారిక తో ప్రేమలో ఉన్న విషయం తెల్సిందే. ఇద్దరు ప్రస్తుతం సహజీవనం కూడా సాగిసించారు.

ఇటీవల శాంతను గురించి పదే పదే పోస్ట్ లు పెడుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. శృతి హాసన్ సన్నిహితుల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఏడాది లోనే పెళ్లి ఉండబోతుందట. శృతి హాసన్ మరియు శాంతను హజారికల వివాహానికి రెండు వైపుల కుటుంబ సభ్యులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. దాంతో సాధ్యమైనంత త్వరగా పెళ్లి జరిగే అవకాశాలు ఉన్నాయి. శృతి హాసన్ పెళ్లి తర్వాత కూడా ఇండస్ట్రీ లో కెరీర్ ను కంటిన్యూ చేసే అవకాశాలు ఉన్నాయి.

Must Read

spot_img