రాను రాను టెక్నాలజీలు ఊహించని విధంగా మార్పులు చోటు చేసుకోనున్నాయి. నిజానికి అన్ని రంగాలలో ప్రతీ పదేళ్లకోసారి టెక్నాలజీలు అప్ గ్రేడ్ అవతున్నాయి. ఎలాగంటే 1990లో కంప్యూటర్లు, కొత్త మిలినియం మొదట్లో సెల్ ఫోన్ అందరి చేతుల్లోకి వచ్చింది. దీంతో ప్రపంచం మొత్తం అరచేతిలోకి వచ్చినట్టైంది. అయితే అప్పటి నుంచి ప్రపంచం రెట్టించిన వేగంతో దూసుకుపోతోంది.

అవును దశాబ్దానికోసారి టెక్నాలజీలన్నీ అప్ గ్రేడ్ అవుతూ వస్తున్నాయి. ఆ దేశం ఈ దేశం అని కాదు అన్ని దేశాలలో ఇది జరుగుతోంది.. 1990 దశకంలో మనం కంప్యూటర్లను చూశాం. కొత్త మిలీనియం మొదట్లో సెల్ ఫోన్ అందరి చేతుల్లోకి రావటం మొదలైంది. ఆ తర్వాత ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టా గ్రాం లాంటి అనేక సంస్థలు చిన్న చిన్న స్టార్టప్స్ గా మొదలై..ఇప్పుడు దిగ్గజ సంస్థలుగా ఎదిగాయి.
వేలాది మందికి ఉద్యోగ ఉపాధి లభించడం జరిగింది. గూగుల్ సెర్చ్ ఇంజిన్ ఇప్పుడు వరల్డ్ లో నెంబర్ 1 సెర్చ్ ఇంజన్ గా మారింది.. మనకి ఏ విషయం గురించి వివరణ కావాలన్నా నెట్ లో గూగుల్ తల్లిని అడగటం మొదలుపెట్టాం. ఇప్పుడు గూగుల్ కి పోటీగా ఓ టెక్నాలజికల్ ఇన్నోవేషన్ పోటీకి వస్తోంది.
ఛాట్ బోట్స్ అన్న పేరు చాలా మందికి తెలిసిపోయింది. చాలా చోట్ల అప్లికేషన్స్ అన్నీ చాట్ బోట్స్ తోనే రన్ అవుతున్నాయి. అలాంటి దశను దాటుకుని ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో వస్తున్న ఓ చాట్ బాట్ నే, ‘చాట్ జీపీటీ’ అంటున్నారు.. చాట్ అంటే మాట్లాడటం. జీపీటీ అంటే జనరేటివ్ ప్రీ ట్రైన్డ్ ట్రాన్సఫార్మర్. అంటే ఈ చాట్ బోట్ కు ముందు అన్ని విధాలుగా శిక్షణ ఇస్తారు.
ఎప్పటికప్పుడు కొత్త విషయాలను దీనికి ఇంక్లుడ్ చేయటం ద్వారా ఈ చాట్ జీపీటీ మనకు సమాధానాలు ఇస్తూ ఉంటుంది. ఇలా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుండటం వల్ల అది చాలా పవర్ ఫుల్ అవుతుంది. ఎవరి ప్రశ్నకైనా ఇట్టే సమాధానం చెప్పేలా నాలెడ్జీ గెయిన్ చేసుకుంటుంది. దాంతో అది సూపర్ ఫాస్ట్ గా జవాబు ఇస్తుంది.
అయితే ఈ చాట్ జీపీటీ వల్ల పెద్ద పెద్ద సంస్థలకు ముప్పు రానుందని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ చాట్ జీపీటీ వల్ల ఎందుకు దిగ్గజ సంస్థలు ముప్పంటే. మనం నెట్ ఓపెన్ చేసి సెర్చ్ ఇంజిన్ లో ఏదైనా సెర్చ్ చేస్తే చాలు వందలకొద్దీ ఇన్ఫర్మేషన్ వచ్చి పడిపోతుంటాయి. ఏది రిలయబుల్.. ఏది కాదు..ఏది మనల్ని మిస్ లీడ్ చేసే విషయమో తెలుసుకోవటం చాలా కష్టం.
ఒక్క పదంతో సెర్చ్ చేస్తే వంద ఆప్షన్లు వస్తాయి. ఏది సెలెక్ట్ చేసుకోవాలనేది మళ్లీ మనకే పెద్ద టాస్క్. చాట్ జీపీటీ అలా కాదు.. బాగా ఆలోచించి క్షణంలో ఒక్కటంటే ఒక్కటే ఆన్సర్ ఇస్తుంది. ఉదాహరణకు ప్రభాస్ అంటే ప్రభాస్ ఎవరు ఏంటీ సింపుల్ గా ఓ ముప్పై పదాల్లో చెప్పేస్తుంది. ఏదైనా సమస్యను దానికి చెప్పామనుకోండి అది మొత్తం సాల్వ్ చేసి ఇస్తుంది.
ఓపెన్ ఏఐ అనే ఆర్టిఫీషియల్ ఇంటిలెజెన్స్ మీద పనిచేసే కంపెనీ ఈ చాట్ జీపీటీని లాంచ్ చేసింది. నవంబర్ లో అనౌన్స్ చేసి మొన్న గత నెల 15న లాంచ్ చేశారు . కేవలం ఐదు రోజుల్లోనే వన్ మిలియన్ యూజర్లను ఈ సర్వీస్ దక్కించుకుంది. ఈ నెంబర్ అచీవ్ అవ్వటానికి చాలా పెద్ద కంపెనీలకు కూడా చాలా టైమ్ పట్టింది. అందుకే గూగుల్ లాంటివి చాట్ జీపీటీ మీద రెడ్ కోడ్ పెట్టాయి.
అవి చేస్తున్న పనులు..తెస్తున్న మార్పులను నిశితంగా పరిశీలిస్తున్నాయి. ఇంతకీ చాట్ జీపీటీ మన సిస్టమ్ లోనో ల్యాప్ ట్యాప్ లోనో వాడటం ఎలా అన్నది చూద్దాం.. ఓపెన్ ఏఐ వెబ్ సైట్ లోకి వెళ్లి లాగిన్ అవ్వచ్చు..లేదంటే గూగుల్ సెర్చ్ చాట్ జీపీటీ అని కొట్టి..ఓపెన్ ఏఐ వెబ్ సైట్ నుంచి దీనిని ఇన్ స్టాల్ చేసుకోవచ్చు.
మన మెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్ ఇస్తే…ఓ ఐడీ ని మొబైల్ నెంబర్ కి పంపిస్తుంది. అది ఎంటర్ చేస్తే ఓ యాక్టివేషన్ లింక్ ను మెయిల్ కు పంపిస్తుంది. అది క్లిక్ చేస్తే ఈ చాట్ జీపీటీ లాంచ్ అయిపోతుంది. అయితే దీంతో ప్రస్తుతానికి కొన్ని సమస్యలు ఉన్నాయి. దీనిని 2021 వరకే అప్ డేట్ చేశారు. సో ఇది చెప్పే విషయాలన్నీ 2021 వరకు తెలిసిన వివరాలను చెబుతుంది. ఆ తర్వాత తనకు తెలియదని చెబుతుంది.
ఎందుకంటే దీన్ని ప్రస్తుతానికి ఇంటర్నెట్ కు ఇంకా లింక్ చేయలేదు. త్వరలో చేయనున్నట్లు రూపకర్తలు ప్రకటించారు. గూగుల్ కూడా చాట్ జీపీటీలాంటి దాన్ని క్రియేట్ చేసి తన సెర్చ్ ఇంజిన్ లో పెట్టాలని భావిస్తోంది. ఎందుకంటే యూజర్ ఫ్రెండ్లీగా ఉండే ఈ కొత్త మాధ్యమం భవిశ్యత్తులో విప్లవాత్మకంగా క్లిక్కయ్యే అవకాశం ఉంది.