మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. RC 15 అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతోన్న ఈ చిత్రంలో నుంచి అప్‌డేట్ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకనో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. RRR వంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత రామ్ చరణ్ నటిస్తోన్న సినిమా కావటంతో అందరూ చాలా ఎగ్జయిట్మెంట్‌తో వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా నుంచి బిగ్అ ప్డేట్ ఒకటి బయటకు వచ్చింది.

దర్శకుడు శంకర్ కెరియన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈయన చేసింది 12 సినిమాలే అయినా… ప్రపంచ వ్యాప్తంగా ఫుల్ పాపులారిటీ వచ్చింది. ప్రస్తుతం శంకర్ రెండు ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఒకవైపు చెర్రీ 15, మరోవైపు భారతీయుడు-2 సినిమా రెండు ఏక కాలంలో షూటింగ్ చేస్తున్నాడు. అయితే ఇప్పడు టాలీవుడ్ లో చర్చ మొత్తం చెర్రీ సినిమా పైనే.
పొలిటికల్ సెటైరికల్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ మూవీని దర్శకుడు శంకర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. ఇందులో రామ్ చరణ్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటిస్తుండగా మరో కీలక పాత్రలో అంజలి కనిపించబోతోంది.
ఇప్పటికే లీకైన అంజలి రామ్ చరణ్ హెరిటేజ్ లుక్ క్లారిటీ ఇచ్చేసింది. అంతే కాకుండా శంకర్ తన గత చిత్రాలకు పూర్తి భిన్నంగా అత్యంత భారీ స్థాయిలో ఈ మూవీని తెరకెక్కిస్తుండటంతో మెగా ఫ్యాన్స్ ఈ మూవీ కోసం భారీ అంచనాలతో ఎదురు చూస్తున్నారు. రీసెంట్ గా ఈ మూవీకి సంబంధించిన ఓ సాంగ్ షూటింగ్ కోసం టీమ్ న్యూజిలాండ్ వెళ్లడం.. సాంగ్ షూట్ కంప్లీట్ చేసుకుని తిరిగి హైదరాబాద్ చేరుకోవడం తెలిసిందే. వచ్చే ఏడాది సమ్మర్ లో భారీ ఎత్తున రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ మూవీకి సంబంధించిన క్రేజీ న్యూస్ ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది.
ఇందులో ద్విపాత్రాభినయం చేస్తున్న రామ్ చరణ్ హిస్టారికల్ క్యారెక్టర్ లోనూ కనిపించి ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేయనున్నాడని ఇన్ సైడ్ టాక్. ఈ విషయంలో రాజమౌళిని ఫాలో కాబోతున్నాడని తెలుస్తోంది. రెగ్యులర్ సినిమాలకు పూర్తి భిన్నంగా రాజమౌళి సరికొత్త కథలతో పాన్ ఇండియా మూవీస్ ని తెరకెక్కిస్తూ తనదైన ప్రత్యేకతని చాటుకుంటున్నాడు. తనని ఇప్పడు శంకర్ RC15 కోసం ఫాలో కాబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ మూవీలోని కీలక ఘట్టంలో రామ్ చరణ్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ పాత్రలో కనిపించనున్నాడని, చరణ్ మేకోవర్ సినిమాకు ప్రధాన హైలైట్ గా నిలవనుందని తెలుస్తోంది.
RRRలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గా క్లైమాక్స్ లో విశ్వరూపం చూపించి పూనకాలు తెప్పించిన రామ్ చరణ్ మరో సారి లెజెండరీ ఫ్రీడమ్ ఫైటర్.. భారత స్వాతంత్య్రం కోసం ఏకంగా అజాద్ హింద్ ఫౌజ్ నే సొంతంగా ప్రారంభించి బ్రిటీష్ పాలకుల గుండెల్లో రైల్లు పరుగెత్తించిన సుభాష్ చంద్రబోస్ గా కనిపించనున్నాడని తెలియాగానే మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారట. చరణ్ ని సుభాష్ చంద్రబోస్ లుక్ లో చూస్తే ఫ్యాన్స్ కు థియేటర్లలో
పూనకాలు గ్యారంటీ.