Homeజాతీయంకశ్మీర్‌లో 74 సంవత్సరాలుగా యూఎన్‌ కు సంబంధించిన ఓ కార్యాలయం

కశ్మీర్‌లో 74 సంవత్సరాలుగా యూఎన్‌ కు సంబంధించిన ఓ కార్యాలయం

ఎంత నిలువరించినా ఎన్ని చర్యలు తీసుకున్నా పాకిస్తాన్ బుద్ది మాత్రం మారడం లేదు. నిత్యం ఏదో ఓ మూల నుంచి కలుగుల్లోంచి బయటపడే ఎలుకల్లా ఉగ్రవాదులు దేశంలోకి చొరబడుతూ ప్రశాంతంగా ఉన్న జమ్ము కశ్మీరులోయలో అలజడి రేపే ప్రయత్నాలు చేస్తున్నారు. వీటన్నింటికీ కారణం లోయలో ఇంకా కుట్రలు జరుగుతూనే ఉన్నాయి. దేశపు హక్కులు అనుభవిస్తూ ఈ దేశంలోనే సురక్షితంగా ఉంటూ దేశద్రోహులుగా మారుతున్న వారే ఈ అలజడులకు కారణం అని సమాచారం. ఈ అంతర్గత సమాచారం అందుకున్న మన పాలకులు అందుకు తగిన చర్యలు తీసుకుంటూనే ఉన్నారు.

అందులో భాగంగానే తాజాగా అత్యంత నిశ్శబ్దంగా ఓ కీలక చర్య చేపట్టింది భారత్.. బయటకు తెలియకుండానే కర్రా విరక్కుండా పామును చక్కగా చంపేసింది. అందుకు ఈ సంగతి అర్థం అయినవాళ్లు శెభాష్‌ జైశంకర్‌ అంటూ మన విదేశాంగ మంత్రిని మెచ్చుకుంటున్నారు. ఇక ఆ చర్య ఏమిటో జైశంకర్ ఏం చేసారో ఇప్పుడు చూద్దాం..మీకు తెలుసా..కశ్మీర్‌లో 74 సంవత్సరాలుగా యూఎన్‌ కు సంబంధించిన ఓ కార్యాలయం నెహ్రూకాలం నుంచి నడుస్తోంది. దాని వల్ల మన దేశానికి ఏ లాభం లేకపోగా నష్టమే జరుగుతోంది. అలాంటి ఓ పనికిరాని ధర్మసత్రాన్ని షట్‌డౌన్‌ చేసేసింది భారత ప్రభుత్వం.

నిజానికి మనం మన ఇంటి గోడకు బీటలు వారితే మరమ్మతు చేస్తాం.. చెట్టుకు పురుగు పడితే మందులు చల్లుతాం.. కానీ అదే చెట్టుకు చెదలు పట్టి పనికి రాకుండా పోతే..ప్రమాదకరంగా మారితే.. గోడ కారణంగా ఇల్లే కూలిపోయే పరిస్థితి వస్తే.. మొదటికే..అంటే కూకటి వేళ్లతో తొలగిస్తాం.. అంతే కదా.. అచ్చం ఇలాగే చేశారు ప్రధాని మోదీ, విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్‌. చెదలు పట్టిన 74 సంవత్సరాల యునైటెడ్‌ నేషన్స్‌ మిలటరీ అబ్జర్వర్‌ గ్రూప్‌ ఇన్‌ ఇండియా అండ్‌ పాకిస్థాన్‌ అనే చెట్టును నిర్దాక్షిణ్యంగా షట్‌డౌన్‌ చేశారు.

నిజానికి ఇదో ఐక్యరాజ్యసమితి కార్యాలయం మాత్రమే..ఇక్కడ ఏడు దశాబ్దాలుగా ఏం చేస్తోంది అంటే..లోయలో ఘటనలను రిపోర్ట్ చేస్తోంది. యునైటెడ్‌ నేషన్స్‌ మిలటరీ అబ్జర్వర్‌ గ్రూప్‌ ఇన్‌ ఇండియా అండ్‌ పాకిస్థాన్‌ అనేది ఐక్యరాజ్యసమితికి సంబంధించిన ఈ పరిశీలక బృందం ముఖ్య ఉద్దేశం భారత్‌ పాకిస్థాన్‌ మధ్య సైనిక ఘర్షణలను పర్యవేక్షిస్తూ నిత్యం నివేదకలు ఇవ్వడం.

1948లో కశ్మీరు సమస్యను నేరుగా పరిష్కరించడం చేయకుండా అప్పటి ప్రధాని నెహ్రూ కాశ్మీర్‌ సమస్యని థర్డ్ అంపైర్ అయిన ఐక్యరాజ్య సమితికి అప్పచెప్పడం వలన ఇది ఏర్పాటయింది. ఈ బృందానికి ఒక ఆఫీసు ఏర్పాటు చేసి, వాళ్లకి జీత భత్యాలతో సకల సదుపాయాలు ఏర్పాటు చేసింది. ఇందులో పనిచేసే 40 మందికి అన్ని సదుపాయాలు కల్పిస్తూ ఆ ఖర్చును మన దేశమే చెల్లించాల్సి ఉంటుంది. చెల్లిస్తోంది కూడా.. అయితే ఉన్నట్టుండి వారం క్రితం ఈ బ్రుందం ఏం చేసిందంటే తనకు అప్పజెప్పిన పనిలో చైనాను కూడా కలిపేసుకుంది. ఈ పరిశీలక బృందం జమ్మూకశ్మీర్‌ సమస్య అనేది భారత పాకిస్థాన్‌ మధ్య కాకుండా చైనాకి కూడా భాగం ఉందని వారం క్రితం ఐక్యరాజ్య సమితికి ఒక నివేదిక ఇచ్చింది.

అంతే కాకుండా తమ కార్యకలాపాలకు భారత్‌ తోపాటు చైనా కూడా అడ్డంకులు కల్పిస్తుందని ఫిర్యాదు చేసింది. అంతటితో ఆగకుండా ‘అన్నం పెట్టే యజమాని మీద కుక్క మొరగినట్లు’ తమకు ఇస్తున్న జీత భత్యాలు సరిపోవడం లేదని, ఆర్థిక సహాయాన్ని పెంచాలని కోరుతూ భారత ప్రభుత్వానికి, ఐక్యరాజ్య సమితికి మెమోరాండం కూడా ఇచ్చింది. అసలు ఈ బ్రుందాన్ని ఇన్నేళ్లుగా మేపుతూ మనం సాధించింది ఏంటంటే ఇక్కడి విషయాలు సైనికుల కదలికలు ఘటనలు అన్నింటినీ బయటి ప్రపంచానికి లీక్ చేస్తున్నామన్నమాట. నిజానికి చాలా విషయాలు మన దేశం సరిహద్దును దాటరానివిగా ఉంటాయి.

కానీ డైరెక్టుగా మనలోనే ఉంటూ మన అంతర్గత విషయాలను డబ్బులిచ్చి మరీ వీరి ద్వారా బయటి ప్రపంచానికి తెలియజేస్తున్నామన్నమాట. అయితే ఇదంతా మనకు ఎలా తెలిసిందంటే దానికో ట్విస్టుంది.. ఎప్పుడయితే ఈ తెల్లఏనుగులు తమకు ఇస్తున్న జీత భత్యాలు సరిపోవడం లేదని, వాటిని బాగా పెంచాలని అడిగారో అప్పుడే మన ప్రభుత్వానికి వీరిపైన ద్రుష్టి పడింది. అసలు వీరేం చేస్తున్నారు మనం ఏం చేస్తున్నామన్న ఆత్మ పరిశీలన మొదలైంది. అప్పుడే మన ప్రభుత్వానికి తత్వం చక్కగా బోధపడింది. ఇంకేం.. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పరిశీలక బృందంలో పనిచేస్తున్న 40 మంది వీసాలను విదేశాంగ శాఖ మరో మాట లేకుండా రద్దు చేసింది.

పది రోజుల్లో దేశం విడిచి వెళ్లిపొవాలని కూడా ఆదేశించింది. వాస్తవానికి ఈ పరిశీలక బృందానికి జీత భత్యాలు ఐక్యరాజ్యసమితి బడ్జెట్‌ నుంచి రావాలి. మరి భారత్‌ ఎందుకు అదనంగా ఈ 40 మంది బృందానికి జీతాలు ఇస్తుందన్న ప్రశ్నకు మన వద్ద సమాధానం లేదు. గత పాలకులు ఇస్తున్నారు కాబట్టి మనం కూడా ఇస్తున్నామని అధికారులు చెబుతున్నారు. అలా ఏకంగా ఏడు దశాబ్దాలుగా ఈ తెల్ల ఏనుగులను మనదేశ ప్రజలు కట్టిన పన్నులతో మేపుతున్నామన్నమాట. ఈ బృందానికి హెడ్‌ క్వార్టర్స్‌ రెండు చోట్ల ఉన్నాయి.

ఒకటి శ్రీనగర్‌లోని గుప్కార్‌ రోడ్‌లో.. రెండవది ఇస్లామాబాద్‌ లో. ఈ రెండు చోట్ల కార్యాలయాలను భారత్‌ పాకిస్థాన్‌ దేశాలు నిర్మించాయి. ఈ 40 మంది బృందానికి విలాసవంతమయిన ఇళ్లు, వాహనాలు, ఇళ్లలో పని వాళ్లు ఇలా చాలా సదుపాయాలు భారత ప్రభుత్వమే భరిస్తోంది. ఇవికాక ఇంకా ఇతర అలవెన్సుల పేరుతో భారీగా ఖర్చవుతుంది. వీళ్లకి వ్యక్తిగత వాహనాలతోపాటు సరిహద్దుల దగ్గరికి వెళ్లి రావడానికి మిలటరీ వాహనాలని సమకూర్చాల్సి ఉంటుంది. అలాగే వీటికి అయ్యే డీజిల్‌ ఇతర నిర్వహణ ఖర్చులు కూడా భారీగానే ఉంటున్నాయి. 74 ఏళ్లుగా భరిస్తున్న వీటినే ఇప్పుడు ఇస్తున్న వాటి కంటే ఇంకా పెంచమని బృందం డిమాండ్‌ చేస్తోంది.

కశ్మీరు లోయలో ఏదైనా ఘటన ఎక్కడ జరిగినా అక్కడికి వాహన సౌకర్యంతో పాటు తమ కార్యాలయానికి రిపోర్ట్ చేయడానికి ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాల్సి ఉంటుంది.ఇంత ఖర్చు పెట్టి, ఇన్ని సదుపాయాలు మనం కల్పిస్తే ఈ బృందం ఏం చేస్తుందో తెలుసా.. జస్ట్, భారత్‌ పాకిస్థాన్‌ సరిహద్దుల వెంబడి ఏం జరుగుతుందో ఐక్యరాజ్య భద్రతా సమితిని నివేదిక ఇస్తూ ఉంటుంది. ఇది బయటి ప్రపంచానికి తెలిసిన విషయం. కానీ వీళ్లు ఎప్పటికప్పుడు ఐరాసతో పాటు అమెరికాకు కూడా మనకు తెలియకుండా నివేదిక ఇస్తూ వస్తున్నారు. ఈ బృందం నివేదికలతో 74 ఏళ్ల నుంచి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఎలాంటి చర్య తీసుకోకుండా చోద్యం చూస్తోంది.

ఇలాంటి పరిశీలక బృందాలని మన దేశంలో ఎందుకు ఉంచినట్లు? ఇన్నాళ్లుగా దేశాన్ని పాలించిన భారత ప్రభుత్వాలు.. మీ పరిశీలక బృందాలు మాకు అక్కరలేదు వెంటనే తీసేయండి అని ఎందుకు చెప్పలేకపోయాయి అన్నది సమాధానం లేని ప్రశ్నగానే మిగిలింది..1971 బంగ్లాదేశ్‌ విముక్తి సందర్భంగా భారత సైన్యం కదలికలని అమెరికాకి చేరవేసింది ఈ పరిశీలక బృందమేనని సమాచారం. అప్పట్లో ఇప్పుడున్నటువంటి హై రిజల్యూషన్‌ ఫొటోలు తీసే ఉపగ్రహాలు అమెరికా వద్ద లేవు. ఈ పరిశీలక బృందం ఇచ్చిన సమాచారమే కీలక పాత్ర పోషించింది. ఇప్పటికీ వీరు అమెరికాకు నివేదికలు అందిస్తూనే ఉన్నారు. మొన్నటికి మొన్న పీవోకేలో కొద్ది భాగాన్ని పాకిస్థాన్‌ చైనాకి దానం చేసింది.

ఈ బ్రుందం తన రిపోర్టులో చైనాని కలిపింది. ఒకవేళ పీఓకేను భారత్‌ని స్వాధీనం చేసుకుంటే అప్పుడు పాకిస్థాన్‌ చైనాకి దానం చేసిన భూమి కూడా మన అధీనంలోకి వచ్చేస్తుంది. అప్పుడు చైనా ఎలా ప్రతిస్పందిస్తుందో దానిని బట్టి భారత్‌ ప్రతిస్పందన ఉంటుంది. అంతే కానీ సమస్య భారత్‌ పాకిస్థాన్‌ మధ్య అయితే చైనాని పార్టీగా చేయడంలో పరిశీలక బృందం వ్యూహం ఏమిటో అర్థమతోంది. వీళ్ల ఉద్దేశం కాశ్మీర్‌ అంశాన్ని మరింత జటిలం చేయడమే. మరో ఏడాదిలో మన దేశంలో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ పరిశీలక బృందం మరో చిచ్చు పెట్టే ప్రయత్నంలో ఉన్నట్లు కేంద్రం పసిగట్టింది. అప్రమత్తమైన ప్రధాని మోదీ, విదేశాంగ శాఖమంత్రి జైశంకర్‌ ఆలస్యం చేయకుండా వీళ్ల వీసాలు రద్దు చేసి మీ సేవలు ఇక చాలంటూ దేశం వదిలి పోవాలని హుకూం జారీ చేశారు.

Must Read

spot_img