శత్రువుకు శత్రువు మిత్రుడు అని అంటారు.పాకిస్థాన్ ఇప్పుడు అదే ఆలోచనలో ఉంది. భారత్-రష్యా మధ్య స్నేహ బంధం కొనసాగటాన్ని బహుశా పాకిస్థాన జీర్ణించుకోలేకపోతోంది. అందుకే రష్యాకు కూడా భయపడకుండా యుక్రెయిన్ కు ఆయుధాల సహాయం చేయటానికి సిద్ధపడింది.
భారత్, రష్యాల మధ్య మైత్రి బంధాన్ని పాకిస్తాన్ జీర్ణించుకోలేకపోతోందా…? అందుకే రష్యాతో యుద్దం చేస్తోన్న ఉక్రెయిన్ కు ఆయుధ సహాయాన్ని చేయటానికి సిద్దమైందా..? పాక్ ఆయుధాల సహాయం వెనక ఉన్న వ్యూహం ఏంటి..?
శత్రువుకు శత్రువు మిత్రుడు అని అంటారు. పాకిస్థాన్ ఇప్పుడు అదే ఆలోచనలో ఉంది. భారత్ – రష్యా దేశాల మధ్య స్నేహ బంధం కొనసాగటాన్ని బహుశా పాకిస్థాన్ జీర్ణించుకోలేకపోతోంది. అందుకే రష్యాకు కూడా భయపడకుండా యుక్రెయిన్ కు ఆయుధాల సహాయం చేయటానికి సిద్ధపడింది.. ఈ విషయంపై ప్రముఖ అంతర్జాతీయ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది.
భారత్ రష్యాల మధ్య బంధం పెరుగుతుండడంతో పాకిస్థాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా పేర్కొంది. కరాచీలోని పోర్టు నుంచి యుక్రెయిన్ సరిహద్దుల్లో ఉన్న యూరోపియన్ దేశంలోని పోర్టుకు సముద్రమార్గం ద్వారా మోర్టార్లు, రాకెట్ లాంచర్లను పాకిస్థాన్ పంపనుందని తెలిపింది.
కాగా చమురు విషయంలో భారత్ కు ఇచ్చినట్లే తమకూ డిస్కౌంట్ ఇవ్వాలని రస్యాను కోరింది పాకిస్థాన్. కానీ రష్యా దీనికి అంగీకరించలేదు. నో చెప్పేసింది. ఈ నిర్ణయంతో రష్యా, భారత్… పాకిస్థాన్ తమ దృష్టిలో ఒకటి కాదనే సంకేతాలిచ్చినట్లైంది. దీన్ని బహుశా పాక్ భరించలేకపోతోంది. ఓ వైపు భారత్ పై పగతో ఎప్పుడు రగిలిపోతుంటుంది పాక్. మరోవైపు… భారత్ కు చేసిన సహాయం తమకు చేయటం లేదనే అసహనం వెరసి పాక్ రష్యాను ఎదిరించే యుక్రెయిన్ కు సహాయం చేయటానికి సిద్ధపడింది. యుక్రెయిన్ పై యుద్ధం ప్రకటించిన తర్వాత రష్యాపై పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించాయి.
రష్యా నుంచి ముడి చమురు దిగుమతులను తగ్గించాయి. చాలా దేశాలు ఈ ఆంక్షలను అమలుచేస్తున్నాయి. కానీ రష్యాతో భారత్ మాత్రం ఆయిల్ కొనుగోలు విషయాలో పాశ్యాత్య దేశాల నిర్ణయాన్ని తోసిపుచ్చింది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసింది.
ఈ విషయాన్ని రష్యా కూడా భారత్ కు తక్కువ ధరకే చమురు సరఫరా చేసింది. దీంతో పాకిస్థాన్ కూడా తమ మంత్రుల్ని రష్యా పంపించి భారత్ కు ఇచ్చినట్లే చమురు అమ్మకాల్లో తక్కువ ధరకు ఇవ్వాలని కోరింది. కానీ రష్యా దానికి నో చెప్పింది. దీంతో పాక్ తన సహజమైన కుటిల బుద్ధిని మరోసారి బయటపెడుతూ రష్యాను ఎదిరించే యుక్రెయిన్ కు ఆయుధ సహాయం చేయటానికి సిద్ధపడింది.
సముద్ర మార్గం గుండా ఆయుధాలను ఉక్రెయిన్ కు పంపించాలని పాక్ నిర్ణయించుకుంది.. దానికి ప్రతిగా తమ మిలటరీలోని ఎంఐ-17 హెలికాఫ్టర్లను అప్ గ్రేడ్ చేసుకునేందుకు యుక్రెయిన్ కంపెనీ నుంచి సహాయం పొందాలని పాక్ ప్రభుత్వ భావిస్తున్నట్లు తెలుస్తోంది.. మోర్టార్లు, రాకెట్ లాంచర్లు, మందుగుండు సామగ్రి.. వంటి ఆయుధాలను యుక్రెయిన్ కు పంపించేందుకు పాక్ ఏర్పాట్లు చేస్తోందని.. యుక్రెయిన్ పక్కనే ఉన్న యురోపియన్ యూనియన్ దేశానికి ఈ ఆయుధాలను చేర్చనుందని సమాచారం..
కాగా యుక్రెయిన్ పాకిస్థాన్ ల మధ్య చాలా కాలంగా మిలటరీ, వాణిజ్యాల విషయంలో మంచి లావాదేవీలు కొనసాగుతున్నాయి. 1991 నుంచి 2020 వరకు దాదాపు 1.6 బిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన మిలటరీ ఉత్పత్తులను పాక్ యుక్రెయిన్ నుంచి కొనుగోలు చేసింది. దీంట్లో యుక్రెయిన్
తయారు చేసిన T-80 UD యుద్ధ ట్యాంకులు 320 కి పైగా ఉన్నాయి. వీటి నిర్వహణ బాధ్యతల్ని కూడా యుక్రెయినే చూసుకునేలా రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. దీన్ని బట్టి చూస్తే యుక్రెయిన్ పాకిస్థాన్ దేశాల మధ్య అండర్ స్టాండింగ్ బాగానే కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది.
అయితే దీనిపై ఇప్పటికే రష్యా, పాకిస్తాన్ ను హెచ్చరించించినట్లు తెలుస్తోంది.
ఉక్రెయిన్ నిపుణులు పాకిస్తాన్ వెళ్లి అణ్వాయుధ సాంకేతికతపై చర్చించేందుకు ప్రతినిధి బృందంతో సమావేశం అయినట్లు రష్యా ఫెడరేషన్ కౌన్సిల్ ఢిపెన్స్ మెంబర్ ఇగోర్ మోరోజోవ్ ఆరోపించారు. ఈ విషయాన్ని రష్యా ప్రభుత్వ వార్తా సంస్థ నివేదించింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలన్ స్కీ తన మిత్ర రాజ్యాలు అయిన బ్రిటీష్, అమెరికాతో అణ్వాయుధాల గురించి చర్చించే అవకాశం ఉందని ఆయన అన్నారు.
అయితే ఈ ఆరోపణలకు సంబంధించి ఎలాంటి ఆధారాలను అందించలేదు. పాకిస్తాన్ గతంలో రష్యా-ఉక్రెయిన్ వివాదంలో ఉక్రెయిన్ కు ఆయుధాలు పంపించిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి.. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ఉక్రెయిన్ లో ఉన్న ఫార్మాగ్ అనే కంపెనీ.. ఉక్రెయిన్ సైన్యానికి గ్లౌసులు సరఫరా చేయడానికి పాకిస్తాన్ లోని బ్లూలైన్స్ కార్గో ప్రైవేట్ లిమిటెడ్ ను సంప్రదించినట్లు తెలిసింది.
ఉక్రెయిన్ బలగాలు ఉపయోగించే 122 ఎంఎం అధిక పేలుడు ఆర్టిలరీ షెల్స్ ను పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్సులో తయారు చేస్తారు. దీన్ని బట్టి చూస్తే ఉక్రెయిన్ కు పాకిస్తాన్ సహకరిస్తుందని వెల్లడవుతోంది. పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో ఉన్న పాకిస్తాన్.. ఉక్రెయిన్ కు ఆయుధాలు అందించడం వల్ల లాభపడాలని భావిస్తోంది. అయితే దీనంతటికి వెనకాల అమెరికా ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
ఉక్రెయిన్ కు సహాయం చేసే నాటో దేశాలకు చమురు ఎగుమతులను నిలిపివేసింది రష్యా.. అంతేకాదు.. ఆ దేశాలతో వాణిజ్య పరమైన సంబంధాలు కొనసాగించడం లేదు.. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు పాక్ సైతం ఉక్రెయిన్ కు సహాయం చేస్తున్నదనే వార్తల నేపథ్యంలో రష్యా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడానికైనా వెనకాడదు.. భారత్, రష్యా ల మధ్య ఉన్న మైత్రిని జీర్ణించుకోలేకనే పాకిస్తాన్ ఆయుధ సహాయం చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు..
శత్రువు మిత్రుడు కూడా శత్రువే అన్న విధంగా భారత్ మిత్రదేశమైన రష్యాకు వ్యతిరేకంగా యుద్దం చేస్తోన్న ఉక్రెయిన్ కు ఆయుధ సరఫరా చేయాలని నిర్ణయించుకుంది పాక్.. ఈ నిర్ణయంతో పాక్, రష్యాల మధ్య భవిష్యత్ లో మరింతగా పెరిగే అవకాశం లేకపోలేదు..