Homeఅంతర్జాతీయంయుక్రెయిన్ ను శ్మశానంగా మార్చేస్తున్న రష్యాకు యుక్రెయిన్ మర్చిపోలేని న్యూ ఇయర్ రిటర్న్ గిఫ్ట్

యుక్రెయిన్ ను శ్మశానంగా మార్చేస్తున్న రష్యాకు యుక్రెయిన్ మర్చిపోలేని న్యూ ఇయర్ రిటర్న్ గిఫ్ట్

ఒకసారి ఉక్రెయిన్ మీద రష్యా విరుచుకుపడుతుంది. వందల సంఖ్యలో జనం చనిపోతారు. మరో సమయంలో ఉక్రెయిన్ అదను చూసి రష్యా బలగాలను చెండాడుతుంది. ఇదీ గత పది నెలలుగా ఉక్రెయిన్ లో జరుగుతోంది. ఎప్పటికప్పుడు అమెరికా నాటో దేశాల నుంచి వచ్చిపడుతున్న కొత్త ఆయుధాలు బాంబులు, టెక్నాలజీలను ఉపయోగించి ఉక్రెయిన్ కూడా రష్యాను ధీటుగానే ఎదుర్కుంటోంది. సరిగ్గా ఈసారి టెక్నాలజీని ఉపయోగించి రష్యాను పెద్ద దెబ్బే కొట్టింది ఉక్రెయిన్..

అదను చూసి విరుచుకుపడటం ఉక్రెయిన్ సేనలకు కొత్త కాదు. ఆ మధ్య 60 కి.మీల రష్యా ట్యాంకర్లు వాహనాలను సరైన చోటుకు వచ్చేదాకా ఎదురుచూసి వీడియో గేమ్ ఆడుకున్నంత తేలికగా ఆటాడుకుంది. అయితే అంతే ధాటిగా రష్యా కూడా ఉక్రెయిన్ నగరాలను శిధిలాలుగా మార్చేసిందనుకోండి..అయితే ఓ సూపర్ పవర్ ను ఎదుర్కుంటున్న బుల్లిపిట్ట లాంటి ఉక్రెయిన్ ఏకంగా 300 మంది రష్యా సైనికుల ప్రాణాలను గాలిలో కలిపేసింది. అది కూడా ఒకే ఒక్క ఫోన్ కాల్ ను ట్రేస్ చేసి ..రష్యా సైనికులు ఎక్కడ దాక్కున్నారో తెలుసుకుంది. ఆపై అమెరికా నుంచి లేటెస్ట్ గా అందుకున్న అత్యాధునిక ఆయుధాలను ప్రయోగించింది. రాకెట్ ధాడులతో రష్యా సైనికులు విడిది చేసిన ప్రాంతం దద్దరిల్లింది.

భయంకరమైన క్షిపణులతో విరుచుకుపడుతూ యుక్రెయిన్ ను శ్మశానంగా మార్చేస్తున్న రష్యాకు యుక్రెయిన్ మర్చిపోలేని న్యూ ఇయర్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది. రష్యా సైనికులు అత్యంత రహస్య ప్రదేశంలో ఉన్నా యుక్రెయిన్ ఇట్టే పసిగట్టింది.అంతే వారు ఫోన్ కాల్స్ లో మునిగి ఉన్న సమయంలో ఒక్కసారిగా విరుచుపడ్డాయి యుక్రెయిన్ క్షిపణులు..అంతే ఏం జరుగుతుందో అర్థం అయ్యేలోపే వందలాదిమంది రష్యా సైనికులు మ్రుతి చెందారు. శరీరాలు తునాతునకలైపోయాయి. ఊహించని ఈ ఘటనకు కారణం కేవలం ఒకే ఒక్క ఫోన్ కాల్ అంటే నమ్మగలరా.. అవును.. ఇది నిజం….ఒకే ఒక్క ఫోన్ రష్యా సైనికుల హైడవుట్ ను బయటపెట్టింది. ఆ ఒక్క ఫోన్ కారణంగా 300 మందికి పైగా సైనికులు ప్రాణాలు కోల్పోయారు.

మరికొందరు గంటలపాటు ప్రాణాలు దక్కించుకునేందుకు పోరాడాల్సి వచ్చింది. రష్యా, యుక్రెయిన్‌ యుద్ధంలో జరిగిన అత్యంత దారుణమైన దాడిగా చెబుతున్నారు విశ్లేషకులు. డోనెస్క్‌లో రష్యా సైనికులు ఉంటున్న కాలేజీపై యుక్రెయిన్‌ రాకెట్లతో మెరుపు దాడి చేసింది. సరిగ్గా కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టిన మొదటి సెకండ్‌లోనే ఈ దాడి జరిగింది. రష్యా సైనికులు న్యూఇయర్‌ జోష్‌లో తమ కుటుంబాలతో మాట్లాడుతూ ఉండగా..ఎడతెరపి లేని రాకెట్ల వర్షం కురిసింది. ఏం జరిగిందో అర్థమయ్యేలోగానే 300 మందికి పైగా రష్యా సైనికులు చనిపోయారు. అందులో కిరాయి సైనికులు కూడా ఉన్నారు. నిజానికి అత్యంత రహస్య ప్రదేశంలో రష్యా సైనికులు తలదాచుకున్నారు. వారి వివరాలు బయటకు పొక్కకుండా కమాండర్లు జాగ్రత్త పడ్డారు.

అలాంటిది ఆ సమాచారం యుక్రెయిన్‌కు ఎలా లీకైందన్నది రష్యాకు అర్థం కాలేదు. దీనిపై జరిగిన విచారణలో వెల్లడైన నిజం రష్యాను మైండ్‌ బ్లాంక్‌చేసింది. బ్యాన్‌ చేసిన ఫోన్ ను తమవారు వాడినందువల్లే కొంపముంచిందని విచారణలో తేలింది. భద్రతా కారణాలతో రష్యా తన సైనికులు వాడే ఫోన్లపై ఆంక్షలు విధించింది. కొన్ని రకాల ఫోన్లను అసలు వినియోగించొద్దని ముందే హెచ్చరించింది. అయితే దాన్ని పట్టించుకోకుండా కొందరు నిషేధించిన ఫోన్లను కూడా తమవారికి న్యూ ఇయర్ గ్రీటింగ్ చెప్పుకునేందుకు ఉపయోగించారు. కాల్స్ ఉద్రుతిని గుర్తించిన యుక్రెయిన్..వాటిని వెంటనే ట్రాక్‌చేసింది. నెట్ వర్క్ లోనికి స్పైవేర్‌ ప్రవేశపెట్టడం ద్వారా అక్కడి మాటలను విన్నట్లు రష్యా అనుమానిస్తోంది.

న్యూఇయర్‌ సందర్భంగా రష్యా సైనికులు తమ కుటుంబాలతో మాట్లాడతారని ఊహించిన యుక్రెయిన్‌ దానికోసం రెడీగా ఉంది. కరెక్టుగా కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టే క్షణంలో రష్యా సైనికులు తమ కుటుంబంతో మాట్లాడేందుకు ఫోన్లు ఆన్‌ చేశారు. దాన్ని గుర్తించిన యుక్రెయిన్‌ వెంటనే వారున్న లొకేషన్‌ను ఖచ్చితంగా గుర్తించారు. అంతే ఈ మధ్యే అమెరికా పంపించిన హిమార్స్‌ రాకెట్లను ప్రయోగించింది. టార్గెట్‌ను చేధించడంలో తిరుగులేని హిమార్స్‌ రాకెట్లు మిగిలిన పనిని అక్యురేట్ గా పూర్తి చేశాయి. అమెరికా వంటి దేశాల నుంచి కూడా నిఘా సమాచారం అంది ఉండొచ్చన్న అనుమానాలున్నాయి. ఏది ఏమైనా ప్రధాన కారణం మాత్రం ఆ ఫోన్లే కావొచ్చని రష్యా గట్టిగా నమ్ముతోంది. నిజానికి శత్రువుల ఆయుధాల పరిధిలో ఉన్నప్పుడు ఏ ఫోన్‌ కూడా వాడకూడదన్న నియమం ఉంది.

Must Read

spot_img