రాజకీయ సంక్షోభాలతో 2022లో బ్రిటన్ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంది. అయితే, ఈ ఏడాదిలోనూ కష్టాలు తీరవని ప్రధాని రిషి సునాక్ తాజాగా వ్యాఖ్యానించారు.
2023 కొత్త సంవత్సరానికి ప్రపంచమంతా ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా స్వాగతం పలికింది. కానీ బ్రిటన్ దేశ ప్రధాని కొత్త సంవత్సరం గురించి మాట్లాడుతూ దేశ ప్రజల సమస్యలు కొత్త సంవత్సరంలోనైనా తీరిపోవాలి అని సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్త సంవత్సరం వచ్చింది అంటే అందరికి నూతనోత్సాహం. ఏదో తెలియని అనుభూతి. గడిచిపోయిన ఏడాదికి ఘనంగా వీడ్కోలు పలికి.. కొత్త ఏడాది సరికొత్తగా ప్రారంభించాలనే తపన. ఉప్పొంగే ఉత్సాహం.. అలుపెరగని ఉల్లాసం.. పాత ఒక రోత.. కొత్త ఓ వింత అనేది కూడా ఇక్కడ సరిపోతుంది. చేసుకుంటేనే కొత్త ఏడాది రాదు.. చేసుకున్నా చేసుకోకపోయినా కొత్త ఏడాది అనేది కామన్. పాత సంవత్సరానికి ముగింపు పలికి.. కొత్త ఏడాది అందరి జీవితాల్లో కొత్త వెలుగులు తీసుకురావాలని 2023కి ప్రతి ఒక్కరు ఉత్సహంతో వెల్ కమ్ చెప్పారు. కానీ బ్రిటన్ ప్రధాని రిషి సునక్ మాత్రం స్యాడ్ గానే వెల్ కమ్ చెప్పాడు.
తాజాగా 2023 కొత్త సంవత్సరానికి ప్రపంచమంతా ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా స్వాగతం పలికింది. కానీ బ్రిటన్ దేశ ప్రధాని కొత్త సంవత్సరం గురించి మాట్లాడుతూ దేశ ప్రజల సమస్యలు కొత్త సంవత్సరంలోనైనా తీరిపోవాలి అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే బ్రిటన్లు పరిస్థితి అలాగే ఉంది మరి. స్థానిక ఆర్థిక పరిస్థితులు దిగజారడంతో పాటు రాజకీయ సంక్షోభాలు, ఉక్రెయిన్-రష్యా యుద్ధం వల్ల 2022లో బ్రిటన్ పలు ఇబ్బందులను ఎదుర్కొంది. 2023లో తమ కష్టాలు తీరిపోయే అవకాశం లేదని ప్రధాని అన్నారు. దేశ ప్రధానిగా తొలిసారి పౌరులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బ్రిటన్ సమస్యల నుంచి గట్టింగించడానికి తీవ్రంగా కృషి చేస్తామని వెల్లడించారు. ప్రజలు ముందు ఉన్న సమస్యలు కొత్త సంవత్సరంలో దూరమైపోతాయని నేను తప్పుదోవ పట్టించట్లేదని రిషి సునాక్ స్పష్టంగా తెలియజేశారు.
దేశంలో స్వేచ్ఛ ప్రజాస్వామ్యాన్ని ప్రజలకు అందిస్తామని వెల్లడించారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధం బ్రిటన్ ముందు ఉన్న అతిపెద్ద సవాళ్లలో ఒకటి అని ఈ సందర్భంగా పేర్కొన్నారు. కోవిడ్ మహమ్మారి నుంచి దేశం కోలుకోగానే ఉక్రెయిన్ పై రష్యా అక్రమ దాడి దండయాత్ర చేపట్టిందని తెలిపారు. ఇదిఅంతర్జాతీయంగా, ఆర్థికంగా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపారు. దీనికి బ్రిటన్ మినహాయింపు కాదు. అందువల్లే రుణాలు, అప్పుల నియంత్రణ విషయాలు తీసుకున్నామని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ తెలిపారు. ఇంకా చెప్పాలంటే ప్రభుత్వం పేదలకు అండగా ఉంటుందని అంతేకాకుండా జాతీయ ఆరోగ్య సేవలను బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అక్రమ వలసల సమస్య పరిష్కరిస్తున్నామని అని దేశ ప్రధాని వెల్లడించారు.
ప్రస్తుతం బ్రిటన్‌లో ద్రవ్యోల్బణం పదిశాతం ఉంటే…20 శాతం మంది ప్రజలు పేదరికంతో ఉన్నారు. ద్రవ్యోల్బణం ప్రభావం వీరిపై ఎక్కువగా ఉంది. మరోవైపు ఇబ్బందులున్నా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఆర్థికంగా, మిలటరీ పరంగా సాయం చేయాల్సి రావడం మరో సవాల్. లిజ్‌ట్రస్ తక్కువ రోజులు ప్రధానమంత్రిగా ఉన్నా… 2030 నాటికి మిలటరీపైన అదనంగా 150 బిలియన్ యూరోలు ఖర్చుచేస్తామని ప్రకటించారు. బ్రెగ్జిట్ వల్ల ఇప్పటికే తీవ్ర ఆర్థిక నష్టం జరిగింది. సెంటర్ ఫర్ యూరోపియన్ రిఫార్మ్ చేసిన విశ్లేషణ ప్రకారం యూరోపియన్ యూనియన్‌లో ఉంటే ఆర్థిక పరిస్థితి 5.2 శాతం మెరుగ్గా ఉండేది. ప్రస్తుత సమస్యలను అధిగమించడం సునాక్‌కు చాలా కష్టంతో కూడినపని. బ్రిటన్ లో వడ్డీ రేట్లు పెరగడం వల్ల అప్పులకు చెల్లించే మొత్తం ఎక్కువవుతుంది.
వినియోగదారులు అవసరమైన సర్వీసుల కోసం కూడా రుణాలు తీసుకోవాల్సిన పరిస్థితి. దీనివల్ల ప్రజలు చేసే ఖర్చులో చాలా తేడా వస్తుంది. ఏడాదిలోనే బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ 0.1శాతం వడ్డీరేటు పెంచింది. కొవిడ్‌ను ఎదుర్కోవడానికి వడ్డీ రేటు తక్కువగా ఉండగా, తర్వాత 2.25 శాతానికి పెరిగింది. త్వరలోనే మూడు శాతానికి పెంచుతూ ప్రకటన వెలువడే అవకాశం ఉండగా…మార్కెట్ అంచనాల ప్రకారం ఈ ఏడాది చివరి నాటికి సుమారు అయిదు శాతానికి చేరే అవకాశం ఉంది. యు.కె. ఆర్థిక వ్యవస్థ సేవారంగాలపై ఎక్కువగా కేంద్రీకరించి ఉంటుంది. ప్రస్తుత నేపథ్యంలో ఈ రంగంపై ప్రభావం పడటంతో పాటు పర్యవసనాలు తీవ్రంగా ఉంటాయి. వాప్యారరంగం దెబ్బతినడం, నిరుద్యోగ సమస్య పెరగడం మొదలైన సమస్యలొస్తాయి. దీంతోపాటు మార్టిగేజ్ చేసిన ప్రజలు డిఫాల్టర్లుగా మారే అవకాశం ఉంది.
ప్రస్తుతం ప్రభుత్వం పేదలకు అండగా నిలుస్తుంది. జాతీయ ఆరోగ్య సేవలను బలోపేతం చేయడానికి చర్యలు తీసుకున్నామని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ అన్నారు. అక్రమ వలసల సమస్య పరిష్కరిస్తున్నామని, నేరస్తులను కట్టడి చేస్తున్నామని అని రిషి సునాక్ తన వీడియో సందేశంలో తెలిపారు. ఉక్రెయిన్‌కు కొత్త సంవత్సరంలోనూ నిరంతర మద్దతు కొనసాగుతుందని స్పష్టం చేశారు. వచ్చే మే ఆరో తేదీన కింగ్ చార్లెస్-3 పట్టాభిషేక కార్యక్రమం.. దేశాన్ని ఏకం చేసే శక్తి అని రిషి సునాక్ అభివర్ణించారు. లిజ్ ట్రస్ రాజీనామా చేయడంతో భారత సంతతికి చెందిన రిషి సునాక్ గత అక్టోబర్‌లో బ్రిటన్ ప్రధానిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బ్రిటన్ ప్రధానిగా పాలన చేపట్టిన భారత సంతతి వ్యక్తిగా రిషి సునాక్ అరుదైన రికార్డు సంపాదించుకున్నారు. ఇటివల బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ విమర్శలపాలయ్యారు. ఓ నిరాశ్రయుడితో సునాక్ జరిపిన సంభాషణపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సంభాషణకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిరాశ్రయుడితో ఇలానా మాట్లాడేది అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.