Homeఅంతర్జాతీయంయుద్ధం ముగించాలంటే… ఉక్రెయిన్ ఆ షరతులను పూర్తి చేయాలి: సెర్గీ లావ్రోవ్

యుద్ధం ముగించాలంటే… ఉక్రెయిన్ ఆ షరతులను పూర్తి చేయాలి: సెర్గీ లావ్రోవ్

ఉక్రెయిన్ ఆక్రమణ కోసం రష్యా చేస్తున్న ఏకపక్ష యుద్దానికి 11 నెలలు పూర్తియింది. ఇకనైనా యుధ్దాన్ని మానుకోవాలని ప్రపంచదేశాలు అర్థిస్తున్న రష్యా మాత్రం కరుణించడం లేదు. అయితే తనంతట తానుగా యుధ్దాన్ని ముగించాలన్న ప్రపోజల్ ముందుంచారు రష్యా అధ్యక్షుడు పుతిన్. ఈ నేపథ్యంలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ఓ ప్రపోజల్ ముందుకు తెచ్చారు.

యుద్ధం ముగించాలంటే.. ఉక్రెయిన్ ఆ షరతుల్ని పూర్తి చేయాలంటూ రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ఓ ప్రపోజల్ ముందుకు తెచ్చారు. ఉక్రెయిన్‌తో యుద్ధం ముగించాలంటే.. తమ షరతుల్ని ఆ దేశం పూర్తి చేయాలని, అవేంటో ఆ దేశానికి తెలుసని ఆయన అన్నారు. తమ షరతుల్ని పూర్తి చేస్తే ఉక్రెయిన్‌కి మంచిదని.. లేకపోతే తమ సైన్యం నిర్ణయిస్తుందంటూ ఆయన నేరుగా హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం రష్యా అధీనంలో ఉన్న ఉక్రేనియన్ భూభాగాల్ని సైతం తమకు అప్పగించాలని అన్నారు. లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. తాము చర్చలకు సిద్ధమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటన చేసిన కొన్ని రోజుల్లోనే సెర్గీ లావ్రోవ్ ఈ విధంగా వ్యాఖ్యలు చేసారు.

అయితే ఇది ప్రపోజల్ అనాలో లేక బెదిరింపులు అనాలో అర్థం కావడం లేదు. ఓవైపు క్షిపణి దాడులు జరుగుతూనే ఉన్నాయి. శిధిలాలను మరిన్ని శిధిలాలుగా మార్చేందుకు బాంబులు వేస్తూనే ఉంది రష్యా. ఈ నేపథ్యంలో యుద్ధవిరమణ ప్రపోజల్ ముందుకు తెచ్చింది. కానీ అది బెదిరింపు మాదిరిగానే ఉందని అంటున్నారు నిపుణులు.

”ఉక్రెయిన్ పాలనలో నిస్సైనికీకరణ, నాజీరహితంగా చేసి.. అక్కడి నుంచి రష్యాకు ఉన్న ముప్పుని తొలగించాలన్నదే మా ప్రతిపాదన అంటున్నారు సెర్గీ లావ్రోవ్. ఇప్పుడు ఉక్రెయిన్‌లో ఆక్రమించిన కొత్త భూభాగాలతో పాటు రష్యా భద్రతకు ఉక్రెయిన్ నుంచి ఎలాంటి బెదిరింపులకు రాకూడదు. ఈ విషయాలన్నీ మా ప్రత్యర్థికి బాగా తెలుసు” అంటున్నారు సెర్గీ లావ్రోవ్.

ఈ విషయాన్ని స్టేట్ న్యూస్ ఏజెన్సీ టాస్ తెలిపింది. ”ఇది చాలా సింపుల్ పాయింట్. తమ షరతుల్ని పూర్తి చేస్తే, ఉక్రెయిన్‌కే మంచిది. లేకపోతే వారి భవిష్యత్‌ని రష్యా సైన్యం నిర్ణయిస్తుందని హెచ్చరించారు. మరి యుద్ధం ఎప్పుడు ముగుస్తుందని ప్రశ్నించగా.. ”బంతి వారి కోర్తులోనే ఉందని, వారి వెనుక వాషింగ్టన్ ఉందని ఆయన చెప్పుకొచ్చారు. అంతకుముందు ఆదివారం చర్చలకు మాస్కో సిద్ధంగా ఉందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. కానీ.. వాషింగ్టన్ మద్దతుతో కీవ్ అందుకు వ్యతిరేకంగా ఉందని ఆరోపించారు. కాగా.. 11 నెలలుగా కొనసాగుతున్న ఈ యుద్ధంలో రష్యాకి కూడా కొన్ని ఎదురుదెబ్బలు తగిలాయి. అయితే.. ఈమధ్య ఉక్రెయిన్‌పై దాడుల్ని రష్యా ఉధృతం చేసింది.

మిసైల్స్, డ్రోన్ దాడుల ద్వారా ఉక్రెయిన్ సివిల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని దెబ్బతీసింది. ఈ దాడుల కారణంగా.. లక్షలాది మంది అంధకారంలోకి వెళ్లిపోయారు. నీటి సమస్య కూడా వారిని ఇబ్బంది పెడుతోంది. మరోవైపు.. చర్చల ద్వారా ఈ యుద్ధానికి స్వస్తి పలకాలని మోడీ ఇరు దేశాల అధినేతలతో పలుసార్లు ఫోన్‌లో మాట్లాడారు. అయితే రెండు వైపులా ఎవరూ తగ్గేదే లే అంటున్నారు.

అమెరికా అండతో ఉక్రెయిన్ రెచ్చిపోతూ రష్యాను ఎదుర్కుంటోంది. ఇప్పటికే ఉక్రెయిన సిరియా శిధిల నగరాలతో పోటీ పడుతోంది. ఎటు చూసినా విద్వంసంతో భీకరంగా మారింది. లక్షలాదిగా జనం పొరుగు దేశాలకు వలసలు పోయి జీవిస్తున్నారు. ఉన్న వారైనా క్షేమంగా ఉన్నారా అంటే అదీ లేదు. ఎప్పుడే బాంబు వచ్చి మీద పడుతుందోనని బతుకుతున్నారు.

అయితే ఈ యుధ్దాన్ని ముగించాలంటే అందుకు అమెరికా అంగీకరించాలన్న విషయాన్ని రష్యా నర్మగర్భంగా ఆరోపిస్తోంది. నాటో దేశాలు, అమెరికా అండతో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ రష్యాను ఎదిరిస్తున్నారు. చివరి రక్తపు బొట్టు వరకు రష్యాతో పోరాడతామని అంతే కానీ రష్యా షరతులను అంగీకరించేది లేదని చెబుతున్నారు. అందుకు తమకు ఆయుధసాయం ఆర్థిక సాయం అందించాలని దేశాలను కోరుతున్నారు. అందుకు తగ్గట్టుగానే రష్యాపై వ్యతిరేతలు ఉన్న దేశాలు ఉక్రెయిన్ ను సాయం అందస్తూ రష్యాపై ఆంక్షలు విధిస్తూన్నారు.

ఎటు చూసినా ఉక్రెయిన్ రష్యా యుధ్దం ప్రపంచానికే ముప్పు తేనుందన్న విషయం చెబుతున్నారు నిపుణులు. అయితే వారి మాటలను ఆ రెండు దేశాలు పట్టించుకోవడం లేదు.

Must Read

spot_img