తమిళ సినీ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడు అయిన తమిళ్ యంగ్ స్టార్ హీరో ఉదయనిధి స్టాలిన్ సంచలన నిర్ణయాన్ని తీసుకుని అభిమానులకు షాక్ ఇచ్చాడు.

ప్రస్తుతం హీరోగా, నిర్మాతగా ఉదయనిధి స్టాలిన్ తమిళ సినీ ఇండస్ట్రీలో కాకుండా సౌత్ లో మంచి పాపులారిటీ ని సొంతం చేసుకున్నాడు. ఈ సమయంలో ఉదయనిధి స్టాలిన్ సినిమా ఇండస్ట్రీకి దూరం అవ్వాలని నిర్ణయించుకోవడం ఆయన అభిమానులకు మింగుడు పడటం లేదు. హీరోగా స్టాలిన్ చేస్తున్న సినిమాలు ప్రస్తుతం సందిగ్దంలో పడ్డాయి.
తమిళ్ హీరో ఉదయనిధి స్టాలిన్ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. ఒకవైపు హీరోగా సినిమాలు చేస్తూనే.. మరోవైపు పెద్ద హీరోలతో సినిమాల్ని నిర్మిస్తున్న ఉదయనిధి స్టాలిన్.. ఇండస్ట్రీకి గుడ్ బై చెప్తున్నట్లు ప్రకటించాడు. దీంతో హీరోగా స్టాలిన్ చేస్తున్న సినిమాలు ప్రస్తుతం సందిగ్దంలో పడ్డాయి. షూటింగ్ మధ్యలో ఉన్న సినిమాలను పూర్తి చేసే అవకాశం ఉంది. కానీ కమిట్ అయ్యి మొదలు కానీ సినిమాలు ప్రారంభించకుండానే పక్కకు పెట్టేయబోతున్నారని
తెలుస్తోంది.
తమిళ సినిమాలకు గుడ్ బాయ్ చెప్పడానికి కారణం ఇదే..
2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందిన ఉదయనిధి స్టాలిన్ తన తండ్రి స్టాలిన్ మంత్రి వర్గంలో ఇటివల చోటు దక్కించుకున్నాడు. భవిష్యత్తులో తమిళనాడు సీఎం ఉదయనిధి స్టాలిన్ బాధ్యతలు చేపట్టాల్సిన అవసరం ఉందని.. అందుకే ఇప్పటి నుండే రాజకీయంగా, పరిపాలన పరంగా అనుభవం సాధించాల్సిందిగా డీఎంకే పార్టీ నాయకులు భావిస్తున్నారు.

తండ్రి ,పార్టీ సీనియర్ ల యొక్క సూచన మేరకు ఉదయనిధి స్టాలిన్సి నిమాలకు గుడ్ బై చెప్పేందుకు సిద్ధం అయ్యారు. ఆ మధ్య కమల్ హాసన్ హీరోగా ఈయన నిర్మాణంలో ఒక సినిమా అధికారికంగా ప్రకటన వచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమా నుండి కూడా ఈ కొత్త మంత్రి గారు తప్పుకున్నారు.
పదేళ్ల క్రితం ఒరు కాల్ ఒరు కన్నడి సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఉదయనిధి స్టాలిన్.. ఆ తర్వాత కూడా చాలా చిత్రాల్లో నటించాడు. ప్రస్తుతం అతని చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి మారి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్న మామన్నాన్ మూవీకాగా.. రెండోది కమల్ హాసన్ సొంత బ్యానర్‌లో చేయాల్సిన సినిమా.
కానీ.. ఇప్పటికే షూటింగ్ అయిపోతున్న మామన్నాన్ మూవీని పూర్తి చేస్తానని క్లారిటీ ఇచ్చిన ఉదయనిధి స్టాలిన్.. కమల్ హాసన్బ్యా నర్‌లో చేసేందుకు అంగీకరించిన సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. వాస్తవానికి ఫస్ట్ సినిమా తర్వాత సినిమాలు వదిలేద్దామని ఉదయనిధి స్టాలిన్ అనుకున్నాడు. ఆ సినిమా సక్సెస్ కావడంలో వరుసగా అవకాశాలు వచ్చినట్లు చెప్పుకొచ్చాడు. కొన్ని కథలు బాగా నచ్చడంతో నో చెప్పలేకపోయినట్లు వివరించాడు. అలానే కొన్ని సినిమాల్ని తన ప్రొడక్షన్ హౌస్ రెడ్ జియాంట్ మూవీస్ ద్వారా నిర్మించినట్లు వెల్లడించాడు.