HomePoliticsదగ్గుబాటి రాజకీయ రిటైర్మెంట్ లో ట్విస్ట్..!

దగ్గుబాటి రాజకీయ రిటైర్మెంట్ లో ట్విస్ట్..!

  • దగ్గుబాటి రాజకీయ రిటైర్మెంట్ .. ఇప్పుడు ఏపీలో చర్చనీయాంశంగా మారింది.
  • తనతో పాటు తన కుమారుడి రాజకీయ భవిష్యత్ కు ఫుల్ స్టాప్ పెట్టడం హాట్ టాపిక్ గా మారింది.

ఎన్టీఆర్ కుటుంబానికి చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాజకీయాలకు పూర్తిగా దూరం అవుతున్నట్టు ప్రకటించారు. బాపట్ల జిల్లా ఇంకొల్లులో నిర్వహిస్తున్న ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో ఆయన ఈ ప్రకటన చేశారు. తాను, తన కుమారుడు హితేష్ చెంచురామ్ ఇద్దరం రాజకీయాల నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించారు. ఎన్టీఆర్ పెద్దల్లుడైన దగ్గుబాటి వెంకటేశ్వరరావు మాజీ మంత్రి కూడా.

పర్చూరు నుంచి అసెంబ్లీకి పలుమార్లు ప్రాతినిధ్యం వహించారు. అలాగే, లోక్‌సభ, రాజ్యసభకు కూడా ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహించారు. 2019 ఎన్నికల్లో వైసీపీలో చేరి పర్చూరు నుంచి అసెంబ్లీకి పోటీ చేశారు. అయితే, ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఏలూరి సాంబశివరావు చేతిలో ఓటమి పాలయ్యారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు గత ఎన్నికలకు ముందే రాజకీయంగా రిటైర్ అవ్వాలనుకున్నారు.

కుమారుడు దగ్గుబాటి హితేష్ రాజకీయ భవిష్యత్ కోసం అమెరికా పౌరసత్వాన్ని కూడా క్యాన్సిల్ చేయించుకున్నారు. ఆయన రాజకీయ రిటైర్మెంట్ గురించి అందరూ ఊహించినప్పటికీ.. అనూహ్యంగా ఆయన కుమారుడు హితేష్ కూడా ఇక రాజకీయాల్లో ఉండరని చెప్పడం ఆశ్చర్యకరంగా మారింది. గత ఎన్నికల్లో వైసీపీ తరపున హితేష్ ను పర్చూరు నుంచి బరిలోకి దింపాలని తీవ్ర ప్రయత్నాలు చేశారు. వైసీపీ అధినేత జగన్ కూడా టిక్కెట్ ఖరారు చేశారు.

అయితే ఆయన అమెరికా పౌరసత్వం రద్దు కాకపోవడంతో చివరి క్షణంలో దగ్గుబాటినే పోటీ చేయాల్సివచ్చింది. అప్పట్లో తప్పిపోయినా కొంత కాలం వైసీపీ కోసం హితేష్ పర్చూరులో పని చేశారు. తర్వాత పూర్తిగా రాజకీయాలకు దూరం అయ్యారు. పురందేశ్వరి బీజేపీ తరపున రాజకీయాల్లో ఉన్నారు. దగ్గుబాటి కుమారుడికి చీరాల టీడీపీ టిక్కెట్ కేటాయిస్తారని కొంత కాలంగా ప్రచారం ఉంది.

కానీ ఇప్పుడు దగ్గుబాటి రాజకీయ విరమణ ప్రకటించడంతో అలాంటి చాన్స్ కూడా లేదని తేలిపోయింది. పురందేశ్వరి బీజేపీలోనే ఉంటారని అంటున్నారు. ఒకప్పుడు చంద్రబాబుతో పోటీగా రాజకీయం చేసిన దగ్గుబాటి.. తర్వాత ఆయనకు దూరమయ్యారు. ప్రస్తుత రాజకీయాల్లో ఇమడలేకపోతున్నట్లుగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు చెబుతున్నప్పటికీ బలమైన కారణంతోనే ఆయన రాజకీయ విరమణ ప్రకటన చేశారని భావిస్తున్నారు.

ఇటీవల ఆయన ఆరోగ్య పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే చంద్రబాబు కుటుంబంతో గతంతో పోలిస్తే సంబంధాలు కాస్త మెరుగుపడ్డాయి.

ఆయన ఆస్పత్రిలో ఉన్నప్పుడు చంద్రబాబు పరామర్సించారు కూడా. అందుకే వారు టీడీపీలో చేరుతారన్న ప్రచారం జరిగింది. అనూహ్యంగా రాజకీయంగా విరమణ ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. దగ్గుబాటి, ఆయన కుమారుడు రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లుగా ప్రకటించడంతో ఇక పురందేశ్వరి మాత్రమే బీజేపీలో కొనసాగనున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో రెండు సార్లు ఎంపీగా గెలిచిన పురందేశ్వరి పదేళ్ల పాటు కేంద్రమంత్రిగా ఉన్నారు.

రాష్ట్ర విభజన తర్వాత బీజేపీలో చేరారు. రెండు సార్లు పోటీ చేసినా పరాజయం పాలయ్యారు. వచ్చే ఎన్నికల్లో ఆమె పోటీ చేస్తారో లేదో క్లారిటీ లేదు. రాజకీయాల్లో విలువలు పడిపోయాయి.. డబ్బు ఉన్నవాడిదే రాజ్యమవుతోంది.. ఇలాంటి రాజకీయాలు నేను చేయలేను.. నేను నా కొడుకు హితేష్ కూడా ఇకనుంచి రాజకీయాలకు దూరంగా ఉంటాం .. ఇదీ ఎన్టీ రామారావు పెద్ద అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు చేసిన ప్రకటన.. ఇది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. మరి పురందశ్వరి కూడా ఇదే నిర్ణయం తీసుకుంటారా? అంటే ఈ ప్రశ్నకు కూడా అవుననే సమాధానం వస్తోంది.

ఆమె ఇటీవల నుంచి భారతీయ జనతా పార్టీకి దూరంగా ఉంటున్నారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు రాజకీయ వైరాగ్యం ఇది మొదటిసారి కాదు.. లక్ష్మీపార్వతి వర్గంలో కొనసాగడం, రాజ్యసభ అభ్యర్థిగా గెలవడం, ఆ తర్వాత బిజెపిలో చేరటం చక చకా జరిగిపోయాయి. కనీసం సమావేశంలో కూడా పిలవడం లేదని ఆయన అప్పట్లో రాజీనామా చేశారు.. 1999 ఎన్నికల్లో రాజకీయాలకు దూరంగా ఉన్నారు.. 2004 ఎన్నికలకు ముందు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, భార్య పురందేశ్వరి ఇద్దరు కాంగ్రెస్ లో చేరారు.. అప్పట్లో ఇది చాలామందిని ఆశ్చర్యపరిచింది..

ముఖ్యంగా దగ్గుబాటి కాంగ్రెస్ లో చేరటం, ఎమ్మెల్యేగా గెలవడం అప్పట్లో ఒక సంచలనం.. రాజశేఖర్ రెడ్డి దగ్గుబాటికి మంత్రి పదవి ఇస్తారని అప్పట్లో చాలా మంది భావించారు.. కానీ వైయస్సార్ .. మీ సతీమణికి కేంద్రమంత్రి పదవి ప్రయత్నం చేసుకోండి. కానీ రాష్ట్రంలో మీకు మంత్రి పదవి ఇవ్వలేనని దగ్గుబాటికి క్లారిటీగా చెప్పారు.. 2004, 2009 లో కాంగ్రెస్ తరపున ఎంపీగా గెలిచి, కొంత కాలం కేంద్ర మంత్రిగా పనిచేసిన పురందేశ్వరి 2014 ఎన్నికల ముందు విలువల పాఠాలు చెప్పి కాంగ్రెస్ ను వీడి బిజెపిలో చేరారు.. తెలుగుదేశం పార్టీ మద్దతుతో రాజంపేట ఎంపీగా పోటీ చేశారు..

ఈ సంఘటన రాజకీయాల్లో సర్దుకుపోవడం అనివార్యం అనే ఉదాహరణను మరింతగా బలపరిచింది. 2019లో దగ్గుబాటి వైసీపీలో చేరటం, ఆయన కొడుకు హితేష్ కు పర్చూరు టికెట్ రావడం మరింత ఆశ్చర్యకరం.. కొడుకు అమెరికా సిటిజన్ కావడంతో దగ్గుబాటి స్వయంగా పోటీ చేశారు. వైసీపీ 151 సీట్లు గెలిచినా.. పర్చూరు లో దగ్గుబాటి ఓడిపోవడం గమనార్హం.

  • పోలింగ్ జరిగిన తర్వాత కూడా దగ్గుబాటి గెలుస్తారనే నమ్మకం ఆయన సన్నిహితుల్లో కూడా కలగలేదు.

పర్చూరు లో ఓడిపోయిన తర్వాత దగ్గుబాటి వెంకటేశ్వరరావును వైసీపీ అధిష్టానం ఏమాత్రం పట్టించుకోలేదు.. పార్టీ సమావేశాలకు ఆహ్వానం పలకలేదు.. పలమార్లు జగన్ అపాయింట్మెంట్ కోసం దగ్గుబాటి ప్రయత్నించినా దొరకలేదు. దీంతోపాటు ఆయన అనుచరులను సొంత పార్టీ వారే వేధిస్తున్న నేపథ్యంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు మనసు మార్చుకున్నారు.. తాను, కొడుకు రాజకీయాలకు దూరంగా ఉంటామని ప్రకటన చేశారు.

కానీ దగ్గుబాటి ఇప్పుడే కాదు గతంలో పలు సందర్భాల్లో ఇదే తీరుగా వ్యవహరించారు. తర్వాత మనసు మార్చుకున్నారు. ఒక్కగానొక్క కొడుకు రాజకీయ జీవితాన్ని దగ్గుబాటి అలా ముగించడని చాలా మంది అంటున్నారు. మరీ ఇదే సమయంలో పురందేశ్వరి కూడా రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. మొత్తానికి దగ్గుబాటి తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది.

కుమారుడికి రాజకీయ భవిష్యత్ కోసం అమెరికా పౌరసత్వాన్ని కూడా క్యాన్సిల్ చేయించుకున్న దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఇప్పుడు మనసు మార్చుకున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ తరపున హితేష్ ను పర్చూరు నుంచి బరిలోకి దింపాలని తీవ్ర ప్రయత్నాలు చేశారు .జగన్ కూడా టిక్కెట్ ఖరారు చేశారు. అయితే ఆయన అమెరికా పౌరసత్వం రద్దు కాకపోవడంతో చివరి క్షణంలో దగ్గుబాటినే పోటీ చేయాల్సివచ్చింది.

అప్పట్లో తప్పిపోయినా కొంత కాలం వైసీపీ కోసం హితేష్ పర్చూరులో పని చేశారు. కానీ పురందేశ్వరి కూడా వైసీపీలోకి రావాలని లేకపోతే మీరు పార్టీ నుంచి వెళ్లిపోవాలని జగన్ సూచించడంతో వారు పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇప్పుడు పూర్తిగా రాజకీయాలకు దూరం అయ్యారు. పురందేశ్వరి బీజేపీ తరపున రాజకీయాల్లో ఉన్నారు. ఆమె టీడీపీలోకి వచ్చే అవకాశం లేదు. దగ్గుబాటి కుమారుడికి చీరాల టీడీపీ టిక్కెట్ కేటాయిస్తారని కొంత కాలంగా ప్రచారం ఉంది.

కానీ ఇప్పుడు దగ్గుబాటి రాజకీయ విరమణ ప్రకటించడంతో అలాంటి ఛాన్స్ కూడా లేదని తేలిపోయింది. వెంకటేశ్వరరావు వైసీపీలోను పురందేశ్వరి బీజేపీలో ఉన్నపుడు కూడా కొన్ని సమస్యలు తలెత్తాయి. భవిష్యత్తులో మళ్ళీ అలాంటి సమస్యలే తలెత్తే అవకాశం ఉందని దగ్గుబాటి దంపతులు అనుకున్నారేమో. అందుకనే తనతో పాటు కొడుకుని కూడా వెంకటేశ్వరరావు రాజకీయాలకు దూరం చేసేశారు.

మరి దగ్గుబాటి నిర్ణయం .. మళ్లీ మారే అవకాశం ఉందా అన్నదే చర్చనీయాంశంగా మారింది..

Must Read

spot_img