Homeఅంతర్జాతీయంభారత్ కి టర్కీ వెన్నుపోటు .. ?

భారత్ కి టర్కీ వెన్నుపోటు .. ?

ఎంతటి శత్రువుకైనా సరే.. ఆపత్కాలంలో అండగా నిలిస్తే.. మిత్రుడిగా మారుతారని భావించిన భారత్ కు నిరాశే ఎదురైంది.. పాక్ మిత్రదేశమైన టర్కీకి భూకంపంతో అల్లాడుతున్న సమయంలో భారత్ చేసిన సాయం కూడా కనిపించడం లేదు.. మరోసారి పాక్ కు మద్దతుగా నిలిచిన టర్కీ.. భారత్ పై తన అక్కసును వెల్లగక్కింది..

వక్రబుద్ది గల టర్కీ.. మరోసారి తన బుద్దిని చూపించింది.. భూకంపంతో అతలాకుతలమైన టర్కీకి భారత్ తన వంతుగా ఎంతో సాయం చేసింది.. అప్పుడు నిజమైన స్నేహితుడిగా ప్రగల్భాలు పలికిన టర్కీ.. అవసరం తీరిపోగానే.. భారత్ పై మరోసారి విషం కక్కింది..

పాముకు పాలు పోసినా.. అది విషమే కక్కుతుంది. భూకంపంతో నిండా మునిగిందని టర్కీకి భారత్‌ సాయం చేస్తే…

అది ఆ సాయాన్ని ఏమాత్రం లెక్కచేయకుండా భారత్‌పై విషం కక్కింది. మరోసారి తన వక్రబుద్దిని చూపించింది. ఐక్యరాజ్యసమితిలో భారత్ శత్రు దేశమైన పాకిస్తాన్‌కు మద్దతుగా కశ్మీర్‌పై మళ్లీ పాతపాటే పాడింది. అంత సాయం చేసినా కూడా భారత్‌ కు వ్యతిరేకంగానే వ్యవహరించింది.
నిజమైన విషనాగు అని టర్కీ అనిపించుకుంది. ఈ బుద్దిపోనిచ్చుకోని టర్కీకి భారత్‌ గట్టిగానే బదులిచ్చింది. ఇలాంటి దేశాల విషయంలో భారత్‌ మానవీయత చూపించినప్పటికీ… ప్రయోజనం లేకుండా పోయిందనేది విశ్లేషకుల అభిప్రాయం..

ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ 75వ సెషన్‌లో ముందుగా రికార్డ్‌ చేయబడిన సందేశంలో టర్కీ విదేశాంగ మంత్రి రెసెప్‌ తయ్యిప్‌ ఎర్డోగాన్‌ కాశ్మీర్‌ సమస్యపై మాట్లాడారు. పాకిస్తాన్‌కు మద్దతుగా వ్యాఖ్యలు చేశారు. ”దక్షిణాసియా స్థిరత్వం, శాంతికి కీలకమైన కాశ్మీర్‌ వివాదం ఇప్పటికీ మండుతున్న సమస్య. జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక హోదా రద్దు తర్వాత తీసుకున్న చర్యలు సమస్యను మరింత జటిలం చేశాయి. ”యుఎన్‌ తీర్మానాల చట్రంలో.. ముఖ్యంగా కాశ్మీర్‌ ప్రజల అంచనాలకు అనుగుణంగా చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి మేము అనుకూలంగా ఉన్నాం” అని పేర్కొన్నారు.

టర్కీ ప్రతినిధి ఎర్డోగన్‌ చేసిన వ్యాఖ్యలపై భారత శాశ్వత ప్రతినిధి తిరుమూర్తి ఖండించారు. ”భారత భూభాగం జమ్మూ – కాశ్మీర్‌పై టర్కీ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు భారతదేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునేలా ఉన్నాయి. ఇది పూర్తిగా ఆమోదయోగ్యం కాదు. టర్కీ ఇతర దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవించడం నేర్చుకోవాలి. దాని స్వంత విధానాలను మరింత లోతుగా ప్రతిబింబించాలి” అని తిరుమూర్తి
స్పష్టం చేశారు. ఫిబ్రవరిలో పాకిస్తాన్‌ పర్యటనలో కూడా టర్కీ దీనిని లేవనెత్తింది. ఇటువంటి వ్యాఖ్యలుద్వైపాక్షిక సంబంధాలపై ప్రభావం చూపుతాయని తెలిపారు. ‘పాకిస్తాన్‌ చాలా కఠోరంగా ఆచరిస్తున్న సరిహద్దు ఉగ్రవాదాన్ని సమర్థించడానికి టర్కీ పదేపదే ప్రయత్నాలు చేస్తోంది’ అని స్పష్టం చేశారు.

పుణ్యం చేయబోతే పాపం ఎదురైనట్లు ఉంది టర్కీ తీరు.

భారీ భూకంపంతో ఇబ్బంది పడుతున్న టర్కీకి మానవత్వంతో సాయం చేయడానికి ఆపరేషన్‌ దోస్త్‌ పేరుతో భారత్‌ తనవంతు సహకారం అందించింది. అక్కడి ప్రజలు కూడా భారత ఆర్మీని, రెస్క్యూ ఆపరేషన్‌ నిర్వాహకులను అభినందించారు. తమను కాపాడినందుకు చేతులు ఎత్తి మొక్కారు. కానీ, టర్కీ ప్రధాని మాత్రం తన వక్రబుద్ధిని
మరోమారు బయటపెట్టుకున్నారు. విశ్వాసం లేని వారికి సాయం చేసినా ఏమి ప్రయోజనం అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

భారత్ ఎదుగుదల ఏ మాత్రం గిట్టని పాకిస్థాన్‌కు టర్కీ మిత్రదేశం. పాక్‌తో కలిసి కశ్మీర్ విషయంలో భారత్‌ ను అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టడానికి టర్కీ ప్రయత్నించింది. అయినా సరే భారత్సంయమనంతో వ్యవహరించింది. భూకంపం కారణంగా టర్కీ కష్టాల్లో పడటంతో.. వెంటనే స్పందించిన ఇండియా వెంటనే సహాయక సిబ్బందిని ఆ దేశానికి పంపించింది. ఇప్పటికీ ఆ దేశానికి సాయాన్ని
పంపుతూనే ఉంది. దీంతో భారత్‌ ను టర్కీ దోస్త్ అంటూ మిత్ర దేశంగా అభివర్ణించింది. వసుదైక కుటుంబ భావన.. అంతర్జాతీయ వేదికలపై ప్రధాని మోదీ తరచుగా చెప్పే మాట ఇది. ప్రపంచం మొత్తం ఒకటే అనేది దీని అర్థం. కులమతాలు, ప్రాంతీయ బేధాల అతీతంగా.. అందరం కలిసి మెలిసి జీవించడమే దీని సారాంశం. మనం అంతా మనవాళ్లే అనుకున్నా.. అందరికీ మనం దగ్గరి వాళ్లం కాలేం.

అంతర్జాతీయంగా అనేక పరిణామాలు కొన్ని దేశాలను దగ్గర చేస్తే.. మరికొన్ని దేశాలను దూరం చేస్తుంటాయి.. టర్కీకి భారత్‌తోనూ సంబంధాలున్నప్పటికీ సాటి ఇస్లామిక్ దేశమైన పాకిస్థాన్‌తో గాఢమైన స్నేహం ఉంది. ఓ మాటలో చెప్పాలంటే టర్కీకి చైనా, టర్కీ రెండు కళ్లలాంటివి. అందుకే కశ్మీర్ విషయంలో కావచ్చు.. భారత్‌లో ముస్లింలపై దాడులు జరుగుతున్నాయని ఆందోళన చేయడం కావచ్చు.. కశ్మీర్విషయంలో కమిటీని ఏర్పాటు చేయడం కావచ్చు. ఇవన్నీ పాకిస్థాన్‌ కు అనుకూలంగా టర్కీ తీసుకున్న నిర్ణయాలే…

2020 ఫిబ్రవరి 14న పాకిస్థాన్ పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన టర్కీ అధ్యక్షుడు ఎర్డగాన్.. ‘‘పాకిస్థాన్ మాకు చేసిన సాయాన్ని ఎన్నటికీ మరవలేం. స్వాంతంత్య్ర పోరాట సమయంలో తను తినే ఆహారంతో పాక్ మా కడుపు నింపింది. మాకెంతగానో సాయపడింది. ఇప్పుడు కశ్మీర్ విషయంలో మేం అంతే అండగా ఉంటాం. తేడా ఏమీ ఉండదు’’ అని వ్యాఖ్యానించారు. దీంతో
భారత ప్రభుత్వం టర్కీపై కన్నెర్ర చేసింది. మీరు 1974లో సైప్రస్‌లో కొంత భాగాన్ని ఆక్రమించినట్టు మేం ఏ దేశాన్ని ఆక్రమించలేదని ఘాటుగా బదులిచ్చింది. టర్కీ నుంచి దిగుమతులను గణనీయంగా తగ్గించుకుంది. టర్కీ శత్రువుగా భావించే ఆర్మేనియాతో 40 మిలియన్ డాలర్ల విలువైన రక్షణ ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

టర్కీలో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 7.8 తీవ్రతతో భూమి కంపించింది అనగానే.. భారత్ అప్రమత్తమైంది.

వరుస ప్రకంపనలను చూసి మెరికల్లాంటి తన ఎన్డీఆర్ఎఫ్ బలగాలను సన్నద్ధం చేసింది.అభివృద్ధి చెందిన దేశాలుగా చెలామణి అవుతున్న మిగతా దేశాల కంటే ముందుగానే.. రెస్క్యూ సిబ్బందిని పంపుతున్నట్లు ప్రకటించింది. రెస్క్యూ త్వరగా టర్కీ చేరుకోవడం కోసం మీ గగనతలాన్నివాడుకోవడానికి అనుమతి ఇవ్వండని పాక్‌ ను కోరింది. టర్కీ తన మిత్రదేశమైన సరే.. పాక్ మాత్రం అందుకు ఒప్పుకోలేదు. దీంతో అరేబియా సముద్రం మీదుగా భారత విమానాలు టర్కీ చేరుకున్నాయి.

భారత్స్పందించిన వేగం, ఆపన్న హస్తం అందించిన తీరు టర్కీని సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది. తను ప్రతి విషయంలోనూ పాక్‌కు వంతపాడుతూ చికాకు పెట్టినా.. సాయం అందించడానికి ముందుకు రావడంతో.. ‘దోస్త్’ అంటూ భారత్‌లోని స్నేహితుణ్ని చూడటం మొదలుపెట్టింది. దీంతో ఇండియా కూడా ‘ఆపరేషన్ దోస్త్’ పేరిట సహాయక కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ఆరు ఐఏఎఫ్ విమానాలు
నిరంతరం టర్కీకి రెస్క్యూ సిబ్బంది, మందులు, వైద్య సిబ్బందిని తరలిస్తూనే ఉంది… ఆంక్షల వలయంలో చిక్కుకున్న సిరియాకు సైతం భారత్ ప్రాణాధార ఔషధాలను పంపించింది.

టర్కీలో క్షతగాత్రులకు చికిత్స అందించడం కోసం ఇండియన్ ఆర్మీ ఓ ఫీల్డ్ హాస్పిటల్‌ను సైతం ఏర్పాటు చేసింది. భారత సహాయక బృందాలు రెస్క్యూ ఆపరేషన్లో చురుగ్గా పాల్గొన్నాయి.. టర్కీలో సేవలు అందించిన భారత సైనికాధికారిణిని ఓ మహిళ హత్తుకున్న ఫొటో చూస్తే.. భారత సైన్యం ఎంత గొప్పగా సేవలు అందించిందో అర్థం చేసుకోవచ్చు. భారత్ సేవలను టర్కీ అంబాసిడర్ ఎంతగానో
కొనియాడారు. టర్కీకి భారత్ సాయం అందిస్తున్న తీరు పట్ల పాకిస్థానీలు సైతం ఫిదా అయ్యారు…

మొన్నటి వరకూ భారత్‌తో పాటు సౌదీ, ఇజ్రాయెల్, యూఏఈ దేశాల పట్ల వ్యతిరేక ధోరణితో ఉన్న టర్కీ.. ఆర్థిక
ఇబ్బందులు, భూకంపం తెచ్చిన నష్టం నేపథ్యంలో దేశ పునర్నిర్మాణం కోసం ఈ దేశాలకు టర్కీ స్నేహ హస్తం అందిచనుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. టర్కీకి భారతదేశం ఇస్తున్న మద్దతు గురించి ప్రస్తావిస్తూ.. భారతదేశంలోని టర్కీ రాయబారి ఫిరత్ సునెల్ ట్వీట్‌లో కృతజ్ఞతలు తెలిపారు. అవసరంలో ఆదుకున్న వారే నిజమైన స్నేహితులు అని వివరిస్తూ భారతదేశానికి చాలా ధన్యవాదాలు అని
పేర్కొన్నారు. ట్విట్టర్‌లో సునేల్ ..””దోస్త్ అనేది టర్కిష్, హిందీలో ఒక సాధారణ పదం..మనకు ఒక టర్కీ సామెత ఉంది. “దోస్త్ కారా గుండే బెల్లి ఒలూర్” . చాలా ధన్యవాదాలు భారత్”అని ట్వీట్ లో తెలిపారు.
అయితే.. వాస్తవానికి మాత్రం భారత్ చేసిన మేలును మర్చిపోయింది టర్కీ.. తాజాగా కశ్మీర్ విషయంలో పాకిస్తాన్ కు మద్దతుగా నిలిచి.. భారత్ పై విషం చిమ్మింది కుటిలబుద్ది గల టర్కీ…

భారత్ శత్రుదేశమైన పాక్ కు టర్కీ మిత్రదేశం.. కశ్మీర్ విషయంలో భారత్ కు వ్యతిరేకంగా పాకిస్తాన్ కు మద్దతుగా నిలిచే టర్కీకి.. భూకంపంతో అతలాకుతలం అవుతున్న సమయంలో భారత్సాయం చేసింది.. అయినప్పటికీ.. వక్రబుద్ది గల టర్కీ మాత్రం భారత్ కు వ్యతిరేకంగా పాక్ కు మద్దతుగా నిలిచింది..

Must Read

spot_img