Homeఅంతర్జాతీయంటర్కీలో శవాల గుట్టలు..భారత్‌కూ పెనుముప్పు! 

టర్కీలో శవాల గుట్టలు..భారత్‌కూ పెనుముప్పు! 

కేవలం మూడు వందల మంది చనిపోయారన్న భూకంపం ఇప్పుడు వంద రెట్లు ఎక్కువగా ముప్పైవేల మంది మ్రుతులకు చేరుకుంది. 2 వందల గంటలు దాటుతున్నా ఇంకా వెలికి తీయాల్సిన శిధిలాలు కుప్పలు తెప్పలుగా అలాగే ఉన్నాయి. అంతర్జాతీయంగా సహాయక బ్రుందాలు తుర్కియే చేరుకుంటున్నాయి కానీ సిరియాలో రెబెల్స్ కారణంగా రక్షణ చర్యలు అంత జోరుగా సాగడం లేదు..అక్కడ కూడా భూకంపం తాలూకు బీభత్సం తుర్కియేతో సమానంగానే ఉంది..

టర్కీ, సిరియాలో భూకంపం కారణంగా మృతుల సంఖ్య 30వేలు దాటింది. ఇంకా పెరిగే అవకాశాలు ఎక్కువేనంటున్నారు అధికారులు. మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూ పోతోంది. ప్రకృతి ప్రకోపానికి ఇరు దేశాల్లో 50 వేల మందికిపైగా బలయి ఉంటారని యునైటెడ్ నేషన్స్ అధికారులు అంచనాలు వేస్తున్నారు. ఇప్పటికైతే ప్రకృతి ప్రకోపానికి ఇరు దేశాల్లో అధికారికంగా 30 వేల మందికి పైగా బలయ్యారు. శిథిలాల కింది చిక్కుకున్నవారిని రక్షించేందుకు ఎనిమిది రోజులుగా సహాయక సిబ్బంది శ్రమిస్తున్నారు. అయితే వేల సంఖ్యలో బిల్డింగ్‌లు కూలిపోవడం, గడ్డ కట్టే చలి వాతావరణం, ఆహారలేమితో మరణాల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. భూకంపం సంభవించి వారం రోజులు దాటుతోంది. శిథిలాల కింద ఇంకా ఎంతో మంది ప్రాణాలతో ఉన్నారు.

ఇదే విషయంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక సర్వం కోల్పోయి తాత్కాలిక శిభిరాల్లో ఉన్నవారు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని రోజులు గడుపుతున్నారు. చలితీవ్రతకు పిల్లల దుస్తులు, ఇతర సామాగ్రిని కాల్చుతూ ఉపశమనం పొందుతున్నారు. ఫిబ్రవరి 6న టర్కీలో భూకంపం సంభవించినప్పటి నుంచి తప్పిపోయిన భారతీయుడు మాలత్యాలోని ఓ హోటల్ శిథిలాల కింద చనిపోయాడు. ఈ విషయాన్ని టర్కీలోని భారత రాయబార కార్యాలయం శనివారం ట్వీట్‌లో తెలియజేసింది. మృతుడు విజయ్ కుమార్‌ అని గుర్తించారు. అతను వ్యాపార నిమిత్తం టర్కీకి వెళ్లాడు. “అతని సామాను మరియు పాస్‌పోర్ట్ కనిపించాయని మాకు సమాచారం అందిందని విజయ్ కుమార్ బంధువు గౌరవ్ కలా అన్నారు. ఈ విషాద వార్త తెలుసుకున్న కుమార్ కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

తనకు తల్లి, భార్య, ఆరేళ్ల పాప ఉన్నారు. నెలన్నర క్రితం తండ్రిని కోల్పోయాడు. టర్కీ, సిరియా దేశాలకు ప్రపంచ దేశాలు తమవంతుగా సాయం అందిస్తున్నాయి. భూకంప బాధితులకు మూడు నెలల అత్యవసర వీసాలను జపాన్‌ మంజూరు చేసింది. బాధితులు తమ కుటుంబాలతో కలిసి తమ దేశానికి రావచ్చని జర్మనీ ఇంటీరియర్‌ మినిస్టర్‌ న్యాన్సీ ఫైజర్‌ తెలిపారు. ఇక భారత సైన్యానికి చెందిన 99 మంది డాక్టర్లు క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. కుప్పకూలిన ఆస్పత్రుల సమీపంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన శిబిరాల్లో బాధితులకు వైద్యసాయం అందిస్తున్నారు. భూకంప ప్రభావంతో నేలకూలిన భవనాల శిథిలాల కింద చిక్కుకున్న కొందరు ప్రాణాలతో బయటపడుతుండగా, అధికశాతం మృతదేహాలను రెస్క్యూ సిబ్బంది వెలికితీస్తున్నారు.

కొత్త లెక్కల ప్రకారం.. 29,896 మంది మరణించినట్లు అధికారులు పేర్కొంటున్నారు. అయితే, ఈ ఊహించని విపత్తు కారణంగా 85వేల మందికిపైగా గాయపడ్డారు. వీరంతా ఆయా ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అయితే, కుప్పకూలిన భవనాల శిథిలాలను తొలగిస్తున్న క్రమంలో మృతదేహాల సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలో ఐక్యరాజ్య సమితి కీలక ప్రకటన చేసింది. రెండు దేశాల్లోని భూకంప ప్రభావిత ప్రాంతాల్లో మృతుల సంఖ్య 50వేలకు చేరే అవకాశం ఉందని తెలిపింది. ఆపరేషన్‌ దోస్త్‌లో భాగంగా ఔషధాలు, వైద్య పరికరాలు, ఇతర సహాయ సామాగ్రితో ఘజియాబాద్‌లోని హిండన్‌ ఎయిర్‌బేస్‌ నుంచి తుర్కియే, సిరియాకు ఏడో విమానం కూడా బయలుదేరింది. టర్కిష్ మరియు సిరియన్ భూకంప బాధితులకు కుటుంబంతో సహా జర్మనీ మూడు నెలల వీసాలు మంజూరు చేస్తుంది.

జర్మనీలోని టర్కిష్ లేదా సిరియన్ కుటుంబాలను విపత్తు ప్రాంతం నుండి తమ దగ్గరి బంధువులను అధికార యంత్రాంగం లేకుండా వారి ఇళ్లకు తీసుకురావడానికి మేము అనుమతించాలనుకుంటున్నామని జర్మనీ తెలిపింది. ప్రకృతి విపత్తులో చిక్కుకున్న టర్కీకి ప్రపంచ బ్యాంకు 1.78 బిలియన్ డాలర్ల సాయాన్ని ప్రకటించింది. అమెరికాసైతం టర్కీ, సిరియాలోని భూకంప ప్రభావిత ప్రాంతాలకు 85 మిలియన్ల డాలర్లు సాయాన్ని ప్రకటించింది. ఇదిలాఉంటే భూకంప ప్రభావిత ప్రాంతాల్లో భారత ఆర్మీ సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. వేలాది మందికి ఇండియన్ ఆర్మీ వైద్య సేవలు అందిస్తోంది. భూకంప ప్రభావిత ప్రాంతాల్లోని పాఠశాల భవనాల్లో ఆస్పత్రిని ఏర్పాటు చేసి, ఇందులోనే ల్యాబ్, ఎక్స్ రే సౌకర్యాలు కూడా అందిస్తున్నారు. భవన శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడటంతో పాటు, వైద్య సేవలు అందించడం ఇలా అన్ని విధాల ఇండియన్ ఆర్మీ భూకంప ప్రభావిత ప్రాంతాల్లో పనిచేస్తోంది

Must Read

spot_img