Homeఅంతర్జాతీయంటర్కీ, సిరియా భూకంప విలయం.. 10వేలకు చేరువలో మరణాలు..

టర్కీ, సిరియా భూకంప విలయం.. 10వేలకు చేరువలో మరణాలు..

పెను ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నతుర్కియే, అంతర్యుధ్ధంలో శిధిలమైన సిరియా దేశాలను ప్రక్రుతి బీభత్సం నిండా ముంచేసింది. ఇప్పటికే ఘోర మ్రుత్యుకలిని చూసిన సిరియాలో ఆనాడు క్షిపణి దాడులతో కుప్పకూలిపోగా మిగిలిన భవనాలను నేలమట్టం చేసింది. భూకంపం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఇప్పటికే ఈ రెండు దేశాల్లో భూకంప ధాటికి మృతుల సంఖ్య అధికారికంగా 5000 చేరుకున్నట్లు ప్రకటించగా ఐక్యరాజ్య సమితికి చెందిన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మాత్రం 20వేల మందికి పైగా మరణించి ఉంటారని అంచనా వేసింది.

అయితే స్థానిక మీడియాలు మాత్రం భూకంప ధాటికి మృతుల సంఖ్య 10వేలకు చేరే అవకాశం ఉన్నట్లు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో టర్కీ వారం రోజుల సంతాప దినాలను పాటిస్తోంది. జాతీయజెండాలను సగానికి అవనతం చేయాలని ఆ దేశం నిర్ణయించింది. 7.8 తీవ్రతతో కూడిన భూకంపంతో రెండు దేశాల్లో అనేక భవనాలు కూలిపోయాయి. శిథిలాల కింద ఇంకా చాలా మృతదేహాలు ఉండే అవకాశం ఉన్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. అయితే ప్రాణం పోకడ వానరాకడ ఎలాగైతే చెప్పలేమో భూకంపాలను అగ్నిపర్వతాలను కచ్చితంగా చెప్పడం అసాధ్యం..ఇన్ని టెక్నాలజీలను కనుగొంటున్నా ఎర్త్ క్వేక్స్ విషయంలో పరిశోధనలు జరగడం లేదా అంటే జరుగుతున్నాయి. కానీ వాటిలో అంతగా పురోగతి కనిపించడం లేదు.

ఎందుకంటే వీటికోసం అంతగా కేటాయింపులు ఉండటం లేదు. అయితే రాబోయే 2026 సంవత్సరంలో భూకంపాలను గుర్తించే దిశగా అంతరిక్షంలో ఉపగ్రహాలను ప్రయోగించబోతున్నారు. భూమి పొరల మధ్య జరిగే మార్పులను అవి కనిపెడతాయని చెబుతున్నారు. సరిగ్గా భూకంపం వచ్చే ముందు కొన్ని గంటల సమయంలో టర్కీలో వేలాదిగా పక్షులు గాల్లోకి లేచాయి. కంగారు కంగారుగా అవి ఆకాశంలో తిరుగుతూ సందడి చేసాయి. మరి పక్షులు భూ కంపణాలను ముందే పసిగట్టాయా అన్నది తేలాల్సి ఉంది.

అంతే కాదు.. దక్షిణ మధ్య తుర్కియే, జోర్డాన్‌, సిరియా, లెబనాన్‌లలో భారీ భూకంపం వచ్చే అవకాశాలున్నాయని మూడు రోజుల ముందే ఓ పరిశోధకుడు హెచ్చరించినట్లు ఓ వార్త వెలుగులోకి వచ్చింది. నెదర్లాండ్స్‌ సంస్థ ‘సోలార్‌ సిస్టమ్‌ జియోమెట్రీ సర్వేకు చెందిన భూగర్భశాస్త్ర పరిశోధకుడు ఫ్రాంక్‌ హూగర్‌బీట్స్‌.. ‘త్వరలోనే దక్షిణ మధ్య తుర్కియే, జోర్డాన్‌, సిరియా, లెబనాన్‌ ప్రాంతాల్లో 7.5 తీవ్రతతో భూకంపం సంభవించే అవకాశం ఉందని ఫిబ్రవరి 3నే ఓ ట్వీట్‌ చేశారు. ఆయన అంచనాల ప్రకారమే ఫిబ్రవరి 6న తెల్లవారుజామున మొదలైన భూకంప ప్రకంపనలు విలయాన్ని సృష్టించాయి.

ఈ ప్రమాదం తనను ఎంతో కలచివేసిందని ఫ్రాంక్‌ హూగర్‌బీట్స్‌ స్పందించారు. గ్రహ సంబంధిత సంక్లిష్ట రేఖాగణితం ఆధారంగా భూకంపం వచ్చే సమయాన్ని అంచనా వేశానని తెలిపారు. స్థానికంగా ఇప్పటివరకు సంభవించిన దాంట్లో ఇదే అత్యంత తీవ్రమైనదని.. మరిన్ని ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందన్నారు. ఈయన చెప్పినట్లుగానే గంటల వ్యవధిలో మరోసారి ప్రకంపనలు వచ్చాయి. అయితే, ఆయన మాటలు విని ఉండాలని అంతా అనుకుంటున్నారు. అయితే ఫ్రాంక్‌ హూగర్‌బీట్స్‌ ముందస్తుగా చేసిన హెచ్చరికలపై పలు విమర్శలు కూడా వచ్చాయి. భూకంపాలను అంచనా వేసేందుకు కచ్చితమైన విధానమేదీ ప్రస్తుతం అందుబాటులో లేదంటూ కొందరు నెటిజన్లు చెబుతున్నారు.

పైగా గతంలో ఆయన చేసిన అంచనాలు తప్పాయని వెల్లడించారు. ప్రస్తుతం ఫ్రాంక్‌ అంచనాలు నిజం కావడంతో లక్షల సంఖ్యలో నెటిజన్లు ఆయన ట్వీట్లు చూస్తున్నారు. అసలు ఎందుకు భూకంపాలు వస్తాయి అన్న విషయానికొస్తే…దానికి గల కారణాలు ఏంటి? అన్నది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. మనకు తెలిసి భూమి లోపల అనేక పొరలు ఉంటాయి. ఒక పొర మందం సుమారు 50 కిలోమీటర్లు ఉన్నట్లయితే ఆ పొరను క్రెస్ట్ లేదా లిథోస్పియర్ అంటారు. దాని కింద పొరను మాంటెక్ అంటారు. దాని మందం మూడు వేల కిలోమీటర్ల లోతుగా ఉంటుంది.

ఈ పొరతో పోలిస్తే హిమాలయాలు చాలా చిన్నవి. భూమిలోని కేంద్రకం..అంటే భూమి ఓ గోళాకారపు ఘనపదార్థం అనుకుంటే సరిగ్గా దాని మధ్యలో ఉండే కేంద్రకం అనే ప్రాంతంలో భయంకరమైన ఉష్టోగ్రత ఉంటుంది. అది 8వేల డిగ్రీల సెల్సియస్ అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నిరంతరం ఆ ప్రాంతంలో భూమికి సంబంధించిన శిలలు మట్టి కరిగిపోయి మరుగుతూ ఉంటుంది. ఎక్కడైతే భూపొరల్లో బలహీన ప్రాంతాలు ఉంటాయో అక్కడ ఈ కరిగిన ద్రవం..అంటే.. లావా.. మాంటిక్, క్రెస్ట్ పొరలను చేధించుకుని బయటకు రావడం జరుగుతుంది. దీన్ని అగ్ని పర్వతం బద్ధలైందని అంటారు. భూమి లోపల చాలా కఠినమైన పొరలతో పాటు చిన్న పొరలు కూడా ఉంటాయని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. అవి ఒకదానికొకటి తగులుకుంటూ కదులుతూ ఉంటాయి. ఈ కదలికల కారణంగానే నష్టం వాటిల్లుతుంటుంది.

అధిక ఒత్తిడితో బయటకు వచ్చిన లావా ప్రభావంతో భూమిపై పొరైన క్రెస్ట్ 10 నుంచి 12 చలించే శిలాఫలకాలుగా ఏర్పడుతుంది. అయితే భూమి మొత్తం 13 పొరలతో ఉంటుందని బుతుంటారు. లావా ఒత్తిడి, ఉష్టోగ్రతలకు ఈ శిలా ఫలకాలలోని కొన్ని భాగాలు ఒకదానికొకటి నెట్టుకుంటుంటాయి. వాటినే టెక్టోనిక్ ప్లేట్లు అని అంటారు. అవి ఒకదానినొకటి తగులుకోవడం లేదా దూరం జరగడం వల్ల భూ ఉపరితలంపై పగుళ్లు ఏర్పడటం జరుగుతుంది. ఇలా టెక్టోనిక్ ప్లేట్లు ఢీకొట్టడం వల్లనే భూకంపాలు వచ్చే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. శిలాఫలకంలో ఏర్పడే పగుళ్ల స్థాయిని బట్టి ఈ భూకంపాలు సంభవిస్తాయి. అయితే భూకంపం సమయంలో పెద్ద శబ్ధాలు తప్పనిసరిగా వస్తాయి. సముద్రాలలో సైతం ఈ భూకంపాలు సంభవిస్తుంటాయి. అయితే అవి భూమి నుంచి ఎంత లోతులో ఏర్పడ్డాయన్న దానిపై వాటి తీవ్రత ఆధారపడి ఉంటుంది. బాగా లోతులో భూకంప కేంద్రం ఉంటే ప్రమాదం తక్కువగా ఉంటుంది. భూ ఉపరితలానికి దగ్గరలోనే ఉంటే ప్రమాద తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది.

అయితే ఈ బలహీనపు టెక్టోనిక్ ప్లేట్లు ఎక్కడ ఉంటాయో సదరు ప్రాంతం ఉండే దేశాలను భూకంపాలకు అనువైనవిగా చెబుతుంటారు. వాటిని ఇప్పటికే గుర్తించి అలర్ట్ కూడా చేసారు. ఇకపోతే భూకంపాలను నమోదు చేసే సాధానాన్ని ‘సిస్మోగ్రాఫ్’ అంటారు. రెండో దశాబ్ధంలో చైనాలో తొలిసారిగా సిస్మోగ్రాఫ్‌ను తయారు చేసి వినియోగించారు. దీనిలో స్ట్రింగ్ ల నుంచి స్థిరంగా వేలాడే బరువు కలిగి ఉంటుంది. దీనికి నాలుగు దిశల చలనాలను నమోదు చేయగల సాధనాలు జత చేసి ఉంటాయి. ఈ సిస్మోగ్రాఫ్ వెనుకాల ఒక అద్ధం ఉంటుంది. ఏ కారణంగానైనా భూమి కంపిస్తే దాని ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ తరంగాల వెనకున్న అద్దాన్ని కదిలిస్తాయి.

ఆ అద్దం నుంచి ప్రతిబించించే కాంతి కిరణాలు నిత్యం తిరిగే గుండ్రని డ్రిమ్ పైకి ఫోకస్ చేయబడి ఉంటాయి. అవి ఫోటో గ్రాఫిక్ ప్లేటు మీద పడుతూ ఉంటాయి. దీని వల్ల డ్రమ్ మీద ఉంటే ఫోటో గ్రాఫిక్ ప్లేటు మీద చలించిన గీతలు ఏర్పడుతాయి. భూకంపాలు వచ్చిన సమయంలో దాని తీవ్రతను కొలిచే సాధనాన్ని ఛార్లెస్ రిక్టర్ 1935లో కనుగొన్నారు. 3వేల800 లీటర్ల పెట్రోలు మండగా వచ్చే శక్తికి సమానమైన శక్తి భూకంపం సందర్భంగా విడుదలవుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. అది రిక్టర్ స్కేలు మీద 2.5కు సమానం. ఇది ఆరు దాటితే భూకంపం ప్రభావం అధికంగా ఉంటుంది. 7 దాటితే అది ప్రమాదకరమైనదిగా చూస్తారు. 8 దాటితే మహా ప్రళయమేనని చెబుతున్నారు. అయితే ఈ ప్రకృతి వైపరీత్యాలను జంతువులు, పక్షులు ముందే ఊహించగలవని శాస్త్రవేత్తలు గతంలో రుజువు చేశారు. మానవాళి తప్పిదాల వల్లే భూకంపాలు సంభవిస్తున్నాయి.

భూ ఫలకాల కదలికలతో భూకంపాలు సంభవిస్తుండగా అలాంటి సున్నితమైన ప్రదేశాల్లో ఉండే దేశాల్లో భూకంపాలు తరచూ సంభవిస్తున్నాయి. జపాన్, ఫిలిప్పిన్స్, ఇండోనేషియా, ఈక్వెడార్, అఫ్గానిస్తాన్ దేశాల్లో తరచూ ఈ భూకంపాలు సంభవిస్తున్నాయి. 2021లో ఈక్వెడార్ లో 23వేల 735 భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. భూకంపాల ముప్పు తీవ్రస్థాయిలో పొంచి ఉన్నప్పటికీ తుర్కియేలో సన్నద్ధత తక్కువే. అందుకే అక్కడ భారీ ఆస్థినష్టం, ప్రాణనష్టం జరిగింది.

Must Read

spot_img