Homeఅంతర్జాతీయంట్రంప్ ఈ కొత్త ధోరణి చూసి విస్తుపోతున్నారు ఎందుకు?

ట్రంప్ ఈ కొత్త ధోరణి చూసి విస్తుపోతున్నారు ఎందుకు?

అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న అభ్యర్థుల ప్రచారం మొదలైంది. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా నిక్కీ హేలీ తాను బరిలో ఉన్నానని ప్రకటించారు. అటు వివేక్ రామస్వామి కూడా పోటీలో ఉన్నట్టు చెబుతున్నారు. తమ ప్రచారం సందర్భంగా గెలిస్తే అమెరికాకు ఏం చేయాలనుకుంటున్నారో ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. అమెరికాకు శత్రు దేశాల వారికి ఇన్నాళ్లుగా అందుతున్న ప్రత్యక్ష పరోక్ష విదేశీ సాయాల్ని నిలిపివేసి వాటిని అమెరికా అభివ్రుద్దికి ఉపయోగిస్తానని చెబుతున్నారు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి నిక్కీహేలీ.

భారత సంతతికి చెందిన నిక్కీ ఇప్పటికే తాను అధ్యక్ష పదవి రేసులో ఉన్నానని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆమె తాను అధికారంలోకి వస్తే ఏం చేయాలనుకుంటుందో చెబుతూ ప్రచారం ప్రారంభించారు. నిక్కీహేలీ ముఖ్యంగా అమెరికా విదేశాంగ విధానంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను అధికారంలోకి వస్తే పాక్‌, చైనాతో పాటు అమెరికాను ద్వేషించే శత్రు దేశాలకు విదేశీ సాయంలో కోత విదిస్తానని చెప్పారు. సర్వసత్తాక అమెరికా ఎప్పుడూ ప్రజల సొమ్మును వృధా చేయదన్నారు. అమెరికా గతేడాది విదేశీ సహాయం కోసం 46 బిలియన్‌ డాలర్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. అది నిజానికి అమెరికా పౌరులకు చేరాల్సిన సొమ్ము అన్నారు.

సాయం పేరిట చేసిన ఖర్చు ఇతర దేశాల జీడీపీ కన్నా ఎక్కువ అని కూడా చెప్పారు. అంతేగాదు ఆ డబ్బు ఎక్కడికి వెళుతుందో అమెరికా పన్ను చెల్లింపుదారులకు తెలుసుకునే హక్కు ఉందన్నారు. వాస్తవానికి ఆ సొమ్ము అంతా అమెరికాను వ్యతిరేకించే దేశాలకు నిధులు సమీకరించడానికి వెళ్తోందని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పారు. తాను అధికారంలో ఉంటే మాత్రం అమెరికా విరోధులకు అందించే సాయంలోని ప్రతి పైసాలో కోత విధిస్తానని కరాకండీగా చెప్పారు.

బైడెన్‌ ప్రభుత్వం పాక్‌కి మళ్లీ సైనిక సాయాన్ని ప్రారంభించిందన్నారు. ఉగ్రవాదులకు నిలయమైన ఆ దేశ ప్రభుత్వం అమెరికాను వ్యతిరేకించే చైనాకు లోబడి ఉంది. అంతేగాదు పాలస్తీనా ప్రజల కోసం అని అమెరికా యూఎన్‌ అవినీతి ఏజెన్సీని అర బిలియన్‌ డాలర్లతో పునురుద్ధరించింది. ఇది కూడా అనవరసరమైన ప్రక్రియ అని కామెంట్ చేసారు. అలాగే ఇరాన్‌కు అమెరికా సుమారు రెండు బిలియన్‌ డాలర్లు సాయం అదిస్తే..అది యూఎస్‌ దళాలపైనే దాడులకు దిగింది. ఇదెక్కడి న్యాయం అని ప్రశ్నించారు. అంతేగాదు యూఎన్‌లో అమెరికాకు అత్యంత వ్యతిరేకంగా ఓటింగ్‌​ వేసే దేశాల్లో ఒకటైన జింబాబ్బేకు కూడా వందల బిలియన్‌ డాలర్లు అమెరికా పాలకులు అందించారు.

అత్యంత హాస్వస్పదమైన విషయమేమిటంటే..చైనా నుంచి అమెరికాకు తీవ్ర స్థాయిలో ముప్పు ఉన్నప్పటికీ పర్వావరణ కార్యక్రమాల పేరుతో చైనాకు సైతం అమెరికా డాలర్లు అందిస్తోంది. అంతేగాదు రష్యన్‌ నియంత వ్లాదిమర్‌ పుతిన్‌ అత్యంత సన్నిహిత దేశమైన బెలారస్‌కి కూడా అమెరికా నుంచి సాయం అందించాం. అలాగే క్యూబాకి కూడా సాయం అందించాం..అంటూ విరుచుకుపడ్డారు నిక్కీ హేలీ. జనానికి నిక్కీ చెబుతున్న మాటలు అర్థవంతంగా ఉన్నట్టు తోస్తోంది..

ఆమె మాటలు అమెరికా ప్రజలను ఆలోచనలో పడేస్తున్నాయి. ఆమె మాటలను ఆసక్తిగా వింటున్నారని చెబుతున్నారు విశ్లేషకులు. ఆమె గతంలో అమెరికా తరపున ఐక్యరాజ్యసమితలో ప్రతినిధిగా పనిచేసారు కాబట్టి విదేశాంగ శాఖపై మంచి పట్టు ఉంది. పొరుగుదేశాల పట్ల మంచి అవగాహనం ఉంది. అందుకే ఆమె మాటల్లో ఆ పదను కనిపిస్తోందని అంటున్నారు విశ్లేషకులు. అమెరికా విదేశాంగ విధానంలో మార్పులు రావాల్సిన అవసరం ఉందని ఆమె పదే పదే చెబుతున్నారు. కేవలం అధ్యక్షుడు జో బైడెన​ మాత్రమే కాదు ఇరు పార్టీల అధ్యక్షులు దశాబ్దాలుగా విదేశీ సాయం విషయంలో ఇలాగే కొనసాగారు. వారంతా అమెరికా సహాయన్ని స్వీకరించే దేశాల ప్రవర్తనను పరిగణనలోకి తీసుకోలేదన్నారు నిక్కీ హేలి.. తాను అధికారంలోకి వస్తే అమెరికా వ్యతిరేక దేశాలకు సాయం చేసి డాలర్లను వృధా చేయనని చెప్పారు.

మన ప్రజలు కష్టపడి సంపాదించిన సొమ్మును అలాంటి దేశాలకు నిధులుగా అందించేదే లేదని తెగేసి చెప్పారు నిక్కీ హేలీ. ఈ సందర్భంగా ఆమె పాకిస్తాన్, చైనాల గురించి నొక్కి చెబుతున్నారు. అవి నిజానికి చాలా చెడ్డ దేశాలనీ, ఆ దేశాలపై విరుచుకుపడ్డారు. పాక్ డజన్ కు పైగా తీవ్రవాద సంస్థలకు నిలయంగా ఉందని ఆరోపించారు. మిత్రదేశం ఇజ్రాయిల్ కు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న పాలస్తీనాకు కూడా అమెరికా నిధులు వెళ్తున్నాయని అన్నారు. తాను అధికారంలోకి వస్తే అమెరికాకు వ్యతిరేకంగా ఉన్న దేశాలను నిధులను ఇవ్వబోమని స్పష్టం చేశారు. మన పక్షాన నిలబడే మిత్ర దేశాలకు మాత్రమే సాయం అందిస్తామని అన్నారు. చైనాకు అమెరికా డబ్బులు ఇస్తోందని, ప్రమాదం అని తెలిసినా అమెరికా ఇలా చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఒక జో బైడెన్ ప్రభుత్వానికి మాత్రమే పరిమితం కాలేదని, రిపబ్లికన్లు, డెమక్రాట్లు గత కొన్ని దశాబ్ధాలుగా ఇలాగే చెస్తున్నారని ఆరోపించారు నిక్కీ హేలి..

Must Read

spot_img