Homeసినిమాపౌరాణిక కథ కోసం చూస్తున్న ఎన్టీఆర్..

పౌరాణిక కథ కోసం చూస్తున్న ఎన్టీఆర్..

నందమూరి తారక రామారావు. ఈ పేరు అంటే తెలియని వారులేరు. సిల్వర్ స్క్రీన్ లెజెండ్ గా ఆయన మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన నటవారసుడు జూనియర్ ఎన్టీఆర్ తాతకు తగ్గ మనవడు. ఎన్టీఆర్ రూపం పుణికిపుచ్చుకున్న వాడిగా యంగ్ టైగర్ కి మంచి పేరుంది. రూపమే కాకుండా నటన, డైలాగ్ డెలివరీలో అంతటివాడు అనిపించాడు. అయితే నందమూరి తారక రామారావు అన్ని రకాల సినిమాల్లో రాణించారు. సోషల్ ప్యాంటసీలతో పాటు పౌరాణిక సినిమాల్లో ఆయనకు ఇప్పటికి వరకు సాటి లేరు. ఆయన నట వారసత్వాన్ని ఏ మాత్రం తగ్గకుండా జూనియర్ ఎన్టీఆర్ ప్రస్థానం కొనసాగుతుంది.

ప్రస్తుత టాలీవుడ్ యంగ్ స్టార్ హీరోలలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమాను వ్యాప్తింపచేస్తుండు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్. ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత ఆయన క్రేజ్ మరింత పెరిగింది. భవిష్యత్‌లో చేయబోయే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీపుకుంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఎన్టీఆర్ రెండు క్రేజీ ప్రాజెక్టుల‌ను అనౌన్స్ చేశారు. అవి రెండూ పాన్ ఇండియా సినిమాలే. అలాగే ఈ రెండు చిత్రాలు సాంఘిక చిత్రాలే. కానీ.. వీట‌న్నింటికీ భిన్నంగా నెక్ట్స్ మూవీని ఆయ‌న పౌరాణిక చిత్రంగా చేయ‌బోతున్నార‌ట‌. ఈ విష‌యాన్ని చెప్పింది ఎవ‌రో కాదు.. టాలీవుడ్ ప్రొడ్యూస‌ర్ సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ. రీసెంట్ ఇంట‌ర్వ్యూలో ఆయ‌న మాట్లాడుతూ తాము చేయ‌బోయే ఫ్యూచ‌ర్ ప్రాజెక్ట్స్ గురించి కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను తెలియ‌జేశారు. అప్పుడు ఎన్టీఆర్‌తో పౌరాణిక చిత్రం చేయ‌బోతున్నామ‌ని తెలిపారాయ‌న‌. ఈ సినిమాకు ఎప్ప‌టిలాగానే వారి సంస్థ ఆస్థాన డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ దర్శ‌క‌త్వం వ‌హించ‌బోతున్నారు.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఎన్టీఆర్ కాంబినేషన్లో అల్డ్రేడి అర‌వింద స‌మేత వీర రాఘ‌వ సినిమా సూసర్ హిట్ అయింది. తర్వాత వారి ఇరువురి కాంబినేషన్ లో మరో సినిమా చేస్తున్నట్లు ప్రకటించిన కాని ముందుకు రాలేదు. అయితే మ‌రోసారి వీరి కాంబినేషన్లో మంచి మూవీతో అభిమానుల‌ను అల‌రించ‌నుందని నిర్మాత నాగ‌వంశీ చెప్పారు. ఇక నాగ వంశీ విష‌యానికి వ‌స్తే ఆయ‌న నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్న తాజా చిత్రం సార్‌. ఇందులో ధ‌నుష్ హీరో. తెలుగు, త‌మిళంలో ఫిబ్ర‌వ‌రి 17న సినిమా రిలీజ్ కానుంది.

యమదొంగ సినిమాలో యంగ్ యముడిగా ఎన్టీఆర్ నటన, ఆహార్యం అద్భుతం. ఇక తాతయ్య దాన వీర శూర కర్ణ మూవీలో చెప్పిన ఏమంటివీ ఏమంటివీ డైలాగ్ ని ఆధునీకరించి యమదొంగ చిత్ర నేపధ్యానికి తగ్గట్లు మార్చి చెప్పారు. జూనియర్ డైలాగ్ చెప్పిన విధానం తాతను మైమరిపించింది. త్రివిక్రమ్ ఇంతవరకు పౌరాణిక చిత్రం చేయనప్పటికీ ఆయనకు పురాణాల మీద మంచి పట్టుంది. ఈ తరంలో పౌరాణిక పాత్రలు చేసి మెప్పించగల అతి కొద్దిమంది నటుల్లో ఎన్టీఆర్ ఒకరు. అలాంటిది ఎన్టీఆర్-త్రివిక్రమ్ కలిసి మైథలాజికల్ ఫిల్మ్ చేస్తే అంచనాలు ఆకాశాన్నంటు తాయ‌న‌డంలో ఏమాత్రం సందేహం లేదు. ప్రస్తుతం ఎన్టీఆర్, త్రివిక్రమ్ కమిట్మెంట్స్ పూర్తయ్యాక ఈ ప్రాజెక్ట్ ప్రారంభంకానుందని, కొద్ది రోజుల్లోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని నాగవంశీ చెప్పుకొచ్చారు.

టాలీవుడ్‌లో పౌరాణిక చిత్రాలు వ‌చ్చి చాలా కాల‌మే అవుతుంది. మ‌ళ్లీ త్రివిక్ర‌మ్‌, ఎన్టీఆర్ క‌లిసి ఆ జోన‌ర్‌లో సినిమా చేయ‌బోతున్నారు. వీరిద్ద‌రికీ ఈ జోన‌ర్‌లో సినిమా చేయ‌టం ఫ‌స్ట్ టైమే అయిన మ‌న పౌరాణికాల‌తో సినిమా అంటే పెద్ద హిట్ కోట్టచ్చు. దీనికి ఉదాహరణగా రాజమౌళి చేసిన యమదొంగ చిత్రం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఇండస్ట్రీలో పౌరాణిక సినిమాలు చేయడం చాలా కష్టం. ఎందుకంటే పౌరాణిక చిత్రాలు చేస్తే ఎక్కువ‌ టైమ్‌, బ‌డ్జెట్ కేటాయించాల్సి వ‌స్తుంది. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఇటు మేక‌ర్స్‌, అటు యాక్ట‌ర్స్ అందుకు సుముఖంగా లేరు. అందుక‌నే పౌరాణిక చిత్రాలు రావ‌టం లేదు. మ‌రి త్రివిక్ర‌మ్ ఏ కాన్సెప్ట్‌ను ఎంచుకుని చేస్తారో చూడాలి మ‌రి. ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా రూపొంద‌నుంది. మార్చి నెల‌లో షూటింగ్ స్టార్ట్ కానుంది. ఇక త్రివిక్ర‌మ్ విషయానికి వ‌స్తే.. ఆయ‌న మ‌హేష్ బాబుతో సినిమా చేస్తున్నారు.

Must Read

spot_img