ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో మల్టీస్టారర్ మూవీస్ ట్రెండ్ నడుస్తోంది. ఒక స్టార్ హీరో.. మరో కథానాయకుడితో నటించడానికి సై అంటున్నారు. సెన్సిబుల్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్ మల్టీస్టారర్ మూవీ చేయడానికి రేడీ అయ్యారు. ‘ఘర్షణ’, ‘ఏ మాయ చేసావె’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు.చివరగా శింబు హీరోగా నటించిన ‘వెందు తానిదందు కాడు’కు దర్శకత్వం వహించారు.
ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. భారీ స్థాయి వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం తెలుగులో ‘లైఫ్ ఆఫ్ ముత్తు’ టైటిల్‌తో రిలీజ్ అయింది. గౌతమ్ త్వరలోనే భారీ స్థాయి యాక్షన్ డ్రామాను తెరకెక్కించనున్నారట. ఈ మూవీ మల్టీ స్టారర్‌గా రూపొందనుందని కోలీవుడ్ మీడియా తెలుపుతోంది.
ఈ యాక్షన్ డ్రామా లార్జర్ దేన్ లైఫ్ పాత్రలతో రూపొందనుందని వదంతులు షికార్లు కొడుతున్నాయి. ఈ పాత్రల కోసం గౌతమ్ కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి , బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ తో చర్చలు జరిపారట. ఇద్దరికి స్క్రిఫ్ట్ నచ్చిందని తెలుస్తోంది. కానీ, కాంట్రాక్ట్‌పై మాత్రం సంతకం చేయలేదని రూమర్స్ హల్‌చల్ చేస్తున్నాయి. ఈ సినిమా కోసం గౌతమ్ ఓ కొత్త ప్రపంచాన్ని రూపొందించనున్నారని సమాచారం అందుతుంది.
గౌతమ్ మీనన్ ఒకవైపు దర్శకత్వం వహిస్తూనే పలు సినిమాల్లో నటిస్తున్నారు. చివరగా ‘మైఖేల్’ లో కనిపించారు. ప్రస్తుతం ‘లియో’ షూటింగ్ లో పాల్గొంటున్నారు. వెట్రిమారన్ దర్శకత్వం వహిస్తున్న ‘విధుతలై’ లో విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆసక్తికరమైన విషయమేమిటంటే ఈ మూవీలో గౌతమ్ కూడా కనిపించనున్నారు.