సీతారామం సినిమా క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. ఎలాంటి ఎక్స్పెట్రేషన్స్ లేకుండా వచ్చిన ఈ సినిమా ఇప్పుడు 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసి సంచనలం సృష్టించింది. ఈ సినిమాతో దర్శకుడు హను రాఘవపూడి ఒక్కసారిగా హాట్ టాపిక్ అయ్యారు. భారీ హైప్ క్రియేట్ కావడంతో టాలీవుడ్ హీరోలు అతనితో నెక్స్ట్ సినిమా చేయడానికి ఆసక్తిగానే ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే హీరోలు అందరూ కూడా ఇప్పటికే పాన్ ఇండియా రేంజ్ లో ఒకరు లేదా ఇద్దరు దర్శకులతో ప్రాజెక్ట్స్ ఫైనల్ చేసుకొని ఉన్నారు.
హను రాఘవపూడి నెక్స్ట్ సినిమా కోసం ఇప్పటికే ఓ పీరియాడిక్ లవ్ స్టొరీని సిద్ధం చేసుకున్నాడు . అయితే ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ని ఎవరితో స్టార్ట్ చేయాలనే విషయంలో మాత్రం తెలుగు హీరోలని చూస్తున్నాడు. అతనికి ఫస్ట్ ఛాయస్ గా నేచురల్ స్టార్ నాని దొరికినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే హను నానితో క్రిష్ణగాడి వీరప్రేమకథ అనే సినిమాని చేసి సూపర్ హిట్ కొట్టాడు. డిఫరెంట్ స్టైల్ లో ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఆ సినిమా లవ్ స్టొరీ ఎంటర్టైన్మెంట్ అందరికి భాగా కనెక్ట్ అయ్యింది. ఈ నేపధ్యంలో మళ్ళీ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం నానిని హను కలిసినట్లు తెలుస్తుంది.
ఇక నాని దసరా మూవీ తర్వాత శౌర్యువ్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఈ నేపధ్యంలో హను స్టైల్ లో ఇంటరెస్టింగ్ స్టొరీ చేయడానికి నాని కూడా సిద్ధంగా ఉన్నాడనే టాక్ వినిపిస్తుంది. అయితే నాని షెడ్యూల్ కాల్ షీట్స్ బట్టి వీరిద్దరి కాంబినేషన్ సెట్స్ పైకి వెళ్ళేది లేనిది డిసైడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ఫిల్మ్ నగర్ సర్కిల్ లో వినిపిస్తుంది. మరి వీరిద్దరూ కాంబినేషన్ సెట్ అయితే మాత్రం కచ్చితంగా సీతారామం లాంటి క్లాసిక్ కాకపోయిన నాని స్టైల్ లవ్ అండ్ ఎంటర్టైనర్ ని కచ్చితంగా చూసే ఛాన్స్ ప్రేక్షకులకి దొరుకుతుందని టాలీవుడ్ లో వినిపిస్తున్న మాట.
Create an account
Welcome! Register for an account
A password will be e-mailed to you.
Password recovery
Recover your password
A password will be e-mailed to you.