HomePoliticsసీబీఐ మాజీ జేడీలక్ష్మీనారాయణ ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో.!

సీబీఐ మాజీ జేడీలక్ష్మీనారాయణ ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో.!

సీబీఐ మాజీ జేడీ .. ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుతున్నారన్న వార్త రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆయనకు వచ్చే ఓట్లు .. ఎవరికి మేలు
చేకూర్చనున్నాయన్నదే హాట్ టాపిక్ అవుతోంది.

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సస్పెన్స్ కు తెర దించారు. వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచే పోటీ చేస్తానని గతంలోనే మాజీ జేడీ లక్ష్మీనారాయణ క్లారిటీ ఇచ్చారు. ఏ పార్టీ నుంచి పోటీలో ఉంటారనేదే ఇప్పటి వరకు తేల్చని విషయం తెలిసిందే. 2019 ఎన్నికల్లో జనసేన నుంచి విశాఖ ఎంపీగా లక్ష్మీనారాయణ బరిలో నిలిచారు. ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి సత్యనారాయణ విశాఖ ఎంపీగా గెలుపొందారు.

ఇప్పుడు విశాఖ కేంద్రంగా ఏపీ రాజకీయం కొనసాగుతున్న వేళ లక్ష్మీనారాయణ తిరిగి విశాఖ నుంచి బరిలో నిలబడాలని డిసైడ్ అయ్యారు. మాజీ జేడీ లక్ష్మీనారాయణ 2019 ఎన్నికల్లో ఓడినా..విశాఖను వీడలేదు. అప్పటి నుంచి తిరిగి విశాఖలోనే పోటీ చేసి తిరిగి గెలవాలనేది ఆయన లక్ష్యంగా కనిపిస్తోంది. జేడీ ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ఎక్కువగా విశాఖ కేంద్రంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు మద్దతుగా ప్లాంట్ ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ హైకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్నారు. ఇప్పటికే లక్ష్మీనారాయణ దాఖలు చేసిన పిటీషన్ పైన న్యాయస్థానం కేంద్రానికి నోటీసులు ఇచ్చింది. అదే సమయంలో ఏపీలో కొత్త పార్టీలు ఎంట్రీ ఇస్తున్న వేళ .. జేడీ అందులో కీలక బాధ్యతలు చేపడతారనే ప్రచారం సాగుతోంది. వీటికి ముగింపు ఇచ్చేలా మాజీ జేడీ సన్నిహితులు వెల్లడించారు.

విశాఖ నుంచి పోటీ చేయటం ఖాయం చేసిన మాజీ జేడీ.. ఏ పార్టీ నుంచి పోటీ చేయటం లేదనేది స్పష్టం అవుతోంది. లక్ష్మీనారాయణ తొలి నుంచి భావజాలానికి అనుకూలంగా ఉండే పార్టీలో చేరుతానని చెప్పుకొచ్చారు. జనసేన నుంచి బయటకు వచ్చేయటంతో, ఇప్పుడు టీడీపీలో చేరుతారనే ప్రచారం సాగింది. బీజేపీ వైపు చూసినా.. కేంద్ర నిర్ణయాల పైన ఆయన పోరాడుతుండటంతో సాధ్యపడదనేది స్పష్టం అయింది.

వచ్చే సార్వత్రిక ఎన్నికలలో విశాఖపట్నం లోక్ సభ సభ్యునిగా అది కూడా ఇండిపెండెంట్ గా పోటీ చేయనున్నట్లు తెలిపారు. అయితే, ఈ ప్రకటన లక్ష్మీనారాయణ అధికారికంగా కాకుండా ఆయన నిర్వహిస్తున్న స్వచ్చంద సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. లక్ష్మీనారాయణ స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేయాలనేది ఫైనల్ నిర్ణయంగా ఉంటుందా .. లేక, పార్టీలు ఏవైనా ముందుకొస్తే నిర్ణయంలో మార్పు ఉంటుందా అనేది మరో చర్చగా వినిపిస్తోంది.

ఇండిపెండెంట్ అభ్యర్ధిగా లక్ష్మీనారాయణ బరిలోకి దిగితే హోరా హోరీగా మారుతున్న ఏపీ ఎన్నికలు, అందునా విశాఖ కావటంతో ఆయన పోటీ ఎవరికి కలిసి వస్తుందనేది ఆసక్తి కరంగా మారింది. జేడీకి పోలయ్యే ఓట్లు ఏ పార్టీకి నష్టం చేస్తాయనేది కూడా చర్చనీయాంశంగా మారింది. గత ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేసిన లక్ష్మీనారాయణకు 2.88 లక్షల ఓట్లు వచ్చాయి.

ఇప్పుడు ఈ ప్రకటన రావటంతో జేడీ కేంద్రంగా విశాఖ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకొనే అవకాశం కనిపిస్తోంది. ఏపీలో ఎన్నికలు జరిగేది 2024 లో. కానీ అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలతో పాటు, ఇతర పార్టీల్లో కూడా ఎన్నికల మూడ్ కనబడుతోంది. ఇక టీడీపీ సంగతి చెప్పక్కరలేదు. పార్టీ అధినేత రాష్ట్రమంతా చుట్టబెడుతున్నారు. పొరుగు రాష్ట్రమైన తెలంగాణలోని ఖమ్మంలో కూడా ఈ మధ్య భారీ బహిరంగ సభ నిర్వహించారు.

తెలంగాణలోనూ పార్టీకి పునర్వైభవం తేవాలని ప్రయత్నాలు చేస్తున్నారట. జనసేనాని పవన్ కళ్యాణ్ ఆయన పాట్లు ఆయన పడుతున్నారు. బీజేపీలో ఎలాంటి హడావిడి లేదు. జనసేన తాము కలిసి పోటీ చేస్తామంటున్నారు. కానీ ఆ రెండు పార్టీలు ఏం చేస్తున్నాయో తెలియడంలేదు. ఇన్ని పార్టీల మధ్య, ఇంతమంది నాయకుల మధ్య ఓ మాజీ పోలీసు ఉన్నతాధికారి వార్తల్లో వ్యక్తిగా మారారు.

ఏపీకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం కాక ముందు.. ఆయన అక్రమాస్తుల కేసు విచారణ సమయంలో సీబీఐ జేడీగా ఉన్న లక్ష్మీనారాయణ చాలా ఫేమస్
అయ్యారు. ఆ కేసు విషయంలో ఇతర పార్టీల నాయకులకు లీకులు ఇస్తూ.. చాలా బాధ్యతారహితంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. జగన్ కేసు ద్వారానే సామాన్యులకు కూడా తెలిసిన లక్ష్మీనారాయణ.. ఆ పాపులారిటీని ఉపయోగించుకొని రాజకీయాల్లో చక్రం తిప్పుదామని డిసైడ్ అయ్యారు.

వెంటనే చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి ప్రవేశించారు. లక్ష్మీనారాయణ రాజకీయ రంగ ప్రవేశం జనసేన ద్వారా జరిగింది. మొదట టీడీపీకి వెళ్తారని భావించినా.. పవన్ కల్యాణ్‌తో నడవాలని డిసైడ్ చేసుకున్నారు. 2019 ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా విశాఖపట్నం ఎంపీగా పోటీ చేశారు. వైసీపీ గాలి బలంగా వీచిన ఆ ఎన్నికల్లో జేడీ మూడో స్థానానికి పరిమితం అయ్యారు. టీడీపీ నుంచి పోటీ చేసిన భరత్ కు 4,32,492 ఓట్లు పోలయ్యాయి.

వైసీపీ నుంచి పోటీ చేసిన ఎంవీవీ సత్యనారాయణ 4,36,906 ఓట్లతో విజయం సాధించారు. ఇక వీవీ లక్ష్మీనారాయణ 2,88,874 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత జనసేన పార్టీకి కూడా రాజీనామా చేసి సైలెంట్ అయ్యారు. ఇప్పుడు విశాఖ కేంద్రంగానే లక్ష్మీనారాయణ పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. విశాఖ చుట్టు పక్కల కొన్ని స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు.

రాబోయే ఎన్నికల్లో మరోసారి విశాఖ నుంచే పోటీ చెయ్యాలి..!

అయితే రాబోయే ఎన్నికల్లో మరోసారి విశాఖ నుంచే పోటీ చేయాలని భావిస్తున్నారు. కానీ ఏ పార్టీలో చేరడానికి ఆయనకు అవకాశం లేకుండా పోయింది. వైసీపీలోకి వచ్చే ఛాన్సే లేదు. ఇక జనసేన నుంచి బయటకు వెళ్లే ముందు పవన్ కల్యాణ్‌కు వ్యతిరేకంగా కామెంట్లు చేశారు. టీడీపీలోకి జంప్ అయినా విశాఖ టికెట్ దక్కదు. ఇక బీజేపీమాత్రమే ఒక అవకాశంగా కనపడుతోంది. కానీ, ఏపీలో బీజేపీకి పెద్దగా బలం లేదు.

పైగా, జీవీఎల్ నరసింహారావు బీజేపీ తరపున విశాఖ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో వీవీ లక్ష్మీనారాయణ ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రధాన పార్టీల నుంచి పోటీ చేయడం కంటే స్వతంత్రంగా పోటీ చేస్తేనే తనకు విలువ ఉంటుందని వీవీ భావించినట్లు సన్నిహితులు చెబుతున్నారు. ఏపీలో ప్రధాన పార్టీల మధ్య తీవ్రమైన పోటీ నెలకొన్న ఈ పరిస్థితుల్లో.. వారందరినీ మించి ప్రచారం చేసి, గెలవగలరా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు లక్ష్మీనారాయణ ఏ పార్టీలో చేరకపోవడమే మంచిదని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.

సిద్ధాంతాలు.. రాద్ధాంతాలు.. అంటూ.. ఆయ‌న ప్ర‌సంగిస్తూ ఉంటారు. తెలుగువారైన ఆయ‌న ఐపీఎస్ ఉద్యోగానికి రిజైన్ చేసి మ‌రీ 2019 ఎన్నిక‌ల‌కు ముందు రాజకీయాల్లోకి వ‌చ్చారు. గ‌తంలో ప్ర‌స్తుత సీఎం జ‌గ‌న్ కేసుల‌ను విచారించి.. పేరు తెచ్చుకున్నారు. సీఎం జ‌గ‌న్ అరెస్టుతో ఈయ‌న పేరు దేశ‌వ్యాప్తంగా మార్మోగింది. ఈ క్ర‌మంలో విశాఖ ఎంపీగా వివీ పోటీ చేయ‌డంతో మ‌రింత అంచ‌నాలు పెరిగిపోయాయి. ఈయ‌న గెలుపు ఖాయ‌మ‌నే చ‌ర్చ‌కూడా జ‌రిగింది.

పార్టీ త‌ర‌ఫున కాకుండా.. ఆయ‌న వ్య‌క్తిగ‌తంగా ఇమేజ్ పెంచుకోవ‌డం.. త‌ర్వాత కాలంలో ప‌వ‌న్ మాట త‌ప్పారంటూ..అంటే.. కేవ‌లం రాజ‌కీయాల‌కే ప‌రిమితం కాకుండా సినిమాల్లోకి వెళ్ల‌డంతో ఆయ‌న పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చారు. ఇక‌, అప్ప‌టి నుంచి వైసీపీ వైపు చూస్తున్నార‌నే వ్యాఖ్య‌లు వినిపించాయి. కానీ, ఏం జ‌రిగిందో ఏమో.. ఆయ‌న మౌనంగా ఉన్నారు.

ఇక‌, ఇప్పుడు తాను స్వ‌తంత్రంగానే పోటీ చేస్తాన‌ని చెబుతున్నారు. అయితే.. దీనిపై విశాఖ రాజ‌కీయ వ‌ర్గాలు ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌ తెర‌మీద‌కి తెస్తున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌లు కీల‌కం కావ‌డంతో ఆయ‌న‌ను వైసీపీ తెర‌చాటు నుంచి న‌డిపిస్తోంద‌ని అంటున్నారు. ఓట్లు చీల్చ‌డం ద్వారా వైసీపీకి మేలు జ‌రిగేలా ఆయ‌న‌ను స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా రంగంలోకి దింపాల‌నేది వైసీపీ నేత‌లు వ్యూహాత్మ‌కంగా చేస్తున్న చ‌ర్చ‌లేన‌ని చాలా మంది చెబుతున్నారు.

లేక‌పోతే.. ఆయ‌న తిరిగి జ‌న‌సేన‌లోకి వ‌చ్చినా.. టీడీపీలోకి వ‌చ్చినా.. అదే సీటును కేటాయించేందుకు రెండు పార్టీలు రెడీ అవుతున్నాయి. వీరిని కాద‌ని.. స్వ‌తంత్రంగా పోటీ చేయ‌డం వెనుక వైసీపీ ఉంద‌ని పెద్ద ఎత్తున కామెంట్లు వినిపిస్తున్నాయి.

Must Read

spot_img