Homeఅంతర్జాతీయంఉక్రెయిన్, రష్యా యుద్ధం భారత్ కు ఏ మేరకు కలిసొచ్చింది..?

ఉక్రెయిన్, రష్యా యుద్ధం భారత్ కు ఏ మేరకు కలిసొచ్చింది..?

ఉక్రెయిన్, రష్యాల యుద్దం భారత్ కు ఏ మేరకు కలిసొచ్చిందనే విషయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.. రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్న భారత్.. ఇటీవల కాలంలో దిగుమతులలో సరికొత్త రికార్డ్ నెలకొల్పింది.. అయితే.. భారత్ ఇంత చేసింది కేవలం బ్యారెల్ కు 2 డాలర్లు మాత్రమేనా..?

ఉక్రెయిన్, రష్యా యుద్దం మొదలైనప్పటి నుంచి రికార్డ్ స్థాయిలో చమురు దిగుమతి చేసుకుంటోంది భారత్.. మిత్రదేశమైన భారత్ కు డిస్కౌంట్ ఇస్తుండటంతో.. భారత్ అధిక మొత్తంలో చమురు దిగుమతి చేసుకుంటోంది.. భారత్ కు చమురు దిగుమతిదారుల్లో రష్యాదే అగ్రస్థానం..

ఉక్రెయిన్ పై రష్యా యుద్దం చేస్తుండటాన్ని భారత్ తనకు సానుకూలంగా మలుచుకుంది. ర్యష్యా నుంచి భారీ సబ్సిడీతో ముడి చమురును దిగుమతి చేసుకోవడం ప్రారంభించింది. సబ్సిడైజ్డ్ క్రూడ్కోసం అమెరికాను సైతం ఎదిరించింది. ఐక్యరాజ్యసమితి ఓటింగ్స్లోనూ, రష్యాకు వ్యతిరేకంగా ఓటేయకుండా ఓటింగ్ కు దూరంగా ఉంది.

రాయితీ మీద రష్యా అందిస్తున్న ముడి చమురు కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి మూడు త్రైమాసికాల్లో సుమారు $2.5 బిలియన్లను ఆదా చేసే అవకాశం ఉందని ఇండియా ట్రేడ్ డేటా చూపిస్తోంది.

రష్యా వల్ల భారతదేశ పొదుపు భారీగా కనిపిస్తున్నా, ఈ లెక్కని ఇంకా విడగొట్టి నిశితంగా పరిశీలిస్తే, ఊహించిన దాని కంటే చాలా తక్కువ లబ్ధి పొందినట్లు అర్ధం అవుతుంది.

ప్రపంచంలో మూడో అతి పెద్ద ముడి చమురు వినియోగదారు భారతదేశం. 2022 ఏప్రిల్ 1 నుంచి డిసెంబర్ 31 కాలంలో, అన్ని దేశాల నుంచి భారత్ దిగుమతి చేసుకున్న ముడి చమురు సగటు ధర బ్యారెల్ కు 99.2 డాలర్లుగా తేలింది. రష్యా పంపిన క్రూడ్ ను ఈ లెక్కల్లోంచి తీసేస్తే, సగటున ఒక్కో బారెల్ ధర 101.2 డాలర్లుగా ఉంది. రష్యన్ చౌక చమురు దిగుమతి వల్ల భారత్ కు సగటున మిగిలింది ఒక్కో బ్యారెల్ కు 2 డాలర్లు మాత్రమే.

2022 చివరి 9 నెలల కాలంలో భారతదేశ చమురు దిగుమతుల మొత్తం విలువ 126.51 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇతర దేశాల ముడి చమురుకు చెల్లించే సగటు ధరను, ఇండియన్ రిఫైనర్లు రష్యన్ చమురు కోసం చెల్లించినట్లయితే, చమురు దిగుమతి బిల్లు సుమారు 129 బిలియన్ డాలర్లుగా లేదా 2 శాతం ఎక్కువగా ఉండేదని విశ్లేషణ చెబుతోంది.

ఇదే కాలంలో రష్యా నుంచి చమురు దిగుమతుల విలువ సుమారు 22 బిలియన్ డాలర్లు.

2022 ఏప్రిల్-డిసెంబర్లో భారతదేశానికి రష్యా పంపిన ముడి చమురు సగటు ధర బ్యారెల్కు 90.9 డాలర్లుగా ఉంది. రష్యాయేతర దేశాల లెక్కలతో పోలిస్తే బ్యారెల్ ధర దాదాపు 10.3 డాలర్లు తక్కువ. ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్న ముడి చమురు సగటు ధరపై 10.1% డిస్కౌంట్కు ఇది సమానం. ఈ లెక్క కూడా బాగానే కనిపిస్తున్నా, వివిధ నివేదికల్లో రాసుకొచ్చిన డిస్కౌంట్ల కంటే ఇది చాలా తక్కువ.

రష్యా ముడి చమురు వాటా 19% … 2022 ఏప్రిల్-డిసెంబర్ నెలల్లో భారతదేశం చమురు దిగుమతుల్లో రష్యా ముడి చమురు వాటా 19 శాతం. ఈ కాలంలో చేసుకున్న దిగుమతుల్లో ఇది 173.93 మిలియన్ టన్నులు లేదా 1.27 బిలియన్ బ్యారెళ్లకు సమానం.

సంవత్సరం క్రితం, ఉక్రెయిన్-రష్యా యుద్ధం ప్రారంభం కావడానికి ముందు, భారతదేశానికి చమురు సరఫరా చేసే దేశాల్లో రష్యాది నామమాత్రపు వాటా. ఇప్పుడు, సౌదీ అరేబియా & యునైటెడ్అ రబ్ ఎమిరేట్స్ వంటి దిగ్గజాలను వెనక్కు నెట్టేసి ముందుకు వచ్చింది. భారతదేశానికి రెండో అతి పెద్ద ముడి చమురు సరఫరాదారుగా ఇరాక్ తర్వాత రెండో స్థానంలో నిలిచింది. 2022 సెప్టెంబర్-డిసెంబర్కా లం వరకే చూస్తే, భారతదేశానికి చమురు సరఫరాదార్లలో రష్యాదే టాప్ ప్లేస్. భారత ప్రభుత్వం కమొడిటీస్ వారీగా & దేశాల వారీగా ట్రేడింగ్ డేటాను ఆలస్యంగా విడుదల చేస్తుంది. ఇప్పుడు మనం చెప్పుకున్న డేటా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలలకు వర్తిస్తుంది. జనవరి వరకు ఉండే డేటా మార్చిలో విడుదల అవుతుంది.

అయితే.. ఈ లెక్కలు ఏమీ తెలియని యూరప్ దేశాలు, అమెరికాలు రష్యా నుంచి అతి చౌకగా క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటుందంటూ భారత్ పై విషం చిమ్మే ప్రయత్నం చేశాయి.. ఉక్రెయిన్ పై రష్యా దాడి విషయంలో తటస్థంగా ఉండటం భారత్ కు కలిసొచ్చిందనే చెప్పాలి.. కానీ.. అమెరికా ఊహించినంత మాత్రం కాదు.. అయితే.. గత కొన్ని నెలలుగా రష్యా నుంచి దిగుమతి చేసుకునే చమురు పెరుగుతూనే ఉంది. మరోవైపు.. రష్యాపై అమెరికా సహా నాటో దేశాల ఆంక్షలతో చమురు నిల్వలు పేరుకుపోయి.. ఆర్థికంగా నష్టాలపాలయ్యే అవకాశం ఏర్పడే సమయంలో రష్యా.. తన మిత్ర దేశమైన భారత్ కు చమురు డిస్కౌంట్ తో విక్రయిస్తోంది.. దీంతో రష్యాకు కూడా లాభమే జరుగుతోంది.. మరోవైపు.. బహిరంగ మార్కెట్లో లభించే చమురు ధరకంటే తక్కువ ధరకు లభించడం వల్ల భారత్ కు మేలు జరుగుతోంది..
అయితే.. ఆ డిస్కౌంట్ ను బహిరంగ మార్కెట్ రేటుకు కంపేర్ చేస్తే.. లాభం మరి ఎక్కువ స్థాయిలో ఉండటం లేదు..

ఏదేమైనా.. భారత్ కు చమురు బహిరంగ మార్కెట్లో కంటే తక్కువ ధరకే లభిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.. అందుకే రష్యా నుంచి దిగుమతి చేసుకునే క్రూడ్ ఆయిల్ ప్రతినెలా పెంచుతూపోతోంది భారత్.. రష్యాపై ఆంక్షలు విధించి.. రష్యాను బలహీన పరచాలని ప్రయత్నించిన యూరప్ దేశాలకు సరిపడా చమురు లభించక ఇబ్బందుల పాలవుతున్నాయి.. మరోవైపు.. రష్యా నుంచి భారత్
కొనుగోలు చేసిన చమురునే అధిక ధరకు కొనుగోలు చేస్తున్నాయి.. రష్ాన్ చౌక చమురు వల్ల భారత్ కు సగటున మిగలింది ఒక్కో బ్యారెల్ కు 2 డాలర్లు మాత్రమే.. అయినప్పటికీ.. దిగుమతులు పెరగడంతో… లాభశాతం కూడా మరింతగా పెరగనుంది.. ఉక్రెయిన్ పై రష్యా యుద్దం విషయంలో భారత తటస్థ వైఖరి.. ప్రత్యక్షంగా భారత్ కు, పరోక్షంగా రష్యాకు కలిసివచ్చిందనేది విశ్లేషకుల అభిప్రాయం..

ఉక్రెయిన్-రష్యా యుద్ధం ప్రారంభం కావడానికి ముందు, భారతదేశానికి చమురు సరఫరా చేసే దేశాల్లో రష్యాది నామమాత్రపు వాటా. ఇప్పుడు, సౌదీ అరేబియా & యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దిగ్గజాలను వెనక్కు నెట్టేసి ముందుకు వచ్చింది రష్యా..

Must Read

spot_img