రానున్న కొద్ది కాలంలోనే మనుషుల వయసు పెరగడాన్ని ఆలస్యం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. యాంటీ ఏజింగ్ కు సంబంధించిన ప్రయోగాలలో మంచి పురోగతి కనిపించిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ఫలితాలతో రానున్న కాలంలో వ్రుద్దులకు సంబంధించిన అనేేక సమస్యలను నయం చేసి వారి వయసుకు చెక్ పెట్టొచ్చని చెబుతున్నారు.
వృద్ధాప్యానికి చెక్ పెట్టే సమయం ఆసన్నమైంది..తాజా పరిశోధన ఫలితాలతో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. వృద్ధాప్యం. మనిషి పరిణామ క్రమంలో అనివార్యమైన దశ. చాలామందికి నరకప్రాయం, బాధాకరం అయిన దశగా ఉంటుంది. ఒంట్లో అవయవాలన్నీ ఒక్కొక్కటిగా శిథిలమవుతూ పట్టు తప్పి క్రమంగా పనికి రాకుండా పోతుంటే, అన్నింటికీ ఇతరులపై ఆధారపడాల్సి వస్తుంది.
నిస్సహాయత కుంగదీస్తుంటే, నీడలా వెంట తిరుగుతూ దోబూచులాడే మృత్యువు ఎప్పటికి కరుణిస్తుందా అని ఎదురు చూస్తూ దుర్భరంగా గడుస్తుంటుంది. అలాంటి వృద్ధాప్యాన్ని వీలైనంత వరకూ వాయిదా వేయగలిగే దిశగా ఇప్పటికే పరిశోధనలు మహా జోరుగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఆ విషయంలో మంచి పురోగతి కనిపిస్తోందని అంటున్నారు శాస్త్రవేత్తలు.

జగానికి వెలుగులు పంచే సూర్యుడి సౌరశక్తి సాయంతో వయసు పెరుగుదలను బాగా నెమ్మదింపజేయవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. అటువంటి అధ్యయనమొకటి చాలా కాలంగా సాగుతోంది. అయితే ఎండలో నిలబడితే ఏమొస్తుందంటే ఎవరైనా విటమిన్ డి అనేస్తారు. అయితే ఇకపై ఎండలో నిలబడటం ద్వారా ముసలితనానికి టాటా చెప్పేయొచ్చని, వయసు పెరుగుదలను బాగా తగ్గించుకోవచ్చని అంటోంది తాజా అధ్యయనం. ”సౌరశక్తిని మానవ కణాలు నేరుగా వాడుకునేందుకు అవసరమైన రసాయన శక్తిగా మార్చడం ద్వారా వాటిని ఎక్కువ కాలం పాటు జీవించేలా చేయవచ్చు.
ఈ విషయం ఆయుర్వేదంలో కూడా ఉంది. కణాల్లోని కీలకమైన మైటోకాండ్రియాలో నిర్దిష్టమైన జన్యుమార్పులు చేయడం ద్వారా దీన్ని సాధించవచ్చు.
ఇప్పటికిప్పుడే కాకపోయినా సమీప భవిష్యత్తులో ఇది సాధ్యమై తీరుతుంది” అంటూ సదరు ఆధ్యయనం కుండబద్దలు కొడుతుండటం ఆసక్తికరంగా మారింది. వృద్ధాప్యానికి దారి తీసే అంశాల్లో మనిషి కణజాలంలోని కీలకమైన మైటోకాండ్రియా పనితీరు మందగించడమే ప్రధాన కారణం. కాకపోతే ఎటువంటి జీవక్రియలు ఇందుకు కారణమవుతాయన్నది మనకింకా తెలియదు.
ఈ సంక్లిష్ట ప్రక్రియను అర్థం చేసుకోవడానికి ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. ”సౌరశక్తిని రసాయన శక్తిగా మార్చి నిర్దిష్ట పద్ధతిపై శోధిస్తున్నారు. కణ కేంద్రకంలోని ప్రోటాన్లను శక్తిమంతం చేస్తే మైటోకాండ్రియాలోని జీవన పరిమాణం పెరుగుతుంది. అలా పెంచేందుకు తోడ్పడే సమలక్షణాలు సమృద్ధిగా పెరుగుతాయి.
యుక్త వయసులో ఇలా కణజాలంలోని మైటోకాండ్రియా సామర్థ్యాన్ని పెంచడం ద్వారా వయసు పెరుగుదలను బాగా నెమ్మదింపజేయొచ్చు. వయో సంబంధిత వ్యాధులకు మరింత మెరుగైన చికిత్స కూడా అందజేయడం వీలు పడుతుంది” అని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్‌లోని రోచెస్టర్ మెడికల్ సెంటర్‌కు చెందిన పరిశోధకులు చెబుతున్నారు. అయితే మౌలిక జీవపరమైన సూత్రాలను అవగాహన చేసుకోవడానికి చాలా కాలంగా శాస్త్రవేత్తలు పరిశోధనలు జరుపుతున్నారు.
ఒకరకం నట్టలను ఈ అధ్యయనానికి ఎంచుకున్నారు. వాటి కణజాలంలోని మైటోకాండ్రియాలో జన్యుపరంగా మార్పులు చేర్పులు చేశారు. అనంతరం సౌరశక్తి సాయంతో దాన్ని పరిపుష్టం చేశారు. ఆపై వాటిని పరిశీలించారు.
సూర్యరశ్మిని గ్రహించడం ద్వారా మైటోకాండ్రియా పైపొరలోని అయాన్లన్నీ మరింత శక్తిమంతంగా మారింది. దాని సామర్థ్యంతో పాటు తాజాదనం స్థాయి కూడా బాగా పెరిగింది. మైటోకాండ్రియా-ఓఎన్‌గా పిలుస్తున్న ఈ ప్రక్రియ ద్వారా మెటబాలిజం రేటులో వృద్ధి జరిగి సదరు నట్టలు మరింత ఆరోగ్యకరంగా మారాయి. పైగా వాటి జీవితకాలం కూడా 30 నుంచి 40 శాతం దాకా పెరగడం గమనించారు.
దీనిని బట్టి ”మా పరిశో ధనలు విజయవంతమయ్యాయి. వాటిని ఇంకాస్త ముందుకు తీసుకెళ్తే వయోవ్రుద్దులలోనూ సంబంధమైన వ్యాధులను మరింత మెరుగ్గా నయం చేయడం సాధ్యపడుతుందని అంటున్నారు. వారిని ఆరోగ్యకపరంగా, నిదానంగా వృద్ధాప్యం వైపు సాగేలా చూసే మార్గం చిక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.