Homeజాతీయంఈ దఫా కేంద్ర బడ్జెట్ .. దేశీ తయారీ రంగంపై వరాలు కురిపించనుందా..?

ఈ దఫా కేంద్ర బడ్జెట్ .. దేశీ తయారీ రంగంపై వరాలు కురిపించనుందా..?

ఉపాధి అవకాశాల్ని పెంచేలా .. పీఎల్ఐ పథకాన్ని విస్తరింపజేయనుందా..? దీంతో మరిన్ని రంగాలకు ప్రోత్సాహం అందనుందా..?

ఎన్నికల వేళ బడ్జెట్ కసరత్తు.. ఉపాధి ఆధారాలను పెంచే దిశగా ఉండనుందన్న వాదనలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా పీఎల్ఐ పథకాన్ని
విస్తరించే వ్యూహంలో కేంద్రం ఉందన్న వార్తలు .. పారిశ్రామిక వర్గాల్లో ఆనందాన్ని తెస్తున్నాయి.

ఫిబ్రవరి 1, 2023 న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2023-24 కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. దేశంలో అధిక ఉపాధి అవకాశాలు
కలిగిన రంగాలను కవర్ చేయడానికి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ పీఎల్ఐ పథకాన్ని విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనిలో భాగంగా రానున్న
బడ్జెట్ లో బొమ్మలు, సైకిళ్లు, తోలు, పాదరక్షల ఉత్పత్తికి ఆర్థిక ప్రోత్సాహకాలను ప్రభుత్వం పొడిగించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు
తెలిపాయి. ఆటోమొబైల్స్, ఆటో కాంపోనెంట్స్, వైట్ గూడ్స్, ఫార్మా, టెక్స్ టైల్స్, ఫుడ్ ప్రొడక్ట్స్, హై ఎఫిషియెన్సీ సోలార్ పీవీ మాడ్యూల్స్, అడ్వాన్స్
కెమిస్ట్రీ సెల్, స్పెషాలిటీ స్టీల్ సహా 14 రంగాలకు ప్రభుత్వం ఇప్పటికే సుమారు రూ. 2 లక్షల కోట్ల వ్యయంతో ఈ పథకాన్ని ప్రారంభించింది.

This time the central budget will shower bounties on the domestic manufacturing sector..?

సెప్టెంబర్ 2022 నాటికి, లార్జ్ స్కేల్ ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్ కోసం పీఎల్ఐ పథకం రూ .4,784 కోట్ల పెట్టుబడులను ఆకర్షించిందని, అలాగే
రూ. 80,769 కోట్ల ఎగుమతులతో సహా మొత్తం రూ. 2,03,952 కోట్ల ఉత్పత్తికి దారి తీసిందని ప్రభుత్వ ప్రకటన తెలిపింది.

ఎల్ఎస్ఈఎం కోసం పీఎల్ఐ పథకం ఫాక్స్కాన్, శామ్సంగ్, పెగాట్రాన్, రైజింగ్ స్టార్, విస్ట్రాన్ తో సహా ప్రముఖ అంతర్జాతీయ సంస్థలను ఆకర్షించింది.

అలాగే లావా, మైక్రోమ్యాక్స్, ఆప్టిమస్, యునైటెడ్ టెలిలింక్స్ నియోలింక్స్, ప్యాడ్జెట్ ఎలక్ట్రానిక్స్ తో సహా ప్రముఖ దేశీయ కంపెనీలు కూడా ఈ పథకంలో
పాల్గొన్నాయి. ఈ పథకం కింద మొత్తం 14 రంగాలకు ప్రైవేటు రంగం నుంచి పెద్ద ఎత్తున భాగస్వామ్యం లభించింది. గత ఏడాది డిసెంబర్ 16న
వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఇప్పటివరకు 13 పథకాల కింద 650 దరఖాస్తులను ఆమోదించామని,
బల్క్ డ్రగ్స్, మెడికల్ డివైజెస్, టెలికాం, వైట్ గూడ్స్, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి రంగాల్లో 100కు పైగా ఎంఎస్ఎంఈలు పీఎల్ఐ లబ్ధిదారులలో
ఉన్నాయని తెలిపింది.

2024 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి సవాళ్లను పరిష్కరించడానికి ప్రభుత్వం ఈ సంవత్సరం ఎక్కువ కేటాయింపులను ప్రకటించే అవకాశం ఉంది. ఎందుకంటే మౌలిక సదుపాయాలు వృద్ధికి ఇదే ముఖ్యమైన ఇంజన్. మౌలిక సదుపాయాలను పెంచడానికి మోడీ ప్రభుత్వం ఇది వరకే గతిశక్తి సహా పలు కార్యక్రమాలను అమలు చేస్తోంది. గతిశక్తి కింద రూ.7.5 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులను చేపట్టనున్నట్టు ప్రకటించింది. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ సర్వర్లు, హార్డ్‌వేర్‌ కోసం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహాకాల పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించనుంది.

అంతేకాక భారత్‌లో అభివృద్ధి చేసిన మేధో సంపత్తి హక్కులు కలిగిన టెక్నాలజీలను తమ ఉత్పత్తుల్లో వినియోగించిన వారికి తయారీదారులకు
అదనపు ప్రోత్సాహకాలను కూడా ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

Must Read

spot_img