Homeఅంతర్జాతీయంఅధికమవుతున్న నిద్ర సమస్యలు కారణం ఇదే..!

అధికమవుతున్న నిద్ర సమస్యలు కారణం ఇదే..!

నిద్ర అనేది మన శరీరానికి విశ్రాంతినిచ్చే ప్రశాంత స్థితి. కేవలం మనుషులకే కాకుండా జంతువులు..పక్షులు ఇంకా ఇలా ప్రతీ ప్రాణికి నిద్ర అనేది ఓ అవసరం. ప్రతీప్రాణి కూడా తాను బ్రతకటానికి నిద్ర పోయి తీరాల్సిందే..ముఖ్యంగా మనుషుల జీవితంలో నిద్ర ప్రాథమిక అవసరం. కానీ మొబైల్ ఫోన్ రాకతో నిద్రాభంగం తప్పడం లేదు..సరిపడా నిద్ర లేనట్టయితే ఎన్నో అనర్థాలు తప్పవు.. ఇంటర్నేషనల్ స్లీప్ డే సందర్భంగా ఈ స్టోరీ మీకోసం..

శారీరకపరంగా అత్యంత ముఖ్యమైనది నిద్ర..ఇది ప్రతీ పౌరుని ప్రాథమిక హక్కుగా ఉంటుంది. ఆరోగ్య జీవనానికి నిద్ర చాలా అవసరమైనది. ప్రపంచ నిద్ర దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం మార్చి నెల మూడవ శుక్రవారం నాడు ఈ రోజును సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతోంది. దీనిని వరల్డ్ స్లీప్ సొసైటీకి చెందిన వరల్డ్ స్లీప్ డే కమిటీ ఆధ్వర్యంలో 2008 వ సంవత్సరం నుండి నిర్వహిస్తున్నారు. ఆరోగ్యకరమైన నిద్ర వల్ల కలిగే ప్రయోజనాలను తెలుపడం, నిద్ర సమస్యల భారం అలాగే వైద్య, విద్యా, సామాజిక అంశాలపై సమాజం దృష్టిని ఆకర్షించడం, నిద్ర రుగ్మతల నివారణ గురించి అవగాహన కార్యక్రమాలు జరుపుతున్నారు. ఆరోగ్యకరమైన నిద్రను ప్రోత్సహించడం ఈ దినోత్సవ ప్రధాన లక్ష్యం.నిద్ర అనేది జీవితంలో చాలా సాధారణ అంశం.

ప్రజల జీవితంలో అత్యంత సామాన్యమైన, తక్కువగా అంచనా వేయబడిన అంశాలలో నిద్ర ఒకటి. కానీ ప్రస్తుత రోజుల్లో నిద్ర సమస్యలు ఉన్నవారు ఎక్కువవుతున్నారు. ఈరోజుల్లో తగినంత నిద్ర పొందడం అనేది నిజమైన సవాలుగా మారుతోంది. కంటి నిండా నిద్ర పోయేవారి జీవితంలో అన్నీ సక్రమంగా జరుగుతాయి. నిద్ర అన్నింటినీ ప్రభావితం చేస్తుంది. అమెరికన్ స్లీప్ అసోసియేషన్ ప్రకారం, 50 నుండి 70 మిలియన్లకు పైగా ప్రజలు పలు రకాలైన స్లీపింగ్ డిజార్డర్స్ ను కలిగి ఉన్నారని సర్వేల్లో తేలింది. 25 మిలియన్లకు పైగా జనం స్లీప్ అప్నియా కలిగి ఉన్నారు.

పిల్లలు అలసిపోయినప్పుడు సహజంగా నిద్రపోతారు, పెద్దలు కూడా అలాగే నిద్ర పోవారు. కానీ ఈ రోజుల్లో పెద్దవారికి ప్రశాంతమైన నిద్ర అందడం లేదు. మనం మన శరీరాన్ని జాగ్రత్తగా అందంగా చూసుకున్నట్లే నిద్ర పోవడంపై శ్రధ్ధ చూపించాలి. ఒక్క రాత్రి తగినంత నిద్ర లేకపోతే మరుసటి రోజు సరిగ్గా పనిచేయలేం. కాబట్టి నిద్ర చాలా ముఖ్యం. ప్రపంచ నిద్ర దినోత్సవం కేవలం నిద్ర యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచడం మాత్రమే కాదు. బదులుగా, నిద్ర సమస్యల పరిష్కారానికి చాలా ప్రాముఖ్యత ఇస్తారు.

నిద్ర సమస్యలు ఎందుకు వస్తాయి,.. తీవ్ర వ్యాధులకు నిద్ర లేమి కారణమా వంటి అంశాలపై అవగాహన కల్పిస్తారు. ప్రపంచ నిద్ర దినోత్సవాన్ని ‘ఆరోగ్యానికి నిద్ర అవసరం’ అనే ప్రత్యేక థీమ్‌తో జరుపుకుంటున్నారు. గత సంవత్సరం కొన్ని కంపెనీలు తమ ఉద్యోగుల కోసం “రైట్ టు నాప్ పాలసీ”ని ప్రకటించాయి. దీని ద్వారా ఉద్యోగులందరూ తమ పని వేళల్లో 30 నిమిషాల నిద్రపోయేలా చేసాయి. “శరీరాన్ని రీఛార్జ్ చేయడంలో, పనిపై మళ్లీ దృష్టి కేంద్రీకరించడంలో సహాయం చేయడంలో మధ్యాహ్నపు నిద్ర ఉపకరిస్తుంది. ఉత్పాదకత మెరుగుపడుతుంది.

ఈ చొరవ ద్వారా సదరు కంపెనీలు నిద్ర విప్లవాన్ని ప్రారంభించాలని భావిస్తున్నాయి. అదే సమయంలో ఇతర కంపెనీలను కూడా ఈ చొరవను అనుసరించమని ప్రోత్సహిస్తున్నాయి. మారిన జీవనశైలి కారణంగా నిద్రలేమి ఏర్పడి ఆరోగ్య సమస్యలు చిన్నాపెద్ద అందరికీ ఏర్పడుతున్నాయి. రోజుకు 8 గంటల నిద్ర సరిగా లేకపోతే అది మిగతా 16 గంటల మెలకువ సమయాన్ని దెబ్బతీస్తుంది. నిద్ర సరిగా లేకపోతే మనిషి మెదడుపై దుష్ప్రభావం పడుతుంది. బెంగళూరుకు చెందిన వేక్‌ఫిట్ సొల్యూషన్స్ అనే సంస్థ ప్రపంచ నిద్ర దినోత్సవం సందర్భంగా ఉద్యోగులకు సెలవు ప్రకటించింది. తమ ఉద్యోగులకు ఆరోగ్యకర జీవనాన్ని అలవర్చే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. ఈ విషయాన్ని లింక్డిన్ వేదికగా ప్రకటిస్తూ.. ప్రపంచ నిద్ర దినోత్సవం సందర్భంగా వేక్‌ఫిట్ ఉద్యోగులందరికీ సెలవు ఇస్తున్నాం.

Must Read

spot_img