మోహన్ లాల్ హీరోగా జీతూ జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు దృశ్యం, దృశ్యం 2. ఈ రెండు సినిమాలు మలయాళంలో భారీ విజయం సాధించాయి. ఇప్పటికే ఈ సినిమాలని తెలుగు, కన్నడ, హిందీ, తమిళ్ లో రీమేక్ చేశారు. రీమేక్ చేసిన ప్రతి భాషలో బిగ్ హిట్ గా నిలిచాయి. తాజాగా హాలీవుడ్ లో సందడి చేయడానికి రేడీ అయింది.
ఇండియన్ సినిమా ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఏ సినిమా రిలీజ్ అయిన మనం దేశంలోనే కాదు… ప్రపంచలో కూడా సత్తా చాటుతున్నారు. సీన్ కట్ చేస్తే.. ఇప్పుడు మరో మళయం సినిమా హాలీవుడ్ లో సందడి చేసేందుకు రేడీ అవుతుంది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ ,హిందీ భాషల్లో సంచలన విజయాన్ని సాధించడమే కాకుండా దేశ వ్యాప్తంగా వైరల్ గా మారింది. దీనికి సీక్వెల్ గా చేసిన దృశ్యం 2
కూడా ఇదే తరహాలో ఇతర భాషల్లోనూ రీమేక్ కావడమే కాకుండా మాతృకని మించి రికార్డు స్థాయి విజయాన్ని సాధించింది. మలయాళంలో నేరుగా ఓటీటీలో విడుదలైన దృశ్యం 2
మంచి ఆదరణ దక్కించుకుంది.
ఇదే మూవీని తెలుగులో విక్టరీ వెంకటేష్ మీనా జోడీగా రీమేక్ చేశారు. ఇది కూడా నేరుగా ఓటీటీలోనే విడుదలై అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక హిందీలో అజయ్ దేవగన్ ,శ్రియా టబుల కలయికలో తెరకెక్కిన దృశ్యం 2
బాలీవుడ్ గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటున్న తరుణంలో థియేటర్లలో విడుదలై దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఎవరూ ఊహించని విధంగా వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ 250 కోట్లు వసూళ్లని రాబట్టడం విశేషం.
మలయాళ, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో సంచలనం సృష్టించిన…ఈ మూవీ ఇప్పుడు హాలీవుడ్ కు వెళుతోంది. ఈ మూవీకి సంబంధించిన దృశ్యం ,దృశ్యం 2 లోని పనోరమా స్టూడియోస్ ఇంటర్నేషనల్ సంస్థ హాలీవుడ్ లో రీమేక్ చేయబోతోంది. ఈ విషయాన్ని తాజాగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఈ సిరీస్ సినిమాలని ఫారిన్ లాంగ్వేజెస్ లలో మేము రీమేక్ చేయబోతున్నామని ప్రకటించింది.
అంతే కాకుండా ఫిలిప్పినో ఇండోనేషియా సింహళ చైనీస్ లోనూ అందించనున్నారట. ఇక కొరియా జపాన్, హాలీవుడ్ కు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని వెల్లడించింది. ఇదిలా వుంటే 2013లో విడుదలైన దృశ్యం
మలయాళ తెలుగు తమిళ హిందీ సింహళ భాషల్లో రీమేక్ అయి అక్కడ సంచలనం సృష్టించింది. ఇక చైనీస్ భాషలో షీప్ వితౌట్ ఏ షెపర్ట్
గా రీమేక్ అయిన అక్కడ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకుంది. ఇండోనేషియాలోనూ దృశ్యం
రీమేక్ కావడం విశేషం.