పరారీలో ఉన్న స్వయం ప్రకటిత గాడ్-మ్యాన్ నిత్యానంద కల్పిత దేశం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస.. ఆ దేశానికి చెందిన ప్రతినిధులు జెనీవాలో స్థిర అభివృద్ధిపై చర్చ సందర్భంగా పాల్గొన్నట్లుగా వార్తలు వచ్చాయి. ఇంతకూ కైలాస దేశం నిజంగానే ఉందా..? ఈక్విడార్ లోని ఒక ద్వీపాన్ని కైలాస దేశంగా ప్రకటించుకుని అక్కడే ఉంటున్నాడు నిత్యానంద.. తాను దైవాంశ సంభూతుడిగా చెప్పుకునే నిత్యానంద… కైలాసను ఐక్యరాజ్యసమితి దేశంగా గుర్తించిందని చెప్పుకోవడానికి ఈ ప్రయత్నాన్ని చేశాడా..?
వివాదాస్పద గురువు నిత్యానంద స్వామి గురించి ఓ న్యూస్ ఇప్పుడు హాట్ టాఫిక్ గా మారింది.. నిత్యానంద దేశ ప్రతినిధి ఐక్యరాజ్యసమితి సమావేశానికి హాజరు కావడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. జెనీవాలో జరిగిన ఐక్యరాజ్యసమితి సమావేశానికి కల్పిత దేశం కైలాస దేశ ప్రతినిధి హాజరయ్యారు. అత్యాచార నిందితుడు, స్వయం ప్రకటిత దైవం నిత్యానంద స్థాపించిన కాల్పనిక దేశం కైలాస ప్రతినిధి యూఎన్ సమావేశానికి హాజరవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. 2019 నవంబర్‌లో నిత్యానందపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది.
గుజరాత్ పోలీసులు నిత్యానంద ఆశ్రమం నుంచి ఒక చిన్నారి కిడ్నాప్ అయిన కేసులో దర్యాప్తు కూడా ప్రారంభించారు. లైంగిక ఆరోపణలు ఎదుర్కొని అరెస్ట్ అయి జైలుకు వెళ్లాడు నిత్యానంద. శిక్ష నుంచి తప్పించుకోవడానికి తాను మగాడినే కాదని ప్రకటించారు..జైలు నుంచి వచ్చిన తర్వాత దేశం విడిచి పారిపోయారు. అదే సమయంలో దేశం విడిచి వెళ్లిపోయిన నిత్యానంద.. కైలాస అనే దేశాన్ని గుర్తుతెలియని ప్రదేశంలో నెలకొల్పారు. దానికి గుర్తింపు ఇవ్వాలని పలుమార్లు ఐక్యరాజ్య సమితికి విజ్ఞప్తి కూడా చేశారు. ఈ క్రమంలో కైలాస శాశ్వత రాయబారి ఐక్యరాజ్య సమితి సమావేశంలో పాల్గొనడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
తనను తాను దైవాంశ సంభూతుడిగా చెప్పుకునే నిత్యానంద స్వామి.. కొత్తగా కైలాస అనే దేశాన్ని సృష్టించాడు.. ఈశ్వడార్ దేశానికి చెందిన ఒక ద్వీపాన్ని కొనేసి దాన్ని ‘కైలాస’ దేశంగా మార్చేశాడు. అక్కడే నివాసం ఉంటున్నాడు. అయితే కైలాస అనే దేశం అసలు ఉందా..? ఉంటే దానికి గుర్తింపు ఉందా..? ఆ దేశం కచ్చితంగా ఎక్కడ ఉంది..? అని భారతీయులకు చాలా అనుమానాలు ఉన్నాయి. అయితే ఈ అనుమానాలను పటాపంచలు చేస్తూ.. అనూహ్యంగా కైలాస ప్రతినిధి ఒకరు ఐక్యరాజ్య సమితి సమావేశానికి హాజరయ్యారు. ‘యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస’ తరపున మాతా విజయ ప్రియా నిత్యానంద అనే మహిళ
ఐక్యరాజ్య సమితి సమావేశానికి హాజరయ్యారు.
ఫిబ్రవరి 22న ఐక్యరాజ్య సమితికి చెందిన కమిటీ ఆన్ ఎకనామిక్, సోషల్ అండ్ కల్చరల్ రైట్స్ సమావేశం జెనీవాలో నిర్వహించింది. దీనికి సంబంధించిన
వీడియో ఫుటేజీని ఐక్యరాజ్య సమితి తమ వెబ్‌సైట్ లో ఉంచింది. అందులో విజయ ప్రియ నిత్యానంద.. కైలాసకు శాశ్వత రాయబారి అనే హోదాలో కనిపించారు. ఆ సమావేశంలో స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు అనే విషయంపై చర్చ జరగగా.. ఆమె కూడా మాట్లాడారు. అంతే కాకుండా తమ దేశ వ్యవస్థాపకుడు నిత్యానందను ఆయన పుట్టిన భారత దేశం వేధింపులకు గురిచేస్తోందని ఆరోపించారు. ఈ సమావేశంలో భారత్‌పై విషం చిమ్మదుకు దొరికి అన్ని అవకాశాలను వినియోగించుకుంది. ఐక్యరాజ్య సమితికి ఫిర్యాదు కూడా చేశారు.
- నిత్యానందపై అనేక నేరారోపణలు ఉన్నాయి..
కైలాస ప్రపంచంలోనే మొట్టమొదటి సార్వభౌమ హిందూ దేశంగా విజయ ప్రియ నిత్యానంద ఐక్యరాజ్యసమితిలో ప్రకటించారు. నిత్యానంద ‘హిందూమతంలో అత్యున్నత గురువు’ అని కైలాస దేశ ప్రతినిధి తెలిపారు. రెండు మిలియన్ల నిత్యానంద భక్తులను హింసించడాన్ని ఆపాలని పిలుపునిచ్చారు, నిత్యానందకు భద్రత కల్పించాలని ఐక్యరాజ్యసమితి సమావేశంలో డిమాండ్ చేశారు. నిత్యానంద హిందూయిజానికి అత్యున్నత మతాధికారని ఆమె సమావేశంలో తెలిపారు. నిత్యానంద మరుగున పడిన 10 వేల హిందూ సంప్రదాయాలను పునరుద్ధరిస్తున్నారని వెల్లడించారు.
మితికి తెలిపారు. స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు సాధించడంలో కైలాస చాలా విజయవంతమైందని వెల్లడించారు. ఇక ఐక్యరాజ్య సమితిలో పాల్గొన్న కైలాస రాయబారి విజయ ప్రియ నిత్యానంద ఆహార్యం పూర్తిగా నిత్యానందను తలపించేలా ఉంది. నిత్యానంద తరహాలోనే ఆమె సన్యాసిని వస్త్రధారణలోకనిపించారు. నిత్యానంద తరహాలోనే తలపాగా ధరించారు. మెడలో వివిధ రకాల పూసల దండలు వేసుకున్నారు. నుదుట బొట్టు ధరించారు. హిందూ తత్వాన్ని ప్రతిభింబించేలా విజయప్రియ సమావేశంలో కనిపించారు.
ఈ సమావేశంలో, తాను 150 దేశాలలో రాయబార కార్యాలయాలు, స్వచ్ఛంద సంస్థలను స్థాపించినట్లు కూడా పేర్కొన్నారు విజయప్రియ నిత్యానంద. అయితే కైలాసాన్ని ఐక్యరాజ్యసమితి గుర్తించిందా లేదా అనేది ఇంకా తెలియరాలేదు. అది గుర్తించబడితే, ఏ ప్రక్రియ ద్వారా నిత్యానందను ఊహాజనిత దేశానికి రాజుగా మార్చారు..? అనేది తేలాల్సి ఉంది. అత్యాచారం, మోసం, ఆధారాలు మాయం చేయడం, పోలీసులను తప్పుదోవ పట్టించడం సహా పలు కేసుల్లో నిత్యానంద నిందితుడిగా ఉన్నాడు. 2010లో ఈ కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో రెండుసార్లు అరెస్టైన నిత్యానంద..బెయిలుపై బయటకు వచ్చాడు.
ఆ తర్వాత లైంగిక వేధింపుల ఆరోపణలపై నిత్యానందను పరారీలో ఉన్న వ్యక్తిగా ప్రకటించారు. 2019 నవంబర్‌లో గుజరాత్ పోలీసులు అతను పరారీలో ఉన్నాడని ప్రకటించారు. అతని ఆశ్రమంలో పిల్లల కిడ్నాప్‌కు సంబంధించిన ఆరోపణలపై పోలీసులు విచారణ చేపట్టారు. అత్యాచార ఆరోపణలు, ఆశ్రమంలో ఏనుగు దంతాలు, పులి చర్మాల స్మగ్లింగ్‌తో పాటు పలు రకాల కేసులు నిత్యానందపై నమోదయ్యాయి. వాటన్నిటి నుంచీ తప్పించుకునేందుకు ఇండియా నుంచి పరారైన నిత్యానంద.. కైలసం పేరుతో దేశాన్నే ఏర్పాటు చేసి.. తనకు తానే ప్రధానిగా ప్రకటించుకున్నారు. బయటి ప్రపంచానికి కనిపించకుండా జీవితం గడుపుతున్నారు.
2019 నవంబర్‌లో నిత్యానంద భారత్ వదిలి వెళ్లిపోయారు. ఈక్వెడార్ సమీపంలో ఓ దీవిలో ఉన్నట్టు తెలిసింది. ఆ దీవికి కైలాస దీవి అనే పేరు పెట్టారు. అప్పటి నుంచి ఆయన బయటి ప్రపంచానికి కనిపించింది లేదు. కానీ నిత్యానంద వివరాలు, కార్యక్రమాలు మాత్రం సోషల్ మీడియాలో అప్‌లోడ్ అవుతున్నాయి. ఇప్పుడు ఆయన ఏకంగా చనిపోయారనే ప్రచారం జరుగుతోంది. కానీ దీనిని ఖండిస్తూ ప్రకటన వచ్చింది.
ఇదిలావుంటే, అక్టోబర్ 2022లో బ్రిటన్‌లోని కన్జర్వేటివ్ ఎంపీలు పార్లమెంటులో దీపావళి పార్టీకి హాజరు కావాల్సిందిగా నిత్యానంద మద్దతుదారులను ఆహ్వానించినప్పుడు విమర్శలను ఎదుర్కొన్నారు. నిత్యానందకు బ్లూ కార్నర్ నోటీసు జారీ చేసేందుకు ఇంటర్‌పోల్ నిరాకరించింది. అయితే, ఒక కల్పిత దేశ ప్రతినిధిని ప్రతిష్టాత్మకమైన కార్యక్రమానికి అనుమతించడమనేది ఎన్నో ప్రశ్నలను లేవనెత్తుతుంది. ఉనికి తెలియని దేశం, తమ ప్రతినిధులను ఐరాస సమావేశానికి అనుమతించడం ఐక్యరాజ్యసమితి సూత్రాలను అవమానించడం కాదా? అనేదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది..
నిత్యానందపై అనేక నేరారోపణలు ఉన్నాయి.. ఈ కేసుల నుంచి తప్పించుకునేందుకు భారత్ ను వదిలి పారిపోయి.. ఏకంగా ఒక ద్వీపాన్ని కొనుగోలు చేసి.. దాన్నే ఒక దేశంగా ప్రకటించించుకున్నాడు. తాజాగా ఐక్యరాజ్యసమితి తమ దేశాన్ని గుర్తించి.. సభ్యత్వం కల్పించినట్లు ఏకంగా పెద్ద ప్లానే వేశాడు.. ఈ వార్తలతో నిత్యానంద లీలలు ఐక్యరాజ్యసమితిని చేరాయంటూ చర్చ మొదలైంది..