ఎన్టీఆర్, రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ ఆర్ ఆర్ తర్వాత ప్రస్తుతం కొరటాల శివతో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా టీమ్ ప్రస్తుతం ప్రిప్రోడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇక అది అలా ఉంటే ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్‌తో వరుసగా రెండు సినిమాలను చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ గ్యాబ్ లోనే మరో సినిమాను కూడా ఎన్టీఆర్ ఓకే చేసినట్లు తెలుస్తోంది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత లాంగ్ గ్యాబ్ తీసుకున్నారు. ట్రిపుల్ ఆర్ సినిమా రిలీజ్ అయ్యి..దాదాపు ఏడాది అవుతున్న కొరటాల సినిమాను మాత్ర సెట్స్ పైకి తీసుకెళ్లలేదు. లెట్ గా స్టార్ట్ చేసినా… స్పీడ్ గా ఫినీష్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తన కెరీర్‌లోని 30వ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ నెలలోనే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కాబోతుందని చిత్ర యూనిట్ ఇప్పటికే వెల్లడించింది.
ఇక ఈ సినిమాను కొరటాల తనదైన మార్క్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ మూవీగా తీర్చిదిద్దనున్నారు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్, కేజీయఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో భారీ మాస్ యాక్షన్ మూవీ చేయనున్నారు. అయితే ఒకటి కాదు.. రెండు ఎన్టీఆర్ 31, ఎన్టీఆర్ 32. వరుసగా రెండు సినిమాలను ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్‌తో చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు సినిమాలను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోందని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ మూవీ పై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.
ఇక తారక్‌తో త్రివిక్రమ్ గతంలో ఓ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేశాడు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా క్యాన్సిల్ అయ్యింది. దీంతో ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్ గురించి ఇండస్ట్రీ వర్గాల్లో ఓ వార్త జోరుగ వినిపిస్తోంది. ప్రముఖ నిర్మాత నాగవంశీ తారక్‌తో ఓ సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడట. ఈ సినిమాను త్రివిక్రమ్ డైరెక్ట్ చేయనుండగా, ఈ భారీ ప్రాజెక్ట్‌ను ఓ మైథలాజికల్ డ్రామాగా తీర్చిదద్దనున్నట్లు నిర్మాత తెలిపాడు. ఇక ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించేందుకు నిర్మాత రెడీ అవుతున్నాడు. మరి ఈ ప్రాజెక్ట్‌ను నాగవంశీ ఎప్పుడు పట్టాలెక్కిస్తాడా.. ఎలాంటి కథతో ఈ సినిమా రానుందా అనే ఆసక్తి అభిమానుల్లో క్రియేట్ అవుతోంది.