ఉక్రెయిన్ పై రష్యా యుద్దం మొదలైన తర్వాత రష్యాకు అమెరికా, యూరప్ దేశాలు ఆంక్షలు విధించాయి. అందులో భాగంగానే రష్యా నుంచి ఇతర దేశాలు సైతం చమురు కొనుగోలు చేయవద్దని హెచ్చరించాయి.. అయినప్పటికీ.. భారత్ మాత్రం చమురు కొనుగోలు చేస్తూనే వస్తోంది.. తాజాగా చమురు కొనుగోలు విషయంలో భారత్ కు అమెరికా నుంచి ఊరట లభించింది..
రష్యా నుంచి భారత్ కూడా చమురు కొనుగోలు చేయవద్దని హెచ్చరించిన అమెరికా తాజాగా వెనక్కి తగ్గింది.. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలుపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని అమెరికా ప్రకటించడం ఇప్పుడు భారత్ సత్తాను ప్రపంచానికి తెలియజేసినట్లయింది.. ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో రష్యాపై అనేక ఆంక్షలు విధించిన అమెరికా.. ఆ దేశం నుంచి భారత్ చమురు కొనడంపై అభ్యంతరం చెప్పింది.
అయితే అమెరికా బెదిరింపులకు భారత్ గట్టిగా సమాధానం ఇచ్చింది. రష్యా నుంచి ఇంధనం కొనుగోలు విషయంలో నిర్ణయం మారదని, ఎవరి ఒత్తిడులకు తలొగ్గేది లేదని కేంద్ర పెట్రోలియం మంత్రి అప్పట్లో తేల్చి చెప్పారు. అయితే చేసే ప్రయత్నాలు అన్నీ చేసి, ఇక భారత్‌ను లొంగదీసుకోవడం వీలు కాదని గ్రహించిన అమెరికా.. ఎట్టకేలకు తోక ముడిచింది.
రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలుపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, ఈ విషయమై భారత్‌పై ఆంక్షలు విధించడం పట్ల అమెరికా దృష్టి సారించడం లేదని ఐరోపా-యురేషియా వ్యవహారాల అమెరికా సహాయ కార్యదర్శి కరెన్ డాన్‌ఫ్రైడ్ వెల్లడించారు.. భారత్ తో సంబంధాలు అత్యంత పర్యవసానంగా ఉన్నాయని, అమెరికా, భారత్‌ల విధానపరమైన అంశాలు భిన్నంగా ఉండవచ్చని, అంతర్జాతీయ నియమాలను గౌరవిస్తూ ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వాన్ని పరస్పరం గౌరవించాలనే నిబద్ధతకు ఇరు దేశాలు కట్టుబడి ఉంటాయని కరెన్ డాన్ ప్రైడ్ తెలిపారు.
రష్యా చమురు కొనుగోలుపై భారతదేశం అనుసరిస్తున్న విధానంతో అమెరికా “సౌకర్యవంతంగా ఉంది” అని అమెరికా ఇంధన వనరుల అసిస్టెంట్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ జియోఫరీ ప్యాట్ తెలిపారు..ఇటీవల జరిగిన చాలా ద్వైపాక్షిక చర్చల్లో ఇంధన భద్రత అనేది ఎంత ముఖ్యమైందో వెల్లడైందని ప్రస్తావించారు. సీనియర్ అమెరికా దౌత్యవేత్తలు రష్యా చమురుపై విధించిన ధర పరిమితిని సమర్థించారు జియోఫరీ ప్యాట్.
అయితే భారతదేశం ఇందులో పాల్గొనకపోయిప్పటికీ, మెరుగైన ధరను చర్చించడానికి ఇది ఒక అవకాశమని అభిప్రాయపడ్డారు..దీనికి ముందు డిసెంబరులో అమెరికా జాతీయ భద్రతా మండలి ప్రతినిధి జాన్ కిర్బీ కీలక వ్యాఖ్యలు చేశారు.. ధరల పరిమితి రష్యన్ చమురుపై తగ్గింపును లాక్ చేస్తుందని.. దీంతో చైనా, భారతదేశం వంటి దేశాలు ధరల తగ్గింపు కోసం బేరసారాలు చేయగలవని తెలిపారు.. ఉక్రెయిన్‌లో యుద్ధానికి ఆజ్యం పోస్తున్న రష్యా ఆదాయాన్ని తగ్గించడం ధరల పరిమితి యొక్క ఆలోచనగా అమెరికా నిర్ణయించింది.
- రష్యా నుంచి చమురు కొనుగోలుకు నిన్నమొన్నటి వరకు అభ్యంతరం తెలిపిన అమెరికా తాజాగా వెనక్కి తగ్గడం భారత్ కు మరింతగా మేలు జరగనుంది..
ఇటీవలి కాలంలో ఇండియా నుంచి ఇంధన ఎగుమతులు భారీగా పెరుగుతున్నాయి. భారత దేశం నుంచి ఇంధనం ఎగుమతులు ఏంటి.. మనమే ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటాం కదా అనుకుంటున్నారా..? కానీ ఇది నిజం. ఇంధన ఎగుమతుల్లో లెక్కలు మారుతున్నాయి. అమెరికా, యురోపియన్ యూనియన్ దేశాలకే భారత్ ఇంధనం ఎగుమతి చేస్తోంది. అంతర్జాతీయ ఆయిల్ మార్కెట్‌లో ఇండియా కీలకంగా మారుతోంది. రష్యా నుంచి తక్కువ ధరకు ముడి చమురు దిగుమతి చేసుకుని దానిని ప్రాసెసింగ్ చేసి అమెరికా, యూరప్ దేశాలకు ఎగుమతి చేస్తోంది.
గత డిసెంబర్ నెలలోనే అమెరికాకు రోజుకు 89 వేల బ్యారెళ్ల గ్యాసోలిన్, డీజిల్‌ను ఇండియా ఎగుమతి చేసింది. గత నాలుగేళ్లలో ఇదే అత్యధికం. ఇక జనవరి నెల వచ్చేసరికి ప్రతీరోజు 1.72 లక్షల బ్యారెళ్ల డీజిల్‌ను యురోపియన్ యూనియన్ దేశాలకు భారత్ ఎగుమతి చేసింది. ఇది కూడా గత రెండేళ్లలో అత్యధికం.
4వాయిస్: ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య కారణంగా అమెరికా, ఈయూ దేశాలు రష్యాపై ఆర్థిక ఆంక్షలు విధించాయి. దీంతో రష్యా ఎగుమతులు నిలిచిపోయాయి. క్రూడ్ ఆయిల్ దిగుమతిపై యూరప్ దేశాలు నిషేధం విధించాయి. ఇదే సమయంలో రష్యాపై ఎలాంటి ఆంక్షలు అమలు చేయని భారత్‌కు అయిల్ ఎగుమతులను భారీగా పెంచుతోంది. అది కూడా రూపాయలలో, తక్కువ ధరకు. ఇలా వచ్చిన క్రూడ్‌ఆయిల్‌ను అమెరికా, ఈయూ దేశాలకు ఇండియా ఎగుమతి చేస్తోంది. అందుకే పెద్దగా ఉత్పత్తిలేని భారత్ నుంచి ఆయిల్ ఎగుమతులు పెరుగుతున్నాయి.
సాధారణంగా ఇంధనం ఉత్పత్తి చేయని దేశాలకు ఉత్పత్తి చేసే దేశాల నుంచి దిగుమతి చేసుకోవడం ఒక్కటే మార్గం. ఇంధన వ్యాపారం మొత్తం డాలర్ల రూపంలో జరుగుతుంది. దీంతో విదేశీ మారకాల్లో చాలా వరకు ఇంధన దిగుమతుల కోసమే ఖర్చు చేయాల్సిన పరిస్థితి. భారత్ లో కూడా ఇంధన ఉత్పత్తి అంతంత మాత్రమే. అందుకే ఒపెక్ దేశాల నుంచే ఇంధన దిగుమతి చేసుకుంటూ విదేశీ మారకాన్ని భారీగా ఖర్చు చేస్తున్నాం. ఇంధన దిగుమతుల కోసం
భారత్ సౌదీ అరేబియాపైనే అధికంగా ఆధారపడింది.
రష్యాతో స్నేహం కలిసి వస్తోంది.. ఉక్రెయిన్, రష్యా యుద్ధం తర్వాత ప్రపంచ దేశాలు రష్యాపై విధించిన ఆంక్షలు భారతకు కలిసి వస్తున్నాయి. రష్యాకు
భారత్‌తో ఉన్న స్నేహం, ఆంక్షలు అమలు చేయకపోవడం, యుద్ధంపై భారత్‌కు ఉన్న వైఖరి కారణంగా తక్కువ ధరకే భారీగా ఇంధనం ఇస్తామని రష్యా ముందుకు వచ్చింది. ట్రాన్స్‌పోర్టు ఇబ్బందులు కూడా చేస్తామని ప్రకటించింది.
- ఎప్పటికైనా చైనాకు గట్టి పోటీనివ్వగల సామర్థ్యం భారత్‌కు ఉందని చాలా మంది విశ్వసిస్తుంటారు..
ఉక్రెయిన్ పై యుద్ధం కారణంగా విధించిన ఆర్థిక ఆంక్షలతో రష్యాకు ఇబ్బందులు మొదలయ్యాయి. ఈ తరుణంలో ఇండియా పరోక్షంగా అండగా నిలిచింది. తక్కువ ధరకు వస్తున్న ఇంధనాన్ని భారీగా దిగుమతి చేసుకుంటూ రష్యాను ఆర్థికంగా నిలబెడుతోంది ఇండియా. అయితే ఇదే సమయంలో రష్యాకు అండగా నిలుస్తున్న భారత్‌ను ఇబ్బంది పెట్టాలని అమెరికా, ఈయూ దేశాలు భావించాయి. భారత్ యుద్ధాన్ని తమకు ఆర్థిక వనరుగుగా మార్చుకుందని అమెరికా విమర్శించింది కూడా. కానీ దీనిని విదేశాంగ మంత్రి జయశంకర్ దీటుగా కౌంటర్ ఇచ్చారు.
ఆంక్షల పేరుతో డ్రామాలు తప్ప భారత్ కంటే ఇంధనం దిగుమతి చేసుకునే దేశాలు అమెరికా, యురోపియన్ యూనియనే అని ప్రకటించారు. దీంతో అమెరికా, ఈయూ దేశాలకు తత్వం బోధపడింది. ఇండియా, రష్యాను నిలువరించడం సాధ్యం కాదన్న నిర్ణయానికి వచ్చింది. తాజాగా రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలుపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, ఈ విషయమై భారత్‌పై ఆంక్షలు విధించడం పట్ల అమెరికా దృష్టి సారించడం లేదని
ఐరోపా-యురేషియా వ్యవహారాల అమెరికా సహాయ కార్యదర్శి కరెన్ డాన్‌ఫ్రైడ్ వెల్లడించారు..
మారుతున్న పరిస్థితులతో ఇప్పుడు అమెరికా, ఈయూ దేశాలకు భారతే ఆపన్న దేశమైంది. ఆంక్షలతో ఇంధన నిల్వలు తగ్గిపోతుండడంతో అమెరికా, యూరప్ దేశాలు భారత్‌ను ఆశ్రయించాయి. దీంతో ఇండియా ఇంధనం ఎగుమతి చేస్తోంది. రష్యా నుంచి దిగుమతి చేసుకున్న క్రూడ్ ఆయిల్‌నే ఎగుమతి చేస్తున్న విషయం ఆయా దేశాలకు తెలుసు. అయినా నోరు మెదుపడం లేదు. దీంతో ఇండియా ఎగుమతులు పెంచుతోంది.
వాస్తవంగా అమెరికా, ఈయూ దేశాలు ఇంధన దిగుమతులు నిలిపివేస్తే రష్యా ఆర్థిక మూలాలు దెబ్బతింటాయని భావిచాయి. కానీ రష్యాలో పరిస్థితి పూర్తిగా భిన్నం. అక్కడ ఇంధన ఉత్పాదకత వ్యయం మిగతా దేశాలతో పోచ్చితే చాలా తక్కువ. రష్యా ఒక బ్యారెల్ ఇంధనం ఉత్పత్తికి కేవలం 30 డాలర్లు మాత్రమే ఖర్చు చేస్తుంది. ఇదే సమయంలో రష్యా తాము నష్టపోయి భారత్‌కు ఇంధనం సరఫరా చేయదు. భారత్ కూడా ఉత్పాదక వ్యయం కంటే తక్కువ చెల్లించదు. ఈ లాజిక్ మర్చిపోయిన అమెరికా, యురోపియన్ దేశాలు ఆంక్షల పేరుతో రష్యా ఇబ్బంది పడుతుందని భావిస్తున్నాయి.
వాస్తవం మాత్రం భిన్నంగా ఉంది. అమెరికా, ఈయూ దేశాలకు భారత్ నుంచి ఇంధన ఎగుమతులు పెరుగుతుండడంతో రష్యా నుంచి భారత్‌కు వచ్చే ఇంధన దిగుమతులు పెరగుతున్నాయి. ఫలితంగా రష్యా ఆర్థికంగా బలపడుతోంది. ఈ చిన్న లాజిక్‌ను అగ్రరాజ్యం ఎలా మిస్ అయిందో అర్థం కాదు. ఎప్పటికైనా చైనాకు గట్టి పోటీనివ్వగల సామర్థ్యం భారత్‌కు ఉందని చాలా మంది విశ్వసిస్తుంటారు. ముఖ్యంగా తయారీలో దూసుకెళ్తున్న చైనాకు ఇండియా అడ్డుకట్ట వేయగలదని చెబుతుంటారు.అపార మానవ వనరులే భారత్‌కు ప్రయోజనాన్ని చేకూరుస్తాయని వివరిస్తుంటారు.
ఈ మధ్య కాలంలో చైనాతో పాశ్చాత్య దేశాల పొరపొచ్చాలు పెరిగిన తర్వాత.. భారత్ వైపు సానుకూల పవనాలు వీస్తున్నాయి. డ్రాగన్ దేశం నుంచి పరిశ్రమల్ని తరలిస్తే.. ప్రత్యామ్నాయంగా భారత్‌నే ఎంచుకునే అవకాశం ఉందని చాలా మంది ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. తాజాగా ఈ అంచనాలన్నింటికీ బలం చేకూర్చే కీలక పరిణామం ఒకటి చోటుచేసుకుంది. ఇంధన ఎగుమతులు భారీగా పెరిగాయి. మరోవైపు.. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోన్న భారత్ విషయంలో అమెరికా జోక్యం చేసుకోమంటూ ప్రకటించడం వంటి పరిణామాలు భారత్‌ను అంతర్జాతీయంగా మరో స్థాయికి తీసుకెళ్లాయంటున్నారు విశ్లేషకులు..
రష్యా నుంచి ఇతర దేశాలు చమురు కొనుగోలు చేయరాదంటూ ఆంక్షలు విధించాయి అమెరికా, యూరప్ దేశాలు.. అయితే.. భారత్ విషయంలో మాత్రం అమెరికా జోక్యం చేసుకోదంటూ రష్యా నుంచి చమురు కొనుగోలుపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ అమెరికా ప్రకటించడం ప్రపంచదేశాలలో భారత్ సత్తాను తెలియజేస్తోంది..