Homeఅంతర్జాతీయంచైనా నుంచి ముప్పు పొంచి ఉంది..!

చైనా నుంచి ముప్పు పొంచి ఉంది..!

భారత్ కు డ్రాగన్ కంట్రీతో సరిహద్దుల వద్ద ముంపు పొంచి ఉంది… భారత సరిహద్దుల వద్ద చైనా ఏకంగా పలు గ్రామాలను నిర్మిస్తోంది.. భారత భూభాగాన్ని ఆక్రమించేందుకు చేయవలసిన కుట్రలు అన్నీ చేస్తోంది చైనా.. డ్రాగన్ కుటిలబుద్దిని గ్రహించిన భారత్ సరిహద్దుల వద్ద మౌలిక సదుపాయాల నిర్మాణాన్ని వేగవంతం చేసింది..

తవాంగ్ ప్రాంతాన్ని టిబెట్ లో భాగమని వాదిస్తోంది చైనా.. పదేపదే చొరబాట్లకు ప్రయత్నిస్తున్న చైనాకు ధీటుగా భారత్ ఏం చేయనుంది..? డ్రాగన్ కంట్రీ దుస్సహాసానికి పాల్పడినా ఎదుర్కొనేందుకు భారత్ ఎలా సమయాత్తం అవుతోంది..?.

చైనాతో ముప్పు పొంచి ఉన్న వేళ అరుణాచల్‌ ప్రదేశ్‌ లో రహదారులు, వంతెనలు, సొరంగ మార్గాలను భారత్‌ యుద్ధ ప్రాతిపదికన నిర్మిస్తోంది. అతి శీతల వాతావరణ పరిస్థితులు ఎదురైనా సరిహద్దులకు వేగంగా సైనిక బలగాలను తరలించేందుకు వీలుగా వీటిని బోర్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌ నిర్మిస్తోంది.. చైనాతో సరిహద్దు కలిగిన అరుణాచల్‌ ప్రదేశ్‌లోని గ్రామాలను రహదారులతో అనుసంధానించనున్నారు. ఆ ప్రాంత అభివృద్ధికి ఇది దోహదం చేయనుందని అధికారులు భావిస్తున్నారు..

అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తవాంగ్‌ ప్రాంతాన్ని టిబెట్‌ లో భాగమని వాదిస్తున్న చైనా… పదే పదే చొరబాట్లకు యత్నిస్తున్న వేళ.. భారత్‌ పూర్తిగా అప్రమత్తమైంది. డ్రాగన్‌ ఎలాంటి దుస్సాహసానికి పాల్పడినా ఎదుర్కొనేందుకు వాస్తవాధీన రేఖ వద్ద భారీ ఎత్తున బలగాలను మోహరించిన భారత్‌.. సరిహద్దుల్లో మౌలిక సదుపాయాల నిర్మాణాన్ని వేగవంతం చేసింది.

పర్వతాలతో నిండిన అరుణాచల్‌ప్రదేశ్‌లో అతిశీతల వాతావరణ పరిస్థితులు ఎదురైనా ఏడాది పొడవునా రాకపోకలు సాగేలా రోడ్లు, సొరంగాలు, వంతెనలు నిర్మిస్తోంది. తద్వారా అదనపు బలగాలను శరవేగంగా అక్కడికి తరలించేందుకు వీలవుతుంది.


ఇందుకు భారత బలగాలు పలు నిర్మాణాలు చేపడుతున్నాయి.. “ఇక్కడి భూభాగం ఇలా చాలా క్లిష్టతరంగా ఉంటుంది. పర్వతాలు ఎక్కువగా ఉంటాయి. సముద్ర మట్టానికి చాలా ఎత్తులో ఇక్కడి భూభాగం ఉంటుంది.

పర్వతాలు, వాతావరణ పరిస్థితులు చాలా క్లిష్టంగా ఉంటాయి. ఇలాంటి కఠిన వాతావరణ పరిస్థితుల్లో రోడ్ల నిర్మాణం కోసం సరిహద్దు రహదారుల సంస్థ నిరంతరం పని చేస్తోంది. ఇక్కడి కొన్ని గ్రామాలు మారుమూల ప్రాంతాల్లో ఉంటాయి. అలాంటి మారుమూల ప్రాంతాలకు కూడా రోడ్లు వేస్తున్నారు.. తద్వారా పశ్చిమ అరుణాచల్‌లో అన్ని ప్రాంతాలు అభివృద్ధి అయ్యేలా చూడటం మరొక ఉద్దేశ్యం..

చైనాతో సరిహద్దు కలిగిన ప్రాంతాల్లో భారీ ఎత్తున మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను భారత్‌ చేపట్టింది. అరుణాచల్‌లోని చైనాతో సరిహద్దు కలిగిన అన్ని గ్రామాలను రోడ్లతో అనుసంధానించాలని కోరుకుంటోంది.


శీతాకాలంలో రోడ్లు మంచుతో కప్పుకుపోయే చోట్ల సొరంగ మార్గాలను నిర్మిస్తోంది. కీలకమైన నచిఫు సొరంగ మార్గం త్వరలోనే అందుబాటులోకి రానుంది. సేలా పాస్‌ సొరంగం కూడా వచ్చే ఏడాది జులై కల్లా పూర్తికానుంది. సేలా టన్నెల్‌ ప్రాజెక్టులో భాగంగా రెండు జంట సొరంగ మార్గాలను నిర్మిస్తున్నారు. నచిఫు సొరంగ మార్గం దాదాపు పూర్తికావచ్చింది. రహదారి పనులకు తుదిరూపునిస్తున్నారు.

చిపు సొరంగం మరో రెండు నెలల్లో ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. సేలా సొరంగం పొడవైనది. అందులో ఒక సొరంగం 1555 మీటర్ల పొడవు ఉంటుంది. మరో సొరంగం దాదాపు కిలోమీటరు పొడవు ఉంటుంది. శీతల వాతావరణం వల్ల అక్కడ కఠిన పరిస్థితులు ఉంటాయి. సొరంగ మార్గాల్లో 24 గంటలూ పని జరుగుతోంది. ఆరు గంటలకు ఒక షిఫ్ట్‌ చొప్పున నాలుగు షిఫ్టుల్లో పని జరుగుతోంది.

మరో నాలుగు నుంచి ఆరు నెలల్లో ఈ సేలా సొరంగాన్ని కూడా మేము ప్రజారవాణా కోసం ప్రారంభించనున్నారు అధికారులు.. భారత్‌తో సరిహద్దుల్లో చైనా వేగంగా మౌలిక సదుపాయాలను నిర్మిస్తోంది. ఏకంగా కొత్త కొత్త గ్రామాలను అక్కడ ఏర్పాటు చేస్తోంది. సైనిక అవసరాల కోసం వీటిని వినియోగించుకుంటోంది. ఈ నేపథ్యంలో డ్రాగన్‌కు ఏ మాత్రం తగ్గకుండా అరుణాచల్‌లో మౌలిక సదుపాయాలను వేగంగా కల్పిస్తోంది.

అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్‌లో చైనా-భారత్ సైనికుల మధ్య ఘర్షణ..!

ఘర్షణ చోటుచేసుకోవడంతో… ఇరు దేశాల సరిహద్దుల వద్ద భారత్ అప్రమత్తమైంది. అరుణాచల్ ప్రదేశ్ లో చైనా-భారత్ సరిహద్దుల వద్ద యుద్ధ విమానాల‌తో భార‌త్ పెట్రోలింగ్ నిర్వ‌హిస్తోంది. చైనా దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు నిఘా ముమ్మరం చేసింది. డ్రాగన్ ఉల్లంఘ‌న‌ల‌ను అడ్డుకునేందుకు గ‌త కొన్ని రోజుల నుంచి భార‌త వైమానిక ద‌ళాలు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది.

అరుణాచ‌ల్‌లోని లైన్ ఆఫ్ కంట్రోల్ వ‌ద్ద జోరుగా పెట్రోలింగ్ జ‌రుగుతోందని అధికారిక వర్గాలు వెల్లడించాయి.. డిసెంబ‌ర్ 9వ తేదీన త‌వాంగ్ సెక్టార్ వ‌ద్ద చైనా బ‌ల‌గాలు ఎల్ఏసీ దాటి భార‌త భూభాగంలోకి వ‌చ్చినందని రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ స్వయంగా పార్లమెంట్ లో వెల్లడించారు. చైనా సైనికులను భారత్ సైనికులు సమర్థవంతంగా తిప్పికొట్టారని వెల్లడించారు. ఘ‌ర్ష‌ణ రోజున ఇరు వ‌ర్గాల ద‌ళాల‌కు స్వ‌ల్ప స్థాయిలో గాయాలైన‌ట్లు తెలుస్తోంది.

భారత్, చైనాల మధ్య 1962 అక్టోబరు నుండి నవంబరు వరకు యుద్ధం జరిగింది.. చైనా- భారత్ సరిహద్దు వివాదమే ఈ యుద్దానికి ప్రధాన కారణం.. 1959 టిబెటన్ తిరుగుబాటు తర్వాత భారతదేశం దలైలామాకు ఆశ్రయం ఇచ్చినప్పుడు రెండు దేశాల మధ్య హింసాత్మక సరిహద్దు వాగ్వివాదాలు జరిగాయి.. 1960-1962లో ప్రతిపాదిత చైనీస్ దౌత్య ఒప్పందాలను భారతదేశం తిరస్కరించిన తర్వాత చైనా సైనిక చర్య మరింత దూకుడుగా పెరిగింది.. చైనా 30 ఏప్రిల్ 1962 తర్వాత లడఖ్‌లో గతంలో నిషేధించిన “ఫార్వర్డ్ పెట్రోలింగ్”ను తిరిగి ప్రారంభించింది.

క్యూబా క్షిపణి సంక్షోభం మధ్య, లడఖ్‌లోని 3,225-కిలోమీటర్ల సరిహద్దు వెంబడి.. అలాగే ఈశాన్య సరిహద్దులోని మెక్‌మహోన్ రేఖ మీదుగా వివాదాస్పద భూభాగాన్ని ఆక్రమిస్తూ, శాంతియుత పరిష్కారం కోసం 20 అక్టోబర్ 1962న చైనా అన్ని ప్రయత్నాలను విరమించుకుంది.. చైనా దళాలు రెండు థియేటర్లలోని భారత బలగాలను వెనక్కి నెట్టాయి.. పశ్చిమ థియేటర్‌లోని వారి క్లెయిమ్ చేసిన భూభాగాన్ని.. తూర్పు థియేటర్‌లోని తవాంగ్ ట్రాక్ట్‌ను స్వాధీనం చేసుకున్నాయి.. 1962 నవంబరు 20న చైనా ఏకపక్షంగా కాల్పుల విరమణను ప్రకటించడంతో వివాదం ముగిసింది. అదే సమయంలో తన క్లెయిమ్ చేసిన ” లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ” కి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది.

అప్పటి నుంచి తరచుగా భారత, చైనా సరిహద్దుల వద్ద కవ్వించు చర్యలకు పాల్పడటమే కాకుండా.. భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చేందుకు ప్రయత్నాలు
చేస్తూనే ఉంది. కుటిలబుద్ది గల డ్రాగన్ తో ఎప్పటికైనా సమస్యలు తప్పవని గ్రహించిన భారత్.. చైనాకు ధీటుగా సరిహద్దుల వద్ద రోడ్లు, సొరంగాలు, వంతెనలను నిర్మించతలపెట్టింది.. ఎలాంటి పరిస్థితుల్లోనైనా చైనాకు ధీటుగా పోరాడేందుకు భారత్ సమాయత్తం అవుతోంది..

డ్రాగన్ కంట్రీ చైనా.. తరచుగా భారత సరిహద్దుల వద్ద చొరబాటుకు ప్రయత్నిస్తూనే ఉంది.. భారత బలగాలు తిప్పిగొట్టడంతో తోక ముడుచుకోవడం అలవాటు చేసుకుంది.. ఇటీవల తవాంగ్ సెక్టార్ లో ఇరుదేశాల మధ్య సైనిక ఘర్షణ చోటుచేసుకోవడంతో.. చైనాకు ధీటుగా భారత్ సరిహద్దుల వద్ద మౌళిక సదుపాయాలను ఏర్పాటు చేసుకుంటోంది..

Must Read

spot_img