HomePoliticsఏపీలో యాత్రల కాలం స్టార్టవనుందన్న టాక్ వినిపిస్తోంది...

ఏపీలో యాత్రల కాలం స్టార్టవనుందన్న టాక్ వినిపిస్తోంది…

ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష నేతలు చేస్తున్న, చేయాలని అనుకుంటున్న యాత్రలపై కోవిడ్ దెబ్బ పడేట్లుంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేయటమే టార్గెట్‌గా పాదయాత్రలు, బస్సు యాత్రలు, జిల్లాల పర్యటనలు పెట్టుకున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ యాత్రలతో జగన్‌పై ఒత్తిడి పెంచేయాలన్నది ప్రతిపక్షాల నేతల లక్ష్యం. అయితే వీళ్ళ ప్రయత్నాలకు కోవిడ్ ఫోర్త్ వేవ్ రూపంలో గండిపడేట్లుంది.

ప్రపంచంపై కరోనా ఫోర్త్ వేవ్ ఒమిక్రాన్ బీఎఫ్-7 వేరియంట్ విరుచుకుపడుతోందని ఐక్యరాజ్యసమితి ప్రపంచ దేశాలను అప్రమత్తం చేసిన విషయం తెలిసిందే. దీని ఆధారంగా కేంద్ర ప్రభుత్వం కూడా అన్నీ రాష్ట్రాలను అప్రమత్తం చేస్తూ లేఖలు రాసింది. ముఖ్యమంత్రులతో పాటు చీఫ్ సెక్రటరీలతో కూడా టచ్‌లో ఉంది. ఇప్పటికే చైనా, జపాన్, కొరియా, అమెరికా, బ్రెజిల్ దేశాల్లో గడచిన వారంలో 35 లక్షల కేసులు వెలుగుచూశాయి.

కాబట్టి మనదేశంలో కూడా కేసులు పెరిగే అవకాశాలున్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయా ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే విషయమై కాంగ్రెస్ అగ్రనేత రాహూల్ గాంధీకి లేఖ రాశారు.

అయితే యాత్రలపై కరోనా దెబ్బ కొట్టనుందన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

కోవిడ్ నిబంధనలను పాటించలేకపోతే పాదయాత్రను రద్దు చేసుకోవాలని మంత్రి రాహుల్ గాంధీకి పంపిన లేఖలో స్పష్టంగా చెప్పారు. రాహుల్ పాదయాత్ర ఏమవుతుందన్న విషయాన్ని పక్కన పెట్టేస్తే ఇదే సూత్రం ఏపీలోని నేతలకు కూడా వర్తిస్తుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒకవైపు చంద్రబాబు నాయుడు ఇదేం ఖర్మ.. రాష్ట్రానికి పేరుతో జిల్లాలు తిరుగుతున్నారు. మరోవైపు సీపీఐ కార్యదర్శి రామకృష్ణ కూడా యాత్ర పెట్టుకున్నారు. ఈ రెండు కాకుండా జనవరి 27వ తేదీ నుండి నారా లోకేష్పా దయాత్రకు రెడీ అవుతున్నారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా వారాహి వాహ‌నంతో యాత్రకు రెడీ అవుతున్నారు. కరోనా వైరస్ వ్యవహారం చూస్తుంటే మళ్ళీ మనదేశంలో ప్రమాదకరంగా మారేట్లుంది. జనవరి రెండో వారం నాటికి కరోనా వైరస్ ప్రమాదకరంగా మారవ‌చ్చని నిపుణులు అంచనాలు వేస్తున్నారు. అంటే చంద్రబాబు ప్రస్తుత పర్యటనలతో పాటు లోకేష్, పవన్ మొదలుపెట్టాలని అనుకుంటున్న యాత్రలకు బ్రేక్ పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ఇవే నిబంధనలు జగన్మోహన్ రెడ్డి జిల్లాల పర్యటనలకు కూడా వర్తిస్తుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీంతో యాత్రల టైంలో కరోనా ఎఫెక్ట్ .. రాష్ట్ర రాజకీయాలపై ఎటువంటి ప్రభావం చూపుతుందన్నదే చర్చనీయాంశంగా మారింది.

తెలుగునాట పాదయాత్రలకు విశేష ఆదరణ ఉంది. యాత్రలతో క్రేజ్ పెంచుకోవడంతో పాటు పార్టీని విజయతీరాలకు నడిపించిన నాయకులు ఉన్నారు. దాదాపు పాదయాత్ర చేసిన నాయకులంతా అధికారంలోకి వచ్చారు. కానీ ఏపీ సీఎం జగన్ నాడు జైల్లో ఉన్నప్పుడు ఆయన తరుపున సోదరి షర్మిల పాదయాత్ర చేశారు. కానీ 2014 ఎన్నికల్లో మాత్రం పార్టీని అధికారంలోకి తీసుకురాలేకపోయారు.

2003లో కష్టాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీని పాదయాత్రతో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విజయతీరాలకు చేర్చారు. తానూ తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. అటు తరువాత చంద్రబాబు పాదయాత్ర చేసి విభజిత ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి రాగలిగారు. అటు తరువాత జగన్ ఏపీలో సుదీర్ఘ కాలం పాదయాత్ర చేసి 2019లో అధికారంలోకి రాగలిగారు. అయితే 2024 ఎన్నికలు సమీపిస్తుండడంతో మరోసారి ఏపీలో పాదయాత్ర మాట వినిపిస్తోంది. టీడీపీ యువనేత నారా లోకేష్పా దయాత్ర చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. అటు పవన్ బస్సు యాత్రకు సైతం సిద్ధమవుతున్నారు. పాదయాత్ర అంటే.. ఒకటి రెండు రోజులతో ముగిసిపోయేది కాదు.

దీంతో నేతలు ఏంచేయనున్నారన్నదే చర్చనీయాంశమవుతోంది.

దాదాపు 14 నెలల సమయం పడుతుంది. దాదాపు అన్నినియోజకవర్గాలను కలుపుతూ 4 వేల కిలోమీటర్ల పాదయాత్రకు టీడీపీ నాయకులు రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. అయితే లోకేష్ ఎంత మేర ప్రజల్లోకి చొచ్చుకెళతారన్న అనుమానం టీడీపీ శ్రేణుల్లో కూడా ఉంది. లోకేష్ పాదయాత్ర ప్రణాళికతోనే గత కొద్ది నెలలుగా ఆరోగ్య జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలుస్తోంది. నిపుణుల సలహా, ఆహార నియమాలు పాటించడంతో బాగా సన్నబడ్డారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.

పాదయాత్రలో నడక ఎంత ముఖ్యమో.. ప్రసంగాలు కూడా అంతే ముఖ్యం. దారిపొడవునా అనేక వర్గాల ప్రజలు తమ సమస్యలను విన్నవిస్తుంటారు. అటువంటి వాటి విషయంలో స్పాంటెనిస్ గా స్పందించాల్సిఉంటుంది. అప్పటికప్పుడు మాట్లాడాల్సి ఉంటుంది. కానీ లోకేష్ ప్రసంగాల్లో వీక్. ఇటీవల కొంత పరిణితి సాధించినా.. మిగతా నాయకులతో పోల్చుకుంటే మాత్రం వెనుకబాటులోనే ఉన్నారు. ఇది ఆయనకు మైనస్ గా మారింది.

అయితే తనకు తాను ప్రూవ్ చేసుకునేందుకు లోకేష్ కు పాదయాత్ర ఓ సువర్ణవకాశంగా విశ్లేషకులు సైతం చెబుతున్నారు. ఇప్పుడు కరోనా తో బ్రేక్ పడనుండడంతో .. ఏం చేస్తారన్నదే చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే పర్యటనల్లో ఉన్న బాబు.. బ్రేక్ తీసుకోక తప్పదన్న అంచనాలు కూడా వినిపిస్తున్నాయి.

మరోవైపు పవన్ కళ్యాణ్ బస్సు యాత్రకు సిద్ధపడుతున్నారు. తొలుత అక్టోబరు 2 నుంచి యాత్రను ప్రారంభించాలనుకున్నారు. అటు కాన్వాయ్ నుంచి ఇటు రూట్ మ్యాప్వ రకూ అంతా సిద్ధం చేశారు. కానీ కొన్ని కారణాలతో బస్సు యాత్రను తాత్కాలికంగా వాయిదా వేశారు. త్వరలో షెడ్యూల్ ప్రకటించనున్నట్టు జనసేన కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. అయితే పవన్ బస్సు యాత్ర అనేసరికి అటు అధికార పక్షంలో వణుకు పుట్టింది.

జనసేన ఆవిర్భావం తరువాత పవన్ ఏ పని తలపెట్టినా, ఏకార్యక్రమం నిర్వహించినా సక్సెస్ అవుతూ వచ్చింది. పవన్ అనేసరికి జనం స్వచ్ఛందంగా తరలిరావడం పరిపాటిగా మారింది. అటు పవన్ ప్రసంగాల్లో మాటల తూటాలు పేలుతుంటాయి. ప్రత్యర్థుల గుండెకు తాకేలా వ్యాఖ్యానాలు చేస్తుంటారు. సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉండడంతో ఏపీ పట్ల సమగ్ర అవగాహన ఉంది.అన్ని రంగాల్లో సమస్యలపై ఇప్పటికే పవన్ అధ్యయనం చేశారు.

అన్ని ప్రాంతాల సమస్యలు తెలుసు. వాటి మూలాల గురించి కూడా పవన్ తెలుసుకున్నారు. అటు ప్రభుత్వ వైఫల్యాలు, ఇటు స్థానిక సమస్యలను పవన్ ఎలుగెత్తి చాటగలరు.

అందుకే పవన్ బస్సు యాత్ర అనేసరికి ఒకరకమైన క్రేజ్ ఏర్పడింది. అన్ని పార్టీల వలే జనసేన వాహనాలను సమకూర్చుకున్నా దానిని అధికార పక్షం బూతద్ధంలో చూపే ప్రయత్నం చేసింది. ప్రస్తుతం జనసేన గ్రాఫ్ పెరిగినట్టు సర్వే నివేదికలు చెబుతున్నాయి. అటు రాజకీయ విశ్లేషకులు సైతం ఇదే
అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఈ సమయంలో కానీ పవన్ బస్సు యాత్ర అంటూ అన్ని జిల్లాలను తిరిగితే రాజకీయ స్వరూపమే మారిపోతుందంటున్నారు. అయితే పవన్ .. జగన్ ముందస్తు సంకేతాలతో అక్టోబరులో యాత్ర నిర్వహణకు ముందుకొచ్చారు. అయితే షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని తెలియడంతో సంక్రాంతి తరువాతే శ్రీకారం చుట్టాలని భావిస్తున్నారు. అప్పటికే ఎన్నికలకు ఏడాది ఉంటుంది. ఎన్నికల వాతావరణం ఉంటుంది. అటు తటస్థులతో పాటు అధికార, విపక్షాల నుంచి భారీ చేరికలు ఉండే

Must Read

spot_img