ప్రపంచవ్యాప్తంగా ఏ దేశానికైనా వివిద రకాలుగా ప్రజల నుంచి వసూలు చేసే పన్నులే ఆర్థిక వనరులుగా ఉంటాయి. అందులో ఐటీ ద్వారా జరిగే వసూళ్లు చాలా కీలకం అని చెప్పుకోవచ్చు. దేశంలో నివసించే పౌరులు తమ సంపాదన నుంచి కొంత మొత్తాన్ని పన్ను రూపంలో చెల్లించడం అన్నది ఏ దేశంలోనైనా ఉంటుంది. కానీ కొన్ని దేశాలలో మాత్రం తమ పౌరులపై ఇన్ కం ట్యాక్స్ అస్సలు వసూలు చేయడం లేదు. అలా చేయాలంటే ఆ దేశానికి ఇతర మార్గాల నుంచి ఇబ్బడి ముబ్బడిగా రాబడి అయినా ఉండాలి లేదా అక్కడ సహజవనరులు పుష్కలంగా ఉండి ఉండాలి.

లేదంటే ఇన్ కం టాక్స్ వసూళ్లు లేకుండా దేశంలో అభివ్రుద్ది పనులు ఒక్క అడుగైనా ముందుకు వేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. కానీ కొన్ని దేశాలలో మాత్రం ఇప్పటికీ పన్నులు కట్టనవసరం లేదు. కొన్ని చోట్ల కాస్తో కూస్తో కడితే చాలు అధికారులతో వేదింపులు అసలే ఉండవు. ఆ దేశాలేంటో మచ్చుకు కొన్నింటిని పరిశీలిద్దాం.. గల్ఫ్ దేశాలలో అపారమైన చమురు నిల్వలు సంపాదన కారణంగా పన్నుల గొడవ ఉండదు.
సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఖతార్, కువైట్ కూడా ప్రజల నుంచి ఎలాంటి ఆదాయ పన్నులు వసూలు చేయవు. వాణిజ్య కార్యకలాపాలపై మాత్రం ఖతార్ లో పది శాతం, కువైట్ లో అక్కడి రాజ్యాంగం ప్రకారం అన్ని సహజ వనరులు వాటి ద్వారా వచ్చే ఆదాయాలు మొత్తం ప్రభత్వానికి చెందుతాయి.దీన్ని బట్టి కువైట్ ప్రబుత్వానికి అధిక ఆదాయం చమురు నిల్వల నుండే సమకూరుతాయి,ఇక్కడ జీడీపీ సగటు వ్యక్తి మీద 59,000 డాలర్లకి ఇందులో 90 శాతం ఎగుమతుల ద్వారా లభిస్తుంది.
ఇక్కడ కేవలం 7 శాతం మందే ప్రైవేట్ ఉద్యోగ సంస్థల్లో పనిచేస్తారు.ఇక్కడ పౌరుల మీద ఎటువంటి పన్ను ఉండదు,సామజిక బద్రత కోసం ప్రతి ఒక్కరు వారి ఆదాయం నుండి 7 .5 శాతం చెల్లించాలి. ఇకపోతే సౌదీ అరేబియా అరబ్‌దేశాలలో రెండో అతిపెద్ద దేశం. ఇక్కడ ఆదాయపు పన్నులుండవు.
కార్పొరేట్, నాన్‌సౌదీ షేర్స్‌పై వచ్చిన ఆదాయంపై 20 శాతం పన్ను చెల్లించాలి. సౌదీ షేర్ హోల్డర్లు మాత్రం 2.5 శాతం రిలీజియస్ ట్యాక్స్ చెల్లిస్తారు. ఇక సహజ వాయువు, చమురు కంపెనీలు 30-85 శాతం మధ్య పన్నులు చెల్లిస్తాయి. కానీ,ఆదాయ పన్ను బదులు ‘జకాద్’ అంటే వారి వారి ఆర్థిక స్థితిని బట్టి దానం చేయాలనే నిబంధన అమల్లో ఉంది. ఇక ఒమన్ విషయానికొస్తే అక్కడ ఆదాయ పన్ను మాత్రమే కాదు..ఆస్థిపన్ను, స్థిరాస్తులపై పన్నులు ఉండవు.
ఒమాన్ దేశ జీడీపీ సగటున ఒకోక్కరిపై 29 ,000 డాలర్లుగా ఉంటుంది. ఇది ఫిలిపైన్స్ సగటు జీడీపీ కన్నా 7 రెట్లు ఎక్కువ మధ్య ఆసియ దేశాల్లోని చాలా సరిహద్దు దేశాల్లో లాగానే ఒమాన్ దేశం కూడా ఎక్కువ ఆదాయం కోసం ముడి చమురు నిల్వల మీదే ఆధార పడింది, అయితే కేవలం సామాజిక భద్రతా పథకాల కోసం 6 .5 శాతం పౌరుల నుంచి ఏదో రకంగా సేకరించబడుతుంది మరే ఇతర పన్నులు ఉండవు.
ఇక్కడ కూడా వ్యక్తిగత, కార్పొరేట్ ఆదాయంపై ఎలాంటి పన్నులు లేవు. మూలవేతనంలో యజమానులు తొమ్మిది శాతం, ఉద్యోగులు ఆరు శాతం చొప్పున సామాజిక భద్రత కోసం చెల్లిస్తారు. అంతే ఇక ఏ పన్నుపోటూ మిమ్మల్ని బాధించదు. అంటే భారతదేశంలో ఈపీఎఫ్ కంట్రిబ్యూషన్ లాగా అన్నమాట. విభిన్న ఆర్థిక వ్యవస్థ గల యూఏఈ 30 శాతం చమురు, సహజవాయువుల నుంచే ఆదాయాన్ని పొందుతుంది.
వ్యక్తిగతమైనా, కార్పొరేట్ అయినా పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే ఆయిల్, గ్యాస్, ఫైనాన్స్ సెక్టార్ల నుంచి పన్నులు వసూలు చేస్తారు. ఫారిన్ బ్యాంకుల బ్రాంచ్‌ల నుంచి 20 శాతం, పెట్రోలియం కంపెనీల నుంచి 55 శాతం పన్నులు వసూలు చేస్తారు. ప్రజల నుంచి ఎలాంటి వ్యక్తిగత పన్ను వసూలు చేయరు. జనం ఎంత సంపాదించుకున్నా ఎలాంటి పన్నులు చెల్లించనవసరం లేదు. పైగా విదేశాల నుంచి దేశంలో ఆశ్రయం పొందినవారు ఇక్కడ ఆస్థులు కొనుక్కోవచ్చు.
నిరభ్యంతరంగా వ్యాపారాలు చేసుకోవచ్చు. అందుకే చాలా మంది యూఏఈలో సెటిల్ అయ్యేందుకు ప్రయత్నిస్తుంటారు. అలాగే దక్షిణ అమెరికా ఖండంలో అందమైన బీచీలు కేసినోలతో అలరారే పనామా దేశంలోనూ అంతే.. అదో పన్ను రహిత స్వర్గంగా పేరు పొందింది.
అక్కడి జనం కూడా ఆదాయపన్ను కట్టే పనిలేదు విదేశాలలో వ్యాపారం చేసి సంపాదించిన డబ్బుకూ పన్ను కట్టక్కరలేదు. దేశంలో చేసే వ్యాపారంపై మాత్రం అదీ స్వల్పస్థాయిలో పన్నులు కట్టాల్సి ఉంటుంది. అది కూడా చాలా తక్కువగానే ఉండటంతో సంపన్నులు అక్కడికి క్యూ కడుతున్నారు.
ఇటు బహమాస్‌లో ప్రజలు ఎలాంటి వ్యక్తిగత పన్ను చెల్లించరు. ఈ కరేబియన్ దేశంలో ప్రభుత్వం ఇన్‌కమ్ ట్యాక్స్‌లను వసూలు చేయడం లేదు. ఇక్కడ కూడా స్థిరాస్తులు కొనుగోలు చేస్తే శాశ్వత నివాస అవకాశం కూడా ఉంటుంది.
కరేబియన్ దీవుల్లోని దేశమైన బహమాస్ ఆర్థిక సేవలు మరియు పర్యాటక రంగం నుండి ఆదాయ ఆర్జిస్తోంది, దేశం మొత్తం జీడీపీ లో 60 శాతం పర్యాటకం నుండే వస్తుంది ఐతే ఉద్యోగాల కల్పనా విషయానికొస్తే 50 మందికి పర్యాటకంగానే ఉంటుంది. అందుకే ఆదాయం, ఆస్థి మీద ఒక శాతం మాత్రమే పన్ను విధించే బహమాస్ లో ఇతర పన్నులు ఎటువంటివి లేవు.
అటు అత్యాధునిక సదుపాయాలకు నిలయమైన బెర్ముడాలోనూ పౌరులకు ఇన్ కం ట్యాక్స్ సమస్యలేదు. నిరభ్యంతరంగా ఎంతైనా సంపాదించుకోవచ్చు. ఆఫ్ షోర్ ఫైనాన్స్ హబ్ గానే కాకుండా పర్యాటకుల ద్వారా కూడా ఆదాయం సమకూర్చుకుంటున్న దేశం బెర్ముడా. అమెరికా తూర్పు తీరం లో బ్రిటీష్ ప్రాదేశిక ప్రాంతం లో ఇది ఉంది. ఈ దేశ వ్యక్తి సగటు జీడీపీ 97.000 డాలర్లు. పరోక్ష పన్నుల ద్వారా అధిక ఆదాయం వస్తుండడంతో ప్రత్యక్ష పన్నులు విధించరు.
ఇక మొనాకో విషయానికొస్తే.. పౌరుల నుంచి మొనాకో ప్రభుత్వం ఎలాంటి పన్ను వసూలు చేయదు. అక్కడ ఆరు నెలలు నివసిస్తే చాలు స్థానికులుగా మారిపోయే అవకాశం ఉంటుంది. అప్పటినుంచి మీ నుంచి పన్ను వసూలు చేయరు. సైమన్ ఐలండ్స్, వనౌటూ లాంటి దేశాల్లోనూ ఐటీ చెల్లింపులు ఉండవు. వనౌటూ దేశంలో అయితే డ్యూయల్ సిటిజన్ షిప్ ను అధికారికంగానే అంగీకరిస్తుంది.
అటు యూరప్ లో ఫ్రాన్స్, స్పెయిన్ మధ్య స్వతంత్ర పాలిత ప్రాంతమైన అండోరాలో వ్యక్తిగత ఆదాయ పన్ను కేవలం పది శాతం, అది కూడా గరిష్టంగా 40 వేల యూరోలకే పరిమితం. వారసత్వ ఆస్తులు, బహుమతులపై ఎలాంటి ట్యాక్సులు ఉండవు. బ్రిటన్ ప్రాదేశిక ప్రాంతంలో ఉండే పశ్చిమ కరేబియన్ సముద్రం లో కేమెన్ ఐలాండ్స్ ప్రపంచంలో సంపన్న దేశాల్లో ఒకటైనదిగా చెబుతారు. ఇక్కడ సగటు వ్యక్తి జీడీపీ 43,800 డాలర్లుగా ఉంటుంది.,ఈ దేశానికి ఎక్కువ శాతం ఆదాయం పర్యాటకం ఆర్ధిక సేవల నుంచి వస్తుంది.
ప్రపంచంలోనే అతి పెద్ద బ్యాంకింగ్ రంగాన్ని కలిగి ఉంది, విదేశీయులు ఇక్కడే తమ నల్లధనాన్ని దాచుకునేందుకు వస్తుంటారు. పనిలో పనిగా టూరిజం కూడా బాగా పుంజుకుంది. ఇక్కడి బ్యాంకులో నిలువలు 1.5 ట్రిలియన్ల డిపాజిట్లుగా ఉన్నాయి, అందుకే ఇక్కడ ప్రజలపై ఎటువంటి పన్ను లేదు. ఇవీ ప్రపంచంలోని కొన్ని సంపన్నమైనవీ, ఆదాయపన్ను కట్టకన్కర్లేని దేశాల వివరాలు.
అయితే ఏ దేశంలోని పౌరులకైనా ఎంతో కొంత పన్నులు ఉండాలని అంటారు నిపుణులు. దీని వల్ల దేశం అభివ్రుద్ది విషయంలో తన వంతు కూడా ఉందన్న ఫీలింగ్ వారిలో కలుగుతుంది. టాక్స్ పేయర్ చెల్లించిన సొమ్మును ఖర్చు చేసే విషయంలో ప్రభుత్వాలు కూడా బాధ్యతగా వ్యవహరిస్తాయి.