- పిల్లలు జన్మించే సమయంలో అధిక బరువుతో ఉండటానికి గల కారణం ఏంటి..?
- ఇప్పటి వరకు జన్మించిన శిశువుల్లో అత్యధిక బరువు ఎంత..?
- సాధారణ బరువు కంటే ఎక్కువ బరువుతో జన్మించే శిశువులను ఏమంటారు…?
- అసలు ఒక శిశువు జన్మించే సమయానికి ఎంత బరువు ఉండాల్సిన అవసరం ఉంది..?
- శిశువు బరువు గర్భిణీ స్త్రీ ఉబకాయాన్ని బట్టి ఉంటుందా..?
- లేక ఇతర అనారోగ్య కారణాలు ఏమైనా ఉంటాయా..?
- మహిళలు ఆలస్యంగా గర్భం దాల్చడం కూడా మాక్రోసోమియా పిల్లల పుట్టుకకు కారణమా…?
ఒక మహిళ ఇటీవల 59 సెంటిమీటర్ల పొడవుతో 7.3 కేజీల బరువున్న బిడ్డకు జన్మనిచ్చింది. బ్రెజిల్ అమెజాన్‌లో ఉన్న పరింటిన్స్‌లోని పాద్రే కోలంబో ఆసుపత్రిలో సిజేరియన్ ఆపరేషన్ ద్వారా ఈ డెలివరీ చేశారు. ఆ బిడ్డకు యాంగర్‌సన్ శాంటోస్ అని నామకరణం చేశారు. 1955లో ఇటలీలో ఒక బిడ్డ 10.2 కేజీలతో పుట్టింది. అత్యంత బరువైన శిశు జననాల్లో ఇప్పటివరకు అదే రికార్డు. సాధారణంగా నవజాత శిశువుల బరువు సగటున మగపిల్లాడు అయితే 3.3 కేజీలు, ఆడపిల్ల అయితే 3.2 కేజీలు ఉంటుంది.
అంతకన్నా చాలా ఎక్కువ బరువుతో పుట్టే భారీ శిశువులను మాక్రోసోమియా అని పిలుస్తారు. అంటే.. గ్రీకు భాషలో పెద్ద శరీరం అని అర్థం.. 4కేజీల కంటే ఎక్కువ బరువుతో పుట్టే ఏ శిశువునైనా గర్బధారణ వయసుతో సంబంధం లేకుండా మాక్రోసోమిక్ బేబిగా పరిగణిస్తారు. సాధారణంగా జనించే పిల్లల్లో మాక్రోసోమిక్స్ 12 శాతం వరకూ ఉంటున్నారు. మహిళల్లో గర్భవతిగా ఉన్నప్పుడు వచ్చే అత్యధిక బ్లడ్ షుగర్ వల్ల కడుపులో బిడ్డ 15 నుంచి 45 శాతం వరకు అధికంగా బరువు పెరిగే అవకాశం ఉంటుంది..
భారీ శరీరంతో ఉన్న శిశువుకు జన్మనిచ్చేటప్పుడు తల్లులకు కూడా కొన్ని రకాలైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. దానిలో ఒకటి తల్లుల శరీర బరువు భారీగా పెరుగడం. ఊబకాయంతో ఉన్న తల్లులకు మాక్రోసోమియా పిల్లలు పుట్టే అవకాశాలు రెండింతలు ఎక్కువగా ఉంటాయి. ప్రెగ్నెన్సీ సమయంలో అత్యధికంగా బరువు పెరగడం కూడా మాక్రోసోమియా ప్రమాదానికి దారితీస్తుంది. జెస్టేషనల్డ యాబెటీస్ అనేది కూడా ఈ విషయంలో ప్రమాదకరంగా మారుతోంది.
యాంగర్ సన్ ఇంతలా బరువు పెరిగేందుకు కారణం ఆ బాబు తల్లికి డయాబెటీస్ ఉండడమేనని పాడ్రే కోలంబో ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు.. జెస్టేషనల్ డయాబెటీస్ లేనప్పటికీ… ప్రెగ్నెన్సీ సమయంలో తల్లి శరీరంలో ఇన్సులిన్ సామర్థ్యం పెరగడంతో, ప్లాసెంటా నుంచి పిండంలోకి వెళ్లే గ్లూకోజ్ శాతం కూడా పెరుగుతుంది. దీని వల్ల కడుపులో ఉన్న పిండం అధిక బరువుతో పెరుగుతుంది.. ఆలస్యంగా గర్భం దాల్చడం కూడా మాక్రోసోమియా పిల్లల పుట్టుకకు కారణమవుతోంది.
- 35 ఏళ్లు పైబడిన తర్వాత గర్భం దాల్చితే, పుట్టే పిల్లలకి మాక్రోసోమియా వచ్చే అవకాశాలు 20 శాతం ఎక్కువగా ఉంటాయి..
తండ్రుల వయసు కూడా ఇక్కడ ప్రధానమే. తండ్రి వయసు 35 ఏళ్ల పైనుంటే, మాక్రోసోమియా పిల్లలు పుట్టే అవకాశం 10 శాతం ఎక్కువగా ఉంటుంది. 40 వారాల కంటే అత్యధికంగా ప్రెగ్నెన్సీ కాలం ఉంటే, మాక్రోసోమిక్ పిల్లలు పుట్టే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా 42 వారాలు లేదా అంతకుమించినప్పుడు ఈ ప్రమాదం పెరుగుతుంది. అలాగే అమ్మాయిలతో పోలిస్తే అబ్బాయిలు ఎక్కువగా మాక్రోసోమిక్‌తో పుట్టే అవకాశాలు మూడింతలు ఎక్కువగా ఉంటాయి. పిల్లల్ని
కనేటప్పుడు వచ్చే ప్రమాదాలు మాక్రోసోమియా పిల్లలు భారీ శరీరంతో ఉండటం వల్ల నార్మల్ డెలివరీ కావడం కష్టమవుతుంది.
తల్లి ప్యూబిక్ బోన్ వెనుకాల బిడ్డ భుజం ఇరుక్కుపోయే ప్రమాదం ఉంటుంది. ఇది చాలా సాధారణంగా జరుగుతూ ఉంటుంది. దీన్నే వైద్య పరిభాషలో ‘షోల్డర్ డిస్టోసియా’ అంటారు. ఒకవేళ పుట్టే బిడ్డ మధ్యలోనే ఇరుక్కుపోతే, పాపకి ఊపిరాడదు. బొడ్డు తాడు కూడా కుచించుకుపోతుంది. అంతేకాక, పిల్లల శరీరంతో చేయి భుజాన్ని కలిపే క్లావికల్ బోన్ కూడా దెబ్బతింటుంది. లేదా వెన్నముక నుంచి చేతికి, చేతి భుజాలకు సెన్సార్ సిగ్నల్స్ పంపే నరాలు కూడా పాడవుతాయి.
సీరియస్ కేసుల్లో శరీర భాగాలు శాశ్వతంగా పాడైపోతాయి. షోల్డర్ డిస్టోసియా నవజాత శిశువుల్లో 0.7 శాతంగా ఉంటుంది. కానీ, మాక్రోసోమిక్ బేబీల్లో ఈ ప్రమాదం 25శాతంగా ఉంది. తల్లులకు కూడా బిడ్డల్ని కనే సమయంలో యోని దెబ్బతినే ప్రమాదం ఎక్కువగా ఉంటాయి. దీని వల్ల బ్లీడింగ్ ఎక్కువగా అయి కొన్నిసార్లు తల్లికి ప్రాణాపాయం తలెత్తుతుంది. పిల్లల బరువు ఎక్కువగా ఉంటే, నార్మల్ డెలివరీ సమయంలో యోని దెబ్బతినే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మాక్రోసోమిక్ బేబీల కదలిక బరువు కారణంగా సాధారణం కంటే మెల్లగా ఉంటుంది. దీని వల్ల తల్లులకు ఇన్‌ఫెక్షన్ సోకుతుంది. బ్లాడర్ లో ఉన్న మూత్రం బయటికి రాకుండా అక్కడే ఆగిపోతుంది. ఇంటర్నల్ బ్లీడింగ్ కూడా అవుతుంది.
మాక్రోసోమిక్ పిల్లల విషయంలో మనకు తెలియని మరో విషయం ఏమిటంటే, వారు జీవితాంతం అంతే బరువుతో ఉంటారా..? లేదా..? అన్నది సందేహం.ఏడేళ్ల వరకు వారు అధిక బరువుతో లేదా ఊబకాయంతో ఉండే అవకాశాలున్నాయని కొన్ని గణాంకాలు చెబుతున్నాయి. ఆ తర్వాత వారికి టైప్ 2 డయాబెటీస్ కూడా వచ్చే అవకాశాలున్నాయని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఈ రకమైన శిశు జననాలు ఇక ముందు ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. గతంతో పోలిస్తే 1970 తర్వాత శిశువుల బరువు సగటున సుమారు 450 గ్రాములు అధికంగా ఉంటోంది. మాక్రోసోమియాకు ప్రధాన కారణమైన ఊబకాయం పెరుగుతుండటంతో, అధిక బరువుతో పుట్టే పిల్లల సంఖ్య కూడా పెరుగుతుందని భావిస్తున్నారు.
మాక్రోసోమిక్ పిల్లల విషయంలో మనకు తెలియని ఎన్నో విషయాలు ఉన్నాయి.. ఏడేళ్ల వరకు వారు అధిక బరువుతో లేదా ఊబకాయంతో ఉండే అవకాశాలున్నాయని కొన్ని గణాంకాలు చెబుతున్నాయి. ఆ తర్వాత వారికి టైప్ 2 డయాబెటీస్ కూడా వచ్చే అవకాశాలున్నాయని పరిశోధనలు సూచిస్తున్నాయి.