Homeఅంతర్జాతీయంప్రపంచంలోనే భయంకరమైన పోవెగ్లియా ఐలాండ్...

ప్రపంచంలోనే భయంకరమైన పోవెగ్లియా ఐలాండ్…

ప్రపంచంలో అనేక వింతలు, విశేషాలున్నాయి. కొన్ని ప్రదేశాలు చరిత్రలో వెరీ వెరీ స్పెషల్ గా నిలుస్తాయి. కొన్ని ప్రాంతాల చరిత్ర ఆసక్తికరంగా ఉంటుంది. ఇప్పుడు మీరు చూడబోయే ఓ ప్రాంతం మానవ అవశేషాలతో నిర్మించబడి ఉంటుంది. మరో భయంకరమైన విషయం ఏమిటంటే.. ఇప్పటి వరకూ ఇక్కడకు వెళ్ళినవారు తిరిగిరాలేదు..దాని పేరే పోవెగ్లియా ఐలాండ్. ఇది ప్రపంచంలోనే భయంకరమైన ప్రాంతంగా చెబుతున్నారు..అదేంటో ఇప్పుడు చూద్దాం..

ఇలాంటి ప్రాంతాల గురించి తెలుసుకుంటే భయంతో వణకాల్సిందే. ఈ రోజు ప్రపంచంలో అత్యంత భయంకరమైన ప్రాంతం గురించి తెలుసుకోనున్నాం. ఈ ప్రదేశంలో సగం భూమి మానవ అవశేషాలతో నిర్మితమైందని చెబుతారు. ఇలా నిర్మాణం వెనుక ఉన్న చరిత్ర కూడా అంతే ప్రమాదకరమైనది. ప్రపంచంలో అత్యంత భయంకరమైన నిషేధ ప్రాంతం ఇటలీలోని వెనిస్.. లిడో నగరాల మధ్య వెనీషియన్ గల్ఫ్.పోవెగ్లియా ద్వీపానికి వెళ్లిన వారు తిరిగి రారు అని అంటారు. ఇప్పటి వరకూ ఈ ప్రాంతాల్లోకి వెళ్లి బతికి వచ్చిన మనిషి ఒక్కరూ లేరని చెబుతున్నారు. దీంతో ఈ ప్రాంతానికి సామాన్యులు అడుగు పెట్టడంపై ప్రభుత్వం నిషేధించింది. ఈ ద్వీపం గురించి తెలుసుకున్న వారు శాపగ్రస్త ద్వీపం అని పిలుస్తారు అంతేకాదు ప్రజలు దీనికి దూరంగా ఉండాలని సలహా ఇస్తారు.

17 ఎకరాలలో విస్తరించి ఉన్న ఈ ద్వీపాన్ని ప్రపంచానికి దూరంగా ఉంచుతూ చుట్టూ ఎత్తైన గోడలు ఉన్నాయి. ఇంతకీ ఈ ద్వీపం ఎందుకు ప్రమాదకరమైనది అంటే..ఇటలీలో ప్లేగు మహమ్మారి వ్యాపించినప్పుడు బాధితులకు వైద్యం ఇచ్చే వీలు లేదని భావించిన ప్రభుత్వం దాదాపు 1.60 లక్షల మందిని ఈ ద్వీపంలోకి తీసుకుని వచ్చి వదిలేశారు. ఇలా చేయడం వలన వ్యాధి పెద్దగా వ్యాపించదని ప్రభుత్వం భావించింది. అప్పడు తాము ఈ చర్య తీసుకోవడం సరైనదని ప్రభుత్వం చెప్పింది. ఈ సంఘటన జరిగిన కొద్దిసేపటికే.. ఈ దేశం బ్లాక్ ఫీవర్ అనే మరో వ్యాధి బారిన పడటం ప్రారంభమైంది. మళ్లీ ఈ ద్వీపం గురించి ప్రభుతం ఆలోచించడం ప్రారంభించింది. ఆ వ్యాధితో ఎవరు చనిపోయినా.. మరెవరూ ఆ వ్యాధి బారిన పడకుండా అక్కడ ద్వీపంలోనే మ్రుతదేహాలను ఖననం చేశారు.

అందుకే ఈ ద్వీపంలోని సగం భూమి మానవ అవశేషాలతో నిర్మితమైందని చెబుతారు. ఎక్కడ చూసినా నిర్మాణాలతో పాటు ఎముకలు కనిపిస్తుంటాయి. చాలా మంది ప్రజలు ఈ ప్రదేశాన్ని శాపగ్రస్తపు దీవిగా పిలుస్తారు. అంతేకాదు.. అర్ధాయువుతో మరణించిన వ్యక్తుల ఆత్మలు ఇక్కడ ఉన్నాయని స్థానికుల విశ్వాసం. అంతేకాదు ఈ ద్వీపం నుండి తరచుగా వింత శబ్దాలు వినిపిస్తాయని.. తాము విన్నామని చెబుతున్నారు. అందుకనే ఈ స్థలంలోకి వెళ్లడంపై స్థానికులకు, పర్యాటకులపై శాశ్వతంగా నిషేధాజ్ఞలు విధించింది ప్రభుత్వం. ప్రస్తుతం దీనిని మోస్ట్ హంటెడ్ ప్లేస్ గా పేరు వచ్చేసింది. ఒకప్పుడు వ్యాధిగ్రస్తులను చావడానికి పంపించగా ఇప్పుడు అక్కడికి వెళితే చాలు చనిపోతామన్న నమ్మకం అక్కడివారిలో పాతుకుపోయింది. ఇప్పటికీ అక్కడ నిశ్శబ్దం తాండవించే వీధులు కనిపిస్తాయి.

14వ శతాబ్దంలో జనం అక్కడి నగరంలో బాగానే ఉండేవారు. అయితే ఒకరి తరువాత ఒకరుగా ఐలాండ్ నుంచి బయటకు వలసలు పోవడం మొదలుపెట్టాక ఒంటరితనం భయంతో విధిలేని పరిస్థితిలో ఖాళీ చేసి సమీప ప్రాంతాలకు తరలిపోయారు. ప్లేగు వ్యాధి కారణంగానే అది పునరావాస కేంద్రంగా మారిపోయింది. వ్యాధిగ్రస్తులు చనిపోతున్నా పట్టించుకునేవారే లేకుండా పోయారు. నిజానికి అక్కడికి వెళ్లిన వారెవరూ వ్యాధి కారణంగా తిరిగి రాలేకపోయారు. దాంతో ఆ ద్వీపానికి వెళ్లిన వారెవరూ తిరిగిరారని పేరు పడిపోయింది. ఎందుకంటే అప్పటి ఇటలీ ప్రభుత్వం వ్యాధిగ్రస్తులను చావడానికి పంపించింది. చనిపోయిన వారిని అక్కడే ఖననం చేయడం కూడా చేసారు. దాంతో అది చావులకు నిలయంగా మారిపోయి గోస్ట్ సిటీగా మారిపోయింది.

1800 సంవత్సరం నుంచి 1900 దాకా అదో మానసిక రోగులకు ఆశ్రయం ఇచ్చేందుకు ఉపయోగపడింది పోవెగ్లియా ద్వీపం. అయితే అక్కడి వారి నమ్మకాల కారణంగా మంచి వారు కూడా మానసిక రోగులుగా మారిపోయేవారు. డాక్టర్లు సైతం పిచ్చివాళ్లుగా మారిపోయి ప్రాణాలు కోల్పోవడంతో ప్రభుత్వం ఆలోచనలో పడింది. అక్కడేం పని తలపెట్టినా కాదు..ఎవరు సాహసించి వెళ్లినా మళ్లీ తిరిగిరారు..ఈ పరిస్తితి 1990 వరకు కొనసాగింది. అనుకోని ఘటనలు జనాన్ని తీవ్రంగా భయపెట్టాయి. దాంతో ఇక ఆ ద్వీపాన్ని శాశ్వతంగా మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మత్సకారులు సైతం పొరబాటున ఆ ద్వీపం తీరాలకు కూడా వెళ్లరు. ఒకదాని వెంట ఒకటిగా శతాబ్దాల పాటు సాగిన బీభత్సం కారణంగా భూమిపైనే పోవెగ్లియా ఐలాండ్ చాలా ప్రమాదకరమైన హాంటెడ్ ప్లేస్ గా పేరు మోసింది.

Must Read

spot_img