ప్రస్తుతం కొనసాగుతున్న పర్యావరణ బీభత్సం కారణంగా ప్రక్రుతిలో జీవ వైవిధ్యం దెబ్బతింటోంది. ఈ నేపథ్యంలో తేనెటీగలకు అపారమైన ముప్పు ఏర్పడింది. మొక్కల్లో పరపరాగ సంపర్కానికి తోడ్పడే తేనెటీగలే లేకుంటే అడవులు బోసిపోతాయి. దీంతో పర్యావరణానికి తీరని నష్టం సంభవిస్తుంది. అంతటి ప్రాధాన్యత కలిగిన తేనెటీగలను వ్యాధుల నుంచి రక్షించే వ్యాక్సిన్ కు అమెరికా ఆమోదం తెలిపింది.
ప్రపంచంలోనే తొలిసారిగా తేనెటీగలకు వ్యాక్సీన్ తయరైంది. అయితే తేనెటీగాలకు టీకాలు ఎలా వేస్తారు..? అసలు తేనెటీగలకు టీకాలు వేయడమేంటి..అన్న ప్రశ్నలు ఎవరికైనా ఆసక్తిగానే ఉంటాయి. మీరు వింటున్నది నిజం..ప్రపంచంలోనే తొలిసారిగా తేనెటీగల కోసం వ్యాక్సీన్ అందుబాటులోకి వచ్చింది. అమెరికా దీనికి ఆమోదం పలికింది.
‘అమెరికన్ ఫౌల్‌బ్రూడ్ డిసీజ్’ అనే రోగం నుంచి తేనెటీగలు మృత్యువాత పడకుండా ఈ వ్యాక్సీన్ కాపాడుతుంది. యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ‘యూఎస్‌డీఏ’ ఈ వ్యాక్సీన్‌కు షరతులతో కూడిన అనుమతులు ఇచ్చినట్లు దీని తయారీ సంస్థ యలాన్ యానిమల్ హెల్త్ వెల్లడించింది. మొక్కల్లో పరాగ సంపర్కానికి సహకరించే జీవులుగా పర్యావరణంలో తేనెటీగల పాత్ర కీలకంగా ఉంటుంది.
భవిశ్యత్తులో ‘తేనెటీగలను బతికించడానికి ఈ వ్యాక్సీన్ కీలకం కానుందని డలాన్ యానిమల్ హెల్త్ సీఈవో అన్నెట్ క్లైజర్ ఓ ప్రకటనలో తెలిపారు. రాణి ఈగకు ఈ వ్యాక్సీన్‌ను ఇవ్వడం ద్వారా లార్వాలు రోగనిరోధక శక్తిని సంతరించుకునేలా చేస్తారు. అమెరికాలో 2006 నుంచి తేనెటీగల గుంపులు తగ్గిపోతున్నాయని యూఎస్‌డీఏ గణాంకాలు చెప్తున్నాయి.
తేనెటీగల ఆరోగ్యంపై అనేక అంశాలు ప్రభావం చూపుతాయని.. పరాన్నజీవులు, కీటకాలు, వ్యాధులు, ఏకంగా గుంపులుగుంపులు ఒకేసారి చనిపోవడానికి కారణమయ్యే బ్యాక్టీరియా వ్యాధులు వంటివన్నీ వాటి మరణానికి కారణమవుతున్నట్లు యూఎస్‌డీఏ చెప్పింది. పర్యావరణానికి అత్యంత ప్రాధాన్యత కలిగినవి తేనెటీగలంటే అతిశయోక్తి కాదు..
ప్రపంచంలోని పంట ఉత్పత్తులలో మూడో వంతుకు కారణం పరాగ సంపర్కానికి తోడ్పడే తేనెటీగలు, పక్షులు, గబ్బిలాలు వంటివేనని యునైటెడ్ నేషన్స్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ చెప్తోంది. కాగా అమెరికన్ ఫౌల్‌బ్రూడ్ డిసీజ్ కారణంగా తేనెటీగల పెంపకందారులకు సవాళ్లు ఎదురవుతున్నాయి. ఇంతవరకు ఈ వ్యాధికి చికిత్స అనేదే లేదు. అంతేకాదు… ఇది చాలావేగంగా వ్యాపించే వ్యాధి.
ఈ వ్యాధి వచ్చినట్లు గుర్తిస్తే తేనెటీగలను పెంచే పెట్టెలు, ఈగలు అన్నిటినీ మంటల్లో కాల్చడమే దీనికి పరిష్కారంగా ఉండేది ఇంతవరకు. అలా చేస్తే మిగతావాటికి వ్యాపించకుండా ఆగేది. ఇప్పుడు కొత్తగా అందుబాటులోకి వచ్చిన వ్యాక్సీన్‌లో అమెరికన్ ఫౌల్‌బ్రూడ్ డిసీజ్‌కు కారణమయ్యే ‘పేనిబాసిల్లస్ లార్వా’ బ్యాక్టీరియానే వాడుతారు.
అయితే, అచేతన స్థితిలో ఉండే బ్యాక్టీరియా వ్యాక్సీన్‌లో ఉంటుందని డలాన్ యానిమల్ హెల్త్ చెప్పింది. తేనెతుట్టెలోని శ్రామిక ఈగలు రాణి ఈగకు అందించే ఆహారం రాయల్ జెల్లీలో వ్యాక్సీన్ ద్వారా ఈ బ్యాక్టీరియాను ప్రవేశపెడతారు. ఆ ఆహారం ద్వారా రాణి ఈగకు అందే రోగనిరోధక బ్యాక్టీరియా దాని అండాశయాలలోకి చేరుతుందని వ్యాక్సీన్ తయారీ సంస్థ చెప్పింది.
రాణి ఈగ అండాశయాలలోకి వ్యాక్సీన్ చేరడం వల్ల అది లార్వాకు రోగనిరోధక శక్తిని కలిగిస్తుందని.. దానివల్ల కొత్తగా జన్మించే ఈగలు ఈ వ్యాధిని తట్టుకోగలుగుతాయని చెప్తోంది. ఈ కొత్త వ్యాక్సీన్ తేనెటీగల పెంపకందారులకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నారు వ్యాక్సీన్ ఈ ఏడాదే పరిమిత సంఖ్యలో అందుబాటులోకి రానుందని తయారీ సంస్థ డలాన్ వెల్లడించింది.
- ప్రపంచంలోనే మొట్ట మొదటిసారిగా తేనెటీగల కోసం ఓ టీకా తయారీకి అమెరికా ఆమోదం తెలిపింది…
డాలన్ యానిమల్ హెల్త్ ఈ టీకాను అభివృద్ధి చేసింది. అమెరికన్ ఫౌల్ బ్రూడ్ డిసీజ్ నుంచి ఈ టీకా తేనెటీగలకు రక్షణ కల్పిస్తుంది. రాణి ఈగ ఆహారంలో టీకాను మిక్స్ చేయడం ద్వారా తేనెటీగలకు ఈ వ్యాక్సిన్ అందిస్తారు. తేనెటీగల రక్షణలో ఇదో కీలక ముందడుగు అని డాలన్ సీఈవో వ్యాఖ్యానించారు. క్రమంగా ఈ టీకాలను ప్రపంచవ్యాప్తంగా సరఫరా చేసేందుకు అనుమతులు రానున్నాయి.
అప్పుడు అన్ని ప్రాంతాలలో తేనెటీగలకు ఈ టీకాలు పనిచేయడం ప్రారంభిస్తాయి. అయితే తేనెటీగలకు వచ్చే ఇతర వ్యాధులను కూడా గుర్తించి ఆ మేరకు వ్యాక్సిన్లను తయారుచేయడం బెటర్ అంటున్నారు నిపుణులు.