Homeసినిమాసూపర్ హిట్ భూల్ భూలయా సినిమాకు థర్డ్ సీక్వెల్

సూపర్ హిట్ భూల్ భూలయా సినిమాకు థర్డ్ సీక్వెల్

బాలీవుడ్ లో అన్ని రకాల ఆడియన్స్ ఉంటారు. అయితే అక్కడ హారర్ సినిమాలను ఎంజాయ్ చేసే వారి సంఖ్య ఎక్కువ. అది కనిపెట్టిన ప్రియదర్శన్ భూల్ భూలయా అనే సినిమా తెరకెక్కించారు. 2007లో వచ్చిన ఈ సినిమా బీ టౌన్ ఆడియన్స్ కు ఒక మంచి హారర్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వడంతో సినిమాను సూపర్ హిట్ చేశారు. ఆ తర్వాత సీక్వెల్ గా భూల్ భూలయా 2 సినిమా తీశారు. ఈ సినిమా కూడా హిట్ అయింది. సీన్ కట్ చేస్తే…ఇప్పుడు పార్ట్ 3 కూడా రెడీ అవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అక్షయ్ కుమార్, విద్యా బాలన్ లీడ్ రోల్స్ లో నటించిన భూల్ భూలయా మూవీ అప్పట్లో సూపర్ హిట్ గా నిలిచింది. 2007లో ఈ సినిమా రిలీజైన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్ గా భూల్ భూలయా 2 సినిమా తీశారు. 2022లో వచ్చిన ఈ సీక్వెల్ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. భూల్ భూలయా 2 సినిమాలో కార్తీక్ ఆర్యన్ హీరోగా నటించగా కియరా అద్వాని, టబు నటించారు.

ఈ రెండు పార్ట్స్ కూడా సూపర్ హిట్ అవడంతో భూల్ భూలయా 3 కి రెడీ అవుతున్నారు మేకర్స్. ఈ సినిమాకు ఒక అద్భుతమైన యూనిక్ స్టోరీ కుదిరిందని అన్నారు దర్శక నిర్మాతలు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. సెకండ్ పార్ట్ లో లాగానే భూల్ భూలయా 3లో కూడా కార్తీక్ ఆర్యన్ హీరోగా నటిస్తాడని బాలీవుడు కోడై కూస్తోంది.

నిర్మాత భూషణ్ కుమార్ భూల్ భూలయా 3 సినిమాను ఈ ఏడాదే పూర్తి చేయాలని తొందరగా ఉన్నారట. ఇక ఈ సినిమాకు థర్డ్ సీక్వెల్ కూడా ప్రేక్షకులను మెప్పించేలా సిద్ధం చేస్తున్నారు అని సినీ విశ్లేషకుల నుండి వస్తున్న సమాచారం. కార్తీక్ ఆర్యన్ ఈ సినిమాతో మరోసారి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉన్నాడు. మరి భూల్ భూలియా థర్డ్ మూవీ ఆశించిన స్థాయిలో ఉంటుందా లేదా అన్నది చూడాలి.

Must Read

spot_img