Homeఅంతర్జాతీయంఅఫ్గాన్ మహిళల విద్యపై నిషేధం విధించిన తాలిబన్లు..!

అఫ్గాన్ మహిళల విద్యపై నిషేధం విధించిన తాలిబన్లు..!

ఇరాన్ లో హిజాబ్ ఉద్యమం మాదిరిగానే ఆఫ్గినిస్తాన్ లో మహిళలు తమ చదువుల కోసం రోడ్డెక్కారు. తమ భవిశ్యత్తును చాందసవాదం కోసం త్యాగం చేయలేక ఎదురు తిరిగి ఏమీ చేయలేక కుమిలిపోతున్నారు ఆఫ్గన్ మహిళలు. చూస్తుండగానే తాలిబన్ల షరియా చట్టాలకు బలవడం ఇష్టం లేక ఇప్పుడు ఉద్యమబాట పట్టారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తున్నారు. కానీ తాలిబన్లు మాత్రం ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేస్తున్నారు.

అఫ్గాన్‌లో విద్యార్థినుల నిరసన గళం బలహీనంగా వినిపిస్తోంది. ఇరాన్ లో హిజాబ్ గురించి జరిగిన ఉద్యమంతో దీనిని పోల్చడానికి లేకుండా పోతోంది. యునివర్సిటీల్లో మహిళల ప్రవేశాలపై నిషేధం విధించడంపై వారు చేస్తున్న ఆందోళనను తాలిబన్లు వెంటనే అణచివేస్తున్నారు. వ్యాటర్ క్యానన్లు రబ్బరు బులెట్లతో చదువుకోసం ఆక్రోశిస్తున్న అమ్మాయిలను చెదరగొడుతున్నారు.

అయితే అఫ్గానిస్తాన్‌లో ఉన్నతవిద్యాసంస్థల్లో మహిళా విద్యార్థులపై నిషేధం విధించి, మహిళా విద్యను నిర్దాక్షిణ్యంగా అణిచివేస్తున్న తాలిబన్‌ ప్రభుత్వానికి విద్యార్థినుల నుంచి నిరసనలు మరింత పెరిగాయి. తమ చదువులు తమ భవిశ్యత్తు గురించి తాడో పేడో తేల్చుకోవాలనుకున్న మహిళలు తాలిబన్లను ఎదిరిస్తున్నారు.

దయలేని తాలిబాన్లను ఎదిరించి వీధుల్లోకి వచ్చి ఆందోళనకు దిగిన విశ్వవిద్యాలయాల విద్యార్థినులు తమ గొంతుకను గట్టిగా వినిపిస్తున్నారు. శనివారం హెరాత్‌ నగరంలోని రాష్ట్ర గవర్నర్‌ అధికారిక నివాసం ఎదుట ఆందోళన చేసేందుకు దాదాపు 150 మంది వర్సిటీ విద్యార్థినులు బయల్దేరారు. ‘విద్య మా హక్కు’ అంటూ ప్లకార్డులు, బ్యానర్లను చేతబూనిన వారిని తరిమికొట్టేందుకు తాలిబన్‌ భద్రతా బలగాలు వాటర్‌ క్యానన్లు వినియోగించారు.

రహదారి వెంట ఉన్న చెట్ల కొమ్మలతో విద్యార్థినులను తరిమికొట్టారు. అయినా సరే నిరసన ర్యాలీని ముందుకు తీసుకెళ్లేందుకు విద్యార్థినులు ప్రయత్నించారు. సంబంధించిన వీడియోను అసోసియేటెడ్‌ ప్రెస్‌ వార్తాసంస్థ విడుదల చేసింది. ఈ వార్తలను బయటి ప్రపంచానికి చేరవేసిన జర్నలిస్టులను అదుపులోకి తీసుకున్నారు తాలిబన్లు.

ఆఫ్ఘన్ బాలికల నిరసన..

మహిలలు మొదట ‘తారిఖీ పార్క్‌ నుంచి నిరసన ర్యాలీ మొదలుపెట్టారు. అయితే, నగరంలో ప్రతీ వీధిలో సాయుధ తాలిబన్లు వారిని అడుగడుగునా అడ్డుకున్నారు. దారుణంగా కొట్టారు. అయితే వారిపై జరిగిన దాడి దారుణం’ అంటూ మరియం అనే విద్యార్థి తాలిబన్లను ఎదిరంచగా ఆగ్రహంగా మాట్లాడారు. అయితే, ఈ నిరసన ర్యాలీపై రాష్ట్ర గవర్నర్‌ హమీదుల్లా ముతావకిల్‌ భిన్నంగా మాట్లాడారు.

‘ఓ నలుగురైదుగురు అమ్మాయిలు వచ్చి ఏదో ఫిల్మ్‌ షూట్‌ చేసి వెళ్లిపోయారు. వారికి ఎలాంటి అజెండా లేదు’ అని తేల్చివేసారు. వర్సిటీల్లో మహిళా విద్యపై నిషేధం విధించడంతో తాలిబాన్‌ పాలనపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. సౌదీ అరేబియా, టర్కీ, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్, ఖతార్, జీ-7 కూటమి దేశాలు తాలిబన్‌ సర్కార్‌ను తీవ్రంగా తప్పుబట్టాయి.

అఫ్గాన్‌ విద్యార్థినులకు మద్దతుగా అఫ్గాన్‌ శరణార్థి విద్యార్థులు నిరసన ర్యాలీ చేపట్టారు..

అఫ్గాన్‌ విద్యార్థినులకు మద్దతుగా పాక్‌లోని క్వెట్టా సిటీలో కొందరు అఫ్గాన్‌ శరణార్థి విద్యార్థులు నిరసన ర్యాలీ చేపట్టారు. మహిళలను చదువులకు దూరం చేసేందుకు కంకణం కట్టుకున్న అఫ్గాన్‌ తాలిబన్‌ పాలకులు తాజాగా మహిళలకు శరాఘాతం వంటి మరో చర్యకు పూనుకున్నారు. అఫ్గానిస్తాన్‌లోని విదేశీ, దేశీయ ప్రభుత్వేతర సంస్థలు మహిళా ఉద్యోగాలను తొలగించాలంటూ ఆదేశాలిచ్చారు.

తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఇవి అమల్లో ఉంటాయని ఆర్థిక మంత్రి మహ్మద్‌ హనీఫ్‌ అన్నారు. వీటిని పాటించని ఎన్జీవోల అనుమతులను రద్దు చేస్తామని హెచ్చరించారు. పార్కులు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో మహిళలు ప్రవేశించరాదనే ఆంక్షలు ఇప్పటికే అమలులో ఉన్నాయి. వాటిపట్ల కూడా నిరసనలు వెల్లువెత్తాయి.

పాపం ఆఫ్గన్ లోని అభం శుభం తెలియని టీనేజీ అమ్మాయిలు పెద్ద ఎత్తున ‘విద్య మా హక్కు’ అంటూ నినాదాలు చేస్తుంటే కర్కోటకుల్లాంటి తాలిబన్లు వారిపై ఒక్కసారిగా విరుచుపడ్డారు. దాంతో అమ్మాయిలు భయంతో పరుగులు తీసారు. ఈ ద్రుష్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే పారిపోయినట్టే పారిపోయి కాసేపు తర్వాత మళ్ళీ వారు తమ నిరసన ప్రారంభించారు.

దీంతో తాలిబన్లు ప్రతి వీధిలో, ప్రతి మూలల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. సాయుధ వాహనాలు సైనికులతో గస్తీ మొదలుపెట్టారు. తాలిబన్‌ అంటే పష్నో భాషలో విద్యార్థి అని అర్థం. చాందసవాదాన్ని ఒంటబట్టించుకున్న సాయుధ తాలిబన్ల్లు ఇప్పుడు మహిళల విద్యను తొక్కిపడుతున్నారు. ఆఫ్ఘన్‌లో తాలిబన్ల పాత పాలన పునరావృతమవుతుందని అంటున్నారు విశ్లేషకులు.

Must Read

spot_img