Homeతెలంగాణకవిత విచారణకు రంగం సిద్ధమైంది

కవిత విచారణకు రంగం సిద్ధమైంది

ఈనెల 11న సీబీఐ విచారణకు కవిత గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.. అయితే ఇదంతా .. ఆమె ప్రెస్ మీట్ వల్లే వచ్చిందన్న టాక్ ఇప్పుడు హాట్టాపిక్ గా మారుతోం మిగిలిన నేతల్లా .. జస్ట్ ఖండిస్తే, సరిపోయేదని.. కామెంట్లతో హీట్ పెంచేశారని టాక్ వినిపిస్తోంది. సీఎం కేసీఆర్ త‌న‌య క‌వితను సీబీఐ విచారించేందుకు ముహూర్తం ఖ‌రారైంది. ఈ నెల 11నఉద‌యం 11 గంట‌ల‌కు విచార‌ణ నిమిత్తం మీ ఇంటికి వ‌స్తామ‌నిక‌విత‌కు సీబీఐ వ‌ర్త‌మానం పంపింది.నిజానికి ఈ నెల 6న క‌విత నుంచి సీబీఐ వివ‌రాలు సేక‌రించాల్సి వుండింది.సీబీఐ నోటీసుల‌పై టీఆర్ఎస్ అనేక త‌ర్జ‌న‌భ‌ర్జ‌న‌ల అనంత‌రం… చివ‌రికి విచార‌ణఎదుర్కోడానికిఅధికార పార్టీ సిద్ధ‌మైంది. దీంతో సీబీఐ విచార‌ణ‌పై కవిత స్ప‌ష్ట‌త ఇచ్చింది.ఈ నెల 11, 12, 14, 15 తేదీల్లో తానుఅందుబాటులో వుంటాన‌ని సీబీఐఅధికారుల‌కుక‌విత స‌మాచారం చేర‌వేశారు. క‌విత ఇచ్చిన తేదీల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్నామ‌ని, 11న ఉద‌యం 11 గంట‌ల‌కు మీఇంటికి విచార‌ణ నిమిత్తం వ‌స్తామ‌ని, అందుబాటులో ఉండాలంటూ సీబీఐ డీఐజీ రాఘ‌వేంద్ర వ‌త్స ఎమ్మెల్సీ క‌విత‌కు మెయిల్ పంపారు. సానుకూలం వ్య‌క్తం చేస్తూ క‌వితస్పందించారు.

ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్‌లో క‌విత‌ను సీబీఐ విచారించాల‌ని అనుకోవ‌డం కీల‌క ప‌రిణామంగా చెబుతున్నారు.ఎందుకంటే సీబీఐ విచారించిన త‌ర్వాత కవిత పాత్ర ఏమీలేద‌ని తేల్చేస్తే… రాజ‌కీయంగా అది బీజేపీపై తీవ్ర ప్ర‌భావం చూపుతుంది. దీన్ని టీఆర్ఎస్ రాజ‌కీయంగా త‌న‌కు అనుకూలంగా మ‌లుచుకుంటుంది. ఆ అవ‌కాశాన్ని కేంద్రంలోఅధికారం చెలాయిస్తున్న బీజేపీ ఇస్తుంద‌ని అనుకోలేం. క‌విత‌ను ఇరికించే వ్యూహంలో సీబీఐ వేస్తున్న మొద‌ట అడుగుగా రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. సీబీఐ విచార‌ణవ‌ర‌కూ వెళ్లి, ఆ త‌ర్వాత బీజేపీ వెన‌క్కి తగ్గే అవ‌కాశాలు లేవ‌ని దేశ వ్యాప్తంగా ఆ పార్టీ చ‌ర్య‌ల‌ను గ‌మ‌నిస్తున్న వారు చెబుతున్న మాట‌. కేసీఆర్ కుమార్తె కావ‌డంతో టీఆర్ఎస్ఆందోళ‌న చెందుతోంది. త‌మ అధినాయ‌కుడి కుటుంబాన్నే టార్గెట్ చేస్తున్న బీజేపీకి, ఇక తామో లెక్క అని టీఆర్ఎస్ ముఖ్య నేత‌లు వాపోతున్నారు.సీబీఐ విచార‌ణ త‌ర్వాత జ‌ర‌గ‌బోయే ప‌రిణామాలు తెలంగాణ‌లో రాజ‌కీయంగా కీల‌క మ‌లుపునకు దారి తీసే అవ‌కాశం వుంది.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి మరింత సమాచారం సేకరించేందుకు ఎమ్మెల్సీ కవితను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు విచారించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.ఆరో తారీఖునే ఆమె విచారించాల్సింది ఉండగా… సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దాఖలు చేసిన ఎఫ్ ఐ ఆర్ లో తన పేరు లేనందున తాను ఆరోజు విచారణకు హాజరు కాబోనని కవిత స్పష్టం చేశారు. తనకు కొన్ని కార్యక్రమాలు ముందే ఖరారై ఉన్నందున వీలుపడదని ఆమె లేఖ ద్వారా సిబిఐ అధికారులకు తేల్చి చెప్పారు. 11, 12, 14 ,15 తేదీల్లో విచారణకు అందుబాటులో ఉంటానని ఆమె సిబిఐ అధికారులకు సమాచారం ఇచ్చారు. అయితే మంగళవారం మధ్యాహ్నం దాకా సిబిఐ అధికారుల నుంచి ఎటువంటి సమాచారం రాకపోవడంతో ఉత్కంఠ నెలకొంది..

సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు ఇచ్చిన నోటీసుల మేరకు మంగళవారం విచారణకు అందుబాటులో ఉంటానని తొలుత చెప్పిన కవిత ఆ తర్వాత మాట మార్చారు. ఎఫ్ ఐ ఆర్ లో తన పేరు లేదని, ముందే ఖరారైన షెడ్యూల్ కారణంగా అందుబాటులో ఉండనని ఆమె స్పష్టం చేశారు.. అయితే దీనికి సంబంధించి మంగళవారం మధ్యాహ్నం వరకు సిబిఐ అధికారుల నుంచి ఎటువంటి బదులు రాలేదు.. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం మంగళవారం కవితను విచారించేందుకు ఢిల్లీ సిబిఐ అధికారుల బృందం ప్రత్యేక ప్రశ్నావళితో సోమవారం సాయంత్రమే హైదరాబాద్ చేరుకుంది..

కానీ ఢిల్లీ ఉన్నతాధికారుల నుంచి ఎటువంటి సంకేతాలు అందకపోవడంతో మంగళవారం వారు కవిత ఇంటికి వెళ్లలేదు. మరోవైపు తాను గడువు కోరుతూ రాసిన లేఖకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నుంచి ఎటువంటి బదులు రాకపోవడంతో ఎమ్మెల్సీ కవిత సైతం మంగళవారం మధ్యాహ్నం వరకు బంజారాహిల్స్ లోని తన ఇంటి వద్ద ఉన్నారు.. అయితే బుధవారం సీఎం కేసీఆర్ జగిత్యాల జిల్లాలో పర్యటిస్తుండడం, ఆ కార్యక్రమానికి కవిత ఇన్చార్జిగా ఉండడంతో ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు మధ్యాహ్నం ఆమె అక్కడికి బయలుదేరి వెళ్లిపోయారు. అయితే మంగళవారం కవితను సిబిఐ అధికారులు ఎలాగైనా విచారిస్తారేమో అనుకుని ఆమె ఇంటి వద్ద మీడియా ప్రతినిధులు హడావుడి చేశారు. పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ నేపథ్యంలో తాము 11న విచారణకు వస్తామని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు కవితకు ఈ మెయిల్ ద్వారా సమాచారం అందించారు.. కవితకు సంబంధించిన పూర్తి చిరునామాను కూడా సిబిఐ డిఐజి రాఘవేంద్ర వత్స పేర్కొన్నారు. ఇందుకు కవిత కూడా ఆరోజు అందుబాటులో ఉంటానని బదులు ఇవ్వడంతో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ప్రత్యేక బృందం తిరిగి విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్ళింది.

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అప్రూవర్ గా మారిన కవిత

అరోరా చెప్పిన వివరాల ఆధారంగానే కవితను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు ప్రశ్నించే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా కవిత వ్యక్తిగత కార్యదర్శిగా వ్యవహరించిన అభిషేక్ రావు కూడా కీలక సమాచారం అందించడంతో వాటి వివరాలు కూడా రాబట్టేందుకు సిబిఐ అధికారులు సమాయత్తమవుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో కేంద్రం, టిఆర్ఎస్ మధ్య ఉప్పు నిప్పులా యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్
ఇన్వెస్టిగేషన్ అధికారులు కవితను ఎలా విచారిస్తారో అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే తొలుత పట్టించుకోవద్దు.. పట్టించుకోనక్కర్లేదు.. భయపడను.. అని ఆమె చాలా ఢంకా బజాయించి చెబుతుంది. కానీ పట్టించుకోకుండా క్షణమైనా ఆగలేకపోతోంది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఒక రిమాండ్ రిపోర్ట్ లో తన పేరు బయటకు రాగానే.. కంగారుగా ప్రెస్ మీట్ పెట్టి ఖండించడం ద్వారా కవిత తొందరపడ్డట్టుగా టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే ఢిల్లీ మద్యం కుంభకోణంలో అమిత్ అరోడా అనే వ్యక్తిని అరెస్టు చేశారు. అతని రిమాండ్ రిపోర్టులో ఆ మద్యం కుంభకోణంతో సంబంధం ఉన్నట్టుగా మరో 36 మంది పేర్లను కూడా కలిపారు. అందులో తెలుగురాష్ట్రాలకు చెందిన ప్రముఖులు పదిమందికి పైగా ఉన్నారు. అయితే వారందరిలోకీ కవితకే కాస్త కంగారు ఎక్కువగా ఉన్నట్టుంది. అందుకే ఆమె తన పేరు బయటకు రాగానే, అగ్గిమీద గుగ్గిలం అయిపోయారు. ప్రెస్ మీట్ పెట్టి మరీ ఫైర్ అయ్యారు.

ఇందులో ఇంకా చాలా మంది పేర్లున్నాయి. ఒంగోలు ఎంపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాగుంట శ్రీనివాసులు రెడ్డి లాంటి వారు కూడా ఉన్నారు. వారెవ్వరూ స్పందించలేదు. మాగుంట శ్రీనివాసులు రెడ్డి అమిత్ అరోడాతో తనకు సంబంధం లేదని చిన్న వివరణ మాత్రమే ఇచ్చారు. అది రాజకీయం చేయాలనుకోలేదు. కవిత మాత్రమే మీడియా ఎదుటకు వచ్చి బిజెపిని, మోడీని, ఈడీని నానా తిట్లు తిట్టారు. సాధారణంగా ఒక పెద్ద అవినీతి కుంభకోణం జరిగినప్పుడు.. అందులో సంబంధం ఉన్నా లేకపోయినా కొందరు ప్రముఖుల పేర్లు చర్చల్లోకి వస్తుంటాయి. వాళ్లెవ్వరూ వాటిని సీరియస్ గా తీసుకోరు. దర్యాప్తు సంస్థలు తమ ఇంటి దాకా వచ్చి ఇబ్బంది పెడితే తప్ప వారినుంచి స్పందన ఉండదు. అయితే కల్వకుంట్ల కవిత పేరు విననపడగానే ఒక ప్రెస్ మీట్ పెట్టేసి.. ఇదంతా బీజేపీ కుట్ర అనేయడమే కాక పంచ్డై లాగులతో ఎద్దేవా చేయడమే రచ్చకు కారణమన్న వాదన సర్వత్రా వినిపిస్తోంది. అలాకాక ఈడీ, సీబీఐలు కాదు కదా.. ఎటువంటి విచారణకైనా మేం సిద్ధం అంటున్న కల్వకుంట్ల కవిత.. విచారణ అయ్యేదాకా ఆగి, దానిని ఎదుర్కొని కడిగిన ముత్యంలాగా బయటకు వచ్చి.. అప్పుడు పంచ్ డైలాగులు విసిరితే బాగుండేదన్న టాక్ .. ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Must Read

spot_img