Homeఅంతర్జాతీయంఅమెరికాలో ఎన్నారైల పరిస్థితి..

అమెరికాలో ఎన్నారైల పరిస్థితి..

ఉద్యోగం కోసమని అమెరికా వెళ్లిన భారతీయులకు అక్కడ కూడా ఉపాధి కష్టాలు మొదలవుతున్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమేజాన్ వంటి మల్టీ నేషనల్ కంపెనీలు పెద్ద ఎత్తున ఉద్యోగుల్ని తొలగిస్తుండడంతో ఆ ప్రభావం భారత టెకీలపై భారీగానే పడుతోంది. దీనికి తోడు వారి వర్క్ వీసాల గడువు దగ్గర పడుతుండడంతో, వీలైనంత తొందరలో ఉద్యోగం దొరికితే కానీ అక్కడ ఉండలేని పరిస్థితి ఏర్పడింది.

చేతిలో ‘జాబ్‌ లేదు.. వీసా టైం ఆగదు’ దీంతో అమెరికాలో ఉండే ఎన్నారైలకు కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. రాబోయే ఆర్థిక మాంద్యం కారణంగా పెద్ద పెద్ద కంపెనీలు కాస్ట్ కటింగ్ పేరుతో ఎడా పెడా ఉద్యోగులను తొలగించడం చేస్తున్నాయి. దాంతో అమెరికాలో ప్రవాసులకు టెన్షన్ మొదలైంది. హెచ్‌-1బీ వీసాతో అగ్రరాజ్యానికి పని కోసం వెళ్లిన వారు ఉద్యోగం ఊడితే..అక్కడ ఎక్కువ కాలం ఉండటానికి వీలు ఉండదు.

ఉద్యోగం పోయిన 60 రోజుల్లోగా కొత్త ఉద్యోగం వెతుక్కోవాల్సి ఉంటుంది. లేదంటే స్వదేశానికి తిరిగివెళ్లడం తప్ప మరో అవకాశం ఉండదు. దిగ్గజ కంపెనీలు కూడా ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతుండటంతో ఇన్నాళ్లూ ఏ సమస్య లేకుండా గడిపిన ప్రవాసుల పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇంతలో మరో ఉద్యోగం వచ్చిందా ఓకే..లేదంటే దేశం వీడాల్సిందే..

  • అమెరికాలో ఉంటున్న వేలాది మంది భారతీయ ఐటీ నిపుణులు ఇప్పుడు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు..

ఆర్థిక అనిశ్చితుల నేపథ్యంలో ఖర్చులను తగ్గించుకునేందుకు అమెరికాలోని టెక్‌ కంపెనీలు కోతలను ఉద్రుతం చేసాయి. ముందుగా ట్విట్టర్ లో మొదలైన తొలగింపు కార్యక్రమం గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, ఫేస్‌బుక్‌, అమెజాన్‌ లాంటి దిగ్గజ సంస్థలకు పాకింది. అమెరికాలో అనేక టెక్‌ కంపెనీలు వేలాదిగా ఉద్యోగుల కోతలు ప్రకటించాయి.

వాషింగ్టన్ పోస్ట్‌ కథనం ప్రకారం.. గతేడాది నవంబరు నుంచి ఇప్పటివరకు దాదాపు 2లక్షల మంది ఐటీ సిబ్బంది ఉద్యోగాలు కోల్పోయారు. ఇందులో 30 నుంచి 40శాతం మంది భారత ఐటీ నిపుణులని చెబుతున్నారు. వీరిలో మెజార్టీ ఉద్యోగులు హెచ్‌-1బీ, ఎల్‌1 వీసాలతో అమెరికాలో ఉంటున్నారు.

దీంతో అగ్రరాజ్యంలోనే ఉండేందుకు ఇప్పుడు వీరంతా ప్రత్యామ్నాయాలు అన్వేషించక తప్పడం లేదు. ”వేలాది మంది టెక్‌ ఉద్యోగులు లేఆఫ్‌లను ఎదుర్కోవడం చాలా దురదృష్టకరం. ముఖ్యంగా హెచ్‌-1బీ వీసాదారులకు మరిన్ని సవాళ్లు ఎదురవుతున్నాయి. వీరు విధుల నుంచి తొలగిపోయిన 60 రోజుల్లోగా కొత్త ఉద్యోగాన్ని సంపాదించాలి. లేదంటే వీసాను మార్చుకోవాలి. దీంతో ఈ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

అందువల్ల హెచ్‌-1బీ వీసాదారులకు టెక్‌ కంపెనీలు కొన్ని మినహాయింపులు ఇస్తే బాగుంటుందని అంటున్నారు. ప్రస్తుతం జాబ్‌ మార్కెట్లో ఉన్న సమస్యల కారణంగా వీరి టర్మినేషన్ తేదీని కొన్ని నెలలు పొడిగించాలని టెకీస్ కోరుతున్నారు. కానీ వారి విజ్నప్తిని కంపెనీలు అంగీకరించేలా కనిపించడం లేదు.

  • అమెరికా టెక్‌ పరిశ్రమలో అధిక మొత్తంలో ఉద్యోగులు భారత్ ప్రవాసులే అవడం విశేషం..

దీంతో లేఆఫ్‌ల్లోనూ వీరే ఎక్కువగా ఉంటున్నారు. అమెరికా నిబంధనల ప్రకారం.. హెచ్‌-1బీ వీసాదారులు లేఆఫ్‌లో ఉద్యోగం కోల్పోతే 60 రోజుల్లోగా కొత్త ఉద్యోగం వెతుక్కోవాలి. వారి వర్క్ వీసాల గడువు దగ్గర పడుతుండడంతో, వీలైనంత తొందరలో ఉద్యోగం దొరికితే కానీ అక్కడ ఉండలేని పరిస్థితి ఏర్పడింది. ఉద్యోగం కావాలంటే వీసా కావాలి, వీసా ఉండాలంటే ఉద్యోగం ఉండాలి.. ఇలా ఒకేసారి రెండు నెత్తిమీద పడుతుండడంతో తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు.

నిజానికి హెచ్-1బీ వీసా అనేది వలసేతర వీసాగా చెబుతారు., ఇది అమెరికాకు చెందిన కంపెనీలు సైద్ధాంతిక లేదా సాంకేతిక నైపుణ్యం అవసరమయ్యే ప్రత్యేక విభాగాల్లో విదేశీ ఉద్యోగులను నియమించుకోవడానికి అనుమతిస్తుంది.

భారతదేశం, చైనా వంటి దేశాల నుంచి ప్రతి సంవత్సరం పదివేల మంది ఉద్యోగులను నియమించుకోవడానికి టెక్నాలజీ కంపెనీలు ఈ వీసాపై ఆధారపడతాయి. ఇక ఎల్-1ఏ, ఎల్-1బీ వీసాలు తాత్కాలిక ఇంట్రాకంపెనీ బదిలీదారులకు అందుబాటులో ఉంటాయి. ఇందులో హెచ్-1బీ వీసాతో అమెరికా వెళ్లి, ప్రస్తుతం ఉద్యోగాలు కోల్పోయిన వారికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

వారికి నిర్ణీత కంపెనీలో సకాలంలో ఉద్యోగం లభించకపోతే వీసా రద్దు అవుతుంది. దీంతో వారు ఉద్యోగం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. కానీ ఒకరిని చూసి మరొకరుగా కంపెనీలు పోటీలు పడుతూ ఉద్యోగులను తొలగిస్తున్నాయి. చివరకు మైక్రోసాఫ్ట్ కంపెనీ కూడా పెద్ద ఎత్తున జాబ్ కట్స్ అమలు చేయబోతున్నామని ప్రకటించింది.

Must Read

spot_img