- టర్కీని భూకంపాలు పగబట్టినట్టు కనపిస్తున్నాయి..
మొన్నటి అతి తీవ్రభూకంపం నుంచి జనం ఇంకా కోలుకోకముందే మరోసారి భూమి కంపించింది. అసలు ఆ ఘటన నుంచి కోలుకోకముందే దెబ్బ మీద దెబ్బలా టర్కీ ప్రజలు భయంతో ఇళ్లలోంచి పరుగులు తీసారు. ఆదివారం అర్దరాత్రి దాటిన తరువతా పలుచోట్లా ప్రకంపణలు చోటు చేసుకున్నాయి. అయితే భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.7 గా నమోదైనట్టు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది..
గత సోమవారం సంభవించిన భారీ భూకంపంతో కకావికలమైన టర్కీలో మరోసారి భూకంపం వచ్చింది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత పలుచోట్ల భూమి కంపించింది. రిక్టరు స్కేలుపై తీవ్రత 4.7గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. దక్షిణ టర్కీ నగరం కహ్రమన్మరాస్ సమీపంలో 15.7 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ భూకంపం వల్ల భవనాలు కూలిపోయినట్లు గానీ, ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు ఎలాంటి సమాచారం లేదు. ఇప్పటికే 40 వేలకు పెరుగుతున్న మృతుల సంఖ్యతో తుర్కియే వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయాయి. తుర్కియే, సిరియాలో గత సోమవారం సంభవించిన భారీ భూకంపంలో మరణించిన వారి సంఖ్య 40 వేలు దాటినట్లు సమాచారం. వేలాదిగా జనం గాయపడ్డారు.
వివిధ దేశాల నుంచి వచ్చి చేస్తున్న సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు టర్కీ హతాయ్ ఎయిర్‌పోర్టులో కార్యకలాపాలను పునరుద్ధరించినట్లు అధికారులు వెల్లడించారు. భూకంపం కారణంగా దెబ్బతిన్న రన్‌వేను రిపేర్ చేసినట్లు చెప్పారు. భూకంపం కారణంగా సర్వస్వం కోల్పోయి వేల మంది ప్రజలు నిరాశ్రయులైతే.. మరోవైపు దొంగలు రెచ్చిపోతున్నారు. ఇళ్లలో చొరబడి వస్తువులు, నగలు, డబ్బులు దోచుకెళ్తున్నారు.
దీంతో ప్రజలు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశంలో అత్యవసర పరిస్థితి అమలులో ఉన్నందున దొంగలపై కఠిన చర్యలు తప్పవని అధ్యక్షుడు రికెప్ తయ్యిప్ హెచ్చరించారు. సాధారణంగా వాళ్లకు ఒక్కరోజు ఉండె జైలు నిర్భంధం ఇప్పుడు నాలుగు రోజులకు పెరిగినట్లు గుర్తు చేశారు. లూటీలకు పాల్పడిన 57 మందిని ఇప్పటికే అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.
ప్రకృతి విపత్తు సంభవించి వారం రోజులు గడిచినందున ఇక శిధిలాల్లో చిక్కిన వారు జీవించి వుండే అవకాశాలు తగ్గిపోతాయని గాలింపు, సహాయక బృందాలు తెలిపాయి. అందువల్ల తమ కార్యకలాపాలను ముగించాలని భావిస్తునాుయి. టర్కీలో ఇప్పటివరకు 35,643మంది మరణించగా, సిరియాలో 4,581మంది చనిపోయారు. దీంతో మొత్తంగా మృతుల సంఖ్య 40 వేలకు పైగా ఉండే అవకాశం ఉంది. నిజానికి భూకంప కేంద్రం భూమిలో 18కిలోమీటర్ల లోతున వుండటంతో నష్ట తీవ్రత ఎక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు. పైగా గాజియన్‌తాపెకి 33కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం కేంద్రం వుంది.
ఈ ప్రాంతంలో పెళుసైన కాంక్రీటుతో కట్టిన భవనాలు ఎక్కువగా ఉన్నాయి. దీనివల్ల త్వరగా పగుళ్ళు రావడానికి లేదా కూలిపోవడానికి అవకాశం ఉంటుంది. కాంక్రీటులోని ఉక్కు తుప్పు పట్టే అవకాశాలు వుంటాయని అమెరికా భౌగోళిక సర్వే తెలిపింది. ఈ కారణంగానే భూకంపంలో నష్టం కూడా ఎక్కువగా వుంది. టర్కీ సహజంగానే భూకంపాలు తరచుగా వచ్చే ప్రాంతం, 2020లో వచ్చిన భూకంపంలో 33వేల మంది చనిపోయారు. భూకంపం వల్ల 84 బిలియన్ల డాలర్ల ఆర్ధిక నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. ఆ ఆర్ధిక నష్టం దేశ జీడీపీలో పది శాతం ఉంటుందని భావిస్తున్నారు.
టర్కిష్ ఎంటర్‌ప్రైజెస్ అండ్ బిజినెస్ కాన్ఫిడరేషన్ ఈ నష్టాన్ని అంచనా వేసింది. రెసిడెన్షియల్ బిల్డింగ్‌లు కూలిపోవడం వల్ల ఆ నష్టం 71 బిలియన్ల డాలర్లు ఉంటుందని, ఇక జాతీయ ఆదాయంలో 11 బిలియన్ల డాలర్ల నష్టం ఉంటుందని ఆ గ్రూపు తెలిపింది. భారీ భూకంపాల వల్ల తుర్కియేలోని 10 ప్రావిన్సుల్లో నష్టం విపరీతంగా జరిగింది. బిల్డింగ్‌లు, ఇండ్లు, హాస్పిటళ్లూ చాలా వరకు కూలిపోయాయి. రోడ్లు, పైప్‌లైన్లు, ఇతర మౌళికసదుపాయాలు కూడా దెబ్బతిన్నాయి. సుమారు 13.5 మిలియన్ల మంది జీవించే ప్రదేశాల్లో ఈ నష్టం జరిగింది.
అత్యంత వేగంగా మౌళికసదుపాయాలు, ఇండ్ల నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు ప్రెసిడెంట్ రీసెప్ తయ్యిప్ ఎర్డగోన్ తెలిపారు. దేశ వృద్ధి రేటు అంచనా వేసిన దానికన్నా రెండు శాతం తక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారత్ ‘ఆపరేషన్ దోస్త్’లో భాగంగా టర్కీకి తక్షణ సాయం అందించడమే గాక పలు రెస్క్యూ బృందాలను కూడా పంపించింది. అందులో భాగంగానే భారత్ 23 టన్నులకు పైగా సహాయక సామాగ్రితో ఏడవ ఆపరేషన్ దోస్త్ విమానాన్ని టర్కీకి పంపించింది. ఆ విమానం ఆదివారం భూకంప బాధిత సిరియాకు చేరుకుంది. దీనిని డమాస్కస్ విమానాశ్రయంలోని స్థానిక పరిపాలన, పర్యావరణ డిప్యూటీ మంత్రి మౌతాజ్ డౌజీ అందుకున్నారు.