Homeఅంతర్జాతీయంప్రపంచ సముద్రాలు అల్లకల్లోలంగా ఉన్నాయి...!

ప్రపంచ సముద్రాలు అల్లకల్లోలంగా ఉన్నాయి…!

అభివృద్ధి చెందుతున్న దేశాలకు చైనా అందిస్తున్న ఆర్థిక సహకారం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ… ఎక్కువగా నష్టమే జరుగుతుందా..? సముద్ర తీర ప్రాంతాలు, సముద్ర సంబంధిత ఉత్పత్తులు విపత్కర పరిస్థితులను ఎదుర్కొనబోతున్నాయా…?

భూ సదస్సులో జీవవైవిధ్యాన్ని కాపాడేందుకు ఒప్పందం ఎప్పుడు కుదిరింది..? సహజ వనరుల నిర్వహణ, అంతర్జాతీయ అభివృద్ధి, ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి కోసం చైనా అందిస్తున్న సహకారం వల్ల ప్రకృతి, స్థానిక ప్రజలు ఏ విధంగా ప్రభావితులవుతున్నారు…?

అభివృద్ధి చెందుతున్న దేశాలకు చైనా అందిస్తున్న ఆర్థిక సహకారం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ… సహజమైన ప్రకృతి తీవ్రంగా దెబ్బతినే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.. సముద్ర తీర ప్రాంతాలు, సముద్ర సంబంధిత ఉత్పత్తులు విపత్కర పరిస్థితులను ఎదుర్కొనబోతున్నాయి. ఈ పరిస్థితులు కొన్ని చోట్ల అత్యధికంగానూ, మరికొన్ని చోట్ల చాలా తక్కువగానూ కనిపిస్తాయి. జీవావరణ వైవిద్ధ్యంపై ఐక్య రాజ్య సమితికి పార్టీల సదస్సు జరుగుతున్న సమయంలో ఈ అంశాలపై చర్చ జరుగుతోంది.

రియోడిజనీరోలో 1992లో జరిగిన భూ సదస్సులో జీవ వైవిద్ధ్యాన్ని కాపాడేందుకు ఒప్పందం కుదిరింది. జన్యువుల నుంచి వాతావరణ వ్యవస్థల వరకు భూమిపై గల జీవరాశులన్నిటినీ కాపాడాలన్నది ఈ ఒప్పందం సారాంశం.

జీవ వైవిద్ధ్య సదస్సు మాంట్రియల్‌లో 2022 డిసెంబరు 7 నుంచి ప్రారంభమైంది, డిసెంబరు 19 వరకు జరుగుతుంది. దీనికి అధ్యక్ష స్థానంలో చైనా ఉంది. రానున్న దశాబ్దంలో ప్రపంచ పర్యావరణ పరిరక్షణ కృషికి మార్గదర్శనం చేసే ‘పోస్ట్ 2020 గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్‌వర్క్‌’ను అధికారికంగా ఆమోదించే అవకాశం ఉందని చాలా దేశాలు భావిస్తున్నాయి. పర్యావరణంపై తన చర్యల ప్రభావాన్ని చైనా ఈ సదస్సులో వివరిస్తుంది.

సహజ వనరుల నిర్వహణ, అంతర్జాతీయ అభివృద్ధి, ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి కోసం చైనా అందిస్తున్న సహకారం వల్ల ప్రకృతి, స్థానిక ప్రజలు ఏ విధంగా
ప్రభావితులవుతున్నారు? అనే అంశాలపై ఇటీవల జరిగిన అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. కొన్నిచోట్ల రిస్క్ చాలా తక్కువగా కనిపించగా, మరికొన్నిచోట్ల రిస్క్ అత్యధికంగా ఉంది.

సెంట్రల్ ఆసియా – చైనా పైప్‌లైన్ ప్రాజెక్టు ద్వారా సహజ వాయువును తుర్క్‌మెనిస్థాన్, ఉజ్బెకిస్థాన్, కజకిస్థాన్‌ల నుంచి చైనాకు తీసుకెళ్లాలన్నది
లక్ష్యం.

చైనా ఆర్థిక భాగస్వాములను మెరుగైన రీతిలో అనుసంధానం చేయాలనే లక్ష్యంతో ఆ దేశాధ్యక్షుడు జీ జిన్‌పింగ్ 2013లో బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. దీనిలో భాగంగా రుణం, పెట్టుబడులు, వాణిజ్యం వంటి రూపాల్లో లక్షల కోట్ల డాలర్లను ఆయా దేశాలకు చైనా సమకూర్చుతుంది. 2008 నుంచి చైనా ఇతర దేశాల్లోని అభివృద్ధి ప్రాజెక్టులకు అందించిన ఆర్థిక సహకారం దాదాపు 50 వేల కోట్ల డాలర్లు ఉంటుంది.

రోడ్లు, రైల్వేలు, నౌకాశ్రయాలు, విద్యుత్తు కేంద్రాలు వంటి వాటిని లాటిన్ అమెరికా, ఆఫ్రికా, ఆసియా, అర్జంటైనా, కెన్యా, సెంట్రల్ ఆసియా, తుర్క్‌మెనిస్థాన్, ఉజ్బెకిస్థాన్, కజకిస్థాన్‌లలో నిర్మించడం కోసం ఈ నిధులను సమకూర్చింది.

అభివృద్ధి చెందుతున్న దేశాలకు సహాయపడాలనే ఉద్దేశంతో బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టును ప్రారంభించినట్లు చైనా చెప్తున్నప్పటికీ, దీనివల్ల వ్యతిరేక ప్రభావాలు కూడా ఉంటాయి. పర్యావరణం దెబ్బతినడంతో పాటు స్థానిక ప్రజలు తమ జీవనోపాధిని కోల్పోతారు. దీనికి ఉదాహరణ, మారిషస్‌లో చైనా ఆర్థిక సహకారంతో నిర్మించిన నౌకాశ్రయాన్ని చెప్పుకోవచ్చు. ఒప్పందం మేరకు చైనీస్ ఫిషింగ్ ఫ్లీట్‌ ఇక్కడికి వచ్చింది. మితిమీరిన చేపల వేట సాగించడంతో స్థానిక చిన్నతరహా మత్స్యకారుల జీవనోపాధి దెబ్బతింది.

చైనా డెవలప్‌మెంట్ బ్యాంక్, ఎక్స్‌పోర్ట్-ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ చైనా అనేక దేశాలకు నిధులు సమకూర్చాయి. వీటిలో 39 అల్పాదాయ, మధ్యాదాయ దేశాల్లోని రోడ్లు, పోర్టులు, రైల్వేలు, వంతెనలు, విద్యుత్కేంద్రాలు, విమానాశ్రయాలు వంటి ప్రాజెక్టులను పరిశీలించినపుడు పర్యావరణానికి, ప్రజల జీవనోపాధికి జరిగిన నష్టం స్పష్టంగా వెల్లడైంది. సముద్ర జీవుల జీవనం దెబ్బతిందని, వాటి ఆవాసాలు నాశనమయ్యాయని, కాలుష్యం పెచ్చమీరిందని వెల్లడైంది. ఈ ప్రాజెక్టుల వల్ల సమీపంలో ఉన్న తీర ప్రాంతాల్లోని జలాలపై దుష్ప్రభావం పడుతోంది. ప్రకాశవంతమైన దీపాలు భారీ శబ్దాలు, ప్రకంపనలు, విషపూరిత భార లోహాల విడుదల వంటి వాటివల్ల ఎక్కువ నష్టం జరుగుతోంది. అభివృద్ధి ప్రాజెక్టుల చుట్టుపక్కల కొంత వరకు ఈ పరిస్థితులు కనిపించాయి.

చేపలు, మెరైన్ మమ్మల్స్, మెరైన్ రెప్టైల్స్, సీ బర్డ్స్, షార్క్‌లు వంటి 324 రకాల జీవులపై దుష్ప్రభావం పడుతోంది. ఆయా జీవులు ఇటువంటి ప్రభావాలను తట్టుకునే సామర్థ్యంపై నష్టం తీవ్రత ఆధారపడి ఉంటోంది. విద్యుత్తు తీగలు సముద్ర జీవులకు తక్కువ నష్టం కలిగిస్తాయి. అయితే వాటికి ప్రకాశవంతమైన దీపాలను అమర్చినట్లయితే సముద్ర పక్షులకు ముప్పు కలుగుతుంది.

ముఖ్యంగా ఇటువంటి ప్రాజెక్టుల వల్ల అత్యధికంగా నష్టపోతున్న ప్రాంతాలు ఆఫ్రికా, కరీబియన్‌లలో ఉన్నాయి. ఆంటిగ్వా, బహమాస్, కామెరూన్, మొజాంబిక్, శ్రీలంకలలో కూడా నష్టం అధికంగానే కనిపించింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 55 తీర ప్రాంత ప్రజలు తీవ్రంగా నష్టపోయే అవకాశాలు కనిపించాయి.

సంవత్సరానికి 1,000 టన్నులకు పైగా సముద్ర సంబంధిత ఆహారాన్ని వినియోగించే ఐవరీ కోస్ట్‌లోని స్థానిక ప్రజలపై వారికి సమీపంలోని అభివృద్ధి ప్రాజెక్టుల దుష్ప్రభావం అధికంగా కనిపించింది. పర్యావరణ పరిరక్షణకు నాయకత్వం వహించాలని చైనా మనస్ఫూర్తిగా కోరుకుంటే, అందుకు తగిన ప్రయత్నాలను బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టు నుంచే ప్రారంభించాలని నిపుణులు చెప్తున్నారు. సమాజం, పర్యావరణంల భవిష్యత్తును నిర్వచించేది సుస్థిర అభివృద్ధి…

భూమిపై అభివృద్ధి ప్రభావం సముద్రాలపై పడకుండానిరోధించడం సంక్లిష్టంగా మారింది.!

ఈ అంతరాన్ని తొలగించడం కోసం ఐక్య రాజ్య సమితి ప్రయత్నిస్తోంది. సుస్థిర అభివృద్ధి కోసం ఓషన్ సైన్స్ దశాబ్దాన్ని ప్రకటించింది. దీంతో కొంత వరకు ఆశలు చిగురిస్తున్నాయి.

ప్రజలు, ప్రభుత్వాలు కలిసికట్టుగా పని చేస్తే అభివృద్ధి ప్రాజెక్టుల వల్ల తీర ప్రాంతాలకు, సముద్ర సంబంధిత వాతావరణ వ్యవస్థకు జరిగే నష్టాన్ని పరిష్కరించుకోవచ్చునని ఈ అధ్యయనంలో వెల్లడైంది. పోర్టులు, తీర ప్రాంత హైవేలు, ఇతర ప్రాజెక్టుల్లో చిన్న చిన్న మార్పులతోనే సత్ఫలితాలను సాధించవచ్చునని తేలింది. పర్యావరణ వ్యవస్థలను, వాటిపై ఆధారపడిన ప్రజలను కాపాడుకోవచ్చునని వెల్లడైంది. ఈ ఆందోళనను పరిష్కరించేందుకు చైనా కొన్ని చర్యలు ఇటీవలే ప్రారంభించినట్లు ఈ అధ్యయన నివేదిక తెలిపింది.

చైనా అనేక దేశాలకు నిధులను సమకూర్చిన తర్వాత అల్పాదాయ, మధ్యాదాయ దేశాల్లోని రోడ్లు, పోర్టులు, రైల్వేలు, వంతెనలు, విద్యుత్కేంద్రాలు, విమానాశ్రయాలు వంటి ప్రాజెక్టులను పరిశీలించినపుడు పర్యావరణానికి, ప్రజల జీవనోపాధికి జరిగిన నష్టం స్పష్టంగా వెల్లడైంది. సముద్ర జీవుల జీవనం దెబ్బతిందని, వాటి ఆవాసాలు నాశనమయ్యాయని, కాలుష్యం పెచ్చమీరిందని వెల్లడైంది.

Must Read

spot_img