Homeఅంతర్జాతీయంభారత్ లో కనిపిస్తున్న భిన్నమైన పరిస్థితి కి కారణం..?

భారత్ లో కనిపిస్తున్న భిన్నమైన పరిస్థితి కి కారణం..?

సాధారణంగా దేశంలో నెలకొన్న పరిస్థితులు .. దేశ ఎన్నికల్లో ప్రభావితం చూపిస్తాయి. అయితే దీనికి భిన్నమైన పరిస్థితి భారత్ లో కనిపిస్తోంది. నిత్యావసరాల ధరలు పెరుగుతున్నా, ప్రజల్లో మాత్రం మోడీనే మిన్న అన్న వాదన వెల్లువెత్తుతోంది. తాజాగా ఇండియా టుడే నిర్వహించిన మూడ్ ఆఫ్ ద నేషన్ .. మోడీనే మళ్లీ ప్రధానిగా ఉండాలని ఆశిస్తోందని తెలుస్తోంది.

నిరుద్యోగం, అధిక ధరలు, ఇంధన ధరల పెరుగుదల.. మోయలేని భారంగా మారుతున్నా, వీటిని వడ్డిస్తోన్న మోడీ సర్కార్ కు మాత్రం ప్రజా మద్ధతు చెక్కుచెదరడం లేదు. దీంతో ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే, మళ్లీ మోడీనే గెలుస్తారంటూ తాజాగా సీ ఓటర్ సర్వే వెల్లడిస్తోంది. ఏదేమైనా మోడీ ప్రభంజనం ఏమాత్రం తగ్గలేదని టాక్ వినిపిస్తోంది.

  • కష్టాలు వచ్చినా, మోడీ ఫేస్ వాల్యూ మాత్రం తగ్గడం లేదు..

దేశంలో ఇప్పటికిప్పుడు లోక్ సభ ఎన్నికలు జరిగితే ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ఇండియా టుడే–సీవోటర్ నిర్వహించిన మూడ్ ఆఫ్​ద నేషన్ జనవరి ఎడిషన్ సర్వేలో వెల్లడైంది. లోక్ సభకు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీ 284 ఎంపీ సీట్లను గెలుచుకుంటుందని, కాంగ్రెస్ 68 సీట్లకు పరిమితం అవుతుందని, ఇతరులకు 191 సీట్లు వస్తాయని సర్వే వెల్లడించింది.

ప్రధాని మోడీ పాపులారిటీ చెక్కుచెదరకుండా అలాగే కొనసాగుతోందని సర్వేలో తేలింది. ప్రధాని మోడీ పనితీరు పట్ల తాజాగా 72% మంది సంతృప్తి వ్యక్తం చేశారని వెల్లడైంది. ఎన్డీఏ ప్రభుత్వం పనితీరు పట్ల 67% మంది సర్వేలో సంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం పట్ల 2022 ఆగస్ట్ లో 56% మందే సంతృప్తి వ్యక్తంచేయగా.. తాజాగా గవర్నమెంట్ అప్రూవల్ రేటింగ్ 11 % పెరిగింది.

అలాగే 2022 ఆగస్ట్ లో ఎన్డీఏ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత 37% ఉండగా, తాజాగా అది18%నికి తగ్గడం విశేషం. దేశవ్యాప్తంగా 1,40,917 మందిపై ఈ సర్వే నిర్వహించారు. వీరికి అదనంగా సీవోటర్ రెగ్యులర్ ట్రాకర్ ద్వారా మరో1,05,008ని ఇంటర్వ్యూ చేసిన ఈ సర్వే ఫలితాలను విడుదల చేశారు.

ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన అతిపెద్ద విజయాలేంటీ? అని ప్రశ్నిస్తే, కొవిడ్ మేనేజ్మెంట్ అని 20%, ఆర్టికల్ 370 రద్దు అని 14%, అయోధ్యలో రాముడి గుడి నిర్మాణం అని 12% మంది చెప్పారు.

మోడీ సర్కార్ అతిపెద్ద వైఫల్యాల గురించి ప్రశ్నించగా.. ధరల పెరుగుదల అని 25%, నిరుద్యోగం అని 17%, కరోనా మేనేజ్మెంట్ అని 8% మంది బదులిచ్చారు. యూనిఫామ్ సివిల్ కోడ్​ కోరుకుంటున్నారా? అన్న ప్రశ్నకు దాదాపు 69% మంది అవునని అన్నారు. స్కూల్స్​ హిజాబ్ బ్యా న్ చేయాల్నా? అంటే.. 57% మంది అవునని చెప్పారు.

  • తెలంగాణలో కూడా బీజేపీ బలం పెరుగుతుందని సర్వేలో వెల్లడైంది..

రాష్ట్రంలో ప్రస్తుతం నాలుగు సీట్లు ఉండగా..ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీ ఆరు ఎంపీ సీట్లను గెలుచుకుంటుందని సర్వే తేల్చింది. అదేవిధంగా ప్రధాని మోడీకి ప్రతిపక్షాల కూటమి సవాలుగా మారనుందా? అంటే.. 2022లో 49% మంది అవునని చెప్పగా.. తాజాగా 39% మందే అవునన్నారు. ప్రజలు ఎవరిని ప్రధానిగా కోరుకుంటున్నారు? అని అడిగితే ఎన్డీయేకే ఓటేశారు. ఎక్కువ మంది మోదీనే మళ్లీ ప్రధానిగా చూడాలనుకుంటున్నారు.

రైతుల ఉద్యమం హోరుగా సాగినా, కరోనా వైఫల్యాలు వెన్నాడినా, ఆర్థిక వ్యవస్థ మందగమనంలో నడిచినా ఎక్కువ మంది మళ్లీ ఎన్డీయే ప్రభుత్వాన్ని, మోదీని కోరుకుంటున్నారు. సర్వేలో పాల్గొన్న 58 శాతం మంది ప్రజలు నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వంపై సంతృప్తిని వ్యక్తం చేశారు. మోదీ పనితీరు బాగుందని 63 శాతం మంది ఓటేశారు.

అయితే, గత ఏడాది ఆగస్టులో నిర్వహించిన సర్వేలో ఆయనకు పడిన ఓట్లు కేవలం 54 శాతమే కావడం గమనార్హం. కానీ, 2020 ఆగస్టులో ఆయన పనితీరు బాగున్నట్టు 78 శాతం మంది చెప్పారు. దానితో పోలిస్తే ఇప్పుడు వచ్చిన 63 శాతం ఓట్లతో ఆయన చాలా దూరంలోనే ఉన్నారని చెప్పాలి.

దీంతో ప్రధాని మోదీకి దగ్గర్లో మాత్రం ఎవరూ లేరు. రాహుల్ గాంధీ కనీసం మోదీ దరిదాపుల్లోకే రాలేరని వ్యక్తం అవుతోంది. తర్వాతి ప్రధానిగా ఎవరు కావాలనుకుంటున్నారని అడిగితే.. నరేంద్ర మోదీకి 52.5 శాతం మంది ఓటేశారు. అంతకుముందుతో పోలిస్తే మోదీకి ఆదరణ భారీగా పెరగడం విశేషం.

గత ఏడాది ఆగస్టులో చేసిన సర్వేలో కేవలం 24 శాతం మందే మోదీకి అనుకూలంగా ఓటేశారు. రాహుల్ గాంధీని కేవలం 6.8 శాతం మందే ప్రధానిగా చూడాలనుకుంటున్నారు.

  • వచ్చే ఎన్నికల్లోనూ మోడీ హవా కొనసాగక తప్పదని అంచనాలు వినిపిస్తున్నాయి..

యోగికి 5.7 శాతం మంది, అమిత్ షాకు 3.5 శాతం మంది, ప్రియాంక గాంధీకి 3.3 శాతం మంది అనుకూలంగా ఉన్నారు. సోనియాగాంధీకి కేవలం 3 శాతం మందే ఓటేయడం గమనార్హం. ఇక కూటమి ఏర్పాటు చేస్తే ప్రధాని రేసులో ఉన్న మమతా బెనర్జీని 2.6 శాతం మందే ప్రధానిగా చూడాలనుకుంటున్నారు. మళ్లీ ఎన్డీయే ప్రభుత్వమే రావాలని 59 శాతం మంది కోరుకున్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‍డీఏ ప్రభుత్వ ప్రజాదరణ మాత్రం అసాధారణ సవాళ్లలోనూ చెక్కు చెదరలేదని, ఇప్పటికిప్పుడు సార్వత్రిక ఎన్నికలు జరిగినా ఎన్‍డీఏ ఘన విజయం సాధిస్తుందని ఈ సర్వే తేల్చింది. మెజారిటీ మార్క్ ను దాటి 43 శాతం ఓట్లతో 321 స్థానాలను సునాయాసంగా గెలుచుకుంటుందని తేల్చింది.

గత సంవత్సరం ఆగస్ట్ నెలలో జరిపిన సర్వేలో ఎన్‍డీఏ 316 సీట్లు గెలుచుకుంటుందని తేలగా, దానిపై మరో ఐదు స్థానాలు అధికంగానే గెలుస్తుందని ప్రస్తుత సర్వే పేర్కొనడం విశేషం. 2019 ఎన్నికల్లో ఎన్‍డీఏ గెల్చుకున్న 357 సీట్ల కన్నా ఈ నెంబర్‍ తక్కువగా ఉండటం గమనార్హం. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వివక్ష యూపీఏ కూటమి 93 సీట్లు గెల్చుకుంటుందని ఈ ఎంఓటీఎన్‍ సర్వే పేర్కొంది.

ప్రాంతాల వారీగా తీసుకుంటే, హిందీ, హిందుత్వ రాజకీయాలు బలంగా ఉన్న ఉత్తర భారతదేశంలో ఎన్‍డీఏ అత్యధికంగా 104 సీట్లను, పశ్చిమ భారతదేశంలో 85
సీట్లను, తెలివైన పొత్తులతో తూర్పు భారతంలో 100 స్థానాలను గెల్చుకుంటుందని ఈ సర్వే తేల్చింది. దక్షిణ భారత్‍లో మాత్రం ఆశించిన ఫలితాలను సాధించలేదని, అక్కడ 32 సీట్లకే పరిమితమవుతుందని పేర్కొంది. పార్టీల వారీగా చూస్తే బీజేపీ మరొకసారి సొంతంగా మెజారిటీ సాధిస్తుందని, మెజారిటీ మార్క్ అయిన 272ని దాటి 291 స్థానాల్లో విజయం సాధిస్తుందని పేర్కొంది.

  • కరోనా సంక్షోభం..

కాంగ్రెస్‍ 51 సీట్లు మాత్రమే సాధిస్తుందంది. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‍ 52 సీట్లు గెల్చుకున్న విషయం తెలిసిందే. కరోనాపై పోరుకు అనూహ్య లాక్‍డౌన్‍ ప్రకటన, కరోనా కేసుల్లో ప్రపంచంలో రెండోస్థానంలో నిలవడం, వలస కూలీల సంక్షోభం, కనిష్ట స్థాయికి జీడీపీ, ప్రబలిన నిరుద్యోగం, లద్దాఖ్‍ సరిహద్దుల్లో చైనా దూకుడు తదితర అంశాల్లో విమర్శలు వచ్చినప్పటికీ.. ప్రధాని మోదీపై ప్రజల విశ్వాసం సడలలేదని సర్వేలో తెలింది.

ప్రధాని నరేంద్ర మోడీకి ప్రజల్లో ఆదరణ ఏ మాత్రం తగ్గలేదు. వరుసగా రెండు పర్యాయాలు ప్రధానిగా ఎన్నికై, 8 ఏళ్లుగా పాలిస్తున్న మోడీపై ప్రజల్లో వ్యతిరేకత తగ్గలేదని సీ ఓటర్‌ –ఇండియా టుడే మూడ్‌ ఆఫ్‌ ది నేషన్‌ సర్వే ద్వారా వెల్లడైంది. ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే.. మళ్లీ ఎన్డీఏ కూటమినే అధికారంలోకి వస్తుందని సదరు సర్వే ఫలితాలు చెబుతున్నాయి. ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ ఏ మాత్రం పుంజుకోలేదని తెలియజేస్తోంది.

గత ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 303 సీట్లు గెలుచుకోగా.. ఇప్పుడు 271 సీట్లు గెలుచుకుంటుందని తెలిపింది. మొత్తంగా బీజేపీ సొంతంగా అధికారంలోకి వస్తుందని సర్వే వెల్లడిస్తోంది. కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ కూటమికి 127 సీట్లు వస్తాయని సర్వే తెలిపింది. ఇందులో కాంగ్రెస్‌ సొంతగా 61 సీట్లు గెలుచుకుంటుందని పేర్కొంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ 52 సీట్లు గెలుచుకుంది. ఈ గణాంకాలు చూస్తే.. కాంగ్రెస్‌ పరిస్థితి ఏ మాత్రం మారలేదని తెలుస్తోంది.

యూపీఏ, ఎన్డీయేతర పార్టీలు 120 సీట్లు గెలుచుకుంటాయని సర్వే చెబుతోంది. మోడీపై అవినీతి ఆరోపణలు రాకపోవడంతోనే ఆయనపై ప్రజల్లో ఆదరణ తగ్గడం లేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అందుకే దేశ ప్రజలు మళ్లీ మోడీకే పట్టం కట్టేందుకు సిద్ధమవుతున్నారు.

ష్టాలు వచ్చినా, మోడీ ఫేస్ వాల్యూ మాత్రం తగ్గకపోవడం రాజకీయ విశ్లేషకులను సైతం అబ్బురపరుస్తోంది. అందుకే వచ్చే ఎన్నికల్లోనూ మోడీ హవా కొనసాగక తప్పదని అంచనాలు వినిపిస్తున్నాయి.

Must Read

spot_img