ఈడీ విచారణకు కవిత గైర్హాజరు కావడం .. ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీనికి కారణమేమిటన్న చర్చ తో పాటు నెక్ట్స్ ఏం జరగనుందన్నదే ఆసక్తికరంగా మారింది. దీంతో ఈడీ ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది చర్చనీయాంశమవుతోంది. దేశాన్ని మొత్తం కుదిపేస్తున్న ఢిల్లీ మద్యం కుంభకోణంలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. వాస్తవానికి ఉదయం 11:30 నిమిషాలకు ఎమ్మెల్సీ కవిత ఈడి అధికారుల విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఆమె మొన్న సాయంత్రమే ఢిల్లీ చేరుకుంది. నిన్న ఢిల్లీలోని ఓ హోటల్లో మహిళా రిజర్వేషన్ కి సంబంధించి సమావేశం కూడా పెట్టింది. ఆ తర్వాత ఉదయం 10 గంటలకు ప్రెస్ మీట్ నిర్వహిస్తానని చెప్పింది. ప్రకారమే గురువారం ఉదయం 10 గంటలకు కవిత ప్రెస్ మీట్ నిర్వహిస్తారని మీడియా ప్రతినిధులు భారీ ఎత్తున ఆమె నివాసానికి చేరుకున్నారు. కానీ ఆమె ఎంతకీ హాజరు కాలేదు. చివరకు ప్రెస్ మీట్ రద్దయిందని భారత రాష్ట్ర సమితి నాయకులు తెలిపారు.
అంతేకాదు ఆమె ఈడి విచారణ కూడా హాజరు కాలేదు. ఎందుకంటే తాను సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ కు సంబంధించి విచారణ పెండింగ్లో ఉన్నందున, హాజరు కాలేనని తన వ్యక్తిగత న్యాయవాది సోమా భరత్ ద్వారా ఈడి అధికారులకు సమాచారం పంపింది. దీనికి ఈడి అధికారులు ఒప్పుకోలేదు. మరోవైపు తనకు ఆరోగ్యం సరిగా లేదని మరో వర్తమానాన్ని తన లాయర్ ద్వారా ఈడి అధికారులకు చేరవేసింది. దీనిపై ఈడి అధికారులు సంతృప్తి చెందలేదు. మరో వైపు కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు, అరుణ్ రామచంద్ర పిళ్లై కస్టడీ గురువారంతో ముగుస్తోంది. వాస్తవానికి ఈడి అధికారులు ఈరోజు కవితతో కలిసి గోరంట్ల బుచ్చిబాబు, అరుణ్ రామచంద్ర పిళ్లై ని విచారించాలని అనుకున్నారు..కానీ జరగబోయే పరిణామాన్ని ముందే పసికట్టిన కవిత.. విచారణకు సంబంధించి తనకు కొంచెం గడువు కావాలని సుప్రీం కోర్టును ఆశ్రయించింది.
అక్కడ ఆమెకు చుక్కెదురు కావడంతో ఈ ప్లాన్ ను అమల్లో పెట్టింది. కవిత విచారణకు రానందున గోరంట్ల బుచ్చిబాబు, అరుణ్ రామచంద్ర పిళ్లై కస్టడీ గడువును పెంచుతారా లేదా అనేది తేలాల్సి ఉంది. న్యాయ నిపుణులు చెప్పిన సమాచారం ప్రకారం.. గోరంట్ల బుచ్చిబాబు, అరుణ్ రామచంద్ర పిళ్లై కస్టడీ సమయాన్ని పెంచాలని ఈడీ అధికారులు కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ కేసులో పెద్దపెద్ద వాళ్లు ఇన్వాల్వ్ అయి ఉన్నందున.. అంత త్వరగా నిజాలు బయటికి రావని ఈడి అధికారులు కోర్టు దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది. గతంలో జగన్ అక్రమాస్తుల కేసులో, గాలి జనార్దన్ రెడ్డి మైనింగ్ కేసులో.. ఈ డి ఇలాంటి మినహాయింపులే కోరింది.. ఇప్పుడు ఢిల్లీ మద్యం కేసు విషయంలో కూడా ఇదే విధానం అనుసరించే అవకాశం కనిపిస్తోంది.. అదే జరిగితే, కవిత అరెస్ట్ తప్పదన్న అంచనాలు సైతం వెల్లువెత్తుతున్నాయి.
- కవిత కౌంటర్ కు ఈడీ రిటార్ట్ ఏవిధంగా ఉండబోతుంది..?
మరోవైపు దిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి దర్యాప్తు సంస్థల అధికారులకు సహకరిస్తానని చెప్పిన కవిత.. ఇప్పుడు ఇలా ప్లేట్ ఫిరాయించడంపై ప్రతిపక్ష నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కవిత అక్రమాలకు పాల్పడిందని, గోరంట్ల బుచ్చిబాబు, అరుణ్ రామచంద్ర పిళ్లై తో కలిపి విచారణ లో పాల్గొంటే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయనే భయపడే విచారణకు హాజరు కాలేదని ధ్వజ మెత్తుతున్నాయి. కాగా కవిత విచారణకు హాజరుకాని నేపథ్యంలో ట్విట్టర్ లో ఢిల్లీ లిక్కర్ స్కాం ట్రెండింగ్ గా నిలిచింది. కవిత విచారణకు హాజరు కానందున ఈడీ అధికారులు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి నోటీసు ఇచ్చారు. ఇప్పటికే మాగుంట కుమారుడిని ఈడీ అరెస్ట్ చేసింది. సౌత్ గ్రూప్ లో మాగుంట, కవిత కీలకంగా ఉన్నారు.
ఆయననుక్ కూడా విచారణకు పిలిపించి, కస్టడీ లోకి తీసుకోవాలని ఈడీ అధికారులు భావిస్తున్నారు. మొదటిసారి విచారణ సందర్భంగా చేసినట్లే కెసిఆర్ ఇంటిదగ్గర భారీ భద్రతా ఏర్పాట్లు జరిగాయి. రెగ్యులర్ పోలీసులు కూడా కెసిఆర్ ఇంటికి చేరుకున్నారు. 10.30 గంటలకు కవిత ఇంటినుండి బయలుదేరుతారని అనుకున్నారు. కానీ ఎంతసేపటికీ ఇంట్లోనుండి రాలేదు. 11 గంటలకు విచారణకు హాజరవ్వాల్సిన కవిత టైం అయిపోయినా ఎందుకు హాజరుకాలేదో
అర్ధంకాలేదు. అయితే 11.40 గంటలకు తేలిందేమంటే విచారణకు కవిత హాజరవ్వాలని అనుకోలేదని. బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమా భరత్ ద్వారా కవిత రాతమూలకంగా కొన్ని సమాధానాలను ఈడీ అధికారులకు పంపారు.
విచారణకు హాజరయ్యే సమయంలోనే కొన్ని డాక్యుమెంట్లను తీసుకురావాలని కోరిన ఈడీ మరికొన్నింటికి సమాదానాలను కూడా ఇవ్వాలని చెప్పారు. అందుకనే వాళ్ళడిగిన ప్రశ్నలకు రాతమూలకంగా సమాధానం ఇచ్చి పంపారు. అనారోగ్య కారణాలతోనే విచారణకు హాజరుకావటం లేదని కవిత చెప్పినట్లు సమాచారం. విషయం ఏమిటంటే ఉదయం నుండి ఢిల్లీలోని కెసిఆర్ ఇంట్లో న్యాయనిపుణులతో చర్చల మీద చర్చలు జరుపుతున్న కవిత ఈడీ విచారణకు మాత్రం అనారోగ్యం కారణంతో హాజరుకాలేనని సమాధానమివ్వటం. మరి విచారణకు హాజరుకాకుండా సోమాతో సమాధానాలను పంపటం అనారోగ్యం కారణాలని చూపటాన్ని ఈడీ
అంగీకరించకపోవడం హాట్ టాపిక్ గా మారింది. కవిత గనుక విచారణకు హాజరుకాకపోతే వెంటనే ఈడీ ఇదే విషయాన్ని కోర్టులో చెప్పే అవకాశముంది. దీన్ని కవిత ఏవిధంగా ఎదుర్కొంటారన్నదీ ఆసక్తికరంగా మారింది.
విచారణను ఉద్దేశ్యపూర్వకంగానే ఎగ్గొడుతున్న కారణంగా అరెస్టు చేసేందుకు అనుమతి కోరే అవకాశం కూడా ఉందంటున్నారు. ఒకవేళ ఈడీ రిక్వెస్టును కోర్టు గనుక ఆమోదిస్తే అప్పుడు కవితకు పెద్ద సమస్యవ్వటం ఖాయం. కవిత వ్యూహంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. ఎడి ఆఫీసు, ఢిల్లీలోని సీఎం కేసీఆర్ నివాసం దగ్గర భారీగా కేంద్ర బలగాలు మోహరించడంతో అసలు ఏం జరుగుతుందనేది అంతు పట్టకుండా ఉంది. ఇక ఈడి విచారణపై స్టే కావాలని కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. కవిత పిటిషన్ పై ఈనెల 24న విచారణ చేపడతామని దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
దీంతో ఈ విషయాన్ని ఈ డి అధికారులకు తన న్యాయవాదుల ద్వారా పంపినట్టు తెలిసింది. తర్వాత అధికారికంగా కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్లో ఉందని, ఈడి విచారణకు హాజరు కాలేనని కవిత తన న్యాయవాదుల ద్వారా తెలిపింది. ఆ తర్వాత తాను అనారోగ్య కారణాలతో విచారణకు హాజరు కాలేనని, తనకు మరో తేదీ నిర్ణయించాలని కూడా న్యాయవాది ద్వారా కవిత కోరారు. అయితే కవిత విజ్ఞప్తిని ఈడి అధికారులు అంగీకరించలేదు. విచారణకు రావాల్సిందేనని కవితకు ఈడీ తేల్చి చెప్పింది. దీంతో కవిత తదుపరి స్టెప్ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.
ఈ నేపథ్యంలో ఢిల్లీలో టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. కాగా ఢిల్లీలో కవితకు మద్దతుగా బీఆరెస్స్ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, భారత్ జాగృతి నేతలు, బీఆరెస్స్ కార్యకర్తలు చేరుకున్నారు. దర్యాప్తు సంస్థల తీరుకు నిరసనగా ఢిల్లీలో బీఆరెస్స్ శ్రేణులు ఆందోళన చేసే అవకాశం ఉందని పోలీసులు భావించారు. దీంతో ఈడీ ఆఫీసు చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేశారు. దీంతో కవిత గైర్హాజరుపై ఈడీ ఏ నిర్ణయం తీసుకుంటుందోనన్న చర్చ సర్వత్రా వెల్లువెత్తుతోంది. ఒకవేళ ఈడీ గనుక కవిత గైర్హాజరును కోర్టుకు నివేదిస్తే, అరెస్ట్ ఆదేశాలు రావచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే, కవిత అరెస్ట పక్కా అని చర్చ సాగుతోంది. అయితే ఈ అంచనా సైతం కవితకు ఉండొచ్చని, దీనిపై కౌంటర్ సిద్ధం చేసుకునే ఉంటారన్న వాదనలు సైతం వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఈ ఎపిసోడ్ లో నెక్ట్స్ ఏం జరుగుతుందోనన్నది ఆసక్తికరంగా మారింది. అదేసమయంలో బీఆర్ఎస్ వర్గాలు సైతం ఆందోళనలకు దిగే అవకాశం ఉందని కూడా అంచనాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఏం జరుగుతుందనేది తెలంగాణవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది.
మరి కవిత కౌంటర్ కు ఈడీ రిటార్ట్ ఏవిధంగా ఉంటుందన్నదే ఆసక్తికరంగా మారింది…