ప్రపంచమంతా ఆంగ్లమయం అయిపోయింది. ఏ దేశం వారితో కమ్యూనికేట్ అవ్వాలన్నా ఇంగ్లీష్ వస్తే సరిపోతుంది. అందుకే చాలా దేశాల్లో ఇంగ్లీషులోనే పిల్లలకు పాఠాలు బోధిస్తున్నారు. ఈ సమయంలో ఒక దేశ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది.
ఇటలీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆంగ్ల భాష ప్రధాన భూమిక పోషిస్తున్న ప్రస్తుత రోజుల్లో ఆ భాష వినియోగాన్ని నిషేధిస్తూ ముసాయిదా బిల్లు ప్రవేశపెట్టింది. ఇటలీలో ఇంగ్లీష్ పై నిషేధం విధించడంతో పాటు ఎవరైనా ఆంగ్లం మాట్లాడితే భారీ జరిమానా విధించేందుకు ముసాయిదా బిల్లు తీసుకొచ్చింది..
ఆంగ్లం.. ఈ భాషకు ఉన్న క్రేజ్ వేరు. ప్రపంచవ్యాప్తంగా కొన్ని దశాబ్దాలుగా రాజ్యమేలుతున్న భాష ఇది. చదువు, ఉద్యోగం, వ్యాపారం.. ఇలా అన్నింటా ఆంగ్లం తప్పనిసరిగా మారింది. అందుకే తల్లిదండ్రులు కూడా మాతృభాషలో కాకుండా ఆంగ్లంలో పిల్లల్ని చదివించడానికి ఇష్టపడుతున్నారు. ఇంగ్లీషుకు ప్రాధాన్యం పెరగడంతో చాలా దేశాలు ఆ భాషకు పెద్దపీట వేస్తున్నాయి. ఈ తరుణంలో ఒక దేశం మాత్రం ఆంగ్లాన్ని వినియోగించడానికి వీల్లేదంటూ హుకుం జారీ చేసింది. అందుకోసం ఒక ముసాయిదా బిల్లును కూడా తీసుకొచ్చింది. పొరపాటున మాటల్లో ఇంగ్లీషు పదాలు దొర్లినా పెద్ద మొత్తంలో ఫైన్విధిస్తామని పేర్కొంది. ఆ దేశమే ఇటలీ.
ప్రపంచమంతా విద్య, ఉద్యోగాల్లో ఇంగ్లీష్ అవసరం. సమాచార మార్పిడికి ఆంగ్ల భాష వినియోగం తప్పనిసరిగా మారిన ఈ రోజుల్లో ఇటలీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సంచలనం సృష్టిస్తోంది.ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే చాట్ జీపీటీని నిషేధించిన ఇటలీ… ప్రస్తుతం ఆంగ్ల భాషపై దృష్టి కేంద్రీకరించింది. అధికారిక వ్యవహారాల్లో ఆంగ్ల భాషను పూర్తిగా నిషేధించే దిశగా
అడుగులు వేస్తోంది. ఇటలీకి చెందిన ఏ వ్యక్తి అయినా ఇటాలియన్ భాష కాకుండా ఇతర భాషలు ఉపయోగిస్తే… భారీ జరిమానా విధిస్తామని హెచ్చరించింది. అందుకోసం ఓ ముసాయిదా బిల్లును కూడా తీసుకొచ్చింది. ఇంగ్లీష్ వాడకాన్ని పూర్తిగా లేకుండా చేయాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని ఇటలీపై విమర్శలు వస్తున్నాయి.
ఇటలీ ప్రధానమంత్రి, బ్రదర్స్ ఆఫ్ ఇటలీ పార్టీ నేత జార్జియా మెలోని ఈ కొత్త ప్రతిపాదిత చట్టాన్ని తెచ్చారు.
ఇటలీ ప్రధానమంత్రి, బ్రదర్స్ ఆఫ్ ఇటలీ పార్టీ నేత జార్జియా మెలోని ఈ కొత్త ప్రతిపాదిత చట్టాన్ని తెచ్చారు. ఈ ముసాయిదా బిల్లు ప్రకారం.. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇటాలియన్ భాషను కించపరుస్తున్నట్లు పేర్కొంది. బ్రిటన్ నిష్క్రమణతో బ్రెగ్జిట్‌గా పేరుగాంచిన యూరోపియన్ యూనియన్ కారణంగా ఈ పరిస్థితి మరింతగా దిగజారిందని ఆ బిల్లు తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పదవుల్లో
ఉన్న అధికారులు, నేతలు ఇటాలియన్ భాషపై నైపుణ్యం కలిగి ఉండాలని ఇటలీ ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఆ చట్టం ప్రకారం స్థానికులు మాట్లాడేటప్పుడు విదేశీ పదాలను ఉపయోగిస్తే ఐదు వేల యూరోల నుంచి లక్ష యూరోలు జరిమానా విధిస్తారు.. అంటే.. భారత కరెన్సీలో దాదాపు రూ.4 లక్షల నుంచి రూ.82 లక్షలు వరకు ఉండనుంది.. ఈ బిల్లును ఛాంబర్ ఆఫ్ డిప్యూటీ సభ్యుడు ఫాభియో రాంపెల్లి ఆ దేశ
పార్లమెంటులో ప్రవేశపెట్టారు. దీనికి ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మద్దతు ఇచ్చారు. ఇంగ్లీష్ పదాలు లేదా ఆంగోమానియాను టార్గెట్‌గా చేసుకుని ఈ చట్టాన్ని తీసుకొచ్చారని తెలుస్తోంది.ఇంగ్లిష్ భాష మీద ప్రజలకు ఉన్న వ్యామోహాన్ని తొలగించడానికి.. తమ భాషను కాపాడుకోవడానికి ఇటలీ ఈ బిల్లును తెచ్చింది. ఈ చట్టం ద్వారా అన్ని విదేశీ భాషలు చేర్చబడినప్పటికీ ప్రధానంగా “ఆంగ్లోమానియా” లేదా
ఇంగ్లిష్ పదాల వినియోగాన్ని తగ్గించడమే లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ ముసాయిదా ప్రధాన ఉద్దేశం ఇటాలియన్ భాష ప్రాధాన్యాన్ని పెంచడమేనని ఇటలీ ప్రభుత్వం వెల్లడించింది. ఈ బిల్లు ప్రకారం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో పదవిని కలిగి ఉన్న ఎవరైనా కూడా “రాతపూర్వకంగా, మౌఖికంగా, ఇటాలియన్ భాషపై నైపుణ్యం కలిగి ఉండాలని స్పష్టం చేసింది. ఇది అధికారిక పత్రాలలో స్థానిక వ్యాపారాలు, ఉద్యోగాల కోసం ఎక్రోనింస్, పేర్లను కూడా ఉపయోగించడాన్ని నిషేధిస్తుంది. ఈ నేపథ్యంలో విదేశీ కంపెనీలకు అన్ని అంతర్గత విధానాలు, ఉపాధి ఒప్పందాల కోసం ఇటాలియన్-భాష వెర్షన్‌లు అవసరం కానున్నాయి. తమ భాషను కాపాడుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇటలీ దేశ ప్రతినిధులు చెబుతున్నారు. ఆంగ్ల భాష మొత్తం సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతుందని అంటున్నారు.
ఆర్టికల్ 1 ప్రకారం.. ఇటలీలోని అన్ని కార్యాలయాల్లో ప్రభుత్వ అధికారులు, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో పదవిని గల వారు విదేశీయులతో మాట్లాడేటప్పుడు కూడా ప్రాథమిక భాషగా ఇటాలియన్‌ను ఉపయోగించాలి. ఆర్టికల్ 2 ప్రకారం.. దేశంలో వస్తుసేవల ప్రచారం కోసం ఇటాలియన్ భాష తప్పనిసరి. ఉద్యోగ, వ్యాపార సంబంధ లావాదేవీల్లో అధికారిక డాక్యుమెంట్లలో ఇటాలియన్ భాషను ప్రభుత్వం
తప్పనిసరి చేసింది. ఆంగ్ల పదాల వాడకంపై పూర్తి నిషేధాన్ని విధించింది. ఇటాలియన్ భాష రాని విదేశీయులతో మాట్లాడేటప్పుడు కూడా ఇటాలియన్ భాషనే వాడాల్సి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం బిల్లు రూపంలో ఉన్న దీన్ని పార్లమెంటు ఆమోదం అనంతరం పూర్తి స్థాయి చట్టంగా మార్చనున్నారు. ఆ తర్వాత దీన్ని అమలు చేయనున్నారు.
ఇటాలియన్ ఒక ఇండో యూరోపియన్ కుటుంబానికి చెందిన భాష. చాలా మంది శాస్త్రవేత్తల పరిశీలన మేరకు ఇటాలియన్, సార్డీనియన్ భాషలు లాటిన్ భాషకు అతి దగ్గరగా ఉండే భాషలు. లాటిన్నుంచి వచ్చిన వల్గర్ లాటిన్ నుంచి ఉద్భవించాయి. ఇది ఇటలీ, స్విట్జర్లాండ్, శాన్ మెరీనో, వాటికన్ నగరంలో అధికార భాషల్లో ఒకటి.
ఇటాలియన్ ఒక ప్రధాన యూరోపియన్ భాష. ఇది యూరప్‌లోని భద్రత, సహకార సంస్థ అధికారిక భాషలలో ఒకటి. యూరోప్ కౌన్సిల్ పని భాషలలో ఒకటి. యూరోపియన్ యూనియన్‌లో 6.7 కోట్ల మంది మాట్లాడే ఈ భాష రెండవ స్థానంలో ఉంది. 1.34 కోట్ల మంది యూరప్
పౌరులు దీన్ని రెండవ భాషగా మాట్లాడుతున్నారు. యూరోపియన్ యూనియన్ లో భాగం కాని దేశాల్లో స్విట్జర్లాండ్, అల్బేనియా, యునైటెడ్ కింగ్డమ్ కూడా ఈ భాష మాట్లాడే వారిని కలుపుకుంటే మొత్తం 8.5 కోట్ల మంది ఉన్నారు.
1861లో ఇటాలియన్ అధికారిక భాషగా మారింది. టుస్కాన్ మాండలికాన్ని ఇటలీకి అధికారిక భాషగా మార్చడానికి నిర్ణయం తీసుకున్నారు.
ఇటాలియన్ వర్ణమాలలో 21 అక్షరాలు మాత్రమే ఉన్నాయి. చారిత్రాత్మకంగా, ప్రామాణిక ఇటాలియన్ వర్ణమాలలో J, K, W, X , Y వంటి 21 అక్షరాలు మాత్రమే ఇటాలియన్ పదాలలో ఉపయోగించబడవు. తక్కువగా పాత రచనలలో మాత్రమే ఉపయోగించబడతాయి.
ఇటాలియన్ లాటిన్‌కు దగ్గరగా ఉన్న భాషలలో ఒకటిగా పరిగణించబడుతుంది. వీటి పదజాలం, ఉచ్చారణ సారూప్యతలను చూసినప్పుడు, ఇటాలియన్ లాటిన్‌కు దగ్గరగా ఉన్న భాషలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఎందుకంటే లాటిన్ రోమన్ సామ్రాజ్యం యొక్క అధికారిక భాష, 6 వ శతాబ్దంలో సామ్రాజ్యం పతనం అయ్యే వరకు ఉపయోగించబడింది. లాటిన్ భాష కూడా కాథలిక్చర్చి, వాటికన్ నగరం యొక్క అధికారిక భాష. ఇటాలియన్ పదాలు ఆంగ్లంలో దుర్వినియోగం చేయబడ్డాయి.
ప్రపంచంలో సుమారు 63 మిలియన్ల మంది ఇటాలియన్‌ను వారి మొదటి భాషగా, సుమారు 3 మిలియన్ల ప్రజలు ఇటాలియన్‌ను రెండవ భాషగా మాట్లాడతారు. బాబెల్ ప్రకారం, ఇటాలియన్ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే 20వ భాషలో ఉండి, అత్యధికంగా అధ్యయనం చేయబడిన 4వ భాష. 19 వ శతాబ్దంలో ఇటలీ నుండి అమెరికా దేశంకు పెద్ద సంఖ్యలో వలసలు రావడంతో, ఇటాలియన్
భాష అమెరికా సెన్సస్ బ్యూరో ప్రకారం సుమారు 709,000 మంది అమెరికన్లు ఇటాలియన్ మాట్లాడతారు, వీరిలో ఎక్కువ మంది న్యూయార్క్, న్యూజెర్సీలో నివసిస్తున్నారు. అలెశాండ్రో వోల్టా ఇటాలియన్శాస్త్రవేత్త కి .శ .1799 లో వోల్టాయిక్ పైల్ అంటే విద్యుత్తును కొలిచే యూనిట్ ను సృష్టించాడు. దీంతో ‘వోల్ట్’ అనే పదం ఉద్భవించింది. ఇటాలియన్ పదాలు నాలుగు జతల హల్లులను కలిగి ఉన్నాయి. ఇటాలియన్ భాషలో పొడవైన పదం సైకోనెరోఎండోక్రినోఇమ్యునోలాజియా (“సైకో న్యూరో ఎండోక్రినో ఇమ్యునాలజీ”) , అదే విధంగా ఇతర వైద్య పదాలు కూడా ఉన్నాయి.
అమెరికా’ పేరు అమెరిగోవెస్పుచి పేరు మీద ఉంది. 15వ శతాబ్దపు ఇటాలియన్ అన్వేషకుడు ఉత్తర, దక్షిణ అమెరికా ప్రత్యేక ఖండాలు, ఆసియాలో భాగం కాదని గుర్తించిన మొదటి యూరోపియన్..
ప్రపంచదేశాల్లో ఇంగ్లీష్ భాషకు ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు.. ఏ దేశ ప్రజలతో కమ్యునికేట్ అవ్వాలన్నా ఇంగ్గీష్ వస్తే సరిపోతుంది.. ఇలాంటి రోజుల్లో కూడా ఇటలీ ఇంగ్లీష్ భాషను ఉపయోగించకూడదంటూ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.