HomeUncategorizedప్రస్తుతం ప్రపంచం మొత్తంగా వాతావరణ మార్పుల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.....

ప్రస్తుతం ప్రపంచం మొత్తంగా వాతావరణ మార్పుల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది…..

యునైటెడ్ కింగ్డమ్ సైతం ఈ మార్పులను అనుభవిస్తోంది. ఈ నేపథ్యంలో చరిత్రలోనే తెలియని అత్యంత వేసవి పరిస్థితులను యూకే ఈ సంవత్సరం చవి చూసింది. అత్యధిక ఉష్ణోగ్రతల కారణంగా రైలు పట్టాలు కూడా కరిగిపోవడంతో రైళ్లు రద్దయ్యయి. వేల మంది మ్రుత్యువాత పడ్డారు.. అందుకే యూకేను ఇకపై చలి ప్రదేశం అని ఎంత మాత్రం అనకూడదంటున్నారు..

మునుపెన్నడూ లేనంతంగా వాతావరణంలో విపరీతమైన మార్పులను యూకే చవిచూస్తోంది. ఈ ఏడాదిలోనే యూకే చరిత్రలోనే అత్యంత వేసవి పరిస్థితులను చవిచూసింది. వేడికి ఏకంగా రైలు పట్టాలే కాలి కరిగిపోయి.. సర్వీసులను నిలిపి వేయాల్సి వచ్చింది. వేల మంది మృత్యువాత పడ్డారు. ఇక ఇప్పుడు చలి వంతు వచ్చింది. మైనస్‌ 10 నుంచి 12 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలతో బ్రిటన్‌ గజగజ వణికిపోతోంది. ఈ సీజన్‌లో ఐస్‌ల్యాండ్‌ కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో చలిపులి పంజా విసురుతోంది. విపరీతంగా కురుస్తున్న మంచుతో రోడ్లపై ప్రమాదాలు జరుగుతున్నాయి. ఒకదానికొకటి ఢీకొంటున్నాయి. ముందున్న వాహనం కూడా కనిపించని పరిస్థితి ఏర్పడటంతో యాక్సిడెంట్లు తప్పడం లేదు..

అందుకే ఇటువంటి వాతావరణంలో వాహనాలతో రోడ్లపైకి రావొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రయాణాలు మానుకోవాలని చెప్పారు. వాహనాలు నడవడం అసాధ్యంగా మారడంతో చాలాచోట్ల యజమానులు తమ కార్లను రహదారుల పక్కన వదిలేసి వెళ్లిపోతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.

కాట్స్‌వాల్డ్, బ్రిస్టల్, సౌత్‌ వేల్స్, హియర్‌ఫోర్డ్‌షైర్, కాంబ్రియా, షెఫీల్డ్‌ తదితర ప్రాంతాల్లో మంచు పెద్ద ఎత్తున పేరుకుని గడ్డ కట్టుకుపోయింది. కొన్నిచోట్ల పట్టాలపై మంచు కప్పేయడంతో రైళ్లను పాకిక్షంగా రద్దు చేశారు. మరికొన్ని ప్రాంతాల్లో రైళ్లు ఆలస్యంగా నడిచాయి. ఇక లండన్‌లోని హిత్రూ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం ఉదయం ఏకంగా 48 విమానాలను రద్దు చేయాల్సి వచ్చింది.

కొన్ని విమానాలు ఆలస్యంగా నడిచాయి. హిత్రూ ఎయిర్‌పోర్ట్‌లో జనం బారులు తీరారు. కెంట్, ఎస్సెక్స్, లండన్‌లో భారీగా మంచు కురిసే అవకా శం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. లండన్‌ సహా సౌత్, సెంట్రల్‌ ఇంగ్లాండ్‌లో ఎల్లో అలర్ట్‌ జారీ చేశారు. స్కాట్లాండ్‌లో మైనస్‌ 15 డిగ్రీలు నమోదైంది. దీనికి ఆర్కిటిక్‌ బ్లాస్టే కారణమని నిపుణులు చెబుతున్నారు. ”ధ్రువాల వద్ద తక్కువ పీడనం వల్ల ఇలా జరుగుతుంది. వాతావరణంలో తీవ్ర మార్పులు, ఉష్ణోగ్రతలు హఠాత్తుగా పడిపోవడం ఆర్కిటిక్‌ బ్లాస్ట్‌ ప్రభావమే” అంటున్నారు. ప్రస్తుతం వెదర్ మెన్ రిపోర్టుల మేరకు యూకే వ్యాప్తంగా రాబోయే కొన్ని రోజులు తీవ్రస్థాయిలో మంచుకురిసే అవకాశం ఉంది.

నిజానికి డిసెంబరు నెలలో ఈ సమయానికి చలి మొదలవుతుంది.

కానీ ఇప్పుడు మాత్రం మంచు కురవడంతో పాటు గడ్డ కట్టుకుపోతోంది. ఇలా గడ్డ కట్టుకుపోయిన కారణంగా వాహనాలు జారిపోతుంటాయి. జారిపోయే కార్లు ఎంత బీభత్సాన్ని స్రుష్టిస్తాయో చెప్పనవసరం లేదు. చాలా వరకు ప్రమాదాలు ఈ కారణంగానే జరుగుతుంటాయి. అయితే ఇలా మంచు కురిసే సమయాలలో కోల్డ్ వెదర్ పేమెంట్స్ అనే ప్రభుత్వం నిబంధన ఒకటి ఉంటుంది. అంటే పెద్ద వయసు వారికి కోల్డ్ వెదర్ ను తట్టుకునేందుకు ప్రభుత్వమే కొంత రుసుము చెల్లించడం జరుగుతుంది. ఇదొక సంక్షేమ పథకంగా అనుకోవచ్చు. అసలే ఆర్థిక పరిస్థితులు సరిగా లేని ఈ సమయంలో ఈ తరహా ప్రక్రుతి వైపరీత్యాలను ఎదుర్కోవడం యూకే ప్రభుత్వానికి కష్టసాధ్యమేనని అంటున్నారు విశ్లేషకులు.

ప్రతీసారి శీతాకాలానికి ముందే యూకేలో చమురు నిల్వలు సరిపడా రిజర్వ్ చేసుకుంటారు. కానీ ఉక్రెయిన్ రష్యా యుధ్దం కారణంగా ఈసారి యూకేకు చమురు సంబంధిత ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదు. ఎందుకంటే రష్యాపై ఆంక్షలు విధించడంలో బ్రిటన్ మొదటి నుంచీ అత్యుత్సాహం ప్రదర్శిస్తూ వస్తోంది. రష్యాకు బ్రిటన్ అంటే పీకల్లోతు కోపంగా ఉంది. అందుకే ఈసారి చమురు కష్టాలు కూడా ప్రక్రుతి వైపరీత్యాలకు తోడవనున్నాయి. చమురు ఉంటేనే చలిని తట్టుకునే పరిస్థితి ఉంటుంది. మంచుతో కప్పబడిపోయని కారణంగా నీటి సరఫరా, కరెంటు సరఫరా విషయంలో చాలా ఇబ్బందులు ఉంటాయి. చాలినంత చమురు గ్యాస్ లేందే యూరప్ ప్రాంతానికి మనుగడ లేదు. ఈసారి చలికాలాన్ని ఎదుర్కోవడం కష్టమేనని చెబుతున్నారు.

Must Read

spot_img