బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్ లు దక్కడంతో స్టార్ హీరోలు పారితోషికాలని తారా స్థాయిలో పెంచేస్తుండటం ఆనవాయితీగా వస్తోంది. ఇప్పుడు అదే తరహాలో టాలీవుడ్ అగ్ర హీరోలు తన రెమ్యునరేషన్ ని భారీగా పెంచేసి షాకిస్తున్నారని తెలిసింది. 2021 వరకు బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపుల్ని ఎదుర్కొన్నారు. సీన్ కట్ చేస్తే..`అఖండ, వీరసింహారెడ్డితో మళ్లీ ట్రాక్ లోకి వచ్చేశారు. దీంతో రెమ్యునరేషన్ పెంచేసినట్లు తెలుస్తోంది.
2021 డిసెంబర్ 2. అఖండ సినిమా రిలీజ్ అయిన డేట్ ఇది. ఈ మూవీ ఫిఫ్టీ పర్సెంట్ ఆక్యుపెన్సీలోనూ బాక్సాఫీస్ వద్ద వండర్స్ క్రియేట్ చేసింది. బాలయ్య పవర్ ఫుల్ పాత్రల్లో నటించిన అఖండ
తిరుగులేని విజయాన్ని అందించిన బాలయ్య సత్తా ఏంటో మరోసారి నిరూపించింది. ఈ మూవీకి పది కోట్లు పారితోషికం తీసుకన్న బాలకృష్ణ ఈ మూవీ అందించిన సక్సెస్ జోష్ తో తాజాగా వీర సింహారెడ్డి
మూవీ చేసిన విషయం తెలిసిందే.
మైత్రీ మూవీ మేకర్స్ వారు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ మూవీ సంక్రాంతి బరిలో విడుదలై మమంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఏకంగా బాక్సాఫీస్ వద్ద 80 కోట్ల వరకు రాబట్టింది. నాన్ థియేట్రికల్ రైట్స్ పరంగానూ ఈ సినిమాకు భారీగానే దక్కింది. ఓవరాల్ గా ఈ మూవీ 120 కోట్లు రాబట్టిందట. ఇప్పటి వరకు 15 కోట్లు మాత్రమే డిమాండ్ చేసిన బాలకృష్ణ ప్రస్తుతం 20 కోట్లు అడుగుతున్నారని తెలుస్తోంది. మేకర్స్ కూడా తాజాగా విడుదలైనప వీర సింహారెడ్డి
వసూళ్లని బట్టి బాలకృష్ణకు 20 కోట్లు ఇస్తామంటూ వెంట పడుతున్నారని ఫిల్మ్ నగర్ టాక్.
బాలయ్య కూడా ఆ మొత్తం ఇస్తేనే సినిమా అంటూ పారితోషికం విషయంలో ఎక్కడా వెనక్కు తగ్గడం లేదని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ తన 108వ ప్రాజెక్ట్ ని చేస్తున్నారు.. ఈ మూవీని సాహు గారపాటి హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. బాలయ్యకు కూతురిగా శ్రీలీల నటిస్తోంది. ఈ మూవీ తరువాత చేయనున్న సినిమాలకు బాలయ్య 20 కోట్లు డమాండ్ చేస్తుండటం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.