Homeఅంతర్జాతీయంబ్రిటన్ లో పెరిగిపోతున్న అక్రమ వలసదార్ల బెడద..?

బ్రిటన్ లో పెరిగిపోతున్న అక్రమ వలసదార్ల బెడద..?

ఇకపై బ్రిటన్ దేశానికి అక్రమ మార్గాన వలసలు వస్తే అంగీకరించేది లేదని స్పష్టం చేసారు ప్రధాని రిషి సునాక్. రోజు రోజుకూ పెరిగిపోతున్న అక్రమ వలసదార్ల బెడద ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. చిన్న చిన్న బోట్లలో లెక్కకు మించి బ్రిటన్ లోకి ప్రవేశిస్తున్న వేలాది మందిని భరించే శక్తి బ్రిటన్ కు లేదని అన్నారు రిషి సునాక్. ఇకపై అక్రమ వలసలకు శరణార్తి హోదా ఉండదని స్పష్టం చేసారు.

బ్రిటన్‌లో అక్రమ వలసదార్ల బెడద రోజు రోజుకు పెరిగిపోతోంది. ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. ప్రతి ఏడాది వేలాది మంది ఇంగ్లీష్‌ చానల్‌ ద్వారా చిన్న చిన్న బోట్లలో బ్రిటన్‌లోకి ప్రవేశిస్తుంటారు. అట్లాంటిక్‌ సముద్రంలో ఉత్తర ఫ్రాన్స్‌ను దక్షిణ ఇంగ్లాండ్‌ను వేరు చేసే ప్రాంతం నుంచి వేలాది మంది చిన్న చిన్న బోట్ల ద్వారా తరలి వస్తుంటారు. ఇలా అక్రమంగా దేశంలోకి ప్రవేశించకుండా కట్టుదిట్టమైన చర్యలకు శ్రీకారం చుడుతున్నట్లు మంగళవారం నాడు బ్రిటన్‌ ప్రధానమంత్రి రిషి సునాక్‌ కొత్త ప్లాన్‌ను ప్రకటించారు. అక్రమంగా దేశంలోకి ప్రవేశించేవారికి శరణార్ధి హోదా ఇచ్చే ప్రసక్తి లేదని కూడా హెచ్చరికలు జారీ చేశారు. దేశంలోకి మీరు అక్రమంగా ప్రవేశిస్తే శరణార్ధి హోదా పొందే అవకాశం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం నుంచి లభించే బెనిఫిట్‌లు మీకు లభించవని ఆయన అన్నారు.

బ్రిటన్‌లో ఉండటానికి మానవ హక్కులను ఉల్లంఘిస్తున్నారంటూ ప్రభుత్వం మీద ఆరోపణలు గుప్పించి దేశంలో ఉండటానికి కూడా ప్రయత్నించడానికి కూడా వీలుండదని సునాక్‌ ట్విట్‌ చేశారు.దేశంలోకి అక్రమంగా వచ్చే వారిని నిర్బంధించి కొన్ని వారాల్లో తిరిగి వచ్చిన దారినే వారి దేశానికి పంపిస్తామని, లేదా మూడవ దేశానికి పంపించడం జరుగుతుందన్నారు. ఉదాహరణకు రువాండా లాంటి దేశాలకు వారిని తరలించడం జరుగుతుందని హెచ్చరించారు. దేశం నుంచి పంపిస్తే.. మీరు భవిష్యత్తులో అమెరికా కానీ, ఆస్ర్లేలియాలో కానీ బ్రిటన్‌లో కానీ రీ ఎంట్రీకి అస్సలు వీలుండదని బ్రిటన్‌ ప్రధాని వివరించారు. కొత్తగా ప్రవేశపెట్టే బిల్లు ద్వారా ఎవరైతే బొట్లలో బ్రిటన్‌లోకి వస్తే వారిని 28 రోజుల పాటు నిర్బంధించి తర్వాత వారిని తిప్పి పంపిస్తామని చెప్పారు.

  • బ్రిటన్‌కు వలస వచ్చే వారు చాలా మంది హ్యుమన్‌ ట్రాఫికింగ్‌.. మనుషుల అక్రమ రవాణా ద్వారా వచ్చే వారుగా ఉంటున్నారు..

అయితే పిల్లలు ఉంటే వారికి మినహాయింపు ఉంటుంది. అనారోగ్యంతో ఉన్న వారు విమానాల్లో ప్రయాణాలు చేయలేని వారు దీర్ఘకాలం పాటు అనారోగ్యంలో ఉన్న వారు అప్పీలు చేసుకోవడానికి వీలుంటుంది. బ్రిటన్‌కు వలస వచ్చే వారు చాలా మంది హ్యుమన్‌ ట్రాఫికింగ్‌.. మనుషుల అక్రమ రవాణా ద్వారా వచ్చే వారుగా ఉంటున్నారు. అలాంటి వారిని బ్రిటన్‌లో అడుగుపెట్టనివ్వమని.. ఎందుకంటే ఆధునిక బానిసత్వాన్ని బ్రిటన్‌ ప్రోత్సహించదని అన్నారు.

అలాంటి వారిని వచ్చిన దారినే తిరిగి పంపిస్తామన్నారు బ్రిటన్‌ ప్రధానమంత్రి. ఇన్నాళ్లూ మానవతా ద్రుక్పదంతో ఆలోచించినా ఇప్పుడది తలకు మించిన భారంగా మారిందన్నారు. యూరోపియన్‌ యూనియన్‌ దేశాలైన ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్‌లతో పోల్చుకంటే బ్రిటన్‌లో శరణార్ధి హోదా కోరే వారు చాలా తక్కువే ఉంటారు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేలాది మంది వలసదార్లు ప్రతి ఏడాది ఉత్తర ఫ్రాన్స్‌కు వచ్చి అక్కడి నుంచి బ్రిటన్‌కు చేరుకుంటున్నారు. దీనికి కారణం బ్రిటన్‌లో ఎవరో ఒకరు దూరపు బంధువులు ఉండటమో లేదా ఇంగ్లీషు భాష రావడమో కారణంగా ఉంటోంది.

అయితే బ్రిటన్‌ దేశంలో అయితే తేలికగా ఉద్యోగాలు దొరుకుతానే ఆశతో వస్తుంటారు. ప్రస్తుతం ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త బిల్లును మానవహక్కుల సంఘాలు, ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శస్తున్నాయి. ప్రభుత్వం కొత్తగా తీసుకు వస్తున్న ప్లాన్‌ పెద్దగా పనిచేయదని.. నిస్సహాయులైన శరణార్థులను బలిపశువులను చేస్తున్నారని మండిపడుతున్నారు. ఇదిలా ఉండగా 2022లో బోట్ల ద్వారా బ్రిటన్‌కు 45వేల మంది రాగా.. 2021లో 28వేల మంది 2020లో 8,500 మంది మాత్రమే వచ్చారని గణాంకాలు తెలియజేస్తున్నాయి.

అక్రమ వలసలను అరికట్టడం తన ప్రాధానాంశాల్లో మొదటిదని చెబుతోన్న రిషి సునాక్‌.. ఇందుకు సంబంధించిన ముసాయిదా చట్టాన్ని ప్రకటించారు. చట్టపరంగా దేశంలోకి ప్రవేశించే వారితోపాటు స్థానికులకు ఇలా అక్రమంగా వలసవచ్చే గ్యాంగులవల్ల ప్రమాదం పొంచివుందన్నారు. దేశంలో అల్లకల్లోలం స్రుష్టించేవారు, అసాంఘీక శక్తులు శరణార్తుల పేరిట బ్రిటన్ లో ప్రవేశించే అవకాశం ఉందన్నారు రిషి సునాక్. ప్రస్తుతం అక్రమంగా తరలి వస్తున్న పరిస్థితి నైతికమైంది కాదని.. అందుకే ఈ బోట్లను అడ్డుకునేందుకే ఈ కొత్త చట్టమని స్పష్టం చేశారు. ఇకపై ఎవరు వచ్చినా వారిని తమ దేశాలకు డిపోర్టింగ్ చేయడం తప్పనిసరి జరుగుతుందన్నారు. అందులో కనికరం చూపించడం అన్నది ఉండదని హెచ్చరించారు.

Must Read

spot_img