కరోనా వైరస్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది.. మరోసారి ప్రపంచవ్యాప్తంగా పంజా విసురుతోందనే భయం ప్రజలను వణికిస్తోంది.. ఇప్పటికే చైనాలో మరణ మృదంగం మోగిస్తోంది. వేలాది మంది మృత్యువాత పడుతున్నారు. చైనా ప్రభుత్వం సైతం వైరస్ ను అరికట్టడంలో విఫలమైంది.. ఇదే ఇప్పుడు ప్రపంచంలోని ప్రజల ఆందోళనకు కారణమవుతోంది..
నిజంగానే కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తుందా..? గత వేరియంట్ల కంటే.. చైనాలో విజృంభిస్తున్న వేరియంట్లు చాలా ప్రమాదకరమైనవా…?కొత్త వేరియంట్లు, కొత్త వేవ్‌లతో అల్లాడుతున్న చైనా నుంచి ముప్పు పొంచి ఉందని పలు దేశాలు టెన్షన్ పడుతున్నాయా..? మరోసారి కరోనా వైరస్ పంజా విసరనుందా..?
వూహాన్ వైరస్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది.. మళ్లీ పంజా విసురుతోందనే భయం ప్రపంచ ప్రజలను వణికిస్తోంది. తాజాగా డ్రాగన్ కంట్రీలో మరణ మృదంగం మోగిస్తోంది. వేలాది మంది మృత్యువాత పడుతున్నారు. ఆసుపత్రుల వద్ద భారీగా క్యూలు కడుతున్నారు. 2020లో ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న కరోనా దృశ్యాలు ఇప్పుడు చైనా అంతటా కనిపిస్తున్నాయి.
కొత్త వేరియంట్లు, కొత్త వేవ్‌లతో అల్లాడుతున్న చైనా నుంచి ముప్పు పొంచి ఉందని పలు దేశాలు టెన్షన్ పడుతున్నాయి. వ్యూహాన్ వైరస్‌తో ముప్పు పొంచి ఉందని అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్‌తో పాటు శాస్త్రవేత్తలు, పరిశోధనల సంస్థలు హెచ్చరిస్తున్నాయి. వూహాన్ ల్యాబ్‌లో పుట్టిన కరోనా మహమ్మారి.. సొంత దేశాన్ని మళ్లీ వణికిస్తోంది. ఈ వైరస్ చైనాతో ఆగదని.. మళ్లీ ప్రపంచంపై పంజా విసురుతుందని నిపుణులు ఆందోళన చెందుతున్నారు.
కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చి.. టీకాలతో లభించిన వ్యాధి నిరోధక శక్తిని కూడా నిర్వీర్యం చేసే ముప్పు ఉందని హెచ్చరిస్తున్నారు. కరోనా కట్టడికి విధించిన జీరో కోవిడ్ ఆంక్షలు ఎత్తివేయడంతో… చైనాలో కేసులు భారీగా పెరుగుతున్నాయి. రోగులతో ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. ఆసుపత్రుల్లో ఏ మాత్రం ఖాళీ స్థలం ఉన్నా.. రోగులను పడుకోబెట్టేస్తున్నారు. తాజా చైనా పరిస్థితులపై అమెరికా కోవిడ్ టాస్క్‌ఫోర్స్ హెడ్ డాక్టర్ ఎరిక్ ఫీగల్ డింగ్ స్పందించారు.
వచ్చే మూడు నెల్లలో చైనాలో 80 కోట్ల మందికి పైగా వైరస్ బారిన పడే అవకాశం ఉందన్నారు. వైరస్ బారిన పడి.. లక్షల మంది చనిపోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. 2020 జనవరిలో వూహాన్ వైరస్ గురించి హెచ్చరించిన శాస్త్రవేత్తల్లో డాక్టర్ ఎరిక్ ఫీగల్ డింగ్ ఒకరు. 2020లో వైరస్ ప్రపంచాన్ని కుదిపేసింది. 35 నెలల్లో 60 కోట్ల కేసులు నమోదయ్యాయి.
60 లక్షల మంది వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. మళ్లీ 2020 నాటి పరిస్థితులు ప్రపంచ దేశాల్లో పునరావృతం అవుతాయని డాక్టర్ ఎరిక్ ఫీగల్ డింగ్ వార్నింగ్స్ ఇస్తున్నారు. వైరస్ విస్పోటనం చెంది.. త్వరలోనే ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఈ అంచనాలు
ఒక్క డాక్టర్ ఎరిక్ ఫీగల్ డింగ్‌వే కాదు.. మరికొందరు శాస్త్రవేత్తలు కూడా ఇవే హెచ్చరికలను చేస్తున్నారు.
కోవిడ్ ఆంక్షలను ఎత్తి వేయడంతో.. 10 లక్షల మంది చనిపోయే ప్రమాదం ఉందని హాంక్‌కాంగ్ యూనివర్సిటీ అంచనా వేస్తోంది. వచ్చే 90 రోజుల్లో 80కోట్ల మందికి వైరస్ సోకే ముప్పు ఉందని యేల్ వర్సిటీ వెల్లడించింది. చైనాలో వ్యాపిస్తున్న వైరస్‌తో కొత్త వేరియంట్లు, కొత్త వేవ్‌లు వస్తాయని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటికే కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చినట్టు అమెరికా అంటువ్యాధుల నియంత్రణ, నివారణ సంస్థ-సీడీసీ ప్రకటించింది.
అమెరికా వైద్య, ఆరోగ్య సంస్థలతో పాటు ప్రభుత్వం కూడా వైరస్‌పై హెచ్చరికలను జారీ చేసింది. చైనాలోని కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయని
అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ అధికార ప్రతినిధి నెడ్ ప్రైజ్ తెలిపారు. చైనాలోని కోవిడ్ వేవ్ ప్రతిచోటా పరివర్తనం చెంది.. ప్రమాదస్థాయిని పెంచుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. చైనాలో కోవిడ్ పరిస్థితులు విషమిస్తున్నాయి.
ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. ఎక్కడ చూసినా.. మృతదేహాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ విషయాలపై చైనా అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. గత కొన్ని వారాలుగా కేవలం ఏడుగురు మాత్రమే చనిపోయినట్టు డ్రాగన్ అధికారికంగా ప్రకటించింది. మరోవైపు స్మశాన వాటికలకు మృతదేహాలతో కూడిన వాహనాలు భారీగా తరలివెళుతున్నాయి.. 24 గంటల పాటు దహన సంస్కారాలను నిర్వహిస్తున్నారు.
బాధిత కుటుంబాలు నల్ల దుస్తుల్లో అంత్యక్రియలకు హాజరవుతున్నారు. అయితే ఎవరూ మరణాలపై మాత్రం స్పందించడం లేదు. తాజాగా చైనా కూడా విచిత్రమైన ప్రకటన చేసింది. కేసుల సంఖ్య భారీగా పడిపోయిందని.. కొత్తగా కేవలం కొన్ని కేసులే నమోదవుతున్నాయని తెలిపింది. చైనా నుంచి బయటకు వస్తున్న వీడియోలకు.. ప్రభుత్వ ప్రకటనలకు ఏ మాత్రం పొంతన లేకపోవడంపై ఆశ్చర్యపోనక్కర్లేదు. మొదటి నుంచి చైనా.. ఇదే విధానాన్నే అనుసరిస్తోంది.
మరోవైపు… చైనా మెడికల్ షాపుల వద్ద.. డెలివరీ వర్కర్లు క్యూ కడుతున్నారు. ప్రజలు పెద్ద ఎత్తున ఔషధాలను, కోవిడ్ టెస్టింగ్ కిట్లను కొనుగోలు చేస్తున్నారు. దీంతో భారీగా ప్రజలు వైరస్ బారిన పడినట్టు స్పష్టమవుతోంది. కోవిడ్ ఆంక్షలను ఎత్తివేసిన తరువాత.. మెడిసిన్ డెలివరీలు భారీగా పెరిగాయని వర్కర్లు చెబుతున్నారు. మరోవైపు మెడికల్ స్టోర్లలో తగినన్ని మందులు లేవని వెల్లడిస్తున్నారు.
మరోవైపు ప్రజలు కూడా భారీగా ఔషధాల కోసం మెడికల్ షాపులకు పరుగులు పెడుతున్నారు. గంటల తరబడి క్యూలో వేచి ఉంటున్నారు. ఇలాంటి దృశ్యాలు చైనా అంతటా కనిపిస్తున్నాయి. తాజా పరిణామాలపై చైనీయులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కొత్త వేరియంట్లు సోకుతున్నాయని టెన్షన్‌పడుతున్నారు. కానీ… ప్రభుత్వం మాత్రం అలాంటి అవకాశాలు లేవని బల్లాగుద్ది మరీ చెబుతోంది.
తాజా మరణాలకు కోవిడ్ కారణం కాదంటూ డ్రాగన్ చెబుతోంది. కోవిడ్ సంక్రమించిన తరువాత.. శ్వాసకోస వైఫల్యంతోనే మరణిస్తున్నట్టు వెల్లడిస్తోంది. ఈ నేపథ్యంలో గుండెపోటు, ఇతర వ్యాధుల కారణంగానే పలువురు చనిపోతున్నారని డ్రాగన్ బుకాయిస్తోంది. అంతే తప్ప.. వైరస్‌తో ఎవరూ మృతి చెందడం లేదని తేల్చి చెబుతోంది. అయితే ఒకేసారి అంతమంది ఇతర వ్యాధులతో ఎలా చనిపోతున్నారో మాత్రం చైనా వెల్లడించడం లేదు.
నిజానికి చైనా ఇలాంటి వివరాలను అస్సలు బయటికి చెప్పదు. మొదటి నుంచి కరోనా కేసుల విషయంలోనూ ఇలానే నాటకమాడింది. అసింటమాటిక్ కింద ఎక్కువ కేసులను చూపి. లక్షణాలున్న కేసులు తక్కువగా చూపింది. అసలు మరణాలే లేవని వెల్లడించింది. కానీ అంతకుమించి మరణాలు సంభవించినట్టు రికార్డులు చెబుతున్నాయి.
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ప్రతిష్టాత్మకంగా భావించి తీసుకొచ్చిన జీరో కోవిడ్ పాలసీ..!
బీజింగ్‌లో కోవిడ్ మృతుల అంత్యక్రియలను నిర్వహించేందుకు ప్రత్యేకంగా దోంగ్జే స్మశాన వాటికను కేటాయించింది. కొన్ని రోజులుగా కుప్పలుతెప్పలుగా మృతదేహాలను పూడ్చిపెడుతున్నారు.. అర్ధరాత్రి, వేకువ జామున అనే తేడాలేకుండా అంత్యక్రియలను నిర్వహిస్తున్నారు. సాధారణంగా.. దోంగ్జే స్మశాన వాటికకు నిత్యం 30 నుంచి 40 మృతదేహాలు వచ్చేవి. ఇప్పుడు రోజుకు 200కు పైగా వస్తున్నట్టు అక్కడి సిబ్బంది చెబుతున్నారు.
స్మశాన వాటికలో పనిభారం పెరిగిందని.. తాము వైరస్ బారిన పడుతున్నామని.. అక్కడి సిబ్బంది వాపోతున్నారు. బీజింగ్‌లో దహన సంస్కారాలు నిరాటంకంగా జరుగుతున్నాయి. మార్చురీల్లో ఓవర్‌లోడ్ పెరిగిపోయింది. 24 గంటలు అంత్యక్రియలు నిర్వహిస్తున్నా.. 2వేలకు పైగా మృతదేహాలతో బంధువులు పడిగాపులు కాస్తున్నారట. ఇదిలా ఉంటే.. చైనాలో ఓమిక్రాన్ విజృంభిస్తోంది దీనికి సంబంధించిన కొత్త సబ్ వేరియంట్ BF.7 తీవ్రమైన ఇన్‌ఫెక్షన్ సామర్థ్యం ఉంది. ఇది ఇతర వేరియంట్ల కంటే వేగంగా వ్యాపిస్తుంది.
టీకాలను తీసుకున్న వారిలోని వ్యాధి నిరోధక శక్తిని కూడా నిర్వీర్యం చేయనున్నది. అంతేకాకుండా ఈ వైరస్ ఒకరికి సోకితే.. వారి నుంచి 18 మందికి సోకుతుందట. ఓమిక్రాన్ వేరియంట్ అయితే కేవలం ఐదు మందికి మాత్రమే సోకేది. BF.7 వేరియంటే ఇంత ప్రమాదకరంగా ఉంటే.. కొత్తగా పుట్టుకొచ్చే వేరియంట్లు మరింత ప్రమాదకరంగా ఉంటాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అయితే చైనాను వణికిస్తున్న వూహాన్ వైరస్… ప్రపంచ దేశాలపై ఎలా దాడి చేస్తోందోనని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే చైనా పొరుగున ఉన్న భారత్‌తో పాటు.. అమెరికా వంటి దేశాలు అప్రమత్తమయ్యాయి. అందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.
కొవిడ్ ఆంక్షల సడలింపుతో చైనాలో రోజురోజుకూ కేసులు పెరుగుతుండగా.. తాజా నివేదిక మరింత భయాందోళనకు గురిచేస్తోంది. ఈ శీతాకాలంలో డ్రాగన్ 3 కరోనా వేవ్‌లను ఎదుర్కొవచ్చని.. నిపుణులు హెచ్చరించారు. ఇందులో ఒక వేవ్ తీవ్రత అధికంగా ఉంటుందని పేర్కొన్నారు. మరోవైపు 2023లో చైనావ్యాప్తంగా 10 లక్షలకు పైగా కొవిడ్ మరణాలు సంభవిస్తాయని అమెరికా పరిశోధన సంస్థ అంచనా వేసింది.
ప్రపంచ దేశాలను ఎన్నో కరోనా వేవ్‌లు వణికించాయి. వైరస్‌కు పుట్టినిల్లుగా భావిస్తున్న చైనాలో మాత్రం ఇలాంటి వేవ్‌లు కనిపించలేదు. దాదాపు మూడేళ్లుగా అక్కడక్కడా కొన్ని కేసులు నమోదైనా వైరస్ వ్యాప్తి చెందకుండా జీరో కొవిడ్ విధానం, కఠిన ఆంక్షలతో జిన్‌పింగ్ సర్కార్ కట్టడి చేసింది. అయితే, చైనా వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వెల్లువెత్తడంతో ఈనెల ప్రారంభంలో పలు ఆంక్షలను సడలించడంతో కేసుల్లో భారీ పెరుగుదల కనిపించింది.
తాజాగా చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ చీఫ్ ఎపిడమాలజిస్ట్ వూ జున్‌యూ సంచలన విషయాలు వెల్లడించారు. ఈ శీతాకాలంలో
మెుత్తం చైనాలో 3 వేవ్‌లు వస్తాయని అందులో ఒకటి తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు.. ప్రస్తుతం చైనాలో మెుదటి వేవ్ నడుస్తోందని జున్‌యూ తెలిపారు. ఈనెల 15 నుంచి ప్రారంభమైన కొవిడ్ తొలివేవ్ జనవరి 15 వరకు ఎక్కువగా నగరాల్లో కొనసాగుతుందని పేర్కొన్నారు. ఇక రెండో వేవ్ జనవరి చివరి నుంచి ఫిబ్రవరి 15 వరకు ఉంటుందని తెలిపారు.
కొత్త సంవత్సరం సందర్భంగా జనవరి 21 నుంచి సెలవుల్లో కేసులు పెరుగుతాయని జున్‌యూ వెల్లడించారు. ఈ సెలవు వారంలో లక్షలాది చైనీయులు కుటుంబాలతో కలిసి విహారాలకు వెళ్తారని అందుకే కేసులు పెరుగుతాయని పేర్కొన్నారు. ఇక ఫిబ్రవరి చివరి నుంచి మార్చి 15 వరకు మూడో వేవ్ ఉంటుందని తెలిపారు.
ఈ సమయంలో విహారయాత్రల నుంచి ప్రజలు తమ ఇళ్లకు చేరుకుంటారని అప్పుడు కేసులు విపరీతంగా బయటపడతాయని వివరించారు. మరోవైపు, ఈ వారంలో కేసుల్లో విపరీతమైన పెరుగుదల ఉంటుందని.. 2023లో కొవిడ్ కారణంగా చైనాలో 10 లక్షలకుపైగా మరణాలు సంభవిస్తాయని.. అమెరికాకు చెందిన ఓ పరిశోధన సంస్థ నివేదిక వెల్లడించింది. ఆంక్షలు సడలించిన తర్వాత చైనాలోని ప్రధాన నగరాల్లోని వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి.
ఈనెల 7న ఆంక్షలు సడలింపు తర్వాత కొవిడ్ మృతుల సంఖ్యపై ప్రభుత్వం అధికారికంగా లెక్కలు వెల్లడించలేదు. కొవిడ్ సామూహిక పరీక్షలు నిలిపివేయడంతో వాస్తవంగా కొవిడ్ సోకిన వారి సంఖ్య బయటపడటం లేదు. 2.20 కోట్ల జనాభా కలిగిన రాజధాని బీజింగ్‌లో ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పటికే విజృంభిస్తోందని అధికారులు తెలిపారు.
కోవిడ్ బారిన పడిన రోగులు.. తమను చేర్చుకోవాలంటూ ఆసుపత్రుల ఎదుట భారీ క్యూలు కడుతున్నారు.. మరోవైపు.. స్మశానాల్లో భారీగా పొగలు.. గుండెలను పిండేసేలా ఆక్రందనలు వినిపిస్తున్నాయి…. ఇవన్నీ వింటుంటే.. భారత దేశంలో కోవిడ్ ఫస్ట్ వేవ్ సమయంలో దృశ్యాలు కళ్ల ఎదుట కదులుతాయి. కోవిడ్ మొదటి దశలో భారత్ లో కనిపించిన ఈ దృశ్యాలే.. ఇప్పుడు చైనాలో కనిపిస్తున్నాయి. కోవిడ్ ఆంక్షలపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో..
ఉన్నట్టుండి జీరో కోవిడ్ పాలసీని బీజింగ్ రద్దు చేసింది. దీంతో డ్రాగన్ కంట్రీలో వైరస్ సునామీని సృష్టిస్తోంది. దీనికే చైనా ప్రజలు అల్లాడుతుంటే.. వారి నెత్తిన బీజింగ్ మరో బాంబు వేసింది. ఒకటికి కాదు.. రెండు కాదు.. ఏకంగా మూడు వేవ్‌లు… వచ్చే మూడు నెల్లలో చైనాను ముంచెత్తనున్నాయట. దీంతో చైనీయులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు కరోనా వైరస్‌ను ప్రపంచంపైకి వదిలిన చైనా.. ఇప్పుడు ఆ ఉచ్చులో తనే చిక్కుకుంది.
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ప్రతిష్టాత్మకంగా భావించి తీసుకొచ్చిన జీరో కోవిడ్ పాలసీని.. ప్రజల ఆందోళనతో తొలగించారు. దీంతో అక్కడ వైరస్ సునామీ సృష్టిస్తోంది. డ్రాగన్ కంట్రీలో ఏ ఆసుపత్రి చూసినా.. రోగులతో కిటకిటలాడుతోంది. స్మశానాలు జనాలతో వెలువెత్తుతున్నాయి.
వేలాది మృతదేహాలను ట్రక్కుల్లో స్మశానవాటికలకు తరలిస్తున్నారు. కానీ.. అధికారికంగా మాత్రం ఇద్దరు మృతి చెందినట్టు బీజింగ్ ప్రకటించింది. కోవిడ్ ట్రాకింగ్ యాప్‌ను తొలగించడంతో కేసుల సంఖ్యను చెప్పడం అసాధ్యమంటూ ఇప్పటికే తెలిపింది. వైరస్‌ను కట్టడి చేయడంలో జిన్‌పింగ్ ప్రభుత్వం చేతులెత్తేసింది.
దీంతో కరోనా రక్కసి విలయతాండవం ఆడుతోంది.తాజాగా చైనాలో ఏ ఆసుపత్రిని చూసినా.. వైరస్ బాధితులతో కిటకిటటాడుతోంది. ఆసుపత్రుల ఎదుట భారీ క్యూలు కనిపిస్తున్నాయి. ఆసుపత్రుల్లో యుద్ధ ప్రాతిపదికన ప్రత్యేక ఐసీయూ వార్డులను ఏర్పాటు చేసినా.. ఫలితం లేకుండా పోయింది. ప్రజలు పెద్ద ఎత్తున వస్తుండడంతో ఎక్కడ ఖాళీ ప్లేస్ ఉంటే.. అక్కడ చికిత్సను అందిస్తున్నారు.
మరోవైపు స్మశానాల్లో 24 గంటల పాటు అంత్యక్రియలు సాగుతున్నాయి. ఇప్పుడే వేవ్ మొదలయ్యిందని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ప్రజలు స్వచ్ఛందంగా ఇళ్లకే పరిమితమవుతున్నారు. షాపులు, కార్యాలయాలు మూతపడుతున్నాయి. నగరాల్లోని రహదారులన్నీ నిర్మానుణ్యంగా కనిపిస్తున్నాయి.
వ్యూహాన్ వైరస్‌తో ప్రపంచదేశాలకు ముప్పు..!
మరోవైపు చైనీయులు భయాందోళనతో వణుకుతున్నారు. వచ్చే మూడు నెలల్లో మూడు వేవ్‌లు డ్రాగన్ కంట్రీని ముంచెత్తనున్నాయట. ఈ ప్రకటన చేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థనో, లేక.. అమెరికా అంటువ్యాధుల నియంత్రణ సంస్థనో కాదు.. స్వయంగా చైనా అంటువ్యాధుల నిపుణుడు వు ఝున్యూ హెచ్చరించాడు. ఇప్పటికే మొదటి వేవ్ మొదలైందని.. ఇది డిసెంబరు నుంచి.. జనవరి మధ్యలో ముగుస్తుందట.
ప్రస్తుతం పెరుగుతున్న కేసులతో సతమతవుతోంది. జనవరి మధ్య నుంచి ఫిబ్రవరి మధ్య వరకు రెండో వేవ్ రానున్నట్టు వెల్లడించారు. కొత్త సంవత్సరం నేపథ్యంలో లక్షల మంది చైనీయులు సొంత ఊర్లకు వెళ్తారు. దీంతో వైరస్ దేశమంతటా వ్యాపించే ప్రమాదం ఉందని ఝున్యూ తెలిపారు. సెలవుల అనంతరం తిరిగి విధుల్లో చేరేందుకు వచ్చే వారితో కొత్త వేరియంట్ సోకి.. మూడో వేవ్ వస్తుందన్నారు.
అంటే.. మధ్య ఫిబ్రవరి నుంచి ప్రారంభమవుతుందని అంటువ్యాధుల నిపుణుడు వివరించారు. మొత్తంగా మూడు వేవ్‌లతో 60 శాతం మంది చైనీయులు వైరస్ బారిన పడే అవకాశం ఉందని తెలుస్తోంది.
చైనా మొత్తం జనాభా 140 కోట్ల మంది కాగా.. వారిలో 80 కోట్ల మందికి వైరస్ సోకననున్నదట. ఈ లెక్కన వైరస్ బారిన పడి.. లక్షల మంది చనిపోయే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో చైనా అధ్యక్షుడు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జీరో కోవిడ్ పాలసీ ఫెయిల్ అయినట్టు స్పష్టంగా తెలుస్తోంది. నిజానికి తాజా వైరస్ విలయానికి జీరో కోవిడ్ పాలసీనే కారణమంటున్నారు నిపుణులు.
మొదటి నుంచి వైరస్ కట్టడికి ప్రపంచ దేశాలు అనుసరించిన పద్దతులను చైనా పాటించి ఉంటే ముప్పు తక్కువగా ఉండేదని చెబుతున్నారు. చైనా ఆర్థిక రాజధాని షాంఘై.. నిర్మాణుష్యంగా మారింది. స్కూళ్లు మూతబడ్డాయి. రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. షాంఘైలోని స్కూళ్ల ఉపాధ్యాయులు, సిబ్బంది పూర్తిగా అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది.
షాంఘైలో 2 లక్షల 30వేల ప్రత్యేక బెడ్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దేశ రాజధాని బీజింగ్‌లోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. జిమ్‌లు, స్టేడియంలను ఆసుపత్రులుగా మారుస్తున్నారు. వేలాది మంది ప్రజలు చికిత్సకోసం ఎదురుచూస్తున్నారు.
నిజానికి బీజింగ్ ఇలాంటి సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లో బయటకు పొక్కనీయదు. ఇప్పుడు కూడా.. డ్రాగన్ కంట్రీ వివరాలను దాచిపెడుతోంది. కేసుల సంఖ్యను, మృతుల వివరాలను వెల్లడించడానికి నిరాకరిస్తోంది. అక్కడి ప్రజలు కూడా చెప్పడానికి సందేహిస్తున్నారు. కానీ పరిస్థితులు విషమంగా ఉన్నాయనడానికి హాంగ్‌కాంగ్ పరిణామాలే నిదర్శనం.
హాంకాంగ్‌లో ప్రజలు పెద్ద ఎత్తున ఔషధాలను కొనుగోలు చేస్తున్నారు. జ్వరం, నొప్పి నివారణ మాత్రలు, కోవిడ్ టెస్ట్ కిట్లనే అధికంగా కొంటున్నారు. కొందరు చైనాలోని తమ కుటుంబీకులకు పంపుతున్నారు. మరి కొందరు మాత్రం స్టాక్ పెట్టుకుంటున్నారు. ఈ పరిణామాలతో డ్రాగన్ బయటకు చెప్పేది ఒకటి.. లోపల జరుగుతున్నది మరొకటని స్పష్టంగా తెలుస్తోంది. 2020 ప్రారంభంలోనే ప్రపంచ దేశాలు వైరస్ బారిన పడ్డాయి.
2020 డిసెంబర్ నాటికి వైరస్ విలయతాండవం ఆడింది. కానీ.. చైనాలో మాత్రం అలాంటి దాఖలాలు కనిపించలేదు. కానీ.. 2021 డిసెంబరులో బీజింగ్‌లో అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. జీరో కోవిడ్ పాలసీతో వైరస్‌కు అడ్డుకట్ట వేసింది. 2022 డిసెంబరులోనూ మరో వేవ్ మొదలయ్యింది. గతేడాది కంటే పరిస్థితులు ఈసారి మరింత దారుణంగా ఉన్నాయి.
వ్యూహాన్ వైరస్‌తో ప్రపంచదేశాలకు ముప్పు పొంచి ఉందని అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్‌తో పాటు శాస్త్రవేత్తలు, పరిశోధనల సంస్థలు హెచ్చరిస్తున్నాయి. కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చి.. టీకాలతో లభించిన వ్యాధి నిరోధక శక్తిని కూడా నిర్వీర్యం చేసే ముప్పు ఉందని హెచ్చరిస్తున్నారు.