Homeఅంతర్జాతీయంప్రపంచ వ్యాప్తంగా దేశాలను వెంటాడుతున్న ఆర్థిక మాంద్యం..

ప్రపంచ వ్యాప్తంగా దేశాలను వెంటాడుతున్న ఆర్థిక మాంద్యం..

  • ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలను ఆర్థిక మాంద్యం వెంటాడుతోంది. ఇప్పటికే శ్రీలంక, పాకిస్తాన్ వంటి పలు దేశాలు తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి.. పరిస్థితులు ఈ విధంగానే కొనసాగితే.. ప్రపంచంలోని మరికొన్ని దేశాలు సైతం ఆర్థిక మాంద్యంలో చిక్కుకునే ప్రమాదం ఉందనేది విశ్లేషకుల అభిప్రాయం…

    ప్రపంచదేశాలకు ఆర్థిక మాంద్యం ముప్పు తప్పదా..? ఇప్పటికే మాంద్యంలో కొట్టుమిట్టాడుతున్న దేశాల పరిస్థితి ఏంటి..? రానున్న కాలంలో మాంద్యం ముప్పులో ఏయే దేశాలు చిక్కుకుంటాయి.. ? ఈ మాంద్యం ప్రభావాన్ని ఆయా దేశాలు ఎదుర్కోనే అవకాశం ఉందా..?

    ఎంతో మంది విశ్లేషకులు, నిపుణులు గత కొంతకాలంగా మాంద్యం ముంపుపై ఆందోళన చెందుతూనే ఉన్నారు. చివరకు అందరి ఆందోళనలు నిజమవుతున్నాయి. రావద్దనుకున్న సమయం రానేవస్తోంది.. అదే ప్రపంచ ఆర్థిక మాంద్యం. ప్రపంచ బ్యాంక్ సైతం ఇదే విషయాన్ని చెబుతూ తన ఆందోళనను వ్యక్తం చేసింది. 2023లోనూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ క్షీణించటం కొనసాగుతుందని మాంద్యం తప్పక ఏర్పడుతుందని కుండబద్దలు కొట్టింది.

    ఈ ఏడాది మాంద్యం కారణంగా దెబ్బతినేది ముఖ్యంగా చిన్న దేశాలేనని ప్రపంచ బ్యాంక్ వ్యాఖ్యానించింది. అధిక ద్రవ్యోల్బణం, పేలవమైన ఆర్థిక ప్రవాహాలు, రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం వంటి అనేక అంతరాల వల్ల ఈ సంవత్సరం ప్రపంచ వృద్ధి ప్రతికూలంగా ప్రభావితమవుతుందని వెల్లడించింది. ఇది మాంద్యానికి దారితీస్తుందని అంచనా వేయబడింది.

    అనేక అత్యవసర కార్యక్రమాలు, జాతీయ-స్థాయి కార్యక్రమాలు పతనం ప్రమాదాన్ని ప్రభావితం చేస్తాయని భావిస్తున్నారు. ముఖ్యంగా రుణ సంక్షోభాన్ని తగ్గించాలని ప్రపంచ దేశాలు తమ ఆర్థిక పరిస్థితిపై దృష్టి సారించటం ప్రారంభించాయి. పెట్టుబడి వృద్ధిని ప్రోత్సహించటం ద్వారా.. అంతర్జాతీయ వృద్ధిని ప్రోత్సహించేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి.

    ఆర్థిక నష్టాలను కొనసాగిస్తున్న దేశాలు దృష్టి పెట్టాలి. ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి సరళంగా వ్యవహరించడం కొనసాగించాలి. ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకు వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లను గత కొన్ని నెలలుగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే దీని నుంచి ప్రజలను రక్షించేందుకు ప్రభుత్వాలు అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. పైగా ఇది ఆర్థిక వృద్ధికి మద్దతునిస్తుందని నిపుణులు భావిస్తున్నారు.

    • ప్రపంచ ఆర్థిక మాంద్యం పొంచి ఉందని అంతర్జాతీయ సంస్థలు ప్రపంచ దేశాలను హెచ్చరిస్తున్నాయి..

    ప్రపంచ బ్యాంక్ హెచ్చరించటానికి ముందు.. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జువా కూడా దేశాలను హెచ్చరించారు. 2023 సంవత్సరం ప్రపంచ దేశాలకు కష్టతరమైనదని అన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మూడింట ఒక వంతు దేశాలకు మాంద్యం తాకవచ్చని ఆమె హెచ్చరించారు. ఈ క్రమంలో ఇప్పటికే అమెరికా, యూరప్, చైనా వంటి పెద్ద దేశాలు నెమ్మదించింది. శ్రీలంక, పాకిస్థాన్ వంటి దేశాలు పతనంతో కొట్టుమిట్టాడుతున్నాయి.

    మాంద్యం గురించి భయపడని దేశాల్లో కూడా మిలియన్ల మంది ప్రజలు దీని బారిన పడవచ్చని ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా యూరోపియన్ దేశాలు మాంద్యం నుంచి తప్పించుకోలేవు. పైగా ప్రపంచ అగ్రరాజ్యం అమెరికా మాంద్యం అంచున ఉందని ఐఎంఎఫ్ పేర్కొంది. ప్రస్తుతం చైనా కరోనా వైరస్ బారిన పడినందున అక్కడి ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం మెుదలవుతోంది.

    మాంద్యం ముదురుతున్నకొద్దీ పెట్టుబడులు తగ్గవచ్చు. ఇన్వెస్టర్లు ఇప్పటికే పెట్టుబడి పెట్టిన తమ సొమ్మును తిరిగి వెనక్కి తీసుకోవటం ప్రారంభించారు. ఇది దేశీల కరెన్సీ విలువ క్షీణత, వాటి మారకద్రవ్యంపై కూడా ప్రభావం చూపనుంది. వస్తువుల ధరలు ఆకాశానికి చేరుకోవటం ప్రజలను అనేకరూపాల్లో ప్రభావితం చేయనుంది. మొత్తం మీద దిగువ తరగతి ప్రజలు కష్టాలు మరింతగా పెరగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

    ఇలాంటి సవాళ్లతో కూడుకున్న పరిస్థితుల్లో భారత్ సైతం కొంత ప్రతికూలతలను ఎదుర్కోవలసి ఉంటుంది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వృద్ధి రేటు 7%గా ఉంటుందని నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ అంచనా వేసింది. మాంద్యంతో ప్రతికూల పరిస్థితులు ఉన్న తరుణంలో ఇలాంటి వృద్ధి రేటు నమోదు చేయటం కొంత మెరుగైనదేనని నిపుణులు అంటున్నారు.

    2023లో ప్రపంచం ఆర్థిక మాంద్యం మరింత ముదురుతుందని బ్రిటన్ సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ బిజినెస్ రీసెర్చ్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ద్రవ్యోల్బణాన్ని అరికట్టేందుకు చాలా దేశాలు అప్పులు చేస్తున్నాయి.. వడ్డీ రేటు కూడా పెరుగుతోంది.. తద్వారా ఆర్థిక వ్యవస్థ కుంచించుకుపోతోంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 2022లో తొలిసారిగా 100 లక్షల కోట్ల మార్క్‌ను దాటేసింది.

    కానీ 2023లో ధరల పెంపుదల దిశగా ప్రభుత్వాల అడుగులు పడకపోవడం వల్ల ఆర్థిక వ్యవస్థ కుంటుపడుతుందని బ్రిటన్‌లోని ఈ సంస్థ వార్షిక ఆర్థిక ప్రివ్యూ నివేదికలో పేర్కొంది. అధిక ద్రవ్యోల్బణానికి ప్రతిస్పందనగా పెరుగుతున్న వడ్డీ రేట్ల ఫలితంగా వచ్చే ఏడాది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యం ఎదుర్కొనే అవకాశం ఉంది” అని CEBR డైరెక్టర్ కే డేనియల్ న్యూఫెల్డ్ అన్నారు.

    • ద్రవ్యోల్బణాన్ని నిరోధించేందుకు ప్రపంచవ్యాప్తంగా వడ్డీ రేట్లు పెంచారు..!

    వడ్డీ రేట్లు ఫలితంగా వచ్చే ఏడాది ప్రపంచం ఆర్థిక మాంద్యం చవి చూసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ద్రవ్యోల్బణంపై పోరాటం ఇంకా ముగియలేదు. ఆర్థిక మాంద్యం దెబ్బ ఉన్నప్పటికీ, సెంట్రల్ బ్యాంకులు 2023లో ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ప్రాధాన్యతనిస్తాయి. తద్వారా దీని ప్రభావం ఆర్థిక ప్రగతిపైనా పడనుందని నివేదిక పేర్కొంది.

    ద్రవ్యోల్బణాన్ని మరింత సౌకర్యవంతమైన స్థాయికి తీసుకురావడానికి అయ్యే ఖర్చు రాబోయే సంవత్సరాల్లో పేలవమైన వృద్ధి అంచనా అని కూడా నివేదిక జోడించింది. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ తాజా అంచనా కంటే ఈ ఫలితాలు చాలా నిరాశపరిచాయని బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. ‘అక్టోబరులో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మూడో వంతు కుదించుకుబోతోందని హెచ్చరికలు జారీ అయ్యాయి.

    • 2023లో ప్రపంచ GDP 2% కంటే తక్కువగా పెరిగే అవకాశం 25% ఉంది.

    ఇది ప్రపంచ మాంద్యంగా స్పష్టంగా చెప్పుకోవచ్చు. 2037 నాటికి, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు సంపన్న దేశాలతో సమానంగా, ప్రపంచ స్థూల జాతీయోత్పత్తి రెట్టింపు అవుతోంది. 2037 నాటికి, తూర్పు ఆసియా. పసిఫిక్ ప్రాంతం ప్రపంచ ఉత్పత్తిలో మూడింట ఒక వంతు వాటాను కలిగి ఉంటుంది, అయితే పవర్ డైనమిక్స్ మారుతుంది, ఐరోపా వాటా ఐదవ వంతు కంటే తక్కువగా ఉంటుందని బ్లూమ్‌బెర్గ్ నివేదించింది.

    సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ బిజినెస్ రీసెర్చ్ దాని వృద్ధి, ద్రవ్యోల్బణం, మారకపు రేట్ల అంచనాలను IMF ప్రపంచ ఆర్థిక సూచన. అంతర్గత నమూనా డేటాపై ఆధారపడింది. ఈ అధ్యయనం ప్రకారం, భారతదేశం 2035 నాటికి 10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను, 2032 నాటికి మొత్తం మీద మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందని అంచనా వేశారు.

    ప్రపంచ వ్యాప్తంగా సగానికి పైగా దేశాలు అప్పుల్లో కూరుకుపోతున్నాయి. భారత్ పొరుగున ఉన్న శ్రీలంక తరువాత పాకిస్థాన్, మయన్మార్, నేపాల్‌ ను కష్టాలు వెంటాడుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఆయా దేశాల్లో సంక్షోభం నెలకొనడానికి ప్రధానంగా స్థానిక పరిస్థితులు, కరోనా సంక్షోభం, తాజాగా తలెత్తిన ఉక్రెయిన్‌- రష్యా యుద్ధాలే కారణమని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.

    ఆయా దేశాల ఆర్థిక మాంద్యం ఎఫెక్ట్ భారత్‌ పైనా పడనుందనే భయాందోళనలు సైతం ఉన్నాయి.. సరైన చర్యలు తీసుకోకపోతే.. ప్రజలకు తీవ్ర కష్టాలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచం ఆర్థిక మాంద్యం దిశగా అడుగులు వేస్తున్నట్టు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఉక్రెయిన్-రష్యా యుద్దం ఇప్పట్లో ఆగేలా లేదనే సంకేతలు కలరవపెడుతున్నాయి. యుద్ధం ఇలాగే కొనసాగితే మాత్రం పలు దేశాలు ప్రమాదంలో పడుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

    • ప్రపంచ ఆర్థిక మాంద్యం పొంచి ఉందని అంతర్జాతీయ సంస్థలు ప్రపంచ దేశాలను హెచ్చరిస్తున్నాయి.. ఇప్పటికే పలు దేశాలు తీవ్ర సంక్షోభంలో చిక్కుకుని విలవిలలాడుతున్నాయి.. ప్రపంచదేశాలు ఈ గడ్డు పరిస్థితులను ఎలా అధిగమించుతాయో చూడాలి..

    Must Read

    spot_img